Telangana Private Employees Union (T.P.U.S) President ….Sanke Rajesh

గోదావరి ఖనికి చెందిన సంకె రాజేష్ ప్రైవేటు ఉద్యోగుల సంఘం (టి.పి.యు.ఎస్) జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఈ మేరకు హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రైవేటు ఉద్యోగుల సంఘం సమావేశంలో రాజేష్ ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మినిమం వేస్ట్ బోర్డ్ చైర్మన్ వెంకట్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.తన నియామకానికి సహకరించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తో పాటు,రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్,ఎం.నాగేశ్వర్, మంజుల రావ్, నారాయణదాసు, శ్రీధర్ లతో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు ఈ సందర్భంగా సంకె రాజేష్ అభినందించారు.

పెద్దపల్లి జిల్లా లోని ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాను.నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన పెద్దలకు,నాయొక్క శ్రేయోభిలాషులకు రాజేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు రాజా తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here