Home Blog Page 825

“Manam Saitam” Free Health Camp

మనంసైతం ఆధ్వర్యంలో ఉచిత  వైద్య శిబిరం

ప్రముఖ నటులు, సంఘ సేవకులు కాదంబరి కిరణ్ కొనసాగిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో మెడీకవర్ ఆస్పత్రి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ అతిథిగా పాల్గొన్నారు. చిత్రపురి కాలనీలో పనిచేస్తున్న కార్మికులు ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో గ్రీన్  ఛాలెంజ్ బృహత్ కార్యంతో తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనం కోసం పాటుపడుతున్న తెరాస రాజ్యసభ సభ్యులు జె సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా హరిత హారం జరిపి, మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి కార్మికులకు పంచారు. మనం సైతం సంస్థ తరుపున చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న దివ్యాంగుడైన మేనేజర్ ప్రవీణ్ కుమార్ కు 25 వేల రూపాయలు, సీనియర్ నటుడు మల్లేశంకు 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్మికులకు దోమ తెరలు, దుప్పట్లు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ…ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి నగరం పచ్చగా ఉండాలంటే హరిత హారం నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. కాదంబరి కిరణ్ గారు ఈ కార్యక్రమానికి ముందడగు వేయడం సంతోషంగా ఉంది. ఆయన మనం సైతం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తున్నా. చిత్రపురి కాలనీలో ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా. అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…భావి తరాలకు మనమిచ్చే నిజమైన సంపద చెట్లే. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో సంతోష్ కుమార్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మా వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ చిత్రపురి కాలనీలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, దోమతెరలు, దుప్పట్లు అందజేశాం. ఇద్దరు నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందించాం. మనం సైతం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో దినేష్, పీవీ శ్రీనివాస్, ఎన్ శంకర్, దీప్తి వాజ్ పాయ్, మనం సైతం, చిత్ర పురి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Agent Sai Srinivasa Atreya producer Appreciate “Suicide Club”

3 i ఫిలిమ్స్ సమర్పణలో  మజిలీ సినిమా ఫేమ్  శివ రామాచద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి,సాకేత్,వెంకట కృష్ణ,చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. సినిమా కు సంబందించిన  అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో ట్రయిల్ షో ను నిర్వహించారు చిత్ర బృందం.
ఈ  కార్యక్రమంలో ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క,డైరెక్టర్ మల్లి తదితరులు చిత్రాన్ని వీక్షించారు.అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మొదటగా ప్రముఖ నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ“ఓక చక్కటి పాయింట్ తో డైరెక్టర్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. టెక్నీకల్ గా కూడా ఈచిత్రం డిఫ్రెంట్ గా ఉంది. అలాగే మంచి సోషల్ కాజ్ తోడైరెక్టర్ శ్రీనివాస్ ,నిర్మాత ప్రవీణ్ ప్రభు,ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు వారిని అభినందిస్తున్నాను”అన్నారు.
 డైరెక్టర్ శ్రీనివాస్ బొగడపాటి మాట్లాడుతూ.నేను రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్ ను ఇంప్లిమెంట్ చేసి సినిమాటిక్ గా చేసిన చిత్రమే ‘సూసైడ్ క్లబ్’. కంప్లీట్ గా స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ. శివ పర్ఫెక్ట్ గా సరిపోయాడు.ఇక వెంకట్ ప్లే చేసిన రోల్ అయితే యూనిక్ గా ఉంటుంది. మా చిత్ర యూనిట్ లో ఉన్న 80 మందిలో చందన ఒక్కటే అమ్మాయి. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇరగదీసాడు అని చెప్పాలి. ఎడిటర్ శర్వా ఎడిటింగ్ స్కిల్స్ సూపర్ అనిపిస్తాయి. త్వరలో మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
శివ రామాచద్రవరపు, ప్రవీణ్ యండమూరి, చందన, సందీప్ రెడ్డి, వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ నటించిన ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం,మ్యూజిక్: కున్ని గుడిపాటి,ఎడిటర్: డే సెల్వ,ఆర్ట్: శాన్ నవార్,విజువల్స్: పవన్ కుమార్ తడక,కుమార్ నిర్మల సృజన్,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,సౌండ్: రాఘవ చరణ్.

Sree Vishnu, Hasith Goli, and Abhishek Agarwal New Movie Launched

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు నేడు సంస్థ కార్యాలయంలో జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.

వినోదం తో కూడిన డ్రామా ఈ చిత్ర కధలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి.

శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం వివేకసాగర్, ఛాయాగ్రహణం వేదరామన్. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

This is a true tribute to ‘The Direction..Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో
మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే.
అత్యంత దారుణం గా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు వున్న పోలీస్ వ్యవస్థకి, కెసిఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు” అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

‘Balayya – Boyapati Hattrick movie Grand opening

సింహా’. ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ప్రొడక్షన్ నెం.౩ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌ లోనే నటసింహ నందమూరి బాలకృష్ణ ‘నువ్వొక మాటంటే అది ‘శబ్దం’ అదే మాట నేనంటే అది ‘శాసనం‘’అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్‌, శివలెంక కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – “ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న నా మరియు బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్‌ మిర్యాల రవీందర్‌ రెడ్డి గారు నిర్మాతగా నూతన చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ’సింహా’, ’లెజెండ్‌’ సినిమాలు చేయడం, అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. అయితే నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్సన్‌ట్రేషన్‌ మా నెక్స్‌ట్‌ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం.రత్నంగారి కథ, సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత బాధ్యత తీసుకుంటాం కనుకనే ’సింహా’, ’లెజెండ్‌’ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. అలాగే ఆధ్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వచ్చింది. ఇండస్ట్రీకి మిర్యాల రవీందర్‌లాంటి మంచి మంచి యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్‌లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు శిక్ష విధించాడు.దిశ అనే మహిళపైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాన్నగారు అన్న నందమూరి తారక రామారావుగారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే ’లెజెండ్‌’ సినిమాలో మేము కూడా స్త్రీ లేకుంటే సృష్టి లేదు అనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మన మహిళలపై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది, మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. అందరికీ ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ద్వారక క్రియేషన్స్‌లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్‌ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా ’భద్ర’. ఒకమంచి సినిమాతో నా లైఫ్‌ స్టార్ట్‌ అయింది. ‘సింహా వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. సింహా, లెజెండ్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను.పొల్యూషన్‌ నుంచైనా తప్పించుకోవచ్చు కానీ పోలీస్‌ నుంచి తప్పించుకోలేరు,దిశకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నపుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారి పోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి ‘పొల్యూషన్‌ నుండైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్‌ నుండి ఎవరూ తప్పించుకోలేరు” అన్నారు.

చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ “భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీస్తుండొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను” అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

“Miss Match” Feel Good Emotional Love Story

Movie Name:-“MISS MATCH”
Banner:-Adhiroh creative science
Starring:-Uday Shankar,Aishwarya rajesh,Sanjay Swarup,Rupa lakshmi,Sharanya
Camera:-Ganesh Chandra
Music:-Giftan
Producers:-G.Sreeram Raju,Barath Ram
Directer:-N.V.Nirmal Kumar..

వైవిధ్యమైన సినిమాలు చేయడం చాల పెద్ద రిస్క్.. కమర్షియల్ సినిమాలు ఎక్కువుగా ఇష్టపడే ఆడియన్స్ ఉన్న టాలీవుడ్ లో కంటెంట్ సెంట్రిక్ సినిమాలు చాల తక్కువుగా తెరకెక్కుతుంటాయి. ఇదే తరహాలో ఫీల్ గుడ్ కంటెంట్ ఉన్న సినిమా అంటూ మూవీ లవర్స్ ని అట్ట్రాక్ట్ చేసిన మూవీ ‘మిస్ మ్యాచ్’ . ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ సినిమాకు డాక్టర్ సలీం ఫేమ్ నిర్మల్ కుమార్ డైరెక్టర్ . ఈ శుక్రవారం రిలీజ్ అయిన ‘మిస్ మ్యాచ్’ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : హీరో ఉదయ్ శంకర్ ఫ్యామిలీ లో ఉన్నవారంతా చాలా క్లాస్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఫామిలీ మొత్తం పల్లెటూరి బ్యాచ్, పైగా హీరో ఫామిలీ అంత చాల చదువుకొని సాఫ్ట్వేర్, కాలేజీ ప్రొఫెసర్ అంటూ జాబ్స్ చేస్తుంటారు, ఇటు వైపున హీరోయిన్ ఫామిలీ మాత్రం చాల సాదా సీదా మనుషులు, పక్క పల్లెటూరి వాళ్ళు, సిటీ కల్చర్ కి బాగా దూరం గా ఉండటానికి ఇష్టపడుతుంటారు, ఇలా రెండు భిన్నకోణాలున్న కుటుంబాల నుంచి వచ్చిన ఒక పల్లెటూరి పిల్ల, ఓ ఐ ఐ టి కుర్రాడి ప్రేమ కథ ఎలా సక్సెస్ అయిందో తెలియాలంటే ‘మిస్ మ్యాచ్ ‘ చూడాల్సిందే…

విశ్లేషణ : విజయ్ ఆంథోనీ అనే మ్యూజిక్ డైరెక్టర్ ని నటుడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసిన సినిమా డాక్టర్ సలీం, ఈ మూవీ కి అప్పట్లో చాలా ప్రసంసలు దక్కాయి . ఆ సినిమా డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ‘మిస్ మ్యాచ్ ‘ ఫై మూవీ లవర్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు, ముందు నుంచి చెబుతున్నట్లుగానే డైరెక్టర్ నిర్మల్ కుమార్ ఈ కథ ని ముఖ్య కథాంశం చుట్టూనే నడిపించాడు.

సినిమా కోసం ఎంచుకున్న లైన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ జాయిన్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా సరైన దారిలో ‘మిస్ మ్యాచ్ ‘ స్టోరీ ని రక్తి కట్టించాడు. డైరెక్టర్ నిర్మల్ కుమార్, ఇక ఇలాంటి వైవిధ్యమైన స్టోరీలు ఎంచుకొన్నపుడు ఇందులో నటించే వారు కూడా వారి నటనలో వైవిధ్యం చూపించాలి, హావభావాలు విషయంలో చాల పర్ఫెక్ట్ గా ఉండాలి, హీరో ఉదయ్ శంకర్ కి ఇది రెండో సినిమానే కావచ్చు కానీ, తన మొదటి సినిమా ‘అటగదరా శివ’ కంటే ‘మిస్ మ్యాచ్ ‘ లో తన నటన లో పరిణితి తెచ్చుకున్నాడు.

ఛాన్స్ ఉంటె చాలు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే నేటి యంగ్ హీరోల మాదిరి కాకుండా, కొత్త కుర్రాడు కొత్తగా ట్రై చేస్తున్నాడు అనే భావం ఆడియన్స్ లో కలిగించాడని ఉదయ్ శంకర్ ఈ సినిమా ద్వారా మరో సారి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది, క్లాస్ లుక్స్ తో ఉదయ్ శంకర్ తాను పోషించిన పాత్ర కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు, అలానే ఐశ్వర్య రాజేష్ తో ఉదయ్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా లో హీరో కి సమానంగా నిలిచే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించింది అని నిర్మొహమాటం గా చెప్పవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ లో ఐశ్వర్య క్యారెక్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది., ఓ లేడీ రేస్లర్ గా కనిపించాలని ఐశ్వర్య పడిన కష్టం, తనకి నటన ఫై డెడికేషన్ మరో సారి మిస్ మ్యాచ్ మూవీ తో క్లియర్ గా ఆడియన్స్ కి కనిపిస్తాయి, ఇక ఓ పల్లెటూరి అమ్మాయి గా అమాయకంగా కనిపిస్తూనే రేస్లర్ గా స్పోర్ట్స్ లుక్ లో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్, అలానే వీరిద్దరితో పాటు, శరణ్య , సంజయ్ స్వరూప్, రూప లక్ష్మి తమ పాత్రల పరిధిలో నటించారు.

అలానే ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాకు పెట్టుబడి పెట్టి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్ గా నిర్మించినందుకు నిర్మాతలు శ్రీరామ్ రాజు,భారత్ రామ్ లను అభినందించాల్సిందే, అలానే గణేష్ చంద్ర కెమెరా పనితనం, గిఫ్టన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మిస్ మ్యాచ్ ను ఆడియన్స్ కి మరింత దగ్గర అయ్యేలా చేస్తాయి అని చెప్పడం లో సందేహం అవసరం లేదు, కధనం లోకొన్నిసార్లు స్లో అనిపించినా , మిస్ మ్యాచ్ మాత్రం ఓ ఫీల్ గుడ్, ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఆడియన్స్ ని అలరించడం ఖాయం.కుటుంబ సమేతంగా చూడ తగ్గ చిత్రమిది.

Rating: 3.25/5

“Maa” Demands Justice for “Disha”

జస్టిస్ ఫర్ దిశ – ఈ దిశగానే తెలుగు సినిమా రంగం కదిలింది. మానవ మృగాల బారినపడి అసువులు బాసిన డా. దిశకు

చిత్రపరిశ్రమ యావత్తూ ఘనంగా నివాళులర్నించింది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఆవరణ నుంచి ఫిలింనగర్ కల్చరల్
సెంటర్ వరకూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. తెలుగు సినిమా రంగానికి చెందిన 24 వృత్తుల వారూ ఈ
ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో పలువురు పరిశ్రమ పెద్దలు, మాజీ మంత్రులు ప్రసంగించారు. దిశ ఘటనలో సత్వర న్యాయమే శరణ్యమన్నారు.

హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి అకృత్యాలు
జరగకూడదన్నారు. దోషులకు కఠిన దండన తప్పనిసరి అని, అది జరిగితేనే దిశ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అనాదిగా స్ర్తీజాతికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలోనూ స్ర్తీకి అన్యాయం జరిగిన ఘటనలు ఉన్నాయని, కాకపోతే చివరికి వారు సింహాసనాన్ని అధిష్టించి ధర్మం నిలబడిందన్నారు. ఈరోజు ఆ పరిస్థతులు లేవన్నారు. ఎలాంటి ఘటన జరిగినా ముందు స్పందిందేది సినిమా
పరిశ్రమేనని గుర్తుచేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పరిశ్రమ అండగా నిలబడుతుందన్నారు. 100 మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదుగాని ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదన్న చట్టంలోని లొసుగుల వల్ల సత్వర న్యాయం జరగడం
లేదన్నారు. జీవిత ఖైదును జీవితాంత ఖైదుగా మార్చాలన్నారు. ‘చట్టమంటే భయంలేదు… సమాజమంటే సిగ్గులేదు’ అనేలా నేటి పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మా’ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ దోషుల్ని చంపితే
ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. వయసు తారతమ్యాలు కూడా చూడకుండా ఇలాంటి దురాగతాలకు పాల్పడటం చూస్తుంటే మనం ఎటుపోతున్నామో అర్థంకావడం లేదన్నారు.
మాజీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ ‘ఇలాంటి నికృష్టులకు కఠిన దండన కావలసిందే. అలా ఉంటేనే భయం అనేది
కలుగుతుంది. పిల్లల పెంపకంలోనూ మార్చురావాలి. చూడకూడని దృశ్యాలను పిల్లలు చూసేరోజులు వచ్చాయి. ఇది మారాలి.
ఇలాంటి దోషులకు ఉరే సరైనది. ఫాస్ట్ ట్రాక్ తీర్పులు కావాలి’ అన్నారు.
‘మా’ ఉపాధ్యక్షడు రాజశేఖర్ మాట్లాడుతూ
‘దుబాయ్ లో ఆడవాళ్ల వైఫు చూడాలంటే భయం. అక్కడ కఠిన దండనలు ఉంటాయి కాబట్టే అలాంటి వాతావరణం ఉంది.
మగపిల్లలకు పాఠశాలల్లో సైకాలజీ క్లాసులు పెట్టి మార్పు వచ్చేలా చేస్తే మంచిది’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ
మాట్లాడుతూ దోషులను రాత్రికి రాత్రి చంపేస్తే తాను చాలా సంతోషిస్తానన్నారు. అన్నీ నిర్దారణ అయినపుడు ఇంకా ఇన్వెస్టిగేషన్
పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.
మాజీ మంత్రి బాబూమోహన్ మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రభుత్వం నిద్రపోతున్నట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దోషుల్ని వారి తల్లదండ్రులే చంపమంటుంటే ప్రభుత్వానికి జాలి
ఎందుకో అర్థంకావడం లేదన్నారు. ‘కనీసం భరోసా కోసమైనా సీఎం మాట్లాడి ఉంటే బాగుండేదని, ప్రభుత్వం ఉలకడంలేదు
పలకడంలేదు. తలుపులు వేసుకుని పడుకోవడానికా ప్రభుత్వాలు?’ అన్ని ప్రశ్నించారు.దోషుల గుండెల్లో దడపుట్టేలా
ప్రభుత్వం చేయాలన్నారు.

మా’ మాజీ అధ్యక్షడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘ప్రతి పోలీసుస్టేషన్ లోనూ సజ్జనార్ లాంటి
అధికారి ఉండాలన్నారు. ఫిలింనగర్ లో రోడ్ల మీదే తాగుతున్నా అడిగేనాధుడు లేడన్నారు. 120 కోట్లమంది జనాభా ఉన్న
మన దేశంలో కోటి మంది వెధవలు చనిపోయినా నష్టం లేదన్నారు.

నిర్మాతల అధ్యక్షుడు సి. కళ్యాణ్ మాట్లాడుతూ
దోషి అనేవాడు శాశ్వతంగా ఈ లోకంటో ఉండకూడదన్నారు. సెలఫోన్ లు వచ్చాక ఇలాంటి విచ్చలవిడితనం
పెరిగిపోయిందన్నారు. సినిమా ప్రారంభంలో సిగరెట్ట హెచ్చరిక బదులు ‘ప్రతి స్ర్తీ మన తల్లి, మన చెల్లి, మన అక్క అని
భావించాలి’ అనే సందేశం ఉంటే బాగుంటుందని, దీన్ని తన సినిమా నుంచే ప్రారంభిస్తానన్నారు. దోషుల్ని బయట వదిలేస్తే
జనమే తీర్పు చెబుతారన్నారు.

దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ఇది నిర్బయతో ప్రారంభం కాదు దిశతో ముగింపు కాదని,
దీనికి శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు. వయసు బలహీనతల్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియా ఒక జనరేషన్ మెదళ్ల మీద
తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మనకిప్పుడు పెద్దబాలశిక్ష లేదు పెద్దల మాట వినే పరిస్థితి లేదన్నారు. సోషల్ మీడియా
దిశను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ:- ఇలాంటి సంఘటనలు మళ్లీ
మళ్లీ జరగకుండా చట్టంలో మార్పులు తేవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హేమ, జయలక్ష్మి, త్రిపురనేని చిట్టి, బెనర్జీ,
సురేష్ కొండేటి, తనీష్ , ఏడిద శ్రీరామ్ , సమీర్ , ఉత్తేజ్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

“Rashi khanna” interview

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో …
హీరోయిన్ రాశీఖన్నా మీడియాతో మాట్లాడుతూ

ఈ సినిమాలో మీ కేరెక్టర్.?

ఈ సినిమాలో నా పేరు హారిక,ఈ సినిమాలో నేనొక ఫిల్మ్ మేకర్,ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను అయోధ్య షూటింగ్ లో ఉన్నాను,నాగ చైతన్య తో మనం లో ఒక చిన్న రోల్ చేసాను,ఈ సినిమా చేయటం రియల్లీ ఎంజాయింగ్.

వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఫీలింగ్ ఏంటి.?

చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది అని అందరికి తెలిసిందే, ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కేరెక్టర్స్ అన్ని బాబీ గారు చాలా బాగా రాసారు,అందరకీ మంచి స్కోప్ ఉంది.

కాంపిటేషన్ బాగా ఉంది కదా.?

కాంపిటీషన్ అవసరం,కాంపిటేషన్ లేకపోతే మనం కష్టపడలేము,కాంపిటీషన్ ప్రతి చోట వుంటుంది,మీ జర్నలిజం లో కూడా ఉంటుంది ఎవరు బెస్ట్ ఆర్టికల్ రాస్తారు అని.

వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారా.?

మంచి రోల్ వస్తే ఖచ్చితంగా చేస్తాను,చాలా మంది చేస్తున్నారు కదా.

ఇండస్ట్రీ ఏమైనా ఇంప్రూవ్ అయింది అంటారా.?

డెఫినెట్ గా అండి,మంచి రోల్స్ వస్తున్నాయి హీరోయిన్స్ కి కూడా,
ఇప్పుడు సమంతా గారు మ్యారేజ్ అయినా తరువాత కూడా మంచి రోల్స్ చేస్తున్నారు,వెబ్ సిరీస్ కూడా వస్తున్నారు.ఇంతకుముందు పెళ్లి అయిపోతే కెరియర్ ఆగిపోయేది ఇప్పుడు అలా కాదు.

ఈ డేట్స్ ప్రాబ్లమ్ వలన ఏమైనా ఆగిపోయినా సినిమాలు ఉన్నాయా.?

నేను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాను,అన్ని నేను మేనేజ్ చేసుకుంటాను,నాకు నిజంగా ఒక ప్రాజెక్ట్ నచ్చితే డే అండ్ నైట్ వర్క్ చేస్తాను.