AVK Filims ‘O Thandri Theerpu’ New Movie Grand Launch

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ‘ఓ తండ్రి తీర్పు’. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జ‌న్మదినం సందర్భంగా  ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహిస్తుండ‌గా రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా.. ప్ర‌ముఖ‌ సంగీత దర్శకులు కోటి కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రమేష్ చెప్పాల స్క్రిప్ట్ అందజేశారు.
అనంతరం.. సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు – పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలియజేప్పే సందేశాత్మ‌క క‌థ‌న‌మే ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రమ‌ని తెలిపారు. మంచి మేసేజ్ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి కి, చిత్రయూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ తండ్రి తీర్పు నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని, లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రోత్సాహం, ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.
దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ.. ఓ తండ్రి తీర్పు సినిమా క‌థ‌ రాయడానికే 6 నెలలు పట్టిందని, ఈ కథను పుస్తకం రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరు సహకరించలేదని అన్నారు. ఓ తండ్రి తీర్పు పుస్తకంగా, మళ్ళీ తిరిగి సినిమా రూపొందటానికి లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సహకారం, రమణ చారి గారి ప్రోత్సహం ఎంతగానో ఉందని అన్నారు.
పర్యవేక్షకులు రాజేందర్ రాజు కాంచనపల్లి మాట్లాడుతూ.. ఓ మంచి కథ కి పర్యవేక్షన చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు నటీనటులు, టెక్నిషియన్స్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 నటీనటులు:
ప్రతాప్, శ్రీరామ్, అనురాధ, చెల్లి స్వప్న, మంజుల, కునాల్ కుషాల్,శ్రీరామోజు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ స్వాతి ప్రవల్లిక నటరాజు
బ్యానర్ : ఏవీకే ఫిలిమ్స్
సమర్పణ: లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్
నిర్మాత:లయన్ శ్రీరామ్ దత్తి
రచన దర్శకత్వం :ప్రతాప్ భీమవరపు
పర్యవేక్షణ : రాజేందర్ రాజు కాంచనపల్లి
డీఓపీ : సురేష్ చెట్ పల్లి
కో డైరెక్టర్ : రంగనాథ్ కలింగ
స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ ; నామాల రవీంద్ర సూరి, సాహిత్య ప్రకాష్
ప్రాజెక్టు కోఆర్డినేటర్: రాపోలు దత్తాత్రి
సంగీతం : మధు బాపు
పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి
పీఆర్‌వో : దయ్యాల అశోక్
ఆర్ట్ : దుద్దుపూడి ఫణి రాజు
అసిస్టెంట్ డైరెక్టర్ : బాలచంద్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here