Home Blog Page 824

”Student Of The Year” Audio Launch

రాహుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. జీవిత రాజశేజర్ దంపతులు, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ…
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా మెసేజ్ తో కూడిన చిత్రం. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించాడు. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటులందరు బాగా నటించారు, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యాజమాన్య అందించిన సంగీతం బాగుంది. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కథ బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో కథ తో పాటు సందేశం ఉంది కావున ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తు సెలవు తీసుకుంటున్న అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ...
చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం మన పిల్లల్ని ఏ స్కూల్ లో వదలాలి ఆలోచిస్తాం. అలా మనం మన పిల్లలకు మంచి భవిషత్తు ఇవ్వాలని తాపత్రేయ పడతాం, సూట్డెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో స్టూడెంట్స్ గురించి ఒక మంచి మెసేజ్ ఉంది, ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది. డైరెక్టర్, నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది, అలాగే ఈ మూవీలో నటించిన కొత్త ఆర్టిస్ట్స్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ…
నా మిత్రుడు ఓబుల్ సుబ్బారెడ్డి సినిమాపైన ఆసక్తితో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాను నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక పాయింట్ ను తీసుకొని ఈ సినిమా తీసాడు దర్శకుడు కరుణ కుమార్. నేను మూవీ చూశాను, నచ్చింది, అందుచేత ఈ చిత్రాన్ని నేనే స్వయంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. కచ్చితంగా ఈ సినిమా ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీయ్యడం జరిగింది. నేను తెలుగులో తీసున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. అన్న మల్కాపురం శివకుమార్ ఈ సినిమా చూసి ఫాన్సీ రేటుకు సినిమా కోనడం మరింత ఎనర్జీ ఇచ్చింది. డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు.

డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మాట్లాడుతూ...
నా నిర్మాత ఓబుల్‌ సుబ్బారెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా మిత్రుడు హరి ప్రసాద్‌ చక్కటి మెసేజ్‌ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పారు. డిసెంబర్ 27న విడుదల కాబోతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ పాయింట్‌ అందరికీ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ బాగుంది. ఇప్పుడే ట్రైలర్, సాంగ్స్ చూశాను మేకింగ్ బాగుంది. యువతకు సందేశం ఇచ్చే సినిమా ఇది. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి, డైరెక్టర్ కారుణ కుమార్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్న అలాగే ఈ మూవీలో నటించిన హీరో హీరోయిన్స్ కు మంచి పేరు వచ్చి వారు బిజీ ఆర్టిస్ట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు : సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ
సాంకేతిక నిపుణులు:నటీనటులు
డైరెక్టర్: జె.కరుణ కుమార్
నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి
కథ – మాటలు: జక్కా హరిప్రసాద్
సంగీతం: యాజమాన్య
లిరిక్స్: రాంబాబు గోషల
పీఆర్ఓ: మధు వి.ఆర్

యువతకు దిశ హత్య కేసు నిందితులు చెప్పిన జీవిత సత్యాలు ఇవే…!

ఎవడు ఎన్ని చెప్పినా… ఎవరు ఎన్ని విధాలుగా ప్రభావితం చేసినా… మన జీవితం అనేది మన చేతుల్లో ఉండాలి… మనను పక్కని వాడు ప్రభావితం చేస్తే… ఆ ప్రభావాన్ని కొంత వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి… ఎందుకంటే మనిషి జీవితం చాలా విలువైనది… దిశ హత్య కేసు నిందితుల విషయానికి వచ్చి ఒక్కసారి చూద్దాం

వాళ్ళల్లో ఎవరికి 25 ఏళ్ళు దాటలేదు. ఇద్దరికీ మీసాలు కూడా రాలేదు… కాని ఒక వ్యక్తి ప్రభావంతో వాళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వాళ్ళు ఆ కాసేపు ఏం కోరుకున్నారో…

వాళ్లకి ఆ కాసేపట్లో ఏం దొరికిందో… వాళ్ళు అనుభవించింది ఏంటో… వాళ్ళకే తెలియాలి… ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న వయసులు అవి… కాని ఆరిఫ్ అనే వ్యక్తి స్నేహంలో పడి… అతనిని అన్నా అన్నా అంటూ తిరిగి, జీవితాలను మిగిలిన ముగ్గురు నాశనం చేసుకున్నారు. పోలీసులు కూడా ఆరిఫ్ ని విచారించిన సమయంలో అతనిలో భయం గాని బాధ గాని పశ్చాతాపం గాని లేదని ఆశ్చర్యపోయారు. స్నేహం అనేది దొరకడం ఈ రోజుల్లో చాలా సులువు… కాని ఆ స్నేహాలు మనను ఎటు వైపు నడిపిస్తున్నాయి…?

వాటి కారణంగా మనం ఎటు వెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి… మద్యం మత్తులో ఒక నిండు జీవితాన్ని నాశనం చేసి… ఆ పది నిమిషాల కోసం నిండు జీవితాలను నాశనం చేసుకున్నారు. సమాజంలో వాళ్ళ చావు సంబరాలు చేసుకునే వరకు తీసుకెళ్ళారు… వాళ్ళు పెరిగిన కుటుంబ పరిస్థితులు, వాళ్ళు పొట్ట కూటి కోసం చేసే పనులు,

వాళ్ళను నడిపించిన కారణాలు… ఏమైనా అయి ఉండవచ్చు… కాని మద్యం మత్తులో వాళ్ళు చేసిన పని ఇప్పుడు వాళ్ళ జీవితాలనే కాదు… కొన్ని కుటుంబాలను నిర్వేదంలోకి నేట్టేసాయి. ఆ నలుగురి కుటుంబాలకు ఇప్పుడు సమాజంలో విలువ ఉండదు. తల్లి తండ్రులను చూసే దిక్కు ఉండదు. వారిలో ఒకరికి భార్య ఉంది… ఆమె పరిస్థితి ఏంటో ఆమె భవిష్యత్తు ఏంటో తెలియదు… ఆమె గర్భిణి… ఆమెకు పుట్టబోయే బిడ్డ లోకాన్ని చూడక ముందే… తండ్రిని కోల్పోయింది. కాబట్టి చేసే ప్రతి పనిలో, ఆలోచించే ప్రతీ ఆలోచనలో కూడా విజ్ఞత అనేది చాలా అవసరం.

ఉన్నదీ ఒక్కటే జీవితం… ఒక మనిషి గా ఆలోచిస్తే వాళ్ళ మీద ఎక్కడో ఒక జాలి అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు జీవితం అంటే ఏంటో తెలీదు. నేడు తల్లి తండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళారు. కన్న పేగు కూడా వాళ్ళని క్షమించొద్దు అని చెప్పింది… స్నేహాలు చేసే ముందు ఆలోచించండి… ఎందుకంటే ఉన్నదీ ఒక్కటే జీవితం… మళ్ళీ జన్మ ఉంటదని ఎవడు చెప్పినా సరే అది అబద్దం… ఉన్న జీవితాన్ని మీకు ఉన్న వసతులతో అనుభవించండి… కాని ఇలా మాత్రం ప్రవర్తించి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు…!

చివరగా ఆ నలుగురి జీవితాలు నేటి సమాజానికి చెప్పిన విలువైన సలహా… పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు తిరుగుతున్నారు, ఎవరితో సావాసాలు చేస్తున్నారు అనేది తల్లి తండ్రులు ఆలోచించాలి, అలాగే మనం ఎవరితో తిరుగుతున్నాం తిరిగే వ్యక్తి మనస్తత్వం, వ్యక్తిత్వం, వ్రుత్తి ఏంటి, అతని చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి, పిల్లలు పని చేస్తున్నారు కదా డబ్బులు తెస్తున్నారు కదా అని వాళ్ళను వదిలేస్తే వాళ్ళు ఏం చేసినా చివరికి నష్టపోయేది తల్లి తండ్రులే. మనం డబ్బులు తెస్తున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా అని,

ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే… డబ్బులు గాని, సుఖాలు గాని ఏ ఒక్కటి శాశ్వతం కాదు… మీ కుటుంబ పరిస్థితుల కారణంగా మీరు ఏ విధంగా అయినా కష్టపడొచ్చు… కాని చేసే స్నేహాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి… చేసుకునే అలవాట్ల విషయంలో కూడా ఒకటికి పది సార్లు జాగ్రత్త పడ౦డి. మన జీవితానికి మనదే బాధ్యత… డబ్బుతో పాటు సమాజంలో ఎలా ఉండాలి అనే విజ్ఞానం కూడా సంపాదించుకొండి… పది మందిని చూసి మంచి నేర్చుకోండి… మీ జీవితాన్ని మీరే సక్రమమైన మార్గంలో పెట్టుకోండి.

”Miss Match” Success Meet

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ బేనర్ పై ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా ‘డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. డిసెంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో..

కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ – ” ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి” అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ – “‘ మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా” అన్నారు. మిస్‌ మ్యాచ్‌ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. తనకు నచ్చిన వాడి ప్రేమను దక్కించుకునేందుకు ఒకమ్మాయి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటోంది. గ్రామీణ యువతి రెజ్లింగ్‌లో ఒలంపిక్స్‌ గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం బాగుందని అంటున్నారు. ఉదయ్‌, ఐశ్వర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అని చెప్పారు.

మాటల రచయిత రాజేంద్ర కుమార్ …‘‘సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతోంది. మరింతగా పెరగాలి’’ అని  చెప్పారు.

దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ – ” చిన్న సినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత జీవీజీగారికి, హీరో ఉదయ్ కి, ఐశ్వర్యకు, నిర్మాత శ్రీరామ రాజు గారికి ధన్యవాదాలు” అన్నారు..మీడియా, ప్రేక్షకుల ఆదరణ, మద్దతు ఉంటే చిన్న చిత్రమైనా ఎంత మంచి విజయం సాధిస్తుందో నిరూపణ అయ్యింది. మా మిస్‌ మ్యాచ్‌ చిత్రాన్నిమీరంతా సహకరించి విజయం చేకూర్చారు. అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ – “ఈశుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ‘తొలిప్రేమ లోని ‘ఈ మనసే. పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్ట‌న్ గారికి థ్యాంక్స్. అలాగే కెమెరా మెన్ గణేష్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.సమావేశం అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్.

‘M3’ Directer Ramakrishna Thota another upcoming movie ”Kodi Katthi”

రామ్ కృష్ణ తోట  దర్శకత్వంలో రూపొందిన  సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం3’. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌). ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్ కి  మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం విడుదల దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్‌ చేశారు. ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘కోడి కత్తి`.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  రామ్ కృష్ణ తోట మాట్లాడుతూ – సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో `ఎం3` చిత్రం రూపొందింది.  తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌, కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను రూపొందించాం. ‘ఎం3’ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడిగా నా నెక్స్ట్ ప్రాజెక్ట్  ‘కోడి కత్తి`. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కె. శరత్ వర్మ పనిచేస్తున్నారు.  న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం“అన్నా

”Mathu Vadhalara” Teaser Released by Mega Hero Power Star Ramcharan

మీ ఇద్దరిని డేడికేషన్, టాలెంట్‌కు  మారుపేరులా నిర్వచించవొచ్చు. రంగస్థలం సమయంలో సింహాతో కలిసి వర్క్ చేశాను. ఆ ప్రయాణం మరపురానిది. మా నటుల ప్రపంచంలోకి సింహాకు స్వాగతం పలుకుతున్నా. కాలభైరవ విలక్షణ గాత్రానికి నేను పెద్ద అభిమానిని. ఆయన పాటల్ని వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.

ప్రముఖ కథానాయకుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా  అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. ఈ చిత్ర టీజర్‌ను రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ తన అభినందనలు తెలియజేశాడు. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది.  శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం చర్చింబోయే అంశం అతినిద్ర యొక్క లక్షణాలు. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం అంటూ ఓ రేడియో వ్యాఖ్యనంతో టీజర్ ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో మనస్తత్వం వున్న  కథానాయకుడిగా శ్రీ సింహా ఈ టీజర్‌లో కనిపిస్తున్నాడు. అన్ని అంశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మర్డరీ సస్పెన్స్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ్త  నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నూతన ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. వినోదం మేళవించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా ద్వారా కొత్త సాంకేతిక నిపుణుల్ని, నటుల్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నాం అన్నారు. నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

.

Director Anil Ravipudi Launches ”Poster” Film First Look Poster

  శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా  “పోస్టర్ “. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసారు. అనంతరం
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ…. ఈ సినిమా హీరోతో  నాకు ఎప్పటి నుండో చాలా మంచి పరిచయం వుంది.  తను  హీరోగా చేస్తుండటం నాకు చాలా సంతోషంగానూ ఉంది, ఈ సినిమా టైటిల్ పోస్టర్ అనగానే చాలా కొత్తగా అనిపించింది.  ఈ పోస్టర్ టీం అందరికి నా అభినందనలు తెలుపుతూ ఈ సినిమా విడుదల అయి మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ… మా సినిమా ఫస్ట్ లుక్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఇష్టమైన దర్శకుడు అనిల్ రావిపూడి గారు. నన్ను ఈ సినిమాకు హీరోగా తీసుకున్న మా దర్శకుడికి ధన్యవాదాలు. మా ఈ పోస్టర్ సినిమా కథ కథనం చాలా నేచురల్ గా ఉంటుంది, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.
దర్శకుడు టి ఎం ఆర్ మాట్లాడుతూ… మనం సినిమా గురించి మాట్లాడుకుంటే మొదట కథ, దర్శకుడు గురించి మాట్లాడుకుంటాం. సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత పోస్టర్ గురించి మాట్లాడుకుంటాం. మేము అలాంటి ఒక మంచి టైటిల్ తో మంచి కథని మీ ముందుకి తెస్తున్నాం. మా ఈ పోస్టర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో మీ ముందుకి వస్తుంది, మీరంతా తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, గణేష్ శంకర్, మల్లికార్జున్, అజయ్..,  వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో మన ముందుకి రానుంది.

‘Sarileru Neekevvaru’ Second Song, ‘Suryudivo Chandrudivo’ Will Be Out On Monday

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం  ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ మైండ్ బ్లాక్’  కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రం నుండి సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో… సోల్ ఫుల్ మెలోడీ ని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలచేయనుంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి11నప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

“AMMA RAJYAMLO KADAPA BIDDALU”CENSOR COMPLET

 రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. రాంగోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు  రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుంది. యు/ఎ  సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 12న చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్బంగా సెన్సార్ రివైజింగ్ కమిటీకి చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు,విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందేనని తెలిపింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం యలేదని…ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్పష్టం చేసింది. ఇందులోని పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీధర్. 

Hero ‘Karthikeya’ interview

‘విమర్శల్ని నేనెప్పుడూ గౌరవిస్తా. అందరి అభిప్రాయాలు వింటా. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటా. అన్నిసార్లు ‘ఆర్‌ఎక్స్‌ 100′ లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. ’90.ఎం.ఎల్‌’ విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లే పరంగా కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా” అని చిత్ర కథానాయకుడు కార్తికేయ అన్నారు. శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో కార్తికేయ మాట్లాడారు.

మాస్‌ హీరోగా ఎదగాలని 90ఎం.ఎల్‌. చేశారా?

నేను మాస్‌ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చెయ్యలేదు. నటుడిగా అన్ని జోనర్లు చెయ్యాలనుకున్నా. వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. చిన్నప్పుడు చిరంజీవిగారిని మాస్‌ చిత్రాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించే వాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రల్లో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రల్లో ఇది ఒకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశా.ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. నేను ఎలాంటి పాత్రకైనా సరిపోతాను అనే నమ్మకం రచయితల్లో కలగాలిగించడమే నా లక్ష్యం. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా.

చిత్ర ఫలితం మీకెలాంటి కిక్‌ ఇచ్చింది?

ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో చిత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆద్యంతం ఆ వినోదాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ కథ తొలిసారి విన్నప్పుడు మీకెలా అనిపించింది?

ఓ చిన్న లోపం వల్ల కథానాయకుడు చిన్నప్పటి నుంచి ఆల్కహాల్‌ తీసుకోవడం అన్నది దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఆసక్తికి గురి చేసింది. నిజంగా ఇలాంటి వారు కూడా ఉంటారా అనుకున్నా. దీని గురించి అంతర్జాలంలో నేనూ వెతికా. కానీ, దొరకలేదు. కేవలం ఇదొక ఫిక్షనల్‌ కథలాంటిది. ప్రేక్షకుల తెరపై చూస్తున్నప్పుడు వాళ్లూ సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారనుకొని చేసిన ప్రయత్నమిది.

టైటిల్‌ వల్ల ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు దూరం అవుతుందని అనిపించలేదా?

ముందుగా ‘దేవదాస్‌.. పార్వతీపురం’ అనే పేరు అనుకున్నాం. ఆ తర్వాత కథాంశానికి తగ్గట్లుగా పేరు ’90.ఎం.ఎల్‌’ అని పెడితేనే బాగుంటుంది అనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. మరో విషయం ఏంటంటే దీన్ని మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా రూపొందించాం. మేం అనుకున్నట్లుగానే ఇది వాళ్లకు చేరింది.

మీరు డ్యాన్స్‌లు చేయరుగదా. ఈ సినిమాకోసం ఏమైనా ప్రత్యేక కసరత్తులు చేశారా?

నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సర్‌ చిత్రాల్లోని పాటలకు స్కూల్‌, కాలేజీల్లో వేదికలపై డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే నా తొలి మూడు చిత్రాల్లో నృత్యాలు అంత ప్రాధాన్యత దొరకలేదు. ఈ చిత్రంలో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా. ఇక వినోదం విషయానికొస్తే.. కథానాయకులు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్‌, చిరు, మహేష్‌ వంటి హీరోలు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేనూ అది దృష్టిలో పెట్టుకునే వినోదాత్మక సన్నివేశాల్ని పండించా.

‘గ్యాంగ్‌లీడర్‌’లో ప్రతినాయకుడిగా చేశారు. మళ్లీ అలాంటి అవకాశమొస్తే చేస్తారా?

కచ్చితంగా చేస్తాను. నాకు నటన అంటే ఇష్టం. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. కానీ, విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు దానికొక ప్రాధాన్యత ఉండాలి. సినిమాకీ నాకూ ఆ పాత్ర ఉపయోగపడేలా ఉండాలి. ఏదో హీరోతో నాలుగు ఫైట్లు చేసేసి వెళ్లిపోయేటట్లు ఉండకూడదు. మనసుకు నచ్చాలే కానీ ఐటెం గీతాలకైనా రెడీనే.

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?

ఇద్దరు కొత్త దర్శకులతో చెయ్యబోతున్నా. ఒకటి యాక్షన్‌ థ్రిల్లర్‌. మరకొటి భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త ప్రేమకథ. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తా.

‘దిశ’ హత్యాచార ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మీ ‘గుణ 360’ క్లైమాక్స్‌ సన్నివేశాలు వైరల్‌ అయ్యాయి. దానిపై మీ అభిప్రాయం?

నిజానికి ఆ సన్నివేశాల్ని ప్రజలు అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి నేను కాస్త బాధ పడ్డా. ఆ సినిమాలో ఓ నటుడిగా హత్యాచార నిందితులను శిక్షించానే తప్ప, నిజ జీవితంలో దిశ ఘటనపై ట్వీట్‌ చేయడం తప్ప ఏం చెయ్యగలుగుతున్నా అనిపించింది.

“Mera Dosth” Movie Success Meet

 పవన్‌, శైలజ  జంటగా వి.ఆర్‌ ఇంటర్నేషనల్‌ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్‌ లో రూపొందిన చిత్రం ‘మేరా దోస్త్‌’. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత పి.వీరారెడ్డి మాట్లాడుతూ…‘‘మేము ఏ టార్గెట్‌తో అయితే సినిమాను నిర్మించామో ఆ టార్గెట్‌ రీచ్‌ అయ్యాం. ఈ  రోజు మా సినిమా ప్రదర్శింపబడుతోన్న కొన్ని థియేటర్స్‌ సందర్శించాం.పాటలకు, ఫైట్స్‌కు, ఫ్రెండ్‌షిప్‌ వాల్యూస్ కి  ఆడియన్స్‌ కనెక్టవుతున్నారు. ఒక మంచి సినిమా తీసామన్న ఆనందంతో థియేటర్‌ నుంచి బయటకొచ్చాం. ఇంకా మా సినిమాను పెద్ద సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు జి.మురళి మాట్లాడుతూ..‘‘ఉషా మయూరిలో ఈ రోజు సినిమా చూశాం. ఆడియన్స్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. విడుదలైన అన్ని ఏరియా నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా సినిమాను ఇంత మంచి సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ’’ అన్నారు.
హీరోయిన్‌ శైలజ మాట్లాడుతూ..‘‘ఈ రోజు విడుదలైన మా సినిమాను ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సాంగ్స్‌, లవ్‌ సీన్స్‌, సెంటిమెంట్  సీన్స్‌ కి ఆడియన్స్‌ కనెక్టవుతున్నారు’’ అన్నారు.
బాక్సాఫీస్‌ అధినేత చందు రమేష్‌ మాట్లాడుతూ..‘‘మేరాదోస్త్‌’ సినిమా రెండు తెలుగు  రాష్ట్రాల్లో  గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలైన అన్ని ఏరియాల  నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. థియేటర్స్‌ కూడా పెంచడానికి నిర్మాత ప్లాన్‌ చేస్తున్నారు. ఇంత మంచి సినిమా చేసిన దర్శక నిర్మాతల కు నా శుభాకాంక్షలు“అన్నారు.
  కాశీవిశ్వనాధ్‌ , బెనర్జీ, అమిత్‌, వీరారెడ్డి తదితరులు  నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ : చిన్న, ఎడిటర్‌ : నందమూరి హరి,  కెమెరా: సుధీర్‌,  నిర్మాత: పి. వీరారెడ్డి, డైరెక్టర్‌: జి.మురళి.