Home Blog Page 819

Radhera movie Teaser Huse Responce

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం రదేరా, జుకెట్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ జుకేట్ రమేష్ మాట్లాడుతూ….
ఖోఖో నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. మా సినిమా టీజర్ ను విడుదల చేసిన వి.వి.వినాయక్ గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. టీజర్ చూసిన అందరూ బాగుంది అంటున్నారు. జనవరి 2020 మోదటివారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్రం చేస్తున్నాము, ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ బాగా చేశారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలువుతాము అన్నారు.
హీరో మరియు నిర్మాత పూల సిద్దేశ్వరరావు మాట్లాడుతూ….
మా రదేరా సినిమాను కొందరు సినీ ప్రముఖులు చూసి బాగుంది అన్నారు. రేవు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ నుండి అదే ఫీడ్ బ్యాక్ వస్తుందని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సిద్దేశ్వర్ రావ్ గారికి ధన్యవాదాలు, క్రీడా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది, నూతన నటీనటులు అయినప్పటికీ అందరూ బాగా చేశారు, స్పోర్ట్స్ నేపధ్యంలో వస్తోన్న సినిమాలు సక్సెస్ అవుతాయి, అదే తరహాలోనే మా సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందని తెలిపారు.
నటీనటులు:
సిద్దేశ్వరరావు, మానస,వై. ఎస్.కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, మారుతి సకరం, రమాదేవి, మంజు, నాని, రాజేష్,సాయి, జానీ, కార్తీక్
సాంకేతిక నిపుణులు:
డబ్బింగ్ : డీజీకీస్ట్
పి.ఆర్. ఓ: మధు విఆర్
డి.టి.ఎస్: పద్మారావ్
మ్యూజిక్: సిద్ధార్థ్
కెమెరా – ఎడిటర్ – కథ – స్క్రీన్ ప్లే – మాటలు -దర్శకత్వం: రమేష్ జకట
నిర్మాతలు: సిద్దేశ్వరరావ్ , నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి

Arjun Suravaram Success Meet

యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ (ఎల్ఎల్‌పి) బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా మూడో వారంలోను విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం సక్సెస్ పార్టీ నిర్వహించారు. పలువురు సినీరంగ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘ఇలాంటి సంతోషకరమైన రోజు సినిమాకు వస్తుందని అనుకోలేదు. సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. ఏదైనా మనమంచికే అన్నట్లు ఫైనల్ గా మంచి సక్సెస్ ను అందుకున్నాం. 14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టి థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ‘నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ. ఇంతటి ఘన విజయానికి ప్రధానంగా మూడు కారణాలు. మొదటి కారణమైన మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్. మా సినిమాకి హెల్ప్ చేయడానికి మనిషి రూపంలో వచ్చిన దేవుడు ఆయన. ఈ సినిమాకు తొలి ఆడియన్, రివ్యూవర్, ప్రమోటర్ చిరంజీవి గారే. ఆయన వల్లే ప్రేక్షకులు మా సినిమాకు వచ్చారు. విజయానికి రెండో కారణం సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా. మూడో కారణం కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీని తమ వర్డ్ ఆఫ్ మౌత్ తో మా సినిమాకు అందించిన ప్రేక్షకులు. మూడో వారంలో కూడా మా సినిమా ఆడుతోందంటే కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్. సినిమాను చివరి నిముషం వరకూ నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకి ధన్యవాదాలు. దర్శకుడు సంతోష్ తో త్వరలో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. అద్భుతంగా నటించడమే కాదు ప్రమోషన్స్ లోను లావణ్య చాలా కోపరేట్ చేసింది. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘అనుక్షణం సినిమా గురించే ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనని చూసి చాలా నేర్చుకుంటుంటాను. ట్రైలర్ చూడగానే ఇలాంటి ఎనర్జిటిక్ రోల్స్ లో నిఖిల్ అద్భుతంగా నటిస్తాడు అనిపించింది. అప్పటి నుండి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే పెద్ద హిట్ అవడం హ్యాపీ. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అన్నారు.

నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ ‘మోసం విశ్వవాప్తం అయినప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య’ అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్పూర్తి. ఆదరించిన ప్రేక్షకులకు, హార్ట్ అండ్ సోల్ తో వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’ అన్నారు.

దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ ‘ఎంతో హార్డ్ వర్క్ చేశాం. చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్ గా సక్సెస్ ను అందుకోవడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ గార్లకి థ్యాంక్స్. నిఖిల్ ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మౌత్ టాక్ తో సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాలో నటించిన,  పనిచేసిన ప్రతి ఒక్కరు హండ్రడ్ పర్సంట్ ఎఫర్ట్ పెట్టారు. అందుకే ఈ చిత్రం ఇంతబాగా వచ్చింది. టీమ్ అందరికీ థ్యాంక్స్’ అన్నారు.

సమర్పకులు ఠాగూర్ మధు, ప్రముఖ నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, నటీనటులు సత్య, కేదార్ శంకర్, కరాటే కళ్యాణి, విద్యుల్లేఖ రామన్, సినిమాటోగ్రాఫర్ సూర్య, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, ఫైట్ మాస్టర్స్ వెంకట్, డిసౌజా తదితరులు పాల్గొన్నారు.

KGF Chapter 2 First Look

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన `కె.జి.య‌ఫ్` రెండు భాగాలుగా రూపొందింది.

`కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 1ను ప్యాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను డిసెంబ‌ర్ 21 సాయంత్రం 5:45గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. అలాగే 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. చాప్ట‌ర్ 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2ను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.
రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Naga Chaitanya Parasuram 14Reels Plus Movie Details

మజిలీ, వెంకీ మామ తో సూపర్ హిట్స్ సాధించిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య , గీత గోవిందం వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చిత్రాన్ని గద్దలకొండ గణేష్ లాంటి మాస్ హిట్ అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు.

Venky mama Review

Title:-“VENKY MAMA”
Banner:-Suresh production
Actors:-Victory Venkatesh,Naga chaitanya,Rashi Khanna,Payal Rajputh,
Camera:-Pradad murella
Music:-S Thaman
Producers:-D.Suresh babu,T.G.Viswa Prasad,Vivek kuchibotla.
Directer:-K.S.Baby

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మామా అల్లుళ్లు గా కలిసి నటించిన“వెంకీమామా” విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.కథ:
మిలటరీ వెంకటరత్నం నాయుడు (విక్టరీ వెంకటేష్) ఊర్లో మంచి పేరున్న వ్యక్తి.జాతకాలు ప్రకారం తన అక్క పెళ్లికి ఒప్పుకోని కారణంగా తండ్రిని ఎదిరించి పెళ్లి చేయడం,ప్రమాదవశాత్తు జాతకం ప్రకారం ఒక యాక్సిడెంట్ లో అక్క,బావ ప్రాణాలు పోవడం దానితో అల్లుడు కార్తిక్ (నాగ చైతన్య) బాధ్యతను తీసుకుని పెంచడం,అది మిలటరీ నాయుడు తండ్రి కి నచ్చకపోవడం.కార్తీక్ మిలటరీ నాయుడు తల్లిదండ్రులకు నచ్చకపోవడానికి కారణాలు ఏంటి,మామా-అల్లుళ్లు లా ప్రేమకథలు ఏంటి,వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటి,చివరికి అల్లుడు ఇంట్లో నచ్చాడా లేదా,ఎందుకు కార్తిక్ ని దూరం పెట్టాలి అనుకున్నారు అనే విషయాలు సినిమాలో చూడాలి.

విశ్లేషణ:
సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు బాబీ,మామ అల్లుళ్లు మధ్య అనుబంధం, గోదావరి అందం,అన్నింటిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు,వెంకటేష్ లో మాస్ యాంగిల్ చూసి చాలా రోజులు అయినా ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చాడు,అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి,మిలటరీ నాయుడు-విక్టరీ అల్లుడు పెరఫార్మన్స్ అయితే అదిరిపోయింది.థమన్ తన మ్యూజిక్,బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లగలిగాడు,ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది.పాయల్ రాజపుత్, రాశీఖన్నా వాళ్ళ అందం,అభినయంతో సినిమాకి తమదైన న్యాయం చేశారు.మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ అంత చక్కగా చూసి హాయిగా నవ్వుకుని ఆనందంతో బయటకు వచ్చే సినిమా.!

Rating…Cinema Rangam 3/5

Ravana Rajyam first look launch

వి3 ఫిలిమ్స్ పతాకం పై  వినయ్ పరువెళ్ల , జ్యోతి హీరోహీరోయిన్లుగా  రామ్ వికాస్. వి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “రామ రావణ రాజ్యం. ఈచిత్ర ఫస్ట్ లుక్ ను  గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వికాస్ మాట్లాడుతూ’ పూర్తి  యాక్షన్ చిత్రమిది. పాత, కొత్త ఆర్టిస్టుల కలయికతో ఈ చిత్రం తెర కెక్కనుంది. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకొనున్నాం.”అన్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి:రూషేంద్ర,ఎడిటర్:సాయి,పి.ఆర్.ఓ :బి.వీరబాబు,మ్యూజిక్:కనిష్క,ప్రొడ్యూసర్:వి3 ఫిలిమ్స్,కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రామ్ వికాస్. వి.

Vallala Chinna Srisailam Yadav Son Praveen Kumar Yadav (Venkat Yadav) and Mahitha Sri Marriage Reception

ప్రముఖ నాయకులు వల్లాల చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్), మహితశ్రీల వివాహం డిసెంబర్ 6వతేదీన సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ అండ్ జువెల్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. కాగా బుధవారం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో మ్యారేజ్ రిసెప్షన్ వేడుక‌ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ వాయిద్యాలు ఓ వైపు, మ్యూజికల్ నైట్ మరో వైపు సభా ప్రాంగణాన్ని ఆటపాటలతో హోరెత్తించాయి. ఆశేష జన సముద్రం నడుమ సాగిన ఈ కార్యక్రమంలో  సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, ఎన్. శంకర్, బి. గోపాల్, సి. కళ్యాణ్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సుమన్, భానుచందర్, బాబూ మోహన్, హీరో మంచు మనోజ్, హీరో అశ్విన్, రాహుల్ యాదవ్ నక్కా, జీవితా రాజశేఖర్, హేమ, కరాటే కళ్యాణి, సాయిరామ్ శంకర్, రామసత్యనారాయణ మొదలగు సినీ ప్రముఖులు.. లగడపాటి రాజగోపాల్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి మొదలగు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Telnagana Govt sponsored Short Film Contest Press Meet

మద్యం, ధూమపానం అవి సేవించేవారికి మాత్రమే హాని చేస్తాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం యావత్ మానవాళి పాలిట పెను శాపంగా మారింది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేసీయార్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా..  కుంభమేళా తరువాత అంత భారీగా జరిగే ‘మేడారం జాతర’ను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాల పోటీని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకులు వీరశంకర్ అధ్యక్షులుగా ఏర్పాటయిన కమిటీలో పలువురు చిత్ర ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వీరశంకర్, సభ్యులు, ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరావు, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డి.సత్యనారాయణలతోపాటు.. ఇన్నొవేటి యాడ్స్ సి.యి.ఓ నగేష్ కోడూర్ పాల్గొన్నారు. 3 నుంచి 5 నిమిషాల నిడివితో ప్లాస్టిక్ వల్ల ప్రపంచానికి జరుగుతున్న అనర్ధం తెలిపేలా లఘు చిత్రాలు ఉండాలని, ఇవి తెలుగులో మాత్రమే తీయాలని,  జనవరి 10 వరకు దీనికి గడువని వారు తెలిపారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 75, 50, 25 వేలు అందిస్తామని, కన్సోలేషన్ బహుమతులుగా ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపిక అందిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.innovativeads.co.in సంప్రదించాలని కోరారు!!

This is the first win for Veerashastha Ayyappa Kathaksam!


‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’కు ఇది తొలి విజయం!! 
                               
100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. సుమన్ తెలుగులో హీరోగా నటించిన ఈ చిత్రానికి వి.ఎస్.పి తెన్నేటి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. వి.ఎస్.ఎల్ జయకుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో గాత్రమందించారు. సెన్సార్ పూర్తి చేసుకోవడంతోపాటు.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా పొందిన  ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వి.ఎస్.పి తెన్నేటి, రుద్రాభట్ల వేణుగోపాల్ తోపాటు, ఈ చిత్రంలో సుమన్ కి జంటగా నటించిన జ్యోతి పాల్గొన్నారు
వి.ఎస్.పి తెన్నేటి మాట్లాడుతూ.సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందడం మా తొలి విజయంగా భావిస్తున్నాం. ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి ప్రశంసలే అందుతాయని నమ్మకం ఉంది.. అన్నారు. తెన్నేటిగారి మార్గ దర్శకత్వంలో, అయ్యప్ప ఆశీస్సులతో అద్భుతంగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.. అని చిత్ర దర్శకులు రుద్రాభట్ల వేణుగోపాల్ పేర్కొన్నారు.
జ్యోతి మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా ఇది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అన్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే: వి.ఎస్.పి తెన్నేటి, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, నిర్మాతలు: వి.ఎస్.పి తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)!!