New concept Suspense Thriller ‘Kaliyugam Pattanamlo’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
సినిమా :‘కలియుగం పట్టణంలో’…
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 29.03.2024
నిర్మాతలు : డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌
దర్శకత్వం : రమాకాంత్ రెడ్డి
నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా, దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల తదితరులు
సినిమాటోగ్రఫీ : చరణ్ మాధవనేని
సంగీతం : అజయ్ అరసాడ
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
పి ఆర్ ఓ: సాయి సతీష్, రాంబాబు


టాలీవుడ్‌లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం   ‘కలియుగం పట్టణంలో’.. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి  ఓ డిఫరెంట్  చిత్రాన్ని నిర్మించారు . ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను తనే చూసుకున్న  . రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  మార్చి 29న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


కథ
నల్లమల ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో  నంద్యాలలో  జరిగే హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) తమ కవల పిల్లలు విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయలతో హాయిగా జీవిస్తుంటారు. విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం సైకోలా ఆనంద పడతాడు. సాగర్ బయట తిరిగితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అని బాల్యంలోనే మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు. అలా కొన్నేళ్ళు గడుస్తాయి. కాలేజీలో విజయ్ మంచితనం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) ఇష్టపడుతుంది. అత్యాచారాలు చేసే క్రూర మృగాలను శ్రావణి వేటాడి చంపుతూ ఉంటుంది. నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ.. సాగర్ లలో ఎవరు మంచి వారు..  ఎవరు చెడ్డ వారు.. అక్కడ జరిగే ఘోరాలతో వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీస్ ఆఫీసర్ అక్కడి క్రైం కి చెక్ పెట్టిందా లేదా అన్నదే కథ.

నటీ నటుల పనితీరు
‘కళాపోషకులు’, ‘అల్లంత దూరానా’, ‘జై సేన’  సినిమాల తరువాత హీరో   విశ్వ కార్తికేయ  మొదటి సారిగా  రెండు షేడ్స్ ఉన్న   పాత్రల్లో  విజయ్, సాగర్ గా మంచి వాడిగా, సైకో వాడిలా చాలా చక్కగా  నటించి మెప్పించడమే కాకుండా కొన్ని చోట్ల భయపెట్టాడు.మరియు యాక్షన్ ఏమోషన్స్ డాన్స్ ఇలా అన్నింటిలోనూ ఆకట్టుకున్నాడు ..కాలేజీ అమ్మాయిగా, అమ్మాయిలకు అన్యాయంచెసే వారిని గుణపాఠం చెప్పే అమ్మాయిగా ఆయుషి పటేల్ చాలా చక్కగా నటించింది. పోలీసు అధికారిగా  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రా శుక్లా  తన పాత్రకు కరెక్ట్ గా సూట్ అయింది . ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల లతో పాటు   మిగిలిన పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు..

సాంకేతిక నిపుణుల పనితీరు
టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు.దర్శక, నిర్మాతలకు ఇది మొదటి సినిమా అయినా..కుటుంబ సమేతంగా వచ్చి చూసేలా మంచి సందేశాన్ని ఇస్తూ  ఎమోషనల్, హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా కథను ఎంచుకుని  ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతూ ఆర్టిస్టులు రియాలిస్టిక్ పెర్ఫార్మన్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించిన దర్శక నిర్మాతల గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది.చరణ్ మాధవనేని కెమెరా వర్క్ బాగుంది.  ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల లు  రాసిన సాహిత్యం ,అనురాగ్ కులకర్ణి గాత్రం, అజయ్ అరసాడ ఇచ్చిన సంగీతం బావుంది. ‘మదర్ సెంటిమెంట్ తో   సాగే  ‘జో జో లాలీ అమ్మ’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదమ్మా అనే డైలాగ్స్, మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ పాటు ఇందులో చాలా ట్విస్టులున్నాయి. గ్యారీ బీహెచ్  ఎడిటింగ్ పనితీరు బాగుంది. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్  బ్యానర్స్ పై ఖర్చుకు వెనుకాడకుండా డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా  నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.మధ్య మధ్యలో వచ్చే ప్రతీ ట్విస్టు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. కొత్త కంటెంట్, థ్రిల్లర్, సస్పెన్స్, ఇంటరాగేషన్ జోనర్స్ ఇష్టపడే వారికి మాత్రం ‘ ‘కలియుగం పట్టణంలో’’ సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here