‘Erra Cheera – The Beginning’ Movie Review (Horror, action & Mother sentiment)

Cinemarangam
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
బ్యానర్ : శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్
సినిమా : ‘ఎర్రచీర – ది బిగినింగ్’
విడుదల తేదీ : 06:02:2026
రివ్యూ రేటింగ్ : 3/5
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు.
నటీ నటులు – బేబీ సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, జీవా, తదితరులు
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
పిఆర్ఓ – సురేష్ కొండేటి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మదర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుని ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు.ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ ఏమిటంటే…
దాసు (కమల్ కామరాజు) అవంతిక (కారుణ్య చౌదరి)ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఆస్తి కోసం దాసు అమ్మమ్మ పన్నీ పార్వతిని అవంతిక హత్య చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత అవంతిక ఒక పాపాత్మగా మారి, తన చనిపోయిన తల్లిని వెతుకుతూ భయంకర రూపంలో తిరుగుతుంది.

ఇదే సమయంలో ట్రాన్స్‌ఫర్‌పై శ్వేతా సిటీకి వస్తున్న పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (సుమన్ బాబు) భార్యకు, ఎర్రచీరలో కనిపించే అవంతిక తన మరణించిన తల్లిలా అనిపిస్తుంది. ఈ అతీంద్రియ సంఘటనల వెనుక అసలు కారణం ఏమిటి? శివశక్తితో ప్రసిద్ధుడైన సరిపోక త్రికోటేశ్వరస్వామి (సుమన్ బాబు మరో కీలక పాత్రలో) ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు? అన్నదే కథ.

నటీనటుల ప్రతిభ
సుమన్ బాబు దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ద్విపాత్ర ఛాయలతో ఆకట్టుకుంటారు. త‌న పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తాడు. త‌న న‌ట‌న‌తో పాత్ర‌లో లీన‌మై ఈ సినిమాకు ప్రాణం పోశాడు. సుమన్ బాబు పోలీస్ పాత్రలో సీరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కారుణ్య చౌదరి అవంతిక పాత్రలో హారర్ ఎలిమెంట్‌ను బలంగా పండించారు.
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో భావోద్వేగాలకు ప్రాణం పోశారు. ఆలీ, అన్నపూర్ణమ్మ, గీతా సింగ్, సత్యకృష్ణన్, భద్రం, జీవా, రఘుబాబు వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ
డైరెక్ట‌ర్ సుమన్ బాబు చింతల్ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కొన్ని సీన్లు తెరకెక్కించారు. తాను రాసుకున్న క‌థ‌లోని సన్నివేశాలు సినిమాను ఎంతో ఎత్తులో నిల‌బెడ‌తాయి. క‌థ‌ను ఎంతో అద్భుతంగా తెర కెక్కించిన తీరు చూస్తే డైరెక్ట‌ర్ సుమ‌న్ బాబుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. హారర్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చీకటి షేడ్స్‌తో కూడిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలాలు. మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు భావోద్వేగంగా పండాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రత్యేకంగా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రమే అయినా, కుటుంబమంతా కలిసి చూసేలా హారర్‌ను మితంగా చూపించడం విశేషం. కథలో కొత్తదనం, మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాల మేళవింపు సినిమాను ఆసక్తికరంగా నిలబెట్టాయి. ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. అదే ప్రేక్ష‌కుల‌ను మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో హార్ట్ ట‌చ్ చేస్తుంది.

భయపెట్టే హారర్‌తో పాటు తల్లిపట్ల ఉన్న అనుబంధాన్ని హృదయానికి తాకేలా చెప్పిన సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక.

Cinemarangam Review Rating : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here