‘Laggam Time’ Movie Review (Love & Comedy entertainer)

Cinemarangam
సమర్పణ : కె. యశ్వంత్ కుమార్ మేరు
బ్యానర్ : 20వ శతాబ్దపు ఎంటర్టైన్మెంట్స్
సినిమా : “లగ్గం”
విడుదల తేదీ : 06:02:2026
రివ్యూ రేటింగ్ : 3/5
రచన, దర్శకత్వం: ప్రజోత్ కె వెన్నం
నిర్మాత : కె. హిమ బిందు
తారాగణం: రాజేష్ మేరు, నవ్య చిట్యాల, నెల్లూరు సుదర్శన్, ప్రీతీ సుందర్, ప్రణీత్ రెడ్డి, కేదార్ శంకర్, మధుమణి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుజాత, కిరణ్ మచ్చ, నీలా రమణ, అరుణ్ కుమార్, పూజా సింఘ్వి, ప్రదీప్, మిర్చి కిరణ్, ఈ రోజుల్లో సాయి తదితరులు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. ప్రశాంత్ కుమార్ మేరు
సంగీతం : పవన్
సినిమాటోగ్రఫీ : పవన్ గుంటుకు
ఎడిటర్: RM విశ్వనాధ్ కూచనపల్లి
కళ: మహేష్ బంతుల
ఫైట్స్: ఎం. శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్: రెతీషా రెడ్డి, కె.రీతు
పీఆర్వో : పాల్ పవన్
డిజిటల్ మార్కెటింగ్ : వంశీ కృష్ణ (సినీ డిజిటల్)

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా తెరకెక్కిన సినిమా లగ్గం టైం. కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. హిమబిందు నిర్మాణంలో ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. లగ్గం టైం సినిమా నేడు ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది.

కథ..
అనన్య(నవ్య) చంద్ర(సుదర్శన్) పెళ్లిరోజు అనన్య బాయ్ ఫ్రెండ్ పెళ్లి ఇంటికి వచ్చి ఆమెని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ పెళ్లింట్లో జరిగిన ఓ సంఘటనతో సూర్య, అతని ఫ్రెండ్ భయపడి పారిపోతారు. అదేరోజు వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండడంతో అక్కడికి వెళ్తే బెటర్ అని ఇంటర్వ్యూ కి వెళ్తారు. కానీ పెళ్లింట్లో పెళ్ళికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఇంటర్వ్యూకి వెళ్లిన సూర్య అక్కడ హెచ్ఆర్(ప్రీతీ సుందర్) కి పూణేలో తనకు, అనన్యకు మధ్య జరిగిన లవ్ స్టోరీ చెప్తుండగా మధ్యలో పోలీసులు సూర్యనే పెళ్లి కొడుకులు కిడ్నాప్ చేశాడు అని అతన్ని తీసుకెళ్తారు.

అసలు పెళ్లి కొడుకు చంద్రని ఎవరు కిడ్నాప్ చేసారు? పుణేలో సూర్య, అనన్యల ప్రేమకథ ఎలా మొదలయింది? పెళ్లింట్లో ఏం జరిగింది? చివరికి సూర్య – అనన్య కలుస్తారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు కిడ్నాప్ అవడం, వాళ్లలో ఎవరికో ఒకరికి లవ్ స్టోరీ ఉండటం అనే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోకి చెందినదే కానీ కాస్త కొత్తగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ సూర్య అనన్య పెళ్ళికి వెళ్లడం, అక్కడి నుంచి వచ్చేయడం, తన లవ్ స్టోరీ చెప్పడం, పెళ్లి కొడుకు కిడ్నప్ అయ్యాడని తెలియడం, అది సూర్యనే చేసాడని పోలీసులు రావడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ లో వరుసగా ట్విస్టులు రివీల్ చేస్తూ బాగానే ముగించారు. సినిమా అంతా ప్రేమ కథతో పాటు కామెడీ కథనంతోనే నడిపించారు. ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిముషాలు పెళ్లింట్లో జరిగే తతంగం అంతా కాస్త సాగదీశారు. ఫ్లాష్ బ్యాక్ హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ సింపుల్ గా, క్యూట్ గా అక్కడక్కడా కామెడీతో సాగుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ నార్త్ అమ్మాయితో హిందీ తెలుగు మాట్లాడించి కామెడీ వర్కౌట్ చేద్దామని చూసారు కానీ అది కాస్త కష్టంగానే ఉంటుంది.

సెకండ్ హాఫ్ లో కూడా కామెడీతో పాటు చిన్న చిన్న ట్విస్టులతో బాగానే నడిపించారు కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్ సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సింపుల్ గా తేల్చేసారు అనిపిస్తుంది. హీరో లవ్ స్టోరీతో పాటు, పెళ్లి కొడుకు లవ్ స్టోరీ ట్రాక్ కూడా నడిపించి ఆ రెండింటితో సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తికర కథనంతో నడిపించారు. సరదాగా కాసేపు నవ్వుకోడానికి వెళ్ళాలి అనుకుంటే లగ్గం టైం చూడొచ్చు.

నటీనటుల పనితీరు ..
రాజేష్ మేరు హీరో పాత్రలో బాగానే చేసాడు. తెలుగమ్మాయి నవ్య చిట్యాల క్యూట్ గా అలరిస్తూనే నటనతో మెప్పించింది. సుదర్శన్ తన కామెడీతో సినిమాని బాగానే నడిపించాడు. ప్రణీత్ రెడ్డి, అరుణ్ కుమార్ అక్కడక్కడా నవ్విస్తారు. ప్రీతీ సుందర్, కేదార్ శంకర్, మధుమణి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుజాత, కిరణ్ మచ్చ, నీలా రమణ, పూజా సింఘ్వి, ప్రదీప్, మిర్చి కిరణ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు ..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్ కూడా యావరేజ్. ఎడిటింగ్ కూడా బాగుంది కానీ కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ కట్ చేస్తే బెటర్. మూల కథ పాతదే అయినా కొత్తగా రాసుకొని కామెడీ కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

Cinemarangam Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here