Star Hero Vijay Deverakonda’s “Family Star” Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సినిమా : “ఫ్యామిలీ స్టార్”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 05.04.2024
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల  
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రోహిణి హట్టంగిడి, వెన్నెల కిషోర్, జగపతి బాబు, అజయ్ ఘోస్, అభినయ, వాసుకి తదితరులు
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ఫిల్మ్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమాతో  నిర్మాతగా మారి దిల్ రాజుగా మారాడు.. ఇప్పుడు మళ్ళీ 21 ఏళ్ల తర్వాత ఇదే రోజున ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు .హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు.”ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సమ్మర్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే పాజిటివ్ వైబ్స్ తో ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ. మధ్యతరగతికి చెందిన గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) సివిల్ ఇంజనీరింగ్ చేసి ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ ఇద్దరన్నలు, వదినలు, వారి పిల్లలు, బామ్మతో ఉంటూ కుటుంబ బారం మొత్తం తన బుజస్కందాలపై మోస్తూ సింపుల్ గా జీవిస్తుంటాడు. సివిల్స్ రాయాల్సిన తన పెద్దన్నయ్య ఒక ఫ్లాష్ బ్యాక్ వల్ల ఇగో హర్ట్ అయి మద్యానికి బానిస అయ్యివుంటాడు. రెండో అన్న వ్యాపార ప్రయత్నాల్లో వుంటాడు. ఇలా వుండగా వీళ్ళపై పోర్షనులోకి  సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇందూ (మృణాల్ ఠాకూర్) అద్దెకి దిగుతుంది. ఆ తరువాత కొద్ది రోజులకు ఇద్దరూ దగ్గరవుతారు. అయితే మధ్యతరగతి కుటుంబపై ఇందూ బుక్ రాసి ప్రచురిస్తుంది. ఈ విషయం తెలిసిన గోవర్ధన్ తమ కుటుంబంపై బుక్ రాసి పరువు తీసే ప్రయత్నం చేసిన ఇందూ కాలేజ్ కు వెళ్లి తనపై ఫైర్ అయ్యి చేయి చేసుకుంటాడు. నీ బుక్ కోసం నన్ను లవ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేశావ్. నీ లాంటి వారికి దూరంగా ఉంటానని.. అలాగే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తలుచుకుంటే ఏమైనా చేయగలడనే విషయాన్ని నిరూపిస్తానని ఆవేశంతో బయటికి వస్తాడు.

ఆ తర్వాత జగపతి బాబు కు చెందిన ఓ పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యి తన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారిందని తనకు పెద్ద కంపెనీ లో జాబ్ వచ్చిందని విడియోలు తీసి కోపంతో ఇందుకు పంపుతాడు. మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్లిన తరువాత తను జాయిన్ అయిన కంపెనీ యజమాని కూతురే ఇందూ అని తెలుస్తుంది. అయితే ఈ కంపెనీలో హార్డ్ వర్క్ చేసి జగపతి బాబు మెప్పు పొంది ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకుంటానని తన ఫ్రెండ్స్ తో చాలెంజీ చేస్తాడు. చివరకు తన చాలెంజ్ ను నెరవేర్చుకొని సొంత కంపెనీ పెట్టాడా ?అసలు ఇందు ఎవరు, ఎందుకు తనగురించి బుక్ రాసింది? ఇందూలాంటి వారికి దూరంగా ఉంటానన్న గోవర్ధన్ చివరకు దగ్గరయ్యాడా లేదా? అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “ఫ్యామిలీ స్టార్” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
సివిల్ ఇంజినీర్ క్యారెక్టర్ లో గోవర్థన్ గా  (విజయ్ దేవరకొండ)నటుడుగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తన డ్రెస్సింగ్, స్టైల్ తో మిడిల్ క్లాస్ యూత్ ను ఆకట్టుకున్నాడు. ఇందూ పాత్రలో నటించిన (మృణాల్ ఠాకూర్) తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంది. విజయ్, మృణాల్ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది, బామ్మ పాత్రలో నటించిన రోహిణి హట్టంగిడి తన పాత్రలో ఒదిగిపోయింది.వెన్నెల కిషోర్ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇందు తండ్రిగా జగపతి బాబు, మరియు అభినయ, వాసుకి తదితరులందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల  పనితీరు
మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పే సినిమా  ఫ్యామిలీ స్టార్. ఇండియా మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటం అనేది జరగడం లేదు. ఇలాంటి టైమ్ లో మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి డిస్కస్ చేసే ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ తో పాటు ఒక మంచి ప్రేమ కథ ను జోడిస్తూ ఇందులో హీరోయిజం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, హ్యూమర్, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు పరశురామ్.

‘కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా…’ అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా…మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
‘మధురము కదా.. ప్రతి ఒక నడక నీతో కలిసి ఇలా, అంటూ క్యాచీ లిరిక్స్ తో సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా ..శ్రేయా ఘోషల్ పాడారు. ఇందులోని పాటలకు గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కేయూ మోహనన్ కెమెరా వర్క్ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్  ఎడిటింగ్ పనితీరు బాగుంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ లు  ఖర్చుకు వెనుకాడకుండా  నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీ కోసం ఏం చేశాడు, తను తలచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలడు అనే గుడ్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ఫ్యామిలీ స్టార్ ” సినిమాకు నమ్మి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here