Home Blog Page 821

Aswatthama Movie Grand Release on jan 31

యంగ్ హీరో నాగ శౌర్య‌,  మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ప్రొడ‌క్ష‌న్ నెం 3గా శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం`అశ్వథ్థామ‌`.నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు- అరివు మాస్ట‌ర్స్ ఈ సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం. ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ సంస్థ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా..

చిత్ర‌ నిర్మాత ఉష మూల్పూరి మాట్లాడుతూ -“ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3గా ` అశ్వథ్థామ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉండబోతొంది. నాగ శౌర్య చాలా మంచి కథ రాశాడు, దాన్ని డైరెక్టర్ తెరమీద అంత‌కన్నా బాగా చూపించాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ – “అశ్వథ్థామ‌` షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మీరు స‌రి కొత్త నాగ శౌర్య ను చూస్తారు. కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేశారు సినిమాకు అది పెద్ద అసెట్ కానుంది.త్వరలో ఈ సినిమకు సంభందించిన మరిన్ని విశేషాలు తెలుపుతాం“ అన్నారు.

డైరెక్టర్ రమణ తేజ మాట్లాడుతూ – “నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్ వారికి థాంక్స్, శౌర్య నన్ను నమ్ము ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యమని చెప్పారు. జనవరి 31న వస్తోన్న మా సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి ప్రేత్యేక ధన్యవాదాలు.

కో ప్రొడ్యూసర్ బుజ్జి మాట్లాడుతూ – “అనుకున్న టైమ్ లో సినిమాను పూర్తి చేశాము. మేము అనుకున్న దానికంటే ఔట్ ఫుట్ బాగా వచ్చింది.
కేజీఎఫ్ కు కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్టర్స్ నాగసౌర్య సినిమాకు తెలుగు లో మొదటిసారి గా యాక్షన్ కొరియోగ్రఫీ చెయ్యడం సినిమాకు ప్లస్ అవుతుందన్నారు మా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసారు“ అన్నారు.

Ala Vaikunthapurramuloo Teaser Release

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Nagachaitanya interview about Venkymama

‘మజిలీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య విక్ట‌రీ వెంక‌టేష్ తో కలిసి నటిస్తున్న భారీ ముల్టీస్టారర్  ‘వెంకీమామ‌’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విక్ట‌రీ వెంక‌టేష్  పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ఇంటర్వ్యూ..

ఇద్దరు మామయ్యలతో కలిసి పని చేయడం ఎలా అన్పించింది?
– ఒక మామయ్య కెమెరా వెనకా, ఒక మావయ్య కెమెరా ముందు మంచి సపోర్ట్‌నిచ్చారు. ఈ షూటింగ్‌లో సినిమాకి సంబంధించిన ఏదో ఒక యాస్పెక్ట్‌లో కొత్త విషయాన్ని సురేష్‌ మావయ్య దగ్గర నేర్చుకున్నాను.

మొదటిసారి వెంకటేష్‌గారితో ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నటించారు కదా! ఆయన దగ్గరనుండి ఏమైనా నేర్చుకోవడం జరిగిందా?
– వెంకీమామ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా పర్సన్‌గా ఆయన ఆన్‌సెట్‌ ఎలా బిహేవ్‌ చేస్తారు. ఎలా కామ్‌గా, పాజిటివ్‌గా ఉంటారు అనేది అబ్జర్వ్‌ చేశాను. చాలామంది అంటుంటారు వెంకటేష్‌గారికి నో హేటర్స్‌. నో నెగిటివిటీ అని. ఆయన్ని అబ్జర్వ్‌ చేశాక ఆయన్ని ఎందుకు అలా అంటారు అనేది నాకు అర్థమైంది. ఆయనతో చేయడం ఏ యాక్టర్‌కైనా బ్లెస్సింగ్‌. ఎమోషనల్‌ సీన్లలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌ ఇవన్నీ ఆయనతో నటించే ఎవరికైనా ప్లస్సే.

రియల్‌ లైఫ్‌లో కూడా మీరిద్దరూ మామ-అల్లుళ్లు కావడం ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?
– నిజం చెప్పాలంటే రియల్‌ లైఫ్‌లో మేమిద్దరం చాలా క్వైట్‌. సైలెన్స్‌లోనే ఒక బాండింగ్‌, ఎటాచ్‌మెంట్‌ ఉంటుంది. కానీ సినిమాలో ఎక్కువ డైలాగులు చెప్పడం, హై ఎమోషన్స్‌లాంటివి చేశాం. మొదటివారం ఎడాప్ట్‌ అవ్వడానికి కొంచెం టైమ్‌ పట్టింది. ఎందుకంటే చెన్నై నుండి కూడా మా ఇద్దరి రియల్‌ లైఫ్‌లో జెన్యూన్‌ బాండింగ్‌ ఉంది. నా చిన్నప్పట్నుంచీ ఆయన నన్ను అబ్జర్వ్‌ చేస్తూనే ఉన్నారు కాబట్టి సెట్లో అలా చేయడం కొత్తగా అన్పించేది. రేపు సినిమా చూశాక ఆడియన్స్‌ కూడా ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కూడా రియల్‌ బాండింగ్‌ ఉంది అనేంతలా ఫీలవుతారు. ఈ స్క్రిప్ట్‌కి అది బోనస్‌.

ట్రైలర్ లో మాసీ క్యారెక్టర్‌లో కన్పిస్తున్నారు! ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
– ఇందులో నాది ఒక డిఫరెంట్‌కైండ్‌ ఆఫ్‌ మాసీ క్యారెక్టర్‌. నేను సిటీలో పెరిగి హాలిడేస్‌కి భీమవరం వస్తాను. ఇంతవరకూ నేను ఆర్మీ ఎపిసోడ్‌ ఎటెంప్ట్‌ చేయలేదు. అలాగే కొత్త స్టైల్లో ఉండే నెంబరాఫ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కథని ఏదైతే ఎలివేట్‌ చేసిందో ఆ మిలట్రీ ఆఫీసర్‌ పాత్ర చేయడం కొత్తగా ఉంది.

ఈ కాంబినేషన్‌ కోసం ఎప్పటినుండి ఎదురు చూస్తున్నారు?
– నేను యాక్టింగ్‌ మొదలు పెట్టినప్పట్నుంచీ వెంకీమామతో, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నటించాలనే ఆలోచన ఉంది. అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ వచ్చాక ఆటోమేటిగ్గా అదే సెట్‌ అవుద్ది అనుకున్నాను. 2019లో ఎలాంటి ప్లానింగ్‌ లేకుండానే ఈ రెండూ కలిసొచ్చాయి. ఈ కథ భీమవరంలో స్టార్ట్‌ అయి కశ్మీర్‌లో ఎండ్‌ అవుతుంది. ముందు కథలో ఈ స్పాన్‌ లేదు. సురేష్‌గారు, వెంకటేష్‌గారు బాబీతో కూర్చుని డిజైన్‌ చేసిన స్ట్రక్చర్‌ అది. నా కెరీర్‌కి ది బెస్ట్‌ మూవీ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇవ్వాలనే కథని అలా డిజైన్‌ చేశారు. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కి పెద్ద ప్లస్‌ అవుతుంది.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది అని సురేష్‌బాబు అన్నారు.
– అవును. సినిమాలో బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. దాంతో పాటు మామ అల్లుళ్ల మధ్య ఒక త్యాగం ఉంటుంది. ఆ లేయర్‌కి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. రియల్‌ లైఫ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఒక అన్‌కండీషనల్‌ లవ్‌, ఎక్స్‌పెక్టేషన్స్‌ లేని శాక్రిఫైస్‌ ఉంటుంది. ఈమధ్యకాలంలో అలాంటివి తెరమీద చూడలేదు. అందులోనూ ఒక రియల్‌ లైఫ్‌ మామ అల్లుళ్లు ఆ క్యారెక్టర్స్‌ చేయడం ఆడియన్స్‌ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. యూనివర్శల్‌ ఎమోషన్స్‌ కూడా అన్ని వర్గాలవారికి కనెక్ట్‌ అవుతాయి.

వెంకటేష్‌గారి కామెడీ టైమింగ్‌ అందుకోవడం కష్టం అన్పించిందా?
– నిజంగానే చాలా కష్టమైంది. నేనే నవ్వు కంట్రోల్‌ చేసుకోలేక చాలా టేక్స్‌ తీసుకున్నాను. ట్రైలర్‌లో చూసింది కొంచెమే. సినిమా ఫుల్‌లెంగ్త్‌ ఎంజాయ్‌ చేస్తారు.

ఈ సినిమా మీ కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ అవుతుందని సురేష్‌బాబు అన్నారు..
– నా క్యారెక్టర్‌ కోసం సర్జికల్‌ స్ట్రైక్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారో ఆ ఎపిసోడ్‌ ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌ అన్నింట్లో మోస్ట్‌ ఛాలెంజింగ్‌ అన్పించింది. ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి ఆడియన్స్‌ డెఫినెట్‌గా రిసీవ్‌ చేసుకుంటారు.

రాశిఖన్నాతో రెండోసారి నటించారు?
– ‘మనం’లో తనతో రెండు నిమిషాల ఎపిసోడ్‌ చేశాను. తను అప్పటికీ, ఇప్పటికీ నటన పరంగా చాలా పరిణితి సాధించింది. ఆమె నటించిన ‘తొలిప్రేమ’ సినిమా నాకు చాలా ఇష్టం. అందులో పూర్తి ఛేంజోవర్‌ కన్పించింది. పాయల్‌ కూడా చాలా బాగా చేసింది.

ఆన్‌ స్క్రీన్‌లో నాగార్జున, వెంకటేష్‌గార్లలో కన్పించిన సిమిలారిటీస్‌ ఏంటి?
– వెంకీమామ టైమింగ్‌, ఆయన మీటర్‌ చాలా డిఫరెంట్‌. అలాగే నాన్న టైమింగ్‌, మీటర్‌ టోటల్లీ డిఫరెంట్‌. అందుకే వారిద్దరి సినిమాలు కాంట్రాస్ట్‌ జోనర్స్‌లో ఉంటాయి. ఏదైనా డెసిషన్‌ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఇద్దరూ ఇమ్మీడియెట్‌గా తీసేసుకుంటారు. రిస్క్‌ అయినా దాని గురించి ఎక్కువ ఆలోచించరు. అదే క్వాలిటీ మళ్లీ నాగేశ్వరరావు, రామానాయుడుగారిలో చూశాను.

ఒక యాక్టర్‌గా మీకెలాంటి క్యారెక్టర్స్‌ అంటే ఇష్టం?
– యాక్టర్‌గా రియలిస్టిక్‌ స్టోరీలు, క్యారెక్టర్స్‌ అంటేనే ఇష్టం.

ఈ సినిమాతో హీరోగా మీ స్పాన్‌ పెరిగిందని అనుకుంటున్నారా?
– తప్పకుండా అండీ. వెంకటేష్‌గారికి లేడీస్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. ఆయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్‌ కూడా ఎక్కువే. వెంకటేష్‌గారి సినిమాలో నేనుండటం వల్ల నా స్పాన్‌ తప్పకుండా పెరుగుతుందని భావిస్తున్నా. నా క్యారెక్టర్‌ని ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తే ఆ క్రెడిట్‌ అంతా సురేష్‌బాబు, వెంకటేష్‌, బాబీగార్లదే.

సమంత మీ సినిమాలను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తుంది కదా?
– అవునండీ. ఈ సినిమా కథ తనకి తెలీదు. ఈమధ్యే సినిమా చూసింది. తను ఏదైనా ఫ్రాంక్‌గా, ఓపెన్‌గా చెబుతుంది. నాకు అలాంటి వాళ్లంటే ఇష్టం. ఈ సినిమా నిజంగా చాలా ఎంజాయ్‌ చేశాను అని చెప్పింది.

శేఖర్‌ కమ్ములగారి సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుంది?
– ఆ సినిమాలో నేను నా మనసుకి దగ్గరైన క్యారెక్టర్‌. అందుకే చాలా ఎంజాయ్‌ చేస్తూ నటిస్తున్నాను. 40% షూటింగ్‌ పూర్తయింది. ‘లవ్‌స్టోరి’ అనేది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. టైటిల్‌ ఇంకా కన్‌ ఫర్మ్‌ కాలేదు. అలాగే నాన్నగారితో కలిసి నటించే ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తరువాత కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. కన్‌ఫర్మ్‌ కాగానే మిగతా వివరాలు తెలియజేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు అక్కినేని నాగ‌చైత‌న్య.

IT Minister KTR wished to Oollaala Oollaala team.

నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం “ఊల్లాల  ఊల్లాల”. సీనియర్ నటుడు ‘సత్య ప్రకాష్” ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయo అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా “ఊల్లాల  ఊల్లాల” చిత్రం లో నటించడమే కాక హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. తను పాడిన ‘రాం రాం’ పాట గురువారం విడుదలకి సిద్ధంగా ఉంది
.

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ తెలంగాణ ఐ.టి మినిస్టర్ కే.టీ.ఆర్ ని కలిసినప్పుడు, ఆయన నిర్మాత ఏ.గురురాజ్ కి, దర్శకుడు సత్యప్రకాష్ కి, హీరో నటరాజ్ కి, గాయని మంగ్లీకి మరియు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాక సుఖీభవ క్రీయేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలన్నీ మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ ని కేటీఆర్ గారు, నిర్మాతకి పరిచయం చేయగా, ఆయన కూడా చిత్రానికి తనవంతు సహాయం చేస్తానని, చిత్రం మంచి విజయం సాధించేలా తోడ్పడతానని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. మా బేన‌ర్‌లో `ర‌క్ష‌క‌భ‌టుడు`, `ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది`, `ల‌వ‌ర్స్ డే` చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా `ఉల్లాలా ఉల్లాలా`. ఇలాంటి కాన్సెప్ట్ లుచాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగాఅంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ చిత్రాన్ని జనవరి 1న భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నం” అని తెలిపారు.

 దర్శకుడు స‌త్య‌ప్ర‌కాశ్‌ గారు మాట్లాడుతూ “నేను దర్శకునిగా మా అబ్బాయిని నటరాజ్ ను ఈ చిత్రంతో హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని చెప్పగా ” కేటీఆర్ గారు మీ అబ్బాయి మంచిగా ఎదగాలి.మీరు దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి ” అని చెప్పారు.

తారాగ‌ణం:
న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, `బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, `అదుర్స్` ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి ఎ.ముత్త‌మ్మ‌
ఛాయాగ్ర‌హ‌ణం: జె.జి.కృష్ణ‌, దీప‌క్‌
సంగీతం: జాయ్‌
ఎడిటింగ్‌: ఉద్ధ‌వ్‌
నృత్య ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ మాస్ట‌ర్‌, దిలీప్ కుమార్‌
యాక్ష‌న్‌: డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
ఆర్ట్: కె.ముర‌ళీధ‌ర్‌
పాట‌లు: కాస‌ర్ల శ్యామ్‌, గురుచ‌ర‌ణ్‌
క‌థ –  స్క్రీన్ ప్లే-మాటలు- నిర్మాత‌: ఎ.గురురాజ్‌
ద‌ర్శ‌క‌త్వం: స‌త్య‌ప్ర‌కాష్‌

‘Poster’ Movie Motion Poster Launched By Minister Harish Rao

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా  “పోస్టర్”.  సినిమా మోషన్ పోస్టర్ ను   మంత్రి హరీష్ రావు గారు విడుదల చేసారు.

అనంతరం హరీష్ రావు గారు మాట్లాడుతూ   “సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే  అన్ని సినిమాలు హిట్టు అవ్వాలి. ఈ పోస్టర్ అనే సినిమా కూడా హిట్ అవ్వాలని ఈ సినిమా టీమ్ సభ్యులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను”   అని అన్నారు.
డైరెక్టర్ టి యం ఆర్ మాట్లాడుతూ   “మా సినిమా మోషన్ పోస్టర్ ను గౌరవనీయులు మరియు మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారు  విడుదల చేయడం  నాకు చాలా సంతోషంగా ఉంది, మా పట్ల ఆయన సహకారానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, అంతేకాక  ఈ సినిమా టీజర్ అతి త్వరలో మీ ముందుకి వస్తుంది, మీరంతా తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను”   అని అన్నారు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, శంకర్ గణేష్, మల్లికార్జున్, అజయ్..,  వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.

Venky mama Movie Musical Night

విక్ట‌రీ వెంక‌టే్‌శ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. మంగ‌ళ‌వారం ఈ సినిమా మ్యూజిక‌ల్ నైట్ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా …రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ – “ఈరోజు మా తాత‌గారు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండుండేవారు. చిన్నాన్న‌తో, చైత‌న్య‌తో స‌ర‌దాగా ఉండేవారు. న‌న్ను మాత్రం ప‌క్కకు తీసుకెళ్లి తిడుతుండేవారు. చైతు నాకంటే చిన్నోడు.. నాకంటే అన్ని ముందు చేసేస్తుంటాడు. నాకంటే కాలేజ్ ముందు పాసైయ్యాడు. నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు. చిన్నాన్న‌తో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇక వెంకీ మామ సినిమా విష‌యానికి వ‌స్తే.. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌కి ఇది స్పెష‌ల్ మూవీ. 55 సంవ‌త్స‌రాల్లో ఇదొక మైల్ స్టోన్‌. దీన్ని ప్రేక్ష‌కులు పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు. 
ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – “నాకు ఎమోష‌న‌ల్‌గా ఉంది. వంద సినిమాలు చేసిన నిర్మాత‌గానే కాదు.. దేశంలోని అన్ని భాష‌ల్లో సినిమాలు చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా?  అంటే ఆ ఘ‌న‌త రామానాయుడుగారికే ద‌క్కుతుంది. మా ద‌ర్శ‌కులంద‌రికీ దేవుడాయ‌న‌. అలాగే నిర్మాత‌ల‌కు గాడ్‌ఫాద‌ర్‌. 24 శాఖ‌ల‌వారికి సాయం చేసే ఆప‌ద్భాంవుడు. ద‌గ్గుబాటి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. రామానాయుడుగారు నాన్న‌గారితోనే కాదు.. నాతో కూడా ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. అలాగే వెంక‌టేశ్‌ను కూడా నా సినిమాతో ప‌రిచ‌యం చేయ‌మ‌ని అన్నారు. వెంక‌టేశ్‌గారు కూడా చ‌క్క‌గా ట్రైనిగ్ తీసుకుని న‌టించారు. ఇక రానాను నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. అలాగే చైత‌న్య‌ను కూడా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సింది. వీలుకాలేదు. త‌న‌తో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాను. రుషిలాంటి రామానాయుడుగారి కోరిక తీరిన రోజుది. ఆయ‌న ఆశీర్వాదాలు ఎప్ప‌టికీ ఉంటాయి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌“ అన్నారు. 
నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ – “వెంక‌టేశ్‌, రానా, చైతులు క‌లిపి నాన్న‌గారు ఓ సినిమా చేయాల‌నుకునేవారు. ఈ సినిమా బంధాలు, అనుబంధాల గురించి చెప్పే సినిమా. కె.ఎస్‌.ప్ర‌కాశ్‌రావుగారు మా నాన్న‌గారితో మంచి స్నేహాన్ని కొన‌సాగించారు. ఆయ‌న చేసిన ప్రేమ్‌న‌గ‌ర్ సినిమాలు మా జీవితాల‌ను మార్చివేసింది. త‌ర్వాత నేను అమెరికా నుండి తిరిగొచ్చాను. అప్పుడు రాఘ‌వేంద్ర‌రావుగారు మాతో చేసిన దేవ‌త సినిమా వ‌ల్ల మా బ్యాన‌ర్ స‌క్సెస్ కంటిన్యూ అయ్యింది. ప్ర‌కాశ్‌రావుగారు తీసిన వ‌సంత‌మాలిగై సినిమాను 45 సంవ‌త్స‌రాల త‌ర్వాత రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా ఆ సినిమా 100 రోజులు ఆడింది. అలాంటి గొప్ప సినిమా ఇది. రాఘ‌వేంద్ర‌రావుగారి ఫ్యామిలీకి మేం రుణ‌ప‌డి ఉన్నాం. నాకు డైరెక్ష‌న్ గురించి కాస్తో కూస్తో నేర్పించింది రాఘ‌వేంద్రరావుగారే. ఆయ‌న అన్ని జోన‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించారు“ అన్నారు. 
నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో అసోసియేట్ కావ‌డం ఆనందంగా ఉంది. బాబీగారికి థ్యాంక్స్‌. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను“ అన్నారు. 
రాశీఖ‌న్నా మాట్లాడుతూ – “`వెంకీమామ‌` సినిమాలో  వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించ‌డం ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎగ్జ‌యిట్‌గా వెయిట్ చేస్తున్నాం. బాబీగారు సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. ప్ర‌తి పాత్ర‌ను చ‌క్క‌గా డిజైన్ చేశారు. సినిమాను ప్రేక్ష‌కులు చూసి ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను“ అన్నారు. 
పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ –  “ఈ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో న‌టించాను. ఇలాంటి పాత్ర‌లో న‌టిచండం ఇదే తొలిసారి. చాలా ఆస‌క్తిగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను“ అన్నారు. బాబీగారు సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. చాలా విష‌యాలు నేర్చుకున్నాను“ అన్నారు. 
డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర(బాబీ) మాట్లాడుతూ – “సినిమాకు సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వెంక‌టేశ్‌గారి పుట్టిన‌రోజుకి చైత‌న్య‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, నా త‌ర‌పునుండి ఇస్తున్న గిఫ్ట్‌గా ఈ సినిమాను భావిస్తున్నాం. యూనిట్ అంతా బాగా స‌పోర్ట్ చేస్తున్నారు. ఈరోజు రామానాయుడుగారుండుంటే ఎంతో ఆనందించేవారు. డిసెంబ‌ర్ 13న వెంకీమామ‌కు అల్లుడు చైతు సాలిడ్ గిఫ్ట్‌ను ఇస్తున్నాడు. చైత‌న్య‌లోని ఎమోష‌న్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. రాశీఖన్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ స‌హా అందరికీ థ్యాంక్స్‌“ అన్నారు. 
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ – “ఏ సినిమాకు ఇంత నెర్వ‌స్‌గా లేను. 13వ తారీఖు ఎప్పుడోస్తుందో, ఎలాంటి ఫ‌లితం ఉంటుందో అని అనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అది మా తాత‌గారి కోసం. ఈ సినిమా మా తాత‌గారి డ్రీమ్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వెంకీమామ‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో కోరిక ఈ సినిమాతో ఈ రెండు కోరిక‌లు తీరిపోయాయి. మా యూత్ అంద‌రికీ వెంకీమామ ఇంకా యూతే. సినిమా ట్రైల‌ర్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. ఈ క్రెడిట్ బాబీకే ఇవ్వాలి. త‌న‌కు థ్యాంక్స్‌. త‌ను దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్‌తో ట్రావెల్ అయ్యాడు. త‌న టీమ్‌కి, త‌మ‌న్‌కి థ్యాంక్స్‌. త‌మ‌న్ పాట‌ల‌కు మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. త‌ను మంచి సంగీతం, ఆర్ .ఆర్ ఇచ్చాడు. రాశీఖ‌న్నా, పాయ‌ల్‌కి థ్యాంక్స్‌. ప్ర‌సాద్ మూరెళ్ళ‌గారికి థ్యాంక్స్‌. డిసెంబ‌ర్ 13న మీ అంద‌రికీ థియేట‌ర్స్‌లో క‌లుస్తాను“ అన్నారు. 
విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “డిసెంబ‌ర్ 13న వెంకీమామ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్‌తో మాకు చాలా ఎన‌ర్జీ వ‌చ్చింది. మా నాన్న‌గారు నాతో, చైతుతో సినిమా చేయాల‌ని బ‌లంగా అనుకున్నారు. ఆయ‌న కోరిక‌తోనే ఈ క‌థ మా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది. బాబీ, అత‌ని టీమ్ అద్భుత‌మైన వ‌ర్క్ చేశారు. ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఆర్ట్ డైరెక్ట‌ర్స్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. త‌మ‌న్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాడు. రాశీఖ‌న్నా, పాయ‌ల్‌ల‌తో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను. నా కెరీర్‌లో తొలిసారి నా బ‌ర్త్‌డేకు వ‌స్తున్న సినిమా ఇది. అభిమానులు అంద‌రూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు నేను మంచి సినిమాలు చేసిన ప్ర‌తిసారి ఆద‌రిస్తున్నారు. ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజ‌న్‌, మాధ‌వ్‌, రైట‌ర్ శ్రీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా త‌మ‌న్ లైవ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. 

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

Munna Kasi interview about ”Heza”(a musical horror)

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై వి.ఎన్. వోలేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12 న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశి ఇంటర్వ్యూ ..

మీ గురించి చెప్పండి ?
– నేను ఎంబిఎ గోల్డ్‌ మెడలిస్ట్‌. దుబాయ్‌లో జాబ్‌ చేశాను. నాకు చిన్నప్పట్నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సంగీతం మీద నాకున్న ప్యాషన్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకోడానికి జాబ్‌ కొంచెం బ్రేక్‌ తీసుకొని ఇండియా వచ్చి సంగీత దర్శకుడిగా మారాను. సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా. ఎస్వీ రంగారావుగారి మనవడు హీరోగా లాంచ్‌ అయిన ‘మిస్టర్‌ 7’. తర్వాత ‘యాక్షన్‌ 3డి’. ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘చిత్రం చెప్పిన కథ’ చిత్రాలకు సంగీతాన్ని అందించాను.రామ్‌గోపాల్‌ వర్మగారి ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’లో రెండు సాంగ్స్‌ చేశాను. ‘మామా చందమామ’ సినిమా తరువాత సంగీత దర్శకుడిగా బ్రేక్ తీసుకున్నాను.

సంగీత దర్శకుడిగా కొనసాగిన మీరు దర్శకుడిగా మారడానికి కారణం ఏంటి?
– చిన్న సినిమాలు హిట్‌ అయి టాక్‌ వస్తేనే జనాల్లోకి వెళ్తున్నాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా సంగీతానికి పేరొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి సందర్భంలో కొంతమంది నిర్మాతలు నా దగ్గరకొచ్చి హీరోగా అవకాశమిస్తాం అని బ్లాంక్‌ చెక్‌ ఇచ్చారు. అప్పటికే నాకు టెక్నీషియన్‌గా కొంత కథ మీద జడ్జిమెంట్‌ ఉండటంతో ముందు కథ చెప్పమని అడిగాను. అన్నీ రెగ్యులర్‌ కథలు కావడంతో మంచి కంటెంట్‌ ఉన్న కథ కోసం వెతకటం స్టార్ట్‌ చేశాను.

ఈ జోనర్ నే ఎంచుకోవడానికి కారణం?
– బేసిక్‌గా నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ని కాబట్టి సంగీతం మీద పట్టు ఉంటుంది. ‘చంద్రముఖి’, ‘అరుంధతి’లాంటి బలమైన హర్రర్‌ కథ అయితే బాగుంటుందని హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌ని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానికి చిన్నప్పటి నుండి రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలని ఫాలో అవడం కూడా ఒక కారణం.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
– ఈ సినిమాలో నాది లీడ్‌ క్యారెక్టర్‌ మాత్రమే. నా క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రెండు గంటల సినిమాలో ప్రేక్షకులకు ఏ ఒక్క సీన్‌ కూడా అనవసరం అనిపించదు. కంటెంట్‌ వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. హర్రర్‌ సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. అది నా డిపార్ట్‌మెంటే కాబట్టి ఈ సినిమాలో ఎక్కడ ఆర్‌ఆర్‌ ఇవ్వాలో కరెక్ట్‌గా అక్కడే ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో దెయ్యానికి, సంగీతానికి ఉన్న లింక్‌ ఏంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. అందుకే ట్యాగ్‌లైన్‌ మ్యూజికల్‌ హర్రర్‌ అని పెట్టాం.

ఈ చిత్రం ద్వారా ఏమైనా మెస్సేజ్ ఇస్తున్నారా?
– ప్రతి సినిమా అయిపోగానే బయటికి వచ్చిన ప్రేక్షకుడు సినిమాలో ఉన్న సందేశం గుర్తుంచుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మన ఆర్గాన్స్‌ డొనేట్‌ చెయ్యడం ఎంతో అవసరం.. అనే సందేశాన్ని సొసైటీ కి ఇద్దామని ఈ సినిమా ద్వారా ప్రయత్నించడం జరిగింది.ముమైత్‌ఖాన్‌ ఈ సినిమాలో డెవిల్‌గా కన్పించనుంది. అది సినిమాలో కొత్త పాయింట్‌. సినిమాను మలుపుతిప్పే కీలకపాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ నూతననాయుడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ లక్ష్మణ్‌. లీజి గోపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– ‘హెజా’ అనేది కొన్ని ప్రాంతాల్లో వ్యక్తుల పేర్లు. దాని అర్థం అందమైనది. ఈ సినిమాకి ఎందుకు ఆ టైటిల్‌ పెట్టాం అనేది సినిమాలో చూపించాం. సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుడు హార్ట్‌ఫుల్‌గా బాగుంది అనుకుంటే చాలు.

నిర్మాత గురించి?
– ఈ సినిమా నిర్మాత మా అంకుల్‌ వి.ఎన్‌. ఓలేటి. సినిమా రంగం కాదు. ఆయన ఓఎన్‌జిసి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌. అద్భుతమైన సింగర్‌. సినిమా అంటే చాలా ఇష్టం. నాలో హర్రర్‌ ఎపిసోడ్‌లో కూర్చోబెట్టగల మంచి స్టోరి టెల్లర్‌, దర్శకుడు ఉన్నాడని నమ్మి ఈ సినిమా తీశారు.

బిజినెస్ ఎలా జరిగింది?
– నైజాం ఓన్‌ డిస్ట్రిబ్యూషన్‌. అలాగే సీడెడ్‌, ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. ఆంధ్రా, తెలంగాణలో దాదాపు 100 కి పైగా థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే కర్ణాటకలో భారీగా రిలీజ్‌ చేస్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– నా తదుపరి చిత్రానికి కూడా ఇదే ప్యాట్రన్‌ ఫాలో అవుతాను. అదిరిపోయే ఒక సెటైరికల్ స్టోరీ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Angry Hero Karthi’s ”Donga” Trailer launch

‘ఖైదీ’లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌ 10న చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.
”చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే” అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలౌతుంది. ‘ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథకి తగ్గ యాక్షన్‌ కూడా ఉందని తెలుస్తోంది. ఇక ట్రైలర్‌ చివర్లో.. ”ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క..” అంటూ కార్తీ చెప్పే డైలాగ్ లో ఆయన  ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌ అనే చెప్పాలి.

ఈ సందర్భంగా హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు ట్రైలర్‌ విడుదల చేశాం. యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉన్న చిత్రం ‘దొంగ’ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని మాకు అందించడానికి సంపూర్ణ సహకారం అందించిన కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని  తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం” అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నికిలావిమల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి. రాజశేఖర్‌, సంగీతం: గోవింద వసంత, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

“College Kumar” Movie Teaser Launch

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈమూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ నిర్మాత పద్మనాభ గారి  ఆత్మీయురాలు రేఖ గారి చేతులు మీదుగా జరిగింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో  చిత్ర
యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా స్టంట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ:
‘‘ ఈ కథ వినగానే నాకు మంచి నమ్మకం కలిగింది. మా అబ్బాయి రాహుల్ విజయ్ తోపాటు ఇందులో పనిచేసిన అందరికీ మంచి పేరురావాలి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా లోనాకు పనిచేసే అవకాశం కల్పించిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్ ’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ నార్ల మాట్లాడుతూ: ‘‘ కన్నడ హిట్ అయిన కాలేజ్ కుమార్ ని తెలుగు లో నిర్మించాం. ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రాహుల్ ఈ సినిమా తో మంచి రేంజ్ లోకి రావాలని ఆకాంక్షింస్తున్నాను’’ అన్నారు.

హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడతూ: ‘‘ఈ సినిమా కథ వినగానే బాగా ఇంప్రెస్ అయ్యాను. రాజేంద్ర ప్రసాద్ వంటి నటులతో కలసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.  మీ అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఈ మూవీ లో చాలా ఉన్నాయి.  మీ సపోర్ట్ మాకు ఉంటుందని నమ్ముతున్నాను ’’ అన్నారు.

ప్రొడ్యూసర్:  ఎల్ పద్మనాభ మాట్లాడుతూ : ‘‘ ఈ సినిమా తో తెలుగులో నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి టీం తో పనిచేసాము.  మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా మంచి కథనుఅందించాము, ప్లీజ్ సపోర్ట్ కాలేజ్ కుమార్’’ అన్నారు.

డైరెక్టర్ హారి సంతోష్ మాట్లాడుతూ: ‘‘ దర్శకుడిగా నాకు ఇది ఎనిమిదో సినిమా, కాలేజ్ కుమార్ కన్నడంలో పెద్ద విజయం అందుకున్నక ఇదే కథను తెలుగు తెరమీదకు రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ పద్మనాధ గారు.నా సినిమాకు పనిచేస్తున్నప్పుడు స్టంట్ మాస్టర్ విజయ్గారి దగ్గర రాహుల్ పిక్స్ చూసాను అప్పుడే ఈ కథ కు అతడే హీరో అని పిక్స్
అయ్యాను. రాజేంద్ర  ప్రసాద్ గారితో పనిచేయడం ఒక మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. తెలుగు పరిశ్రమ లో పనిచేయడం నాకు చాలా కంపర్టబుల్ గా ఉంది. అంతే కాదు చాలా నేర్చుకున్నాను. టీజర్తర్వాత సాంగ్స్ ఒన్ బై ఒన్ విడుదల చేస్తాము. ఒక మంచి టీం తో పనిచేసాను ,సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది అని నమ్మతున్నాను’’ అన్నారు.

బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ: ‘‘ కాలేజ్ కుమార్ గురించి యేడాదిన్నర క్రితమే విన్నాను. ఈ సినిమా తో తెలుగులో రాహుల్ ,రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషనల్ వస్తుందనగానే చాలా పెద్ద హిట్అవుతుందని అనుకున్నాను. ప్రొడక్షన్ ని చాలా ప్లాన్డ్ గా చేసారు.కన్నడలో విజయంసాధించినట్లు తెలుగు లో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ’’ అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ: ‘‘ ప్రతి కొడుక్కి హీరో వాళ్ళ నాన్నే.ఆయన్ను చూస్తూనే పెరుగుతాం.. ఆయన భుజాల మీదనుండే ప్రపంచాన్ని చూస్తాం.అందుకే ఈ కథకు నాకు ఒక పర్సనల్ ఎమోషన్ గా మారింది. శశికుమార్ అనే ఫాదర్
శివకుమార్ అనే కొడుక్కి నేల మీద నిలబడి సొసైటి ని చూడటం నేర్పిస్తాడు.. ఆక్రమంలో వారద్దరి మద్య జరిగే కథ కాలేజ్ కుమార్. రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి పనిచేయడం ఒక లెర్నింగ్  అలాంటి అవకాశం నాకు దొరకండం నా అదృష్టం.తప్పకుండా మా టీజర్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రియగారి తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.’’ అన్నారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ: ‘‘ కాలేజ్ కుమార్ కాలేజ్ కి వెళ్ళేది నేనే. ఇంతకు మించి కథ నన్ను అడగొద్దు.. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన కథల్లో ఈ కథ ఒకటి. కథా బలం ఉండి దాన్ని ఎంటర్ టైన్మెంట్ గా చెప్పగలిగితే అది ప్రేక్షకులకు బాగా చేరవవుతుంది. ఈకథకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి.. ఈ సినిమా లో నవ్వుతూనే ..నవ్వుతూనే ఉంటారు.  ఒక్కసారి ఆలోచిస్తారు. ఈ సినిమా విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను. ఎక్కడి వారయినా అక్కున చేర్చుకునే గుణం తెలుగు పరిశ్రకు ఉంది నిర్మాత పద్మనాభ, కి దర్శకుడు హార సంతోష్ కి తెలుగు పరిశ్రమ తరపున నేను స్వాగతం చెబుతున్నాను.నాతో పాటు నటించిన మధుబాల నటన కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. రాహుల్ కి నాకు మద్య కెమిస్ట్రీ చూసి రాహుల్ తండ్రి విజయ్ కి జెలసీ వస్తుంది. అంత బాగా మా కాంబినేషన్ కుదిరింది. కథా బలంతో పాటు ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా అందరినీ ఆలోచిప జేసే చిత్రంగా కాలేజ్ కుమార్ నిలుస్తుంది’’అన్నారు.

నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు

బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్:  ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్

”Adiguruvu Amma” Trailer launch

డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి, తేజ రెడ్డి, `సుర‌భి` ప్ర‌భావతి, వేమూరి శ‌శి, గోప‌రాజు విజ‌య్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `ఆది గురువు అమ్మ‌`. ఇళ‌య‌రాజా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా….

వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “దైవ స‌మానులుగా భావించే త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను వెల‌క‌ట్ట‌లేం. త‌ల్లి త‌న వారిపై చూపించే ప్రేమ చాలా గొప్ప‌ది. ఆమె తొలి గురువుగా బిడ్డ‌కు అన్నీ తానై నేర్పిస్తుంది. అలాంటి అమ్మ‌పై రూపొందిన `ఆది గురువు అమ్మ‌` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ట్రైల‌ర్ చాలా బావుంది. అమ్మ ప్రేమ‌లోని గొప్ప‌త‌నాన్ని చూపించే చిత్ర‌మిది. డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రిగారు మంచి న‌టుడు. ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఆయ‌నే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తూ నిర్మించిన ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి మాట్లాడుతూ – “అమ్మ గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా చాలా సినిమాలు వ‌చ్చాయి. అమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె ప్రేమ గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా రూపొందించిన సినిమా `ఆది గురువు అమ్మ‌`. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు