Home Blog Page 823

‘Aatagadara Shivaa’ Event on Jan 5th,2020 at Shilpakalavedika.

జనవరి 5న ‘ఆటగదరా శివ’ సంగీత విభావరి
ప్రముఖ నటుడు, రచయిత, కవి, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన ‘ఆటగదరా
శివా’ గేయ కావ్యం సంగీత విభావరిగా సంగీతాభిమానుల ముందుకు రానుంది.
వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ లోని
శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. స్వతహాగా శివభక్తుడైన
తనికెళ్ల భరణి రాసిన  శివతత్త్వాలు అనేకం ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. సంగీత
దర్శకుడు, ప్రఖ్యాత వేణుగాన విధ్వాంసుడు ఫ్లూట్ నాగరాజ్ ఈ ‘ఆటగదరా శివ’ తత్వాలకు సంగీత దర్శకత్వం అందించనున్నారు. ఇవామ్, తెలంగాణ కల్చరల్ అండ్ టూరిజం మినిస్ట్రీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అలేఖ్య హోమ్స్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమానికి శ్రీమతి మణినాగరాజ్ రూపకల్పన చేయగా, హీరో సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. విశ్వవిఖ్యాత డ్రమ్మర్ శివమణి, గిటార్ వాద్యకారిణి మోహినీ డే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నైబృందం వాద్య సహకారం అందిస్తుంది.  జంట నగరాలకు చెందిన గాయకులు ఈ పాటలు పాడతారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

Megastar chiranjeevi condolences to Noor Bhai family

గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించారు. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
కుటుంబసభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ  నూర్ మహ్మద్ తన వీరాభిమాని అని  ఆయన మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు.ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు.

“Venky Mama” Pre Release Event in Kammam

వెంకీ మామ ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు కూడా చాలా మంది హాజరయ్యారు.. ఆ విశేషాలు మీకోసం..

హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. సౌండ్ ఏంటి.. ఈ ఖమ్మం సౌండ్ అంటే అంతేగా అంతేగా.. మాటలు కాదు వణుకులే. చాలా ఆనందంగా ఉంది.. మా ప్రీ రిలీజ్ ట్రైలర్ వేడుకకు ఇక్కడికి రావడం. ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా కూడా వెంకీ మామ అంటున్నారు. మా సురేష్ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ చించేసాడు.. చించేసాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. ముందు నుంచే ఈ సినిమా బాగా వచ్చింది.. మంచి కథ తెచ్చుకున్నాం.. అందరం కష్టపడి సూపర్ హిట్ చేస్తున్నామని కష్టపడి పని చేసాం. టెక్నీషియన్స్ అంతా కష్టపడ్డారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్భుతంగా తీసి మామ అల్లుడు సెంటిమెంట్ టెర్రిఫిక్‌గా తీసాడు. చాలా థ్యాంక్స్ బాబీ.. అద్భుతమైన సినిమా ఇచ్చావు.. అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంటికెళ్లాలి.. లేదంటే నాకు టెన్షన్ వస్తుంది. ఈ సినిమాలో ఇందాక మీరు వినుంటారు పాటలో అమ్మైనా నాన్నైనా నువ్వేలే నువ్వే వెంకీ మామ. నాకు అంతా ఫ్యాన్స్.. నా 30 ఏళ్ల కెరీర్‌లో మీరే నా బలం.. ఖమ్మంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు థ్యాంక్స్. అక్కడికి రావాలని ఉంది కానీ రాలేను కదా. థ్యాంక్ యూ సో మచ్.. డిసెంబర్ 13న కలుద్దాం అని తెలిపారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. మా విక్టరీ వెంకీ మామ అభిమానులందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులంతా బాగున్నారా.. చాలా సంతోషంగా ఉంది కలవడం. పైగా ఖమ్మంలో కలవడం ఇంకా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్.. ఐ లవ్ యూ ఆల్ ఖమ్మం. నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు మనం, వెంకీ మామ మెమోరీస్. కెమెరా వెనక ఓ మామ.. ముందు మరో మామ.. నన్నెంత బాగా చూసుకున్నారో. ఇద్దరు మామయ్యలు చాలా బాగా చూసుకున్నారు. రేపు విడుదలైన తర్వాత క్రెడిట్ అంతా వాళ్లదే. కూల్ డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్. కొందరు కమర్షియల్ ఎలిమెంట్స్.. కొందరు కంటెంట్ పట్టుకుని సినిమా చేస్తారు. కానీ బాబీ రెండు కలిపి కొట్టాడు. చాలా మంది దర్శకులు లవ్ స్టోరీ చేస్తే ఈయన మిలటరీ చేసాడు. హీరోయిన్స్ రాశీ, పాయల్ కూడా చాలా బాగా నటించారు. రాశీ తెలుగులో తొలి సినిమా మనం.. చిన్న రోల్ చేసింది. నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. పాయల్‌తో మంచి ఎంటర్టైనింగ్ ట్రాక్ ఉంది. థమన్ ఇవ్వాల మిస్ అయ్యాడు.. కానీ ఆయన రాక్ స్టార్. ప్రతీ ఏడాది ఫ్రెష్ సౌండ్‌తో వస్తున్నాడు. టెక్నికల్ టీం అంతా అద్భుతంగా పని చేసారు. అందరికీ థ్యాంక్యూ.. ట్రైలర్ బాగుంది కదా.. అల్లరి అల్లరిగా ఉంది కదా.. మామా అల్లుళ్లు అల్లరి మామూలుగా ఉండదు.. చాలా జాగ్రత్తగా ఇంటికెళ్లండి.. ఖమ్మం పోలీస్.. శ్రేయాస్ మీడియాకు థ్యాంక్స్.. అని తెలిపారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. నమస్కారం ఖమ్మం.. ముందుగా ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగ చైతన్య అభిమానులకు.. మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులకు అందరికీ నమస్కారం. అందరి అభిమానులకు ఎందుకు చెప్తున్నానంటే ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్ గారు. సినిమా చేసిన తర్వాత కూడా ఆ రిలేషన్ మెయింటేన్ చేయడం గొప్ప విషయం సర్. మహేష్ బాబు గారిని తమ్ముడిలా చూసుకుంటారు. వరుణ్ వచ్చి భోజనం చేస్తాడు. పవన్ గారితో ఫ్రెండ్ షిప్ ఉంటుంది. ఈ సినిమా నాకు కష్టపడితే వచ్చింది. చిన్నపుడు వీసీఆర్ కోసం వెళ్తే సీడీలు దొరికేవి కావు.. ఎవరో ఒకరు ఆడవాళ్లు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చింది. మీతో సినిమా చేసినపుడు నేను చాలా నేర్చుకున్నాను. ఎఫ్2లో వెంకటేష్ గారి ఫన్ చూసారు.. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గారి మాస్ యాంగిల్ చూపించాను. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు.. ఇదే ఫస్ట్ సినిమాలా చూస్తాడు.. ఇది కెరీర్‌కు ఇంపార్టెంట్ అన్నట్లుంటాడు. సురేష్ బాబు గారు పెద్ద పుస్తకం.. ఆయన గురించి చెప్పడం కష్టం. చాలా మంది నిర్మాతలతో పనిచేసాను సర్.. అన్నీ బాగా వచ్చినయ్ సర్.. మెయిన్ ఆర్టిస్టులు లేని సీన్ కొరత కనిపించింది. అక్కడ ఎవరూ లేరు.. క్రౌడ్ ఉండి నాజర్ గారి లాంటి కారెక్టర్ ఆర్టిస్టు ఉన్నారు.. అలాంటి సీన్ రీ షూట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు నెక్ట్స్ సినిమా చేయాలంటే భయంగా ఉంది.. మీ స్కూల్, మీ రైటింగ్ నాకు గుణపాఠం సర్. హీరోయిన్లు బాగా చేసారు. రాశీ ఖన్నా బాగా చేసింది. పాయల్ ఆర్ఎక్స్ 100 మాదిరే హై లో ఉంటుంది. టెక్నికల్ టీం చాలా బాగున్నారు. ప్రసాద్ అన్నా సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ బ్యాగ్రౌండ్ బాగుంది.. బ్రహ్మ గారూ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేసారు. శ్రీకాంత్ విసా స్క్రిప్ట్‌లో హెల్ప్ చేసాడు. నా రైటింగ్ టీం స్పెషల్ మెన్షన్.. ఈ సినిమాను నాకు తీసుకొచ్చిన నా గురువు కోన వెంకట్ థ్యాంక్స్.. సింగర్స్, లిరిసిస్టులు అందరికీ థ్యాంక్స్.. అని తెలిపారు.

హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఖమ్మం ఎలా ఉన్నారు.. మేం ఫస్ట్ టైమ్ ఖమ్మంకు వచ్చాను. ఇంత పెద్ద క్రౌడ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వెంకీ మామ నాకు చాలా స్పెషల్. వెంకీ గారితోనే కాదు చైతూతో కూడా ఫస్ట్ సినిమా ఇది. నేను కూడా మీ లాగే వెంకటేష్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.. సినిమాల గురించి లైఫ్ గురించి నేర్చుకున్నాను. బాబీ గారితో రెండోసారి పని చేస్తున్నాను జై లవకుశ తర్వాత. సురేష్ ప్రొడక్షన్స్‌కు కూడా చాలా థ్యాంక్స్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి కూడా థ్యాంక్స్. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. పాయల్ రాజ్‌పుత్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 13న విడుదల కానుంది.. వచ్చి ఆశీర్వదించండి.. అని తెలిపారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఖమ్మం.. నేను రెండోసారి ఖమ్మంకు వచ్చాను. మీడియా వాళ్లందరికీ థ్యాంక్స్.. ఈ రోజు చాలా ఎగ్జైటెడ్‌గా.. ఆనందంగా ఉంది. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్.. దానికి కారణం వెంకటేష్ గారూ. ఐ లవ్ యూ.. నేను మీకు పెద్ద ఫ్యాన్. మీతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.. ఇంత త్వరగా మీతో పని చేస్తానని అనుకోలేదు.. కల నిజమైనట్లు ఉంది.. వెంకీ మామ ఫస్ట్ డే షూట్‌లో చాలా కంగారు పడ్డాను.. కానీ వెంకటేష్ గారు నన్ను ఫ్రీ అయ్యేలా చేసారు. ఇందులో హిందీ టీచర్‌గా నటిస్తున్నాను.. అని తెలిపారు.

నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెండేళ్ల జర్నీ ఇది. ఇలాంటి సందర్భంగా వెంకటేష్, నాగ చైతన్య లాంటి హీరోలతో గ్రేట్ మల్టీస్టారర్ ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి.. అని తెలిపారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. ఖమ్మం ప్రజలకు థ్యాంక్స్.. ప్రెస్ మీట్‌లలో అయితే ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడటం రాదు.. రాజకీయ నాయకులు అయితే బాగా మాట్లాడతారు.. మా సినిమా డిసెంబర్ 13న విడుదలవుతుంది.. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న మంచి సినిమా అవుతుంది. గ్రేట్ యాక్షన్.. సెంటిమెంట్.. ఎంటర్‌టైన్మెంట్ ఉన్న సినిమా ఇది… అని తెలిపారు.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. మా సినిమాలో అన్నీ ఉంటాయి.. డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. దర్శకుడు బాబీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. వెంకటేష్, నాగ చైతన్య నటన మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 13న వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని
తెలిపారు..

Ala Vaikunthapurramloo Teaser out on December 11th

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న
‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

“DTS” Movie Opening

కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. కొత్త కాన్సెప్ట్ తో యంగ్ టీం తో డిటియస్ మూవీ ప్రారంభం లాంఛనంగా జరిగింది. ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ లో ఆశిష్ గాంధీ, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు. శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్ లో  నూతన దర్శకుడు అభిరామ్ పిల్లా దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీ ప్రారంభం ప్రొడక్షన్ ఆఫీస్ లో చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా :
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ: ‘‘ నాటకం తర్వాత కొత్త కాన్సెప్ట్ ల కోసం చూస్తున్న టైంలో అభిరామ్ చెప్పిన కథ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఆ కథతో మా ప్రయాణం మొదలయ్యాక నిర్మాత గంగా రెడ్డి గారికి కాన్పెప్ట్ చెప్పాము.  ఆయనకు నచ్చి వెంటనే సినిమా ప్రారంభించారు. మా ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
హీరోయిన్ పూజా జవేరి
మాట్లాడుతూ:
‘‘ అభిరామ్ కాన్సెప్ట్ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ టీంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, డిఓపి సతీష్ గారి కాంబినేషనల్ లో మరోసినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ టీం లో ఒక ఎనర్జీ కనిపిస్తుంది. ఆశిష్ తో కలసి పనిచేయడం ఇదే మొదటిసారి మా కాంబినేషన్ తెరమీద బాగుంటుందని నమ్ముతున్నాను. కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది ’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్  సాయి కార్తిక్ మాట్లాడుతూ: ‘‘ కాన్సెప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది, అభిరామ్ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు.  నిర్మాత గంగారెడ్డి నాకు మంచి మిత్రుడు ఆయనకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ప్రొడక్షన్ ను ప్రారంభించాము. డిటియస్ టైటిల్ అనగానే చాలా కొత్త గా ఫీల్ అయ్యాను . ఇలాంటి కాన్సెప్ట్ లకు మ్యూజిక్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

నిర్మాత గంగారెడ్డి మాట్లాడుతూ: ‘‘ డిసెంబర్  చివరి వారంలో షూటింగ్ కి వెళుతున్నాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసాము. అభిరామ్ కాన్సెప్ట్ వినగానే చాలా కొత్త గా గ్రిప్పంగ్ గా అనిపించింది. మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణల వివరాలు త్వరలోనే తెలయజేస్తాం.   మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

డిఓపి సతీష్  ముత్యాల మాట్లాడుతూ: ‘‘ ఇలాంటి సబ్జెక్ట్ లకు పనిచేయడం లో సినిమా టోగ్రాఫర్ కి ఒక ఛాలెంజ్ ఉంటుంది. అభిరామ్ స్ర్కిప్ట్ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఇలాంటి యంగ్ టీంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

బ్యానర్: శ్రీ భవితా క్రియేషన్స్
హీరో : ఆశిష్ గాంధీ
హీరోయిన్: పూజా జవేరి.

సాంకేతిక వర్గం:
మ్యూజిక్ : సాయి కార్తిక్, డి ఓపి : ముత్యాల సతీష్, పి. ఆర్. ఓ: జియస్ కె మీడియా, నిర్మాత గంగారెడ్డి, దర్శకత్వం :అభిరామ్ పిల్లా.

“Victoria” Queen movie Grand Opening

మోహన్ ప్రొడక్షన్స్  సమర్పణలో చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ లు ప్రధాన పాత్రధారులుగా నవీన్ లొట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విక్టోరియా’ దీనికి  టాగ్ లైన్ మహారాణి. ఓ  ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు,వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది ఈసినిమా ముఖ్య భూమిక.అలానే అమ్మాయిలను రేప్ చేసి చంపేయడం, ప్రజలు దాని గురుంచి  సామాజిక మాధ్యమాల్లో చర్చిండం కామన్ టాపిక్ అయిపోయింది. ఈ తరహా తీరును ఈ  సినిమాలో ప్రస్తావిస్తూ తెరకెక్కించిన చిత్రమే విక్టోరియా.వి. అర్జున్ అప్పారావు నిర్మాత గా వ్యవహరిస్తున్నఈ చిత్రం ఆదివారం ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో ప్రారంభోత్సవం జరుపుకుంది.ఈ నూతన చిత్రానికి క్లాప్ నిర్మాత రాజ్ కందుకూరి ఇవ్వగా,గౌరవ దర్శకత్వం సీనియర్ దర్శకుడు సముద్ర వహించగా,ఆన్ శ్రీ. రాఘవ సతీష్ స్వామిజీ కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు నవీన్ లొట్ల మాట్లాడుతూ.ఓ  ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగిన అనుకోని సంఘటనలు,వారి జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువచ్చాయి అనేది చిత్ర కథాంశం.  6 నెలలుగా ఈ చిత్ర కథపై కష్టపడి అర్జున్ అప్పారావు గారికి వినిపించడం జరిగింది. ఆయనకు కథ నచ్చి వెంటనే అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్ గా నిలుస్తుంది. అదే సినిమాకు బలం అని చెప్పొచ్చు.త్వరలో సెట్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మరికొంత మంది ప్రముఖ నటీ నటులు నటించనున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్మాత అర్జున్ అప్పారావు, మురళి వై కృష్ణ,చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ ఇతరులు పాల్గొన్నారు.
చిత్రాన్షి ద్రంజ్, సంరీన్ మజిర్, పింకీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర, విజయ్, నాని భాష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మురళి వై. కృష్ణ, మ్యూజిక్: ఎల్. వి. ముత్తు గణేష్, ఎడిటర్: మోహన్ రామా రావు, మేనేజర్: రవీందర్, నిర్మాత: వి. అర్జున్ అప్పారావు, స్టోరీ- డైలాగ్స్-డైరెక్షన్: నవీన్ లొట్ల.

“Entha Manchivadavuraa”1st Lirical Video Song Released

“ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..“

అని అంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.  సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంది.
ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో
జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..`ను చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌ల చేసింది. గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల సుబ్ర‌మ‌ణ్యం ఈ పాట‌ల‌ను ఆల‌పించారు.  నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ ట్యూన్‌కి  ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ సంద‌ర్భంగా ..
నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ “ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. అలాంటి కంటెంట్‌ను సూచించేలాగానే ఈ రోజు విడుద‌లైన సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` ఉంది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ …‘‘ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు ఎక్స‌లెంట్‌గా పాడిన ఈ పాటకు రామ‌జోగయ్య‌గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మ‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది“ అన్నారు.

న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:
త‌మ్మిరాజు
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

“Amaram Akhilam Prema”Teaser launched by Star Directers Sukumar,Korasala Siva

విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్  ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి కొరటాల శివ ఆవిష్కరించారు.
  ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..అమరం అఖిలం ప్రేమ టీజర్ ఆవిష్కరణ సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమరం అఖిలం ప్రేమఅనే ఈ టైటిల్ చాలా పాజిటివ్‌గా వుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సుకుమార్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అన్నారు
సుకుమార్ మాట్లాడుతూ ….ఈ చిత్ర నిర్మాత ప్రసాద్‌తో నాది 20 ఏళ్ళ ప్రయాణం. లెక్చరర్స్‌గా ఇద్దరం కలిసి పనిచేశాం. ప్రసాద్ ఈ చిత్రంతో నిర్మాతగా మారటం ఆనందంగా వుంది. విజయ్ రామ్‌ను హీరోగా చూడాలనేది ఆయన తండ్రి కోరిక. నటుడిగా అన్ని రకాల ఎమోషన్స్ పండించడమే ఓ హీరోకు కావాల్సిన అర్హత. అది విజయ్‌రామ్‌లో వుంది. ఈ చిత్ర దర్శకుడు జోనాథన్ నాకు చాలా ఏళ్ళ నుండి తెలుసు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. రసూల్ ఎల్లోర్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి.  తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
సుకుమార్ తనను గుర్తించి హీరోగా ఎంకరేజ్ చేశారని హీరో విజయ్‌రామ్ తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ సుకుమార్ గారు లేకపోతే ఈ రోజు నేను దర్శకుడిగా మీ ముందు వుండేవాడ్ని కాదు. మొదట్నుంచీ ఆయన ప్రోత్సాహం ఎంతో వుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాత ప్రసాద్ ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మించారు. బొమ్మరిల్లుతో జెనీలియాకు ఎంత మంచి పేరు వచ్చిందో ఈ చిత్ర నాయిక శివశక్తికి ఈ చిత్రంతో అంత పేరు వస్తుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ నా మీద ప్రేమతో ఈ వేడుకకు విచ్చేసి, మమ్ములను ప్రోత్సాహిస్తున్న సుకుమార్, కొరటాల శివకు నా కృతజ్ఞతలు. తప్పకుండా ఈ చిత్రం అందరి ప్రశంసలు పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రథన్, నటుడు శ్రీకాంత్, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా, జక్కా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

“Swechha” Releasing On December 27

ప్రముఖ గాయనీ మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్వేచ్ఛ. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్ చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ .. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండలతో పాటు పలు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఈ నెల 22న పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ సినిమాలోని ప్రతి పాటలో మా టీమ్‌లో ఎంతో పాజిటివ్ ఎనర్జీని నింపింది. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా వుందని భోలో షావలి తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ …..పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలు అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడపిల్లలను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న కొన్ని సంఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు అందరి మనసుకు హత్తుకునే విధంగా వుంటాయి.మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. హాస్య నటుడు చమ్మక్ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు అని తెలిపారు.

A soulful melody coming up from ”Sarileru Neekevvaru”

సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే క్లాసీ సాంగ్ గా ఉండనుందని తెలియజేస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు టీం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఒక స్ట్రాటజీ ప్రకారం పాటలని విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి అన్ని హంగులతో ఆల్ క్లాస్ ఆడియన్స్, ఫాన్స్ కి ఫీస్ట్ గా, సంక్రాంతి ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ క్యారక్టరైజెషన్, కామెడీ టైమింగ్ హైలైట్స్ గా ఉండనున్నాయి. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.