Director Gopinath Reddy of “Sammathame” Fame and UG Productions to Announce Their Second Film Tomorrow

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది “సమ్మతమే” సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా రిలీజై ఈ రోజుకు సరిగ్గా మూడేళ్లవుతోంది. 2022, జూన్ 24న “సమ్మతమే” ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీమ్ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ తమ సంస్థలో ప్రొడక్షన్ నెం. 2గా కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 11.11 నిమిషాలకు చేయబోతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్స్, ఇతర వివరాలు రేపటి ప్రకటనలో మేకర్స్ వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here