Legendary Music composer Shri MM Keeravani released by latest Telugu independent Song “Veekshana”

ప్రముఖ సింగర్ హారిక నారాయణన్ తెలుగు  సినీ రంగంలో అనేక మంచి చిత్రాలలో విజయవంతమైన పాటలు పాడారు. ఇప్పుడు తను లేటెస్ట్ గా తెలుగు ఇండిపెండెంట్ “వీక్షణ’ అనే పాటను స్వరపరచి ప్రదర్శించిన ఈ పాటను ప్రముఖ సంగీత స్వరకర్త ఎం ఎం కీరవాణి ఆశీర్వదిస్తూ అయన చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేసిన పాటకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

అలాగే సింగర్ హారిక నారాయణన్ తెలుగు  సినీ రంగంలో నే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల సినీ పాటలు కూడా పాడి, మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా వీక్షణ పాటను సొంతంగా రచించి, బాణి సమకూర్చి, తనే పాడిన ఒక క్రొత్త ప్రయోగం ఈ పాట.ప్రణవ్ చాగంటి ద్వారా శక్తివంతమైన ర్యాప్‌ను అందించి, 24 ఫ్లిక్స్ బ్యానర్‌పై జితేంద్ర గంజి మరియు వంశీ మొరుసుపల్లి నిర్మించిన వీక్షణ ఒక లోతైన భావోద్వేగ అనుభవాన్ని అందిస్తుంది.మనం చూసే విధానంలో చిన్న మార్పు కూడా అద్భుతమైన మార్పును ఎలా సృష్టిస్తుందో చూపిస్తుంది “వీక్షణ” .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here