Degree College Movie Contraversial pressmeet

డిగ్రీ కాలేజ్ పోస్టర్ల విషయంలో వ్యక్తమైన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని మాత్రం తొలగిస్తున్నట్లు దర్శకుడు నరసింహనంది మీడియా సమావేశంలో తెలియజేశారు..

వరుణ్, దివ్య రావు జంటగా, శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకంపై నరసింహనంది స్వీయ దర్శకత్వం లో రూపొందించిన చిత్రం డిగ్రీ కాలేజ్.ఈ నెల 7 (శుక్రవారం) నాడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నేపథ్యంలో పోస్టర్ల విషయంలో అభ్యంతరం వ్యక్తం కావడంతో వాటిపై అత్యవసరంగా గురువారం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ నందు మీడియా సమావేశం నిర్వహించారు..

ఈ సందర్బంగా దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ.. నేను గతంలో 1940 లో ఒక గ్రామం వంటి సినిమా తీసి జాతీయ అవార్డ్ తోపాటు నంది అవార్డ్ గెలుచుకున్నాను.తరువాత కమలతో నా ప్రయాణం,లజ్జ,బుద్దారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్ వంటి సామాజిక సందేశాన్నందించే పలు చిత్రాలు చేశాను.నేను సమాజానికి చెడు చేదు చెయ్యాలని ఏ రోజు ఆలోచించను, ఒక సామాజిక బాద్యతను దృష్టి లో పెట్టుకొని మొదటినుండి నేను నా సినిమాలు చేస్తుంటాను.ఈ సినిమా కూడా ఒక యదార్థ సంఘటనను ప్రేరణతో చేసిన కథే ఈ డిగ్రీ కాలేజ్, ఇందులో బలమైన కథ ఉంది.కొన్ని సన్నివేశాలు కథకు అనుగుణంగా చేశాము. ముందు సినిమాను చూడమని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.మీరు సినిమాను చూడకుండా సినిమా పోస్టర్లను చూసి ఆపేస్తామనడం ఎంత వరకు సమంజసము.సినిమా పై మేము చాలామంది ఆధారపడివున్నాము.మీరు సినిమా చూసిన తరువాత ఏదైనా అభ్యంతర పోస్టర్స్ ఉంటే వాటిని తొలగిస్తాము.పోస్టర్ల విషయంలో తలెత్తిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాము.నిన్న కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు,మహిళలు పోస్టర్ల విషయంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ టాస్క్ ఫోర్స్ వారు మాపై చర్యలు తీసుకొమ్మన్నారు.మమ్మల్ని పోలీస్ వాళ్ళు పిలిపించి 3 గంటలు పైగా స్టేషన్ లో కూర్చోబెట్టారు.మాపై వివిధ సెక్షన్స్ నమోదు చేస్తామన్నారు.కానీ పబ్లిసిటీ పోస్టర్స్ కు క్లీయరెన్సు కొన్నింటికి ఉన్నాయి,కొన్నింటికి లేవు అందుకనే ఏవైతే అభ్యంతకరంగా ఉన్న రెండు పోస్టర్స్ ను కూడా వెంటనే తొలగించే కార్యక్రమం మొదలు పెట్టాము నిన్న సాయంత్రం నుండే అందువల్ల ఈ సినిమాను ఆపే ప్రయత్నం చేయవద్దు,సినిమా చూడండి అని విజ్ఞప్తి చేస్తున్నాము.నన్ను అరెస్ట్ చేశారని కొన్ని మీడియా ఛానెల్స్ లో వస్తున్నట్లు తెలిసింది,అభ్యంతర పోస్టర్స్ ను తొలగించమని చెప్పారు తప్ప పోలీస్ లు నన్ను అరెస్ట్ చేయలేదు అని అన్నారు..

ఇంకా ఈ సమావేశంలో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు,సహనిర్మాతలు అలెటి శ్రీనివాసరావు, కొండయ్య లు మాట్లాడుతూ. . ఇప్పటి వరకు ఎన్నెన్నో పోస్టర్స్ ను మేము బయట చూస్తుంటాము,కానీ ఇలాంటి పోస్టర్స్ వేస్తే అభ్యంతరాలు వస్తాయని తెలియదు మాకు.కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ వాటిని దృష్టిలో పెట్టుకొని అట్టి పోస్టర్లను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టాము,ఎఫ్. డి.సి కి వారికి  కూడా అట్టి పోస్టర్లను తొలగిస్తామని తెలుయజేశామని అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here