Nitin ,Chandrasekhar Eleti ,Bhavya Creations Movie ‘Check’ Releasing on February 19

నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19 గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ “ జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ మధ్య కాలంలో ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలే దుకచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది.ఓ ఉరిశిక్ష పడ్డఖైదీచెస్ గేమ్’ ద్వారా తన లక్ష్యాన్నిఎలా చేరు కున్నాడన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశంఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందినితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీఇందులో ఉంటాయిఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కి చక్కటి స్పందన లభించిందిఇందులో కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి” అనితెలిపారు.

నితిన్,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీ వాత్సవ్ , ఆర్ట్ : వివేక్అన్నామలై  , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత :  వి.ఆనంద ప్రసాద్,

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here