I have not cheated anyone- Nutty Kumar

ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఐనా ఇష్టం నువ్వే’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేసాను. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేసాడు. ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లి లీగల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ చంటి అడ్డాల మాత్రం హాలీ ఇన్ ఫ్లూయెన్స్ చేసి నామీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను కూడా అతనిపై ఫిర్యాదు చేశా. పోలీసులపైనా, న్యాయస్థానాలపైనా నాకు నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా’ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here