‘Badmashulu’ trailer launched by Director Balagam Venu, Movie releasing on June 6th

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు బలగం వేణు విడుదల చేశారు.

ఈ సందర్భంగా బలగం వేణు మాట్లాడుతూ….బద్మాషులు ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంఫై4, ఫన్ రైడ్ లా అనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉంది, జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను, అలాగే ఈ చిత్రంలో నటించిన మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి ఇద్దరికి మంచి పేరు రావాలి, నిర్మాత దర్శకుడు శంకర్ చేగూరి కు ఈ సినిమా తో సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.

ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలి అనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here