Love and Crime Comedy Entertainer “parari” Review

Cinemarangam.Com
సమర్పణ : గాలి ప్రత్యూష
బ్యానర్ : ,శ్రీ శంకర ఆర్ట్స్
సినిమా : “పరారీ “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 30.03.2023
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
నటీ నటులు …యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ : గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,
పి. ఆర్ ఓ : సతీష్ కె

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే నే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇప్పటి వరకు రానటువంటి కొత్త కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “పరారీ “.గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “పరారీ”..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ:

యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ఇద్దరూ ఒకే కాలేజ్. ఇద్దరూ ప్రేమించుకుంటారు. హీరో తండ్రి(షయాజి షిండే) ఒక బిజినెస్ మేన్. చాలా తీరిక లేకుండా గడిపేస్తుంటారు. హీరోకి మరో ఇద్దరు స్నేహితులు(జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్) ఉంటారు. అందులో భూపాల్ కి తన తోటి ఆర్టిస్ట్ శివాని సైనిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదు మంది కలిసి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదే సమయంలో యోగీ తండ్రి… పాండే (మకరంద్ దేశముఖ్ పాండే) చేత కిడ్నాప్ కి గురవుతాడు. మరి యోగి… మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? కిడ్నాప్ కి గురైన తన తండ్రిని ఎలా విడిపించుకున్నాడు?  డీప్ లవ్ లో ఉన్న యోగి (యోగీశ్వర్), అతిథి (అతిథి) లు
ఒక్కటయ్యారా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే “పరారీ” సినిమా తప్పక చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
యోగి పాత్రలో నటించిన హీరో యోగీశ్వర్ కొత్త వాడైనా …
తన హావ భావాలతో పాటు, మాటలు,పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు.హీరోయిన్ గా నటించిన అతిథి తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. హీరోతో పాటు చేసిన భూపాల్,.అతనికి జోడీగా నటించిన శివాని సైని పాత్ర కూడా గ్లామర్ తో కూడి… యూత్ ని ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ రఘు కారుమంచి… బాగా నవ్వించారు. తన కామెడీ టైమింగ్ తో చాలా చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఆలీ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. పోలీస్ అధికారి పాత్రలో సుమన్ కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్రనే చేసి మెప్పించారు. హీరో తండ్రిగా షయాజీ షిండే బాగా నవ్వించారు. అలాగే హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి గయ్యాళిగా ఆకట్టుకుంటుంది. ఇక చెప్పుకోవాల్సింది… బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ ముఖ్ పాండే..కామెడీ విలన్ పాత్రలో బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. విలన్ శ్రవణ్ కాసేపే ఉన్నా… తన పాత్ర పరిధి మేరకు నటించారు. స్వామీజీ పాత్రలో కమెడీయిన్ జీవా తో పాటు ఇందులో నటించిన వారందరూ కూడా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు సాయి శివాజీ లవ్ క్రైం కామెడీ థ్రిల్లర్ మూవీస్ కు కావాల్సిన స్క్రీన్ ప్లేను గ్రిప్పింగ్ గా రాసుకుని ఆడియన్స్ ని థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే లా చాలా చక్కగా తెరకెక్కించాడు. ఫన్ ఎపిసోడ్ ని బాగా ఎంగేజింగ్ తీశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి.ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రధాన పాత్ర పోషించాయి. గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ, సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ చాలా రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రేక్షకులను ఆకట్టుకొనే విధమైన పాటలే కాకుండా చక్కటి నేపధ్య సంగీతంతో పాటు మంచి సాహిత్యం అందించాడు . రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ పనితీరు బాగుంది. గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించిన “పరారీ”..సినిమా చూసిన తరువాత నిర్మాత మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో కథతో పాటు ప్రేక్షకులను థియేటర్లో రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునే లా తీసిన ఈ సినిమా లో అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “పరారీ” చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam. Com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here