కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రాక్షస. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్ తో రూపొందించారు. మార్చి 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 28న విడుదల విడుదల కావలసిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాలతో వారం రోజులపాటు వాయిదా వేశారు. ఫైనల్ గా మార్చి 7న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.
గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస ట్రైలర్ నచ్చి తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ..”బెటర్ ఔట్ పుట్ కోసం మా చిత్రాన్ని వారం రోజులు పాటు వాయిదా వేశాం. మార్చి 7న విడుదలకు అన్ని సన్నాహాలు చేస్తున్నాం.
ఇప్పటికే విడుదల చేసిన హీరో ఫస్ట్ లుక్ ను పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.
ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : నోబిన్ పాల్, సినిమాటోగ్రఫీ : జైబిన్ పి జాకబ్.
చిత్రం : రాక్షస
నటీనటులు : డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్, అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ, జయంత్ తదితరులు..
బ్యానర్ : కంచి కామాక్షి కోల్ కతా కాళి క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జైబిన్ పి జాకబ్
సంగీత దర్శకుడు : నోబిన్ పాల్
దర్శకుడు : లోహిత్ హెచ్
పీఆర్వో: హర్ష









