Late Kaloji Narayanarao Biopic Shooting begins

“ప్రజాకవి-కాళోజీ” సినిమాను “జైనీ క్రియేషన్స్” బ్యానర్ పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నంది అవార్డు గ్రహీత డాక్టర్ ప్రభాకర్ జైనీ వహించారు. పాటలు కళారత్న బిక్కి కృష్ణ. సంగీతం యస్. యస్. ఆత్రేయ; కెమెరా సత్యజిత్ రే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన రవి కుమార్ నీర్ల. కాళోజీ పాత్రను అచ్చుగుద్దినట్టు కాళోజీ గారి పోలికలున్న శ్రీ మూలవిరాట్ పోషిస్తున్నారు. అనేక మంది ప్రముఖ సినిమా టీవీ కళాకారులు మిగిలిన తారాగణం. కాళోజీ గారి పై కళారత్న బిక్కీ కృష్ణ గారు రాసిన ‘అతడు అతడే’ అనే పాటపై శరత్ సుంకరి బృందం వారు ప్రదర్శించిన నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అతని జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని “”ప్రజాకవి-కాళోజీ”” గారి బయోపిక్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ముహుర్తపు షూటింగ్ జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరియు తెలంగాణా ప్రభుత్వ సలహాదారు శ్రీ కేవీ రమణా చారి గారి చేతుల మీదుగా షూటింగు ప్రారంభించబడింది.
ఈ షూటింగులో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు గారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. ఆ కార్యక్రమంలో కాళోజీ కొడుకు రవి, కోడలు వాణి కూడా పాల్గొనడం విశేషం.

టెక్నీషియన్స్:
బ్యానర్: జైనీ క్రియేషన్స్
పాటలు: కళారత్న బిక్కి కృష్ణ
కెమెరా: రవి కుమార్ నీర్ల
పి.ఆర్. ఓ.: కడలి రాంబాబు
సంగీతం: యస్. యస్. ఆత్రేయ
గాయనీగాయకులు: వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, మాళవిక, భూదేవి
నిర్మాత : విజయలక్ష్మీ జైనీ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ ప్రభాకర్ జైనీ

నటీనటులు:
మూలవిరాట్ (కాళోజీ) విజయలక్ష్మీ జైనీ,(కాళోజీ భార్య పాత్ర) పీవీ మనోహర్ రావు (పీవీ నర్సింగ్ రావు గారి తమ్ముడు), తుమ్మూరి రామ్మోహన్ రావు, చెల్లి స్వప్న, సాదినేని శ్రీజ, సిద్ధూరెడ్డి,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here