Home Blog Page 822

”Sarileru Neekevvaru” second single ‘Suryudivo Chandrudivo’ is an Chartbuster Trending At No 1 In Youtube

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా అంద‌రూ  ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్ సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది. ’సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో’ అనే పల్లవి తో సాగే ఈ పాట శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటూ రికార్డ్ వ్యూస్ సాధించి ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఫ్రెష్‌ మెలోడి ట్యూన్‌కి  రామజోగయ్య శాస్త్రి హృదయానికి హత్తుకునే భావాత్మక సాహిత్యం అందించారు. ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ దీన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించారు.

’సూర్యుడివో చంద్రుడివో’  పాటతో  ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ గా ’సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజేషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం

‘Takkar’ ‬Movie title poster launched by Hero Varn Tej

మెగా హీరో వరుణ్ తేజ్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్స్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

గతంలో కప్పల్, పండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు

DSP’s musical treat on the way

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ ‘మైండ్ బ్లాక్’ మాస్ నంబర్ కి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సాయంత్రం ‘సూర్యుడివో చంద్రుడివో’ సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ రోజు షూటింగ్‌ జరుపుకుంటున్న మూడు వేరువేరు సినిమాల పాటల గురించి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈరోజు వెల్లడించారు దేవిశ్రీ ప్రసాద్. అందులో సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరునీకెవ్వరు’ నుండి ఒక డాన్స్ నంబర్, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ మూవీ నుండి ఒక రొమాంటిక్ మెలోడీ, కీర్తి సురేష్ తదుపరి చిత్రం నుండి ప్రత్యేకమైన కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ఈ రోజు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ రీ రికార్డింగ్ పనుల్లో బిజీ గా ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతున్న సరిలేరు నీకెవ్వరు లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్ కి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Ram charan donates 10 lakhs

గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణ వార్తకు ‘మెగా’కుటుంబం వెంటనే స్పందించింది.
విషయం తెలియగానే మెగాస్టార్‌ చిరంజీవి నూర్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో
మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అందుబాటులో లేకపోవడంతో నిన్న వెళ్ళలేకపోయారు. కొద్దిసేపటి క్రితం రామ్‌చరణ్‌ ఒక ప్రకట చేస్తూ తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్నికలుస్తానని తెలిపారు. నూర్‌ ఆహ్మద్‌ కుటుంబానికి రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.‘నూర్‌ అహ్మద్‌ గారు మెగా అభిమానులందరిలోకెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అన్నారు. మెగా బ్లడ్‌ బ్రదర్‌ నూర్‌ అహ్మద్‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని సంతాపాన్ని ప్రకటించారు.

Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’ Is Out And Became An Instant Hit

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌  ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఆడియన్స్‌, ఫాన్స్‌ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్‌,  సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది. ’సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో…సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో..విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో…సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీమెలోడీగా ఉంది.  ఎమోషనల్‌గా సాగుతూనే సినిమాలోని ప్రధాన పాత్రల భావోద్వేగాలను చాల బలంగా ఎస్టాబ్లిష్‌ చేస్తోంది. ముఖ్యంగా చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలలో రూపొందించిన వీడియో, మహేష్ బాబు, విజయశాంతి మధ్య వచ్చే సీన్లు, సెట్లో టీమ్  చేసే సందడి అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది.  దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్‌తో సాంగ్‌ను చక్కగా తీర్చిదిద్దారు.  ఎన్నో మెలోడీ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌ చేసిన మరో సూపర్‌ మెలోడీ సాంగ్‌ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ  క్లాసీ సాంగ్‌ లిరిక్స్‌ అర్థవంతంగా ఉన్నాయి.  ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ గానం ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది.

’సరిలేరు నీకెవ్వరు’ టీం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ’సూర్యుడివో చంద్రుడివో’  పాటతో  ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్‌ ఫాన్స్‌కి ఫీస్ట్‌ గా సంక్రాంతి ఎంటర్టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజెషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Ram establishes a monumental record with ”Hello Guru Prema Kosame”

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో రామ్ పోతినేని మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన రామ్ మాస్ లో సరికొత్త స్టైల్ ని ప్రజెంట్ చేశాడు. ఇక రామ్ కి నార్త్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతున్నట్లు మరోసారి ఋజువయ్యింది.’ హలొ గురు ప్రేమ కోసమే ‘ హిందీలో ‘దుందార్ ఖిలాడీ’గా అనువాదమైన విషయం తెలిసిందే. 
యూ ట్యూబ్ లో ఈ సినిమా 140+ వ్యూస్ తో పాటు 1 మిలియన్ ప్లస్ లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ లో అతివేగంగా ఈ మైల్ స్టోన్ అందుకున్న ఏకైక  సౌత్ ఇండియన్ స్టార్ గా రామ్ ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. రామ్ కి ఈ రికార్డులు కొత్తేమి కాదు. రామ్ కెరీర్ లో ఎన్నో వీడియో సాంగ్స్ యూ ట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అందులో ‘నేను శైలజ’ సాంగ్ 100మిలియన్ ల వ్యూస్ ని అందుకోగా, ఆ సినిమా హిందీ డబ్బింగ్ లో 140మిలియన్ల వ్యూస్ ని దాటేసింది. ‘ఉన్నది ఒకటే జిందగీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘నెంబర్ 1 దిల్ వాలా’ కూడా 1 మిలియన్ లైక్స్ కి అతి దగ్గరలో Rఉంది. ‘ హైపర్ ‘ , ‘శివమ్’ సినిమాలు కూడా హిందీ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.   
ఇక ఇప్పుడు ‘హలో గురు ప్రేమ కోసమే ‘  సినిమా యూ ట్యూబ్ లో అత్యధిక లైకులు అందుకున్న సినిమాగా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ ను అందుకుంది. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్
 కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర  క్రియేషన్స్ బ్యానర్ లో ‘దిల్ ‘ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హలో గురు ప్రేమకోసమే’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఈ రేంజ్ లో రికార్డు సృష్టించింది అంటే ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ వస్తే మరిన్ని కొత్త రికార్డులతో యూ ట్యూబ్ దిమాక్ ఖరాబ్ కావాల్సిందే..!

Nandini Rai Upcoming Movies

నందిని రాయ్ ఈ పేరు వినగానే మనకి గుర్తుచ్చే సినిమాలు ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్. ఇలాంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ 2 లో బెస్ట్ కంటస్టెంట్ గా నిలిచి మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది .తాజాగా
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న నంది అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే లాల్ భాగ్ అనే మలయాళం మూవీ లో కూడా నటిస్తోంది ఈ తెలుగు హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ లో బిజీ బిజీ గా ఉంది నందిని. ఇవి కాకుండా మలయాళం లో కూడా ఒక అద్భుతమైన అవకాశం కూడా వచ్చింది.ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోతోంది నందిని.మంచి కథ ఉంటే నేను ఆ సినిమా ని వదులుకోను అని చెప్పింది . నాకు భాష లతో సంబంధం లేదు సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కథ నచ్చితే చాలు ఏ భాషలో ఐనా సినిమాలు చేయడానికి నేను రెడీ గా ఉన్నా అని చెప్పింది.ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మరియు తన లైఫ్ గురించి చాలా హ్యాపీ గా ఉన్నానని తెలిపింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత మరిన్ని వివరాలు తన సోషల్ మీడియా పేజీ లో తెలియచేస్తానని చెప్పింది.

మలయాళం లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం లాల్ బాగ్. ఈ చిత్రంలో తెలుగు సహజ నటి అయిన నందినీ రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది . మరియు హిందీలో నందీ అనే సినిమాలో కూడా నటిస్తోంది . ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు తమిళం,మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్ . బాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ సుందరి అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం 040. ఇక ఆ తర్వాత వచ్చిన మాయ,మోసగాళ్ళకు మోసగాడు,సిల్లీఫెలోస్ సినిమాలతో తక్కువ కాలంలోనే తన మార్క్ ని చూపించింది. ఇక మళయాలం, కన్నడ లో నటించిన గుడ్ బాయ్ డిసెంబర్,ఖుషి ఖుషి యాగీ సినిమాలతో పాటు మరికొన్ని ఆఫర్స్ లను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి తిరిగి అడుగుపెట్టబోతున్న నందిని రాయ్ అక్కడి ప్రేక్షకులను ఏమేరకు అలరించబోతుందో చూడాలి.తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలు తనకి మంచి పేరు తీసుకొస్తాయని గట్టిగా చెప్తోంది నందిని రాయ్

”Siva 143” First look and Trailer Launched on the Occasion of C Kalyan Birthday

సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు సందర్భంగా భీమవరం టాకీస్ 98వ చిత్రం  శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల !!!*
ఈ సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ...
 నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి మొదటి ఓనమాలు దిద్దించింది మా అన్నయ్య కళ్యాణ్ గారు..నేను ఏమి చేసిన నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేదీ…ఆయనే..ఈ రోజు నేను ఇన్నే సినిమాలు తీసాను అంటే అది ఆయన నేర్పింది అన్నారు..
సి.కళ్యాణ్ గారు మాట్లాడుతూ…
చిన్న సినిమాలను మాత్రేమే తీస్తాను అని ఒట్టు పెట్టుకుని తన పద్ధతి లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బడ్జెట్ దాటకుండా..
ఒక ప్లాప్ తీస్తే ఆ నిర్మాత మళ్ళీ సినిమా తీయా లేని పరిస్థితుల్లో  ఉన్న ఈ రోజుల్లో హిట్ ప్లాప్ కి అతీతంగా సేఫ్ గా సినిమాలు తీస్తూ అందరి కి అందుబాటులో ఉండే మా తమ్ముడు రామ సత్యనారాయణ..కి ఈ శివ 143 విజయం పొందాలని కోరుకుంటున్నాను..దర్శకుడు సాగర్ నటుడు గా .డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్ గా తన బాధ్యతలను చక్కగా నెరవేర్చాడు. ఈ సినిమా వల్ల కెమరామెన్ సుధాకర్.సంగీతం మనోజ్.ఎడిటర్ శివ వై ప్రసాద్ లకు మంచి అవకాశాలు వస్తాయి.
డీఎస్ రావు మాట్లాడుతూ…
నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ గారికి థాంక్స్. మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. హీరోగా దర్శకుడిగా శైలేష్ సాగర్ శివ 143 సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకుంటారు అన్నారు.
హీరో , డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ…
శివ143 సినిమా ట్రైలర్ విడుదల చేసిన సి.కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. రామసత్యనారాయణ గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుంది. భీమవరం టాకీస్ బ్యానర్ లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది అవ్వడం సంతోషంగా ఉంది. మాకు సహకరించిన అందరికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

Tholubommala sithralu production No1 talkie part completed

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై నూతన దర్శకులు కొమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు గా పాత కొత్త నటీనటులతో పాటు కోమరక్క, స్వప్న, వేదం నాగయ్య, పద్మారావు, ఆదినారాయణ, గోవింద్ రాజు ప్రధన పాత్రలో నటిస్తున్నారు. 
ఈ సందర్భంగా దర్శకులు జానకిరామ్ మాట్లాడుతూ
ఉదయ్ భాస్కర్, చందు, పోసాని కృష్ణమురళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశానని తెలిపారు, ఇది నాకు తొలి చిత్రం. అంతర్వేది, మచిలీపట్నం, శ్రీశైలం, వికారాబాద్, హైదరాబాద్ తదితర లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోవడంతో ఒక స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది, ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కోసం సెట్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
కథ విషయానికి వస్తే…ఇది కుటుంభమంతా కలిసి చూడదగ్గ చిత్రం, లవ్, సెంటిమెంట్, కామెడీ, హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ తో పాటు చక్కటి సందేశం ఇస్తుందని తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి
ఎడిటర్: సునీల్ మహారణ
సంగీతం: యు.వి.నిరంజన్
నిర్మాత: కొమారి జానయ్య నాయుడు
కథ- మాటలు -స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కొమారి జానకిరామ్

Superstar Rajinikanth @ audio release function of ‘Darbar’*

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్‌.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. శ‌నివారం అనిరుద్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ….

*సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ* “సుభాస్క‌ర‌న్ నాకు మంచి స్నేహితుడు. త‌నొక సినిమా ప్రొడ్యైస‌ర్‌గానే మ‌న‌కు తెలుసు. కానీ తను లండన్ లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. స‌మాజానికి సేవ చేస్తున్నాడు. త‌న నిర్మాణంలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నేను 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాల‌ని ఆయ‌న‌ నన్ను అడిగాడు నేను సరేనన్నాను. ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగ‌దాస్‌గారు ఆలోచ‌న‌లోకి వ‌చ్చారు. ఆయన డైరెక్ట్ చేసిన రమణ, గజినీ చిత్రాలు నాకు బాగా నచ్చాయి అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగ‌దాస్‌. అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని క‌దా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైందీ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత శంకర్‌లా ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌తో ప‌నిచేయం ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ ఇలా అన్ని హంగులుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివ‌న్‌తో ద‌ళ‌ప‌తి త‌ర్వాత 29 ఏళ్లకు క‌లిసి ప‌నిచేసిన సినిమా. అలాగే నయనతార ఈ సినిమాలో న‌టించింది. త‌ను చంద్రముఖిలో తొలిసారి నాతో న‌టించింది. ఈ సినిమాలో చంద్ర‌ముఖి కంటే గ్లామర్ గా ఎనర్జిటిక్ గా కనపడుతుంది. అలాగే సునీల్ శెట్టి, యోగిబాబు, నివేదా థామస్ ఇలా అంద‌రూ చాలా మంచి పాత్రలు చేశారు. రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ను పీటర్ హెయిన్స్‌గారు కంపోజ్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. వర్షాల కారణంగా గా సినిమా షెడ్యూల్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను మురుగ‌దాస్ 90 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయ‌న‌ కాకుండా మ‌రెవరున్నా ఈ సినిమాను అంత క్వాలిటీగా, త్వ‌ర‌గా పూర్తి చేయ‌లేరు. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. `పేట` కంటే ఈ సినిమాలో పాట‌లు బావున్నాయి. సాధార‌ణంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో ఇళ‌య‌రాజాగారికి స‌న్నివేశాల‌ను స్క్రిప్ట్ ప‌రంగా డెవ‌ల‌ప్ చేయ‌డం.. వాటికి సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆ త‌ర్వాత అలాంటి సెన్స్ నేను అనిరుద్‌లోనే చూశాను. మంచి వ్యక్తులు అందరూ మంచి మనసుతో మంచి సమయంలో కలిసి చేసిన సినిమా ఇది కాబట్టి మంచి సమయంలోనే రిలీజ్ అవుతుంది. నేను త‌మిళ‌నాడుకి వ‌చ్చేటప్పుడు నాపై న‌మ్మ‌కంతో న‌న్ను ఇక్క‌డ అడుగు పెట్టించిన వారి నుండి. నాపై న‌మ్మ‌కంతో సినిమాలు రూపొందించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రి న‌మ్మ‌కాన్ని నేను వ‌మ్ము చేయ‌లేదు. ఇప్పుడు `ద‌ర్బార్‌`తో మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను. డిసెంబర్ 12న నా పుట్టిన రోజు ఆరోజు నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోననే సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా ఆ రోజున గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేయ‌వ‌ద్దు. ఆ డ‌బ్బుల‌తో పేదలకు అనాధలకు సాయం చేయాలని కోరుతున్నాను “ అన్నారు.

*చిత్ర ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ* “నాకు ఊహ తెలిసి మా ఊరిలో థియేటర్ లో నేను చూసిన హీరో రజినీకాంత్‌గారే. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఆయన మనకు దొరికిన వరం. దేవుడ్ని నమ్మినవాడు కష్టపడతాడు నిజాయితీగా ఉంటాడు అని నమ్మే వారిలో ఆయన ఒకరు. ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితమనే పెద్ద నౌకలో నేను ఏడాదిపాటు ట్రావెల్ చేయ‌డం గ‌ర్వంగా అనిపిస్తుంది. నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టిగారు ఇలా అందరూ పాత్రలు చాలా బాగుంటాయి. `కత్తి` సినిమా స‌మ‌యంలో సుభాస్క‌ర‌న్‌గారితో సినిమా చేశాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఆయ‌నే త‌మిళ సినిమాకు ఓ పిల్ల‌ర్‌లా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు. `క‌త్తి` త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో `ద‌ర్బార్‌` చేయ‌డం ఆనందంగా ఉంది. అనిరుద్ చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎడిట‌ర్ శ్రీకర్ ప్రసాద్‌గారు ఓ స‌న్నివేశాన్ని చూసిన‌ప్పుడు కేవ‌లం ఎడిటింగ్ మాత్ర‌మే చేయ‌కుండా సన్నివేశాన్ని ఎన్‌హెన్స్ చేయ‌డానికి ఏం చేయాల‌నే సూచ‌న‌లు ఇస్తారు. అలాగే సంతోశ్‌శివ‌న్‌గారితో ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్ అంటే ద‌ళ‌ప‌తి సినిమానే గుర్తుకు వ‌స్తుంది. 29 ఏళ్ల‌కు ఈ కాంబినేష‌న్‌ను నేను డైరెక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఓ ఎమోష‌న్‌తో ఉంటాయి. రామ్‌లక్ష్మణ్‌గారు, పీట‌ర్ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు. గ‌త 15 ఏళ్ల‌లో రజినీకాంత్‌గారిని ప్రేక్షకులు చూడని విధంగా యాక్ష‌న్ సన్నివేశాలుంటాయి“ అన్నారు.

*డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ* “ఈ సినిమాకు మెయిన్ హీరో అనిరుద్‌. త‌ను చాలా టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్. బెస్ట్ ఇచ్చేవరకు మ‌న కంటే ముందు త‌నే కాంప్రమైస్ కాడు. ఇప్పుడు తనతో నేను ఓ సినిమా చేస్తున్నాననే విషయం అంద‌రికీ తెల‌సిందే. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా మ్యూజిక్ ఇవ్వ‌డం త‌న‌కు బాగా తెలుసు. డైరెక్టర్ మురుగదాస్ మంచి రైటర్. నాకిష్టమైన దర్శకుడు కూడా. ఆయ‌న త‌న సినిమాల్లో హీరో విలన్ పాత్రలను అద్భుతంగా డిజైన్ చేసాడు. ఈ రెండు పాత్రలు క్లైమాక్స్‌లో ఎలా పోరాడుతాయో అనే ఆస‌క్తిని ప్ర‌తి స‌న్నివేశాలో పెంచుకుంటూ పోయి. క్లైమాక్స్‌ను అద్భుతంగా డిజైన్ చేస్తాడు. అదే ఆయన బలం. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా చేసిన సునీల్‌శెట్టిగారికి అభినంద‌న‌లు. అలాగే పెద్ద సినిమాలను నిర్మించాలంటే డబ్బులు ఉంటేనే సరిపోదు ఫ్యాషన్ కూడా ఉండాలి. అలాంటి ఫ్యాషన్ ఉన్న నిర్మాత సుభాస్క‌ర‌న్‌గారు. ఆయ‌న‌తో 2.0కి క‌లిసి ప‌నిచేశాను. ఇప్పుడు లైకా బ్యాన‌ర్‌లో `ఇండియ‌న్ 2` చేస్తున్నాను. ఈ సినిమాల‌తో పాటు ఆయ‌న ర‌జినీసార్‌తో తెర‌కెక్కించిన మ‌రో భారీ చిత్ర‌మే `ద‌ర్బార్‌`.ఈ సినిమాతో ఆయనకు గొప్ప సక్సెస్ రావాలి. ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని చేయాలి. రజినీకాంత్‌గారి గురించి చెప్పాలంటే, ఆయ‌న్ని మిస్ చేసి ఏడాదిన్న‌ర అవుతుంది. ఆయ‌న్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. ఆయన ఎందుకంటే కాలం విలువ తెలిసిన హీరో. ఆయన దగ్గరనుంచి చి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా కాలం తర్వాత ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కాబ‌ట్టి ప్రేక్ష‌కుల్లాగా నేను కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను“ అన్నారు.

*లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ఎ.సుభాస్క‌ర‌న్ మాట్లాడుతూ* – “2.0`త‌ర్వాత ర‌జినీకాంత్‌గారితో మా బ్యాన‌ర్‌లో చేసిన చిత్ర‌మిది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అంద‌రినీ మెప్పించేలా, మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెస్తుంది. మురుగ‌దాస్‌గారికి థ్యాంక్స్‌. అనిరుద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. సంతోశ్ శివ‌న్‌గారికి, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌గారు స‌హా అంద‌రికీ ప్రత్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

*మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ మాట్లాడుతూ* – “నేను ర‌జినీకాంత్‌గారికి వీరాభిమానిని. 8 ఏళ్ల ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా న‌న్ను ధ‌న‌ష్‌గారు గుర్తించారు. ఆయ‌న‌కు ముందుగా థ్యాంక్స్‌. అప్పుడు ర‌జినీకాంత్‌గారి సినిమాకు ప‌నిచేయాల‌ని క‌ల క‌న్నాను. ఆ క‌ల ఒక‌సారి కాదు.. రెండు సార్లు నిజ‌మైంది. సినిమా రీ రికార్డింగ్ కూడా పూర్త‌య్యింది. రీ రికార్డింగ్ పూర్త‌యిన‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా అనిపించింది. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా చిన్న చిన్న సినిమాల‌కు ప‌ని చేస్తున్న త‌రుణంలో ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌గారు నాలో ప్ర‌తిభ‌ను గుర్తించి క‌త్తి సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. అది నాకు పెద్ద బ్రేక్ అయ్యింది. అలా నేను పెద్ద సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. అయితే ర‌జినీగారితో తొలిసారి `పేట‌` సినిమాకు ప‌నిచేశాను. ద‌ర్బార్ సినిమాకు ఆయ‌న‌తో క‌ల‌సి రెండోసారి క‌లిసి ప‌నిచేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. గొప్ప జ‌ర్నీ. ఈ అవ‌కాశం ఇచ్చిన మురుగ‌దాస్‌గారికి, సుభాస్క‌ర‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

*బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ* – “నేను ద‌క్షిణాది స్టార్స్‌లో ర‌జినీకాంత్‌గారితో కలిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని క‌ల క‌న్నాను. ఈరోజు ఆ క‌ల నేర‌వేరింది. ఈ సినిమా స్క్రిప్ట్ చెప్ప‌డానికి మురుగ‌దాస్‌గారు రాగానే, విన్నాను. ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే అన్నాను. అయితే ఆయ‌న్ని మురుగ‌దాస్‌గారిని ఓ మాట అన్నాను. `ఈ సినిమా త‌ర్వాత ద‌క్షిణాదికి నేను భ‌యం లేకుండా రావ‌చ్చు క‌దా!` అన్నాను. నా పాత్ర‌ను మురుగ‌దాస్‌గారు అంత బాగా డిజైన్ చేశారు. నేను ఇక్క‌డ అభిమానుల్లాగానే ఆయ‌న్ని అభిమానించి ఈ సినిమాలో న‌టించాను. ఈ అవ‌కాశం ఇచ్చిన సుభాస్క‌ర‌న్‌గారికి, మురుగ‌దాస్‌గారికి, స‌పోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్‌“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నివేదా థామ‌స్‌, రాఘవ లారెన్స్‌, అరుణ్ విజ‌య్‌, వివేక్, సంతోశ్ శివన్, లతా రజనీకాంత్, సౌందర్య రజినీ కాంత్, ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌, విశ‌గ‌న్‌, ప్రేమ సుభాస్క‌ర‌న్‌, ర‌మ్యా మురుగ‌దాస్‌, పీవీఆర్ నైనా త‌దిత‌రులు పాల్గొన్నారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ: సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి, బి.ఎ.రాజు, సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.