Sahasra Production’s logo and ‘6am Love’ web series title launched held grandly

నూతన నిర్మాణ సంస్థ ‘సహస్ర ప్రొడక్షన్స్’* (Sahasra Productions) లోగో ఆవిష్కరణ మరియు వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన వెబ్ సిరీస్ “6am లవ్” (6am Love) టైటిల్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.

లక్ష్మీకాంత్ కె.బి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు సుధాకర్ అక్కినపల్లి దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటులు, రచయిత శ్రీ పోసాని కృష్ణమురళి గారు క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ ఛోటా కె. నాయుడు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నటులు కౌశల్, జోష్ రవి* గార్లు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. 

ఈ సందర్భంగా…ప్రముఖ నటులు, రచయిత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. “సహస్ర ప్రొడక్షన్స్ ద్వారా లక్ష్మీకాంత్ గారు నిర్మాణంలోకి అడుగుపెట్టడం సంతోషకరం. దర్శకుడు సుధాకర్ కెమెరా, డైరెక్షన్ రెండు బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నాడు. ‘6am లవ్’ టైటిల్ చాలా క్యాచీగా, కొత్తగా ఉంది. ఈ వెబ్ సిరీస్ పెద్ద విజయం సాధించి, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

బిగ్ బాస్ కౌశల్ మాట్లాడుతూ..“టైటిల్ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇప్పుడు అంతా వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. డైరెక్టర్ సుధాకర్ గారి విజన్, నిర్మాత లక్ష్మీకాంత్ గారి ప్యాషన్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌కి నా ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.

నటుడు జోష్ రవి మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో విభిన్నమైన కాన్సెప్టులతో వచ్చే వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతోంది. దర్శకుడు సుధాకర్ ఎంచుకున్న ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘6am లవ్’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలి” అని ఆకాంక్షించారు.

నిర్మాత లక్ష్మీకాంత్ కె.బి మాట్లాడుతూ.. “మా మొదటి అడుగును ఆశీర్వదించడానికి విచ్చేసిన పోసాని గారికి, ఛోటా కె. నాయుడు గారికి, కౌశల్, జోష్ రవి గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. సహస్ర ప్రొడక్షన్స్ ద్వారా మంచి కంటెంట్ ఉన్న కథలను ప్రేక్షకులకు అందించాలన్నదే మా లక్ష్యం. సుధాకర్ చెప్పిన ఈ క్యూట్ అండ్ ట్రెండీ స్టోరీ నాకు బాగా నచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ సిరీస్‌ను నిర్మిస్తాం” అని అన్నారు.

దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సుధాకర్ అక్కినపల్లి మాట్లాడుతూ.. “నా కథను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత లక్ష్మీకాంత్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మమ్మల్ని దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ‘6am లవ్’ అనేది నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండే ఒక అందమైన కథ. నా కెమెరాతో, డైరెక్షన్ తో ఈ కథకు పూర్తి న్యాయం చేస్తాను. నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం” అని తెలిపారు.

సాంకేతిక బృందం:
నిర్మాణ సంస్థ: సహస్ర ప్రొడక్షన్స్
వెబ్ సిరీస్ పేరు:6am లవ్
నిర్మాత:లక్ష్మీకాంత్ కె.బి
దర్శకత్వం & సినిమాటోగ్రఫీ: సుధాకర్ అక్కినపల్లి
పిఆర్ఓ : నరేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here