Pink Elephant Pictures ‘Raakaasa’ summer fantastic blockbuster success meet held grandly

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సమ్మర్ ఫన్‌టాస్టిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌కి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు వెంటనే చూడండి. నిహారిక చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ మూవీని ఆడియెన్స్‌కి ఎంత వరకు రీచ్ చేయాలో, ఎలా ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేశారు. ఐపీఎల్ సీజన్‌లోనూ ‘రాకాస’ కోసం ఆడియెన్స్ వస్తుండటం గొప్ప విషయం. కామెడీ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వచ్చి సినిమాని చూస్తారు. నేను ఇంకా ఈ మూవీని చూడలేదు. కాకపోతే చాలా ఎపిసోడ్స్ చూశాను. అవి చూస్తేనే సంగీత్, గెటప్ శ్రీను, నయన్, వెన్నెల కిషోర్ గారి కామెడీ చూసి పగలబడి నవ్వేశాను. అనుదీప్ బీజీఎం, పాటలు బాగున్నాయి. ఓ అమ్మాయి (మానస శర్మ) డైరెక్టర్‌గా వచ్చి ఇంకో అమ్మాయి (నిహారిక) నిర్మాతగా నిలబడి.. బ్లాక్ బస్టర్ కొట్టారంటే హ్యాట్సాఫ్. వారిద్దరూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. మానస శర్మ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంగీత్ ఇలానే కంటిన్యూగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. సమ్మర్‌లో రాబోతోన్న అన్ని చిత్రాల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని థియేటర్లో చూసి సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. ‘రాకాస’ విజయంలో వెన్నెల కిషోర్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో వెన్నెల కిషోర్ గారు షూట్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘రాకాస’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుఖ్వేందర్ సింగ్ గారు కూడా రాకాస పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ టైంలో అనిల్ రావిపూడి గారు ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు మళ్లీ మా కోసం ఆయన వచ్చారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కి కామెడీ అంటే అనిల్ రావిపూడి గారు గుర్తుకు వస్తారు. ఆయన సంక్రాంతికి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మేం సమ్మర్‌లో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేశామని అనుకుంటున్నాం. క్లీన్ కామెడీ చిత్రంగా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ‘రాకాస’ నిలిచింది. ‘రాకాస’ విజయం ప్రేక్షకులదే’ అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘అనిల్ రావిపూడి గారి సినిమాల్ని ఢీ కొట్టలేం గానీ.. ఆయన ప్రమోషన్స్‌ని ఢీ కొట్టాలని మేం అనుకున్నాం. మూవీని వీలైనంత వరకు ఆడియెన్స్ వరకు రీచ్ చేయగలగాలి. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజ్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని ముందు నుంచీ అనుకున్నాం. ఆయన ఎంట్రీకి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన నిహారిక గారు, మానస శర్మ గారికి థాంక్స్. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ఈవెంట్‌ను పెట్టాం. మహిళలు తరిలి వచ్చి మా సినిమాని చూస్తున్నారంటే మా కంటెంట్ వారికి నచ్చిందని భావిస్తున్నాం. మా మూవీని ఇంతలా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

నయన్ సారిక మాట్లాడుతూ .. ‘‘రాకాస’ని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక, మానస శర్మకు థాంక్స్. థియేటర్లో చిన్న వాళ్లు, పెద్ద వాళ్లు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

మానస శర్మ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ఆ సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నా నిర్మాతలు నిహారిక, జీ స్టూడియో, డిస్ట్రిబ్యూటర్లు సినిమా పట్ల, రిజల్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారి పాత్రను సర్ ప్రైజింగ్‌గా ఉంచాలని అనుకున్నాం. ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. గెటప్ శ్రీను గారు మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన అన్వర్ గారు, అను… స‌మ్మర్ సెన్సేష‌న‌ల్ మూవీగా ‘రాకాస’.. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మూడు రోజుల్లో రూ.15.80 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించిన చిత్రం

ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి థియేట‌ర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా ‘రాకాస‌’ సెన్సేష‌న్ క్రియేట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ ఈ చిత్రం అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. స‌మ్మ‌ర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండ‌టం ఈమ‌ధ్య కాలంలో అరుదైన‌ప్ప‌టికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మ‌ళ్లీ తీసుకొచ్చింది. ఆడియెన్స్ అంద‌రూ సినిమా చూసి కుటుంబంతో క‌లిసి చ‌క్క‌గా న‌వ్వుకుని వెళుతుండ‌టం మంచి ప‌రిణామం.

సినిమాకు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ క‌లెక్ష‌న్స్ రూపంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నిపిస్తోంది. రోజు రోజుకి సినిమా కలెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే అందుకు కార‌ణం. మూడు రోజుల్లో రాకాస సినిమా రూ.15.80 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సినిమాను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. కుటుంబంతో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ముందుగా ఈ సినిమాను ఆప్ష‌న్‌గా తీసుకుంటున్నారు. అందుకునే సినిమాను మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. సినిమాకు హిట్ మౌత్ టాక్ కూడా క‌లిసి రావ‌టం శుభ సూచ‌కం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తోంది. నార్త్ అమెరికాలో ఇప్ప‌టికే సినిమాకు 250K (రెండున్నర ల‌క్ష‌ల‌) డాల‌ర్ల వసూళ్ల‌ను సాధించ‌టం అక్క‌డ సినిమాకు ల‌భిస్తోన్నరెస్పాన్స్‌ను సూచిస్తోంది. సింపుల్ హ్యుమ‌ల్, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుండ‌టంతో వీకెండ్‌లో సినిమాకు తొలి ప్రాధాన్య‌మిచ్చారు.

రాకాస‌ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. సినిమా చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో రూపొందింది. సంగీత్‌, గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇది అన్ని వ‌య‌సుల వారికి నవ్విస్తోంది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌, న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. త‌న‌దైన యాక్టింగ్‌తో వెన్నెల కిషోర్ స‌న్నివేశాన్ని మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చారు.

ప్రేక్షకుల రెస్పాన్స్‌ సోషల్ మీడియాలో కూడా బలంగా కనిపిస్తోంది. థియేటర్లలో సినిమా ఎలా కనెక్ట్ అవుతుందో పోస్టులు, రియాక్షన్స్ రూపంలో స్పష్టంగా తెలుస్తోంది. వీడియోలు, కామెంట్స్‌లో పిల్లలు విజువల్స్, కామెడీ సీన్స్‌కి ఎగ్జైట్మెంట్‌తో రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీలు తమ థియేటర్ అనుభవాన్ని రిలాక్స్‌గా, నవ్వులతో నిండిన అవుటింగ్‌గా షేర్ చేస్తున్నారు. చాలామంది ఈ సినిమాను ‘నో-స్ట్రెస్ వాచ్’ అని, ‘పక్కా ఫ్యామిలీ థియేటర్ సినిమా’ అని అంటున్నారు. కుటుంబమంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే సినిమాగా ఉండ‌ట‌మే సినిమాకు పెద్ద ప్లస్‌గా మారుతోంది.

‘రాకాస‌’ ప్రత్యేకంగా ఇంత మంచి విజ‌యాన్ని సాధించ‌టానికి కార‌ణం.. ఇది అన్ని తరాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌ట‌మే. పిల్లలు ఇందులోని ఫాంటసీ, ఊహాజనిత ఎలిమెంట్స్‌కి ఆకర్షితులవుతుంటే, పెద్దవాళ్లు హ్యూమర్, పాత్రల మధ్య ఉండే డైనమిక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బ్యాలెన్స్‌డ్‌గా సినిమాను రూపొందించ‌టంతో కుటుంబమంతా క‌లిసి థియేట‌ర్స్‌కు వ‌స్తోంది.

ఫ్యామిలీస్ రాకాస‌ సినిమాను బలంగా ముందుకు తీసుకెళుతుంటంతో సినిమాకు రోజు రోజుకీ ఆద‌ర‌ణ పెరుగి స‌మ్మ‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మెప్పిస్తోంది.ఇంత భారీ విజయానికి కార‌ణం కార‌ణం ఫ్యామిలీ ఆడియెన్స్ కార‌ణం. రోజు రోజుకి సినిమాకు ఆద‌ర‌ణ పెరుగుతూ సినిమా థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here