Megastar Chiranjeevi garu will be gracing the Pre Release event of O PittaKatha

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌యి మార్చి 6న విడుదలకి సిద్ధంగా ఉంది.మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత వి.  ఆనందప్రసాద్‌    మాట్లాడుతూ –‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.

నటీనటులు:

 విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి.

సాంకేతిక నిపుణులు: 

పాటలు: శ్రీజో , ఆర్ట్: వివేక్‌ అన్నామలై, ఎడిటర్‌: డి.వెంకటప్రభు, కెమెరా: సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here