Home Blog Page 818

Meet Raashi Khanna’s World Famous Lover

మోస్ట్‌ హ్యాపీనింగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. భిన్నమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ నలుగురు హీరోయిన్స్‌ పాత్రలకు, హీరో పాత్రకు ఉన్న రిలేషన్‌ ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. డిఫరెంట్‌ లుక్‌, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐశ్వర్యా రాజేష్‌, ఇజాబెల్లె లెయితె, క్యాథరిన్‌ థ్రెసా లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈరోజు రాశీఖన్నా లుక్‌ను హీరోతో ఆ పాత్రకు ఉన్న రిలేషన్‌ను విడుదల చేశారు.
రాశీఖన్నా పాత్ర పేరు యామిని.. దేవరకొండ పాత్ర పేరు గౌతమ్‌. ఐశ్వర్యాజేష్‌, క్యాథరిన్‌కు శీనయ్య, శ్రీనుగా.. ఇజాబెల్లె లెయితె, రాశీఖన్నాలకు గౌతమ్‌గా విజయ్‌దేవరకొండ పాత్ర పరిచయం ఉంది. “అతన్ని నా ప్రపంచంగా చేసుకున్నాను. నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ గౌతమ్‌ను వేలంటెన్స్‌ డే సందర్భంగా కలుసుకుందాం’ అంటూ రాశీఖన్నా తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.
ఈ లుక్‌లో విజయ్‌దేవరకొండ, రాశీఖన్నా లుక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. విజయ్‌దేవరకొండ నాలుగు గెటప్స్‌లో కనపడటానికి, వేర్వేరు పేర్లతో పిలవడానికి గల కారణాలు మాత్రం సీక్రెట్‌. జవనరి 3న సినిమా టీజర్‌ విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
వేలెంటెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

Ruler Pre Release function

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం  ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఘ‌నంగా జ‌రిగింది.  ఈ మూవీ ట్రైల‌ర్‌ను బోయ‌పాటి శ్రీను, నంద‌మూరి రామ‌కృష్ణ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, గంటా శ్రీనివాస‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, వాసుప‌ల్లి గ‌ణేష్‌, సి.క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్, డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, శ్రీభ‌ర‌త్‌, సోనాల్ చౌహాన్‌, వేదిక, అంబికా కృష్ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ – “బాల‌కృష్ణ‌గారితో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఆయ‌న‌తో సినిమా చేయ‌డం హ్యాపీ. నాకు అవ‌కాశం ఇచ్చిన కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి, సి.క‌ల్యాణ్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
వేదిక మాట్లాడుతూ – “తెలుగులో చాలా ఏళ్ల త‌ర్వాత చేస్తోన్న సినిమా. బాల‌కృష్ణ‌గారితో నా తొలి చిత్రం. షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న నాకు హెల్ప్ చేయ‌డమే కాదు.. న‌న్ను చాలా ఇన్‌స్పైర్ చేశారు. సి.క‌ల్యాణ్‌గారికి, కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
సౌతిండియా ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షుడు ర‌వి కొటాక‌ర్ మాట్లాడుతూ – “మా నాన్న‌గారు, ఎన్టీఆర్‌గారు క‌లిసి ర‌క్త‌సంబంధం సినిమా చేశారు. అందుకే మేం బాల‌కృష్ణ‌గారిని అన్న‌య్య అని పిలుస్తుంటాం. 30 ఏళ్ల ముందు బాల‌య్య‌గారు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ద‌క్షిణాదిన స్టార్స్ అయిన ర‌జినీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, బాల‌కృష్ణ వంటి స్టార్స్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టిన క్రెడిట్ కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికే ద‌క్కుతుంది. క‌ల్యాణ్‌గారు డిఫ‌రెంట్ సినిమాలు చేసే ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌. జైసింహా వంటి హిట్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రూల‌ర్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది“ అన్నారు.
నంద‌మూరి రామ‌కృష్ణ మాట్లాడుతూ – “రూల‌ర్ త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్యవాదాలు“ అన్నారు.
బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ – “సినిమా వాళ్ల‌కి వైజాగ్, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఇచ్చే స‌హ‌కారాన్ని ఏ రోజు మ‌రువ‌లేం. ఎక్క‌డా చూడ‌లేం. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ఇక్క‌డే షూటింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయ‌న త‌మిళంలో చేసిన సినిమాల‌న్నీ మాలాంటి ద‌ర్శ‌కుల‌కు రెఫ‌రెన్స్‌లా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ్. జైసింహా త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా సూప‌ర్ డూప‌ర్‌హిట్ట‌వుతుంది. సి.క‌ల్యాణ్‌గారికి అభినంద‌న‌లు. రూల‌ర్ అనే పేరు బాల‌య్య‌బాబుకి ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోతుంది. ఈ సినిమా టైటిల్‌ను నేను రిజిష్ట‌ర్ చేసి, సాంగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ టైటిల్ బాల‌య్య‌బాబుగారికే ద‌క్కింది. రూల‌ర్ ఆఫ్ ఆర్ట్స్.. రూల‌ర్ ఆఫ్ హార్ట్స్‌ బాల‌య్య‌. ఆయ‌న న‌ట‌న‌తోనే న‌డ‌వ‌డిక‌తోనూ అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు. ఆయ‌న న‌టించిన రూల‌ర్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. ఇందులో వ‌ర్క్ చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు థ్యాంక్స్‌“ అన్నారు.
డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – ``నేను ఇండ‌స్ట్రీలో వచ్చిన త‌ర్వాత నాకు ఎక్కువ స‌పోర్ట్ అందించిన వ్య‌క్తి బాల‌కృష్ణ‌గారే. ఆయ‌న తండ్రి ఎన్టీఆర్‌గారు రూల‌ర్‌. ఆయ‌న కొడుగ్గా పెరిగిన బాల‌కృష్ణ‌గారు రూల‌ర్ అంటే ఏంటో తెలుసుకున్న వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి రూల‌ర్ అనే ఓ సినిమా చేస్తే ఎంత బావుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కె.ఎస్‌.ర‌వికుమార్ అంటే సూప‌ర్ డైరెక్ట‌ర్‌. చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసే డైరెక్ట‌ర్ ఆయ‌న‌. క‌ల్యాణ్‌గారితో సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పటి నుండి ప‌రిచ‌యం ఉంది. ఇంత మంది నాకు కావాల్సిన వ్య‌క్తులు చేసిన ఈసినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – `` బాల‌కృష్ణ‌గారు మ‌న‌సులో ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా ఉండే వ్య‌క్తి. చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వంతో ఓపెన్‌గా ఉంటారు. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. మంచి టైటిల్‌, డైరెక్ట‌ర్‌, నిర్మాత అన్ని చ‌క్క‌గా కుదిరాయి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్ మాట్లాడుతూ – “ జైసింహా త‌ర్వాత మా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. బాల‌య్య‌గారికి, క‌ల్యాణ్‌గారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ప‌రుచూరి ముర‌ళిగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంత‌న్ భ‌ట్‌, రామ‌జోగ్య శాస్త్రి, భాస్క‌ర భ‌ట్ల‌, కెమెరామెన్ రాంప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. ఎంటైర్ టీం ప్రారంభం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. వేదిక‌, సోనాల్‌, జ‌య‌సుధ‌, ప్ర‌కాశ్‌రాజ్ స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌“  అన్నారు.
నిర్మాత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “బాల‌కృష్ణగారితో క‌లిసి నేను, కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు  పండ‌గ‌లాంటి సినిమా జైసింహాను ఇచ్చాం. రూల‌ర్ సినిమా కూడా పండ‌గ‌లాంటి సినిమా. మీసం మెలేసి మాట్లాడేలా ఉంటుంది. అలాంటి సినిమాను బాల‌య్య‌గారి కోసం, నా కోసం ప‌రుచూరి ముర‌ళిగారు మాకు ఇచ్చారు. క్యాస్టింగ్‌, ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉండే ఈ సినిమాను 5 నెల‌ల్లోనే ర‌వికుమార్‌గారు పూర్తి చేశారు. సంక్రాంతి భోజ‌నాన్ని 25 రోజుల ముందుగానే ఇస్తున్నాం. చిరంత‌న్ భ‌ట్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్ ఇర‌గ‌దీసేశారు. 5 నెల‌ల్లో ఇంత టైట్ వ‌ర్క్‌ను పూర్తి చేయ‌డ‌మంటే మాట‌లు కాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను త‌మ‌దిగా భావించి సినిమా చేశారు. పండ‌గ‌లాంటి సినిమా. సినిమా చూసిన త‌ర్వాత బాల‌య్య ఈజ్ గ్రేట్ అనేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “ఎన్టీఆర్, బ‌స‌వ‌తార‌క‌మ్మ పుణ్య దంప‌తుల క‌డుపున పుట్ట‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్న‌గారి బాట‌లో న‌డుస్తూ వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తున్నాను. ఆదిత్య 369, శ్రీరామ‌రాజ్యం, గౌత‌మిపుత్ర‌శాకర్ణి, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల కృష్ణ‌య్య‌, సింహా, లెజెండ్ వంటి ఎన్నెన్నో పాత్ర‌ల‌ను చేశాను. క‌ళామ‌త‌ల్లికి సేవ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేసుకుంటున్నాను. నేను ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆయ‌న బాగా న‌మ్మారు. మ‌న‌మే ముందు అడుగు వేయాల‌ని ఆయ‌న న‌మ్మారు. అది సినిమాలైన కావ‌చ్చు.. రాజ‌కీయాలైన కావ‌చ్చు. అన్నింటినీ ప్రేక్ష‌కులు ఆద‌రించారు. నేను, కల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ క‌లిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఆ స్ఫూర్తితోనే రూల‌ర్ సినిమాను చేశాం. రూల‌ర్ సినిమాకు మ‌రో క‌థ‌ను అనుకున్నాం. కానీ అది కుద‌ర‌లేదు. ఆ స‌మయంలో నేను ప‌రుచూరి ముర‌ళిగారి ఫోన్ చేశాను. ఆయ‌న ద‌గ్గ‌రున్న క‌థ‌ను వినిపించారు. న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా, కొత్త‌ద‌నం అందించాలనే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాను. నాకు రైతు మీద సినిమాలు చేయాల‌ని చాలా కోరిక ఉండేది. ఓ సంద‌ర్భంలో చాలా మందిని క‌లిశాను కూడా. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఈసినిమాలో అది కొంత తీరింది. కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి నాలానే సినిమా అంటే ప్రేమ‌. నాలుగు నెల‌ల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. చిరంత‌న్ భ‌ట్‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్‌ను కూడా చ‌క్క‌గా అందించి పాత్ర‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. కెమెరామెన్ స‌న్నివేశాల‌ను అద్భుతంగా వెండితెర‌పై ఆవిష్క‌రించారు. వేదిక‌, సోనాల్ చౌహాన్ చ‌క్క‌గా న‌టించారు.  పైట్ మాస్ట‌ర్స్ రామ్‌ల‌క్ష్మ‌ణ్, పాట‌లు రాసిన రామ‌జోగయ్య‌గారు, భాస్క‌ర‌భ‌ట్ల‌గారికి అభినంద‌న‌లు. న‌టీన‌టులైన భూమిక‌గారు, జ‌య‌సుధ‌గారు, ప్ర‌కాష్‌రాజ్‌గారు స‌హా అంద‌రి కష్టంతోనే సినిమాను నాలుగు నెల‌ల్లోనే పూర్తి చేశారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.

HERO KARTHI INTERVIEW(FOR DONGA MOVIE)

’ఖైదీ’లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై ’దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ’దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ ప‌తాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా యాంగ్రీ హీరో కార్తీ ఇంటర్వ్యూ…

’ఖైదీ’ బ్లాక్ బస్టర్ తో తెలుగులో ఒక మార్క్ క్రియేట్ అయింది కదా! ఈ సినిమాతో ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్ అందుకోగలరా?
– అలా ఆలోచించి నేను ఏ పని చేయలేదు. ప్రతి సినిమాకు నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే చూశాను. ఇప్పటివరకు 19 సినిమాలు చేశాను. ప్రతిదీ నాకు నచ్చిన సినిమాలే చేస్తూ వచ్చాను. నా స్క్రిప్ట్ ఎంపికలో మాత్రం కేర్ఫుల్ గా ఉంటాను.

ఈ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి?
– ‘రంగ్ దే బసంతి’ సినిమాకు వర్క్ చేసిన రైటర్ రెన్సిల్ డి సిల్వ ఈ స్క్రిప్ట్ ను నాదగ్గరకు తీసుకురావడం జరిగింది. నరేషన్ చేస్తున్నప్పుడే స్క్రిప్ట్ లో అక్క క్యారెక్టర్ నాకు నచ్చింది. అప్పుడే వదినకు వినిపించాను ఆమెకు బాగా నచ్చింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నపుడు ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ అయితే ఈ కథకు పూర్తి న్యాయం చేయగలడు అనిపించి మా ప్రొడ్యూసర్స్ అతన్ని కాంటాక్ట్ అవడం జరిగింది. కార్తీ, జ్యోతిక ఇద్దరు చేస్తున్నారంటే నేను తప్పకుండా చేస్తాను అని ఓకే చేశారు. జీతూ జోసెఫ్ కి స్క్రిప్ట్ నచ్చగానే నాకు సినిమా మీద కాన్ఫిడెంట్ పెరిగింది.

మీ వదిన జ్యోతిక గారితో కలిసి నటిస్తున్నప్పుడు సెట్లో ఎలా అనిపించేది?
– రెగ్యులర్ గా ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నట్లే ఉండేది. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అలాంటివే. అయితే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ గ్రేట్. పైగా ఆవిడది స్ట్రాంగ్ క్యారెక్టర్. తమిళ్ నేర్చుకొని పంచ్ డైలాగ్స్ చెప్పి ఇవి నీ సినిమాలో పెట్టుకో అనేవారు. అలాగే మా ఫాదర్ రోల్ లో నటించిన సత్యరాజ్ గారిది కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాంటి గ్రేట్ ఆర్టిస్ట్ ల పక్కన చేస్తున్నపుడు మనకు తెలియకుండానే బాగా చేయగలము.

సినిమా ఏ జోనర్ లో ఉంటుంది?
– సినిమా గురించి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి అలాగే సస్పెన్స్ ఉంది. దృశ్యం డైరెక్టర్ కాబట్టి అతడి స్పెషాలిటీ థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. నా క్యారెక్టర్ వచ్చేసి ఊపిరి సినిమాలో నేను చేసిన ‘శీను’ క్యారెక్టర్ లా ఉంటుంది. సినిమాలో మాత్రం ‘నాపేరు శివ’ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా పేరు శివ, ఊపిరి క‌లిపితే వ‌చ్చిన డిఫ‌రెంట్ ఫిలిం లా ఉంటుంది.

సత్యరాజ్ తో సెకండ్ మూవీ కదా?
– అవును, సత్యరాజ్ గారితో ‘చినబాబు’ సినిమా చేశాను. ఈ స్క్రిప్ట్ విన్న తరువాత తండ్రి క్యారెక్టర్ సత్యరాజ్ గారు చేస్తారంటేనే సినిమా చేద్దాం అని అన్నాను. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. చాలా షేడ్స్ ఉంటాయి. ఆయన కూడా చాలా రోజుల తరువాత పెర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది అని చెప్పారు. అలాగే షావుకారి జానకి, సీత గారి క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటాయి.

‘దొంగ’ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి?
– మీరు ‘ఊపిరి’ సినిమా చూస్తే ఆ సినిమాకు ‘దొంగ’ అని టైటిల్ పెట్టొచ్చు..కేవలం దొంగతనం చేయడమే కాదు ఇతరుల మనసుల్ని దోచుకున్నా ‘దొంగ’ టైటిల్ సరిపోతుంది. ఒక ‘దొంగ’ మంచి గా మారి అందరి హృదయాల్ని ఎలా దోచుకున్నాడనే స్టోరీ కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ అనిపించింది.

చిరంజీవి గారు కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ చేశారు. మీరు అదే ఫాలో అయ్యారు?
– ‘ఖైదీ’ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. ఈ సినిమాకోసం ‘తమ్ముడు’ టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ‘దొంగ’ కూడా చిరంజీవి గారి టైటిల్ కావడం నిజంగా హ్యాపి.

జోసెఫ్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– చాలా కాలం తర్వాత ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్టర్ తో చేస్తున్నాను. చాలా మంది సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేశారు. షూటింగ్ స్పాట్ కి వెళ్ళగానే సినిమా అనేది టీమ్ ఎఫర్ట్ మనం అందరం కలిసి మంచి సినిమా తీద్దాం అనేవారు. ప్రతి రోజు ఉదయం అందరం కలిసి కూర్చొని ఆరోజు చేయాల్సిన సన్నివేశాల గురించి మాట్లాడుకుని చేసే వాళ్ళం. ఒక సీనియర్ డైరెక్టర్ లా కాకుండా ఒక క్లాస్ మేట్ తో చేస్తున్న ఫీలింగ్ కలిగింది.

టెక్నీషియన్స్ గురించి?
– ఆర్ డి రాజశేఖర్ గారు చాలా సీనియర్ సినిమాటోగ్రాఫర్. అలాగే మా అన్నయ్య సూర్య గారికి ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి బ్యూటిఫుల్ విజువ‌ల్స్ ఇచ్చారు. ’96 ‘ సినిమాకు చేసిన గోవింద్ వసంత గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కెజిఎఫ్ డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు చాలా శ్రమ తీసుకొని మంచి డైలాగ్స్ రాశారు. ట్రైల‌ర్‌లో ఆయ‌న డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఇష్టపడి పనిచేశారు. అందుకే 65 రోజుల్లో అనుకున్నటైమ్‌కి షూటింగ్ పూర్తి చేయగలిగాము.

బ్లాక్ బస్టర్ ఆన్ ది వే’ అని నాగార్జున గారు ట్వీట్ చేశారు కదా..
– ‘దొంగ’ తెలుగు టీజర్ నాగార్జున గారు విడుదల చేశారు. టీజర్ చూడగానే చాలా బాగుంది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ట్వీట్ పెట్టారు. ఆయన చాలా మంది డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఆయనకు మా టీజర్ నచ్చడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

తెలుగు ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్‌ గురించి?
– హర్షిత మూవీస్‌ రావూరి వి. శ్రీనివాస్‌ గారు ఈ సినిమాను తెలుగులో చేస్తున్నారు అనగానే చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మంచి సినిమా తీయడమే కాదు దానికి మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్‌ గారు సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను.

Meet Vijay Devarakonda’s Singareni Girlfriend In WFL

క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ జీవితంలోని నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలను ప్రేమిస్తాడు.  వీరిలో విజయ్‌ భార్యగా, తెలంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  శనివారం క్యాథరిన్‌ థ్రెసా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో క్యాథరిన్‌కు సింగరేణి ప్రాంతానికి లింక్‌ ఉంది. ఆమె విజయ్‌ను శ్రీనుగా సంబోధిస్తుంది.
పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్‌ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ వేలంటెన్స్‌ డే సందర్భంగా  ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాథరిన్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది.
ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్‌ దేవరకొండ కనపడుతున్నారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ స్మిత పాత్రలో క్యాథరిన్‌ కనపడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన విజయ్‌ దేవరకొండ రెండు లుక్స్‌కు ఈ లుక్‌ డిఫరెంట్‌గా ఉంది.
జనవరి 3న ఈ సినిమా టీజర్‌ విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ మ్యూజిక్‌, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Karthikeya in Geetha Arts Banner

భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం చావు కబురు చల్లగా. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. 2020లో షూటింగ్ జరుపుకోనున్న చావు కబురు చల్లగా మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రం గురుంచి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.

బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : బన్నీ వాసు
సహ నిర్మాత : సునీల్ రెడ్డి
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి

Degree college Movie Releasing Date

 

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం తదితర చిత్రాలు అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు దర్శకుడిగా నరసింహ నందికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. .ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం రెండు ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇదిలావుండగా… శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో పాటు రెండు ట్రైలర్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేసారు. అతిధిగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్ ఒక ట్రైలర్ ను, ఇంకో ట్రైలర్ ను సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ ఆవిష్కరించగా, మేకింగ్ వీడియోను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బాపిరాజు విడుదల చేసారు.

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, నూతన ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలను తీయడం మొదటినుంచి నా అలవాటు. అయితే ఈ చిత్రాన్నిఆర్ట్ జోనర్లో కాకుండా ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా తీసాం. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో అన్న అంశాలనే సహజత్వానికి దగ్గరగా ఇందులో చూపించాను. ఇంతవరకు నేను తీసిన చిత్రాలకు బిన్నంగా కమర్షియల్ అంశాలను పొందుపరిచాను. ట్రైలర్లో ఒక రకంగా..సినిమాలో ఒకరకంగా చూపించడం నాకు అలవాటు లేదు. ట్రైలర్స్ లో వున్నది సినిమాలోనూ ఉంటుంది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే సెన్సార్ లో కట్ చేసారు అని అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సందేశాత్మక అవార్డు చిత్రాలను తీసే దర్శకుడు ఇలాంటి రొమాంటిక్ చిత్రం ఎందుకు తీశారో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం అప్పుడప్పుడైనా ఆయన తన పంధా చిత్రాలను తీస్తుండాలి. ఏదిఏమైనా…యూత్ ను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటుందని బావిస్తున్నా అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో రొమాన్స్ మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగ సన్నివేశాలున్నాయి. హృదయాలను స్రుపించే స్పృశించే సన్నివేశాలున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు.

హీరో వరుణ్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు.
హీరోయిన్ దివ్యారావు మాట్లాడుతూ, ప్రేమకథ అయినప్పటికీ ఎంతో భావోద్వేగ భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రవి రెడ్డి, మదన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Scientific Romedy movie Partner

ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్‌ లల్వాని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘పార్టనర్‌’. సైంటిఫిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాయల్‌ ఫార్చునా క్రియేషన్స్‌  బ్యానర్‌ నిర్మాణంలో  ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్‌ మనోజ్‌ దామోదరన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘మరకతమణి’ వంటి డిఫరెంట్‌ మూవీ తర్వాత మరోసారి డిఫరెంట్‌ కామెడీ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్‌, రెండు పాటల చితీరకరణ పూర్తయ్యాయి. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. సైంటిఫిక్‌ రొమెడీగా  ప్రేక్షకుల ముందుకు 2020 ప్రథమార్థంలో ‘పార్ట్‌నర్‌’ సినిమా విడుదల కానుంది.

ఈ పుట్టినరోజు ఆది పినిశెట్టికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఆది మూడు భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ‘పార్టనర్‌’ చిత్రంతో పాటు ఆయన పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో  నటిస్తోన్న స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘క్లాప్‌’… నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలోని లుక్స్‌ను విడుదల చేశారు.

నటీనటులు:
ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్‌ లల్వాని, పాండిరాజన యోగిబాబు, జాన్‌ విజయ్‌, రోబో శంకర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: మనోజ్‌ దామోదరన్‌
నిర్మాత: రాయల్‌ ఫార్చున క్రియేషన్స్‌
సినిమాటోగ్రఫీ: షబీర్‌ అహమద్‌
సంగీతం:  సంతోష్‌ దయానిధి
ఎడిటర్‌: గోపీ కృష్ణ

Heza Success Meet

పాపులర్ మ్యూజిక్ కంపోజర్ మున్నా కాశి స్వీయ దర్శకత్వంలో హారర్ జోనర్ లో రూపొందిన చిత్రం హేజా. ప్రోమోలతోనే అందరి దృష్టిని ఆకర్షించి ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ అనిపించిన హేజా చిత్రం విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో డైరెక్టర్ మున్న కాశీ మాట్లాడుతూ….
సినిమాను ఆడియన్స్ థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ గా ఉన్నాయని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మంచి సినిమాకు మరిన్ని థియేటర్స్ దొరికితే బాగుంటుందని భావిస్తున్నాను, ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది. హేజా సినిమా రివ్యూలు అన్ని బాగున్నాయి, బుక్ మై షో లో 90 శాతం పైగా రేటింగ్ ఉంది, ఇది చాలు మా సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పడానికి. రాబోయే రోజుల్లో సినిమాకు థియేటర్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను మౌత్ టాక్ తో ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత వి.ఎన్ ఓలేటి మాట్లాడుతూ
హేజా సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. థియేటర్స్ కొరత ఉంది, మంచి సినిమాను ఎక్కువ మంది ఆడియన్స్ కు అందచెయ్యలేక పోతున్నామన్న వెలితి ఉంది, కానీ త్వరలో మాకు ఆ సమస్య తీరుతుందని అనుకుంటున్నాను. థియేటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మా సినిమాను ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికి థాంక్స్ తెలిపారు.
హీరోయిన్ లిజీ గోపాల్ మాట్లాడుతూ…
నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మున్న కాశీ గారికి అలాగే నిర్మాత ఓలేటి గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఆడియన్స్ సినిమా చూసి బాగుందని అంటున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. హేజా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఆర్టిస్ట్ & లిరిక్ రైటర్  ప్రఫుల్ కుమార్ మాట్లాడుతూ...
మున్న కాశీ గారితో నటించడమే కాకుండా ఈ సినిమా కోసం ఒక పాట రాయడం జరిగింది. ఫస్ట్ షో నుండి హేజా మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉంది. భవిషత్తులో మున్న గారితో కిలిసి మరిన్ని సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాను అన్నారు.
ఆర్టిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ…
నిర్మాత ఓలేటి గారు కష్టపడి ఈ సినిమా తీశారు, అందుకు ప్రతిఫలంగా సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. నా పాత్రకు  మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డైరెక్టర్ గా హీరోగా మున్న కాశీ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

Macho Star Gopichand,Mass Director Sampath Nandi’s Movie regular shoot Begins

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  ప్రొడక్షన్‌ నెం.3  గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుండి ప్రారంభం అయింది. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా  భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా…

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ అధినేత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ” మా బేనర్ లో గోపీచంద్‌ సంపత్‌ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ గా  అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం.  మా బేనర్ కి  మరోప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. గోపి చంద్ సరసన తమన్నా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మొదటి షెడ్యూల్   అనంతరం కంటిన్యూ గా  రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి   డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.