Home Blog Page 826

Angry Hero Karthi’s ‘Donga’ Telugu Theatrical Rights by Ravuri V. Srinivas

ఖైదీ’లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్నయాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై దృశ్యం ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ‘దొంగ’. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.  ఈ సందర్భంగా..

హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఖైదీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తీ చేస్తోన్న డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం ‘దొంగ’. యాక్షన్, ఎమోషన్ అన్ని ఉన్నఈ చిత్రం టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. కార్తిగారికి వ‌దిన అయిన జ్యోతిక‌గారు ఈ చిత్రంలో అక్క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. అలాగే స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. గోవింద్ వ‌సంత మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్‌.డి.రాజశేఖర్ విజువ‌ల్స్ ఈ చిత్రానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి.  మా బేనర్లో  తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం కల్పించిన వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంస్థలకి, హీరో కార్తీ గారికి ధన్యవాదాలు. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం“అన్నారు.యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నికిలావిమ‌ల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

‘M6’ Producer Viswanath Tanneeru To Start A New Film

యమ్‌6′ నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు కొత్త సినిమా
సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టి మొదట టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా కొన్ని సీరియల్స్‌ని సొంతంగా నిర్మించారు నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు. నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఇటీవల ‘యమ్‌6’ పేరుతో ఓ హారర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంతో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో తమ విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్‌లో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్‌ 6 విశ్వనాథ్‌ తన్నీరు పుట్టినరోజు. ఈ సందర్భంగా
నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు తమ కొత్త ప్రాజెక్ట్‌ గురించి తెలియజేస్తూ ”సినిమా మీద ప్యాషన్‌తోనే ఈ రంగంలోకి వచ్చాను. కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాను. కొన్ని టీవీ సీరియల్స్‌ నిర్మించాను. ఆ అనుభవంతోనే ‘యమ్‌6’ చిత్రాన్ని నిర్మించాను. ఈరోజుల్లో చిన్న సినిమాలను నిర్మించి వాటిని సక్రమంగా విడుదల చేయడం అనేది కష్టతరమైన పని. మా సినిమా విడుదల విషయంలో కూడా నేను ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయితే నా నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో అలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్‌పై 6 నెలలు వర్క్‌ చేశాం. లవ్‌, కామెడీ, సెంటిమెంట్‌తోపాటు ప్రజెంట్‌ జనరేషన్‌కి మంచి మెసేజ్‌ని కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నాం. ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, విజయీభవ ప్రొడక్షన్స్‌ పతాకాలపై తెరకెక్కించనున్నాం. త్వరలోనే మా కొత్త సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం” అన్నారు.

“Iddari Lokam Okkate” Release Date

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…
దిల్‌రాజు మాట్లాడుతూ – ”2019 సంక్రాంతికి ఎఫ్‌2, సమ్మర్‌లో మహర్షి వంటి బ్లాక్‌బస్టర్స్‌ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం. కానీ ఈ ఏడాది మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ రోజున ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దర్శకుడు జీఆర్‌.కృష్ణ ఓ టర్కీ సినిమా చూసిన ఆ ఐడియాను నాకు చెప్పాడు. అక్కడ నుండి మన నెటివిటీకి తగిన విధంగా కథను డెవలప్‌ చేశాం. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. చిన్నప్పట్నుంచి హీరో, హీరోయిన్‌ మధ్య ఇంటిమెసీ ఎలా ఉంటుంది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది కథ. ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్‌ నన్ను వచ్చి కలిసి ‘సార్‌! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడు. అలా సినిమా మొదలైంది. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. డైరెక్టర్‌ ఈ సినిమా కోసం మిక్కి జె.మేయర్‌, సమీర్‌ రెడ్డి, అబ్బూరి రవి, తమ్మిరాజు వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ను సెలక్ట్‌ చేసుకున్నాడు. కథ తర్వాత డైరెక్టర్‌ తనకు ఎలా కావాలో అలా చేయించుకున్నాడు. టెక్నీషియన్స్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నాను. ‘ఇద్దరి లోకం ఒకటే’ మా బ్యానర్‌లో రూపొందిన 33వ చిత్రం. ఓ సినిమాకు రిలీజ్‌కు ముందే ప్రాఫిట్స్‌ వస్తాయని ప్రూవ్‌ చేసింది. అందరూ ఇన్‌వాల్వ్‌మెంట్‌తో సినిమాను అందంగా తీశారు. ప్రస్తుతం లిప్‌కిస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. మా సినిమాలో కూడా లిప్‌కిస్‌ ఉండటంతో మా సినిమాకు సెన్సార్‌ జరిగినప్పుడు యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. రాజ్‌తరుణ్‌, షాలిని బెస్ట్‌ పెర్ఫామెన్స్‌. డిసెంబర్‌ 25న విడుదల కాబోయే ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం బెస్ట్‌ మూవీ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్‌ హిట్‌తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్‌కమ్‌ అవుతుంది. మంచి లవ్‌ ఎలిమెంట్స్‌, హ్యుమర్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా సినిమా కనెక్టింగ్‌గా ఉంటుంది. సినిమా క్లైమాక్స్‌ కనెక్టింగ్‌గా ఉంటుంది. మిక్కి మ్యూజిక్‌ సూపర్బ్‌గా కుదిరింది. అన్నీ సాంగ్స్‌ స్టోరీ బేస్డ్‌గానే ఉంటాయి. కచ్చితంగా డిసెంబర్‌ 25 వచ్చే ‘ఇద్దరి లోకం ఒకటే’ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు జీఆర్‌ కృష్ణ మాట్లాడుతూ – ”పుట్టిన దగ్గరి నుండి ఒకటయ్యేంత వరకు హీరో, హీరోయిన్‌ మధ్య సాగే ప్రేమకథే ‘ఇద్దరి లోకం ఒకటే’. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. హార్ట్‌ టచింగ్‌ స్టోరీ. మంచి సినిమాను తీశామని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడు మంచి సినిమాను చూశామనే ఫీలింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేసి బయటకు వస్తారు. ఆ మంచి ఫీల్‌ ప్రేక్షకులతో ట్రావెల్‌ అవుతుంది. దిల్‌రాజుగారికి, రాజ్‌తరుణ్‌గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెబుతున్నాను. రాజుగారు మంచి టెక్నీషియన్స్‌ను ఇచ్చారు. అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. రాజ్‌తరుణ్‌ అంటే మాస్‌ లుక్‌, ఓ యాసతో కూడిన డైలాగ్స్‌ ఉంటాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. కానీ ఇందులో డిఫరెంట్‌ రాజ్‌తరుణ్‌ కనపడతారు. తను అద్భుతంగా చేశాడు. అలాగే షాలిని పాండే పాత్ర ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. గోపీగారికి థ్యాంక్స్‌. రాజుగారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాం” అన్నారు.
హీరో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ – ”నాకు గోపీగారు, ఆర్‌.కెగారు ఈ కథను చెప్పగానే నచ్చి చేస్తానని చెప్పాను. మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ. సినిమా బయటకు వచ్చే ప్రేక్షకుడికి సినిమా గుర్తుండిపోతుంది. అందరం ప్రేమించి సినిమాను చేశాం. నాకు కలిసొచ్చిన డేట్‌.. ఉయ్యాల జంపాల విడుదలైన తేది డిసెంబర్‌ 25న ఈ సినిమా విడుదలవుతుంది” అన్నారు.
బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో భాగమైన మిక్కి జె.మేయర్‌గారికి, సమీర్‌రెడ్డిగారికి, తమ్మిరాజుగారికి, అబ్బూరి రవిగారికి థ్యాంక్స్‌. పెద్ద టెక్నీషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడిని సినిమా హాంట్‌ చేసే సినిమాల కోవలో ఈ సినిమా చేరుతుంది. చివరి ముప్పై నిమిషాలు ప్రేక్షకులు సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు.కథ వినగానే రాజ్‌తరుణ్‌ చాలా కొత్తగా ఉందని ఓకే చెప్పాడు. రాజ్‌తరుణ్‌, షాలిని పాండే అద్భుతంగా పెర్ఫామ్‌ చేశాడు. రాజ్‌తరుణ్‌ మెచ్యూర్డ్‌గా, కొత్తగా కనపడతాడు. క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.

“HEZA” Pre Release Event

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం “హేజా”.  (ఎ మ్యూజికల్ హారర్).  వి ఎన్ వి  క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీని అందించారు.. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో…
నటుడు త‌నికెళ్ళ భ‌రణి మాట్లాడుతూ – “ఎట్టి పరిస్థితులలోనూ హిట్ కొట్టాలనే లక్ష్యం, తపన తో ఈ సినిమా తీశారు దర్శకుడు మున్నా కాశి. కొత్త పాయంట్ తో వస్తోన్నచిన్న సినిమా, వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నఈ తరుణంలో వస్తోన్న ‘హేజా’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
స‌హ‌ నిర్మాత వి.ఎన్.వోలేటి మాట్లాడుతూ – “మున్నాకాశితో 2008 నుండి ట్రావెల్ చేస్తున్నాను. నాకు సినిమా రంగం మీద అనుభవం లేకున్నా మున్నా నరేట్ చేసిన విధానం, కథ నచ్చి ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా ఇంత తొందరగా ఓకే అవుతుంది అని మేము అనుకోలేదు. దుబాయ్ లో మంచి ఉద్యోగం ఉన్న వదులుకొని తనని తాను నిరూపించుకోవాలి అని వచ్చి సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మున్నా కాశి. ఇప్పుడు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి కసితో చేసిన సినిమా ఇది. టీమ్అందరూ అంకితభావంతో పనిచేశారు. తప్పకుండా పెద్ద సక్సెస్ సాధిస్తాం” అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ – “హారర్ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండవు కానీ ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ లిజీ గోపాల్ మాట్లాడుతూ – “ఈ మూవీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ  – “హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్  జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో ఒక డెవిల్ కి, మ్యుజిషియన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ గా చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే ఒక బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మా ప్రొడ్యూసర్ వి ఎన్ వోలేటి గారి సపోర్ట్ వల్లనే ఈ సినిమా ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది. లిజీ గోపాల్ హీరోయిన్ గా కన్నా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువ కష్టపడింది. తన క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. నా స్నేహితుడు నాని చమిడిశెట్టి ఈ సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వంశీ కూడా మంచి సపోర్ట్ చేశారు. అలాగే నూతన్ నాయుడు, లక్ష్మణ్ మంచి క్యారెక్టర్స్ చేశారు. ముమైత్ ఖాన్ ను  డెవిల్ గా చూపించడం జరిగింది. ఆమె కూడా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేసింది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా బాగా సపోర్ట్ చేశారు. త‌నికెళ్ళభ‌రణి మొదటి నుండి నన్నుసపోర్ట్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి చిరంజీవి గారు అనేక విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇచ్చే మెస్సేజ్ కి ఈక్వల్ గా ఉండే మెస్సేజ్ ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మా సినిమాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి ధన్యవాదాలు” అన్నారు.
నటీనటులు : మున్నా కాశి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముమైత్ ఖాన్, నూతన నాయుడు, ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100), లిజి గోపాల్, భూష‌న్‌, ప్రీతం నిగమ్ తదితరులు…
సాంకేతిక నిపుణులు :
కథ, మాటలు,స్క్రీన్ ప్లే, సంగీతం,దర్శకత్వం – మున్నా కాశి
ప్రొడ్యూసర్: –  కెవిఎస్ఎన్ మూర్తి
స‌హ‌నిర్మాత:-  వి.య‌న్ వోలెటి
బ్యానర్ : వి.ఎన్.వి క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
ఎడిటర్ : గ్యారీ బి హెచ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్

“Rural” Pre Release Event at Vizag

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 14న వైజాగ్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌లో ఎంటైర్ చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్, టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
`జైసింహా` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ సంగీతాన్ని, రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Hero Sundeep Kishan ventures into a new business

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చిన ఆ చిత్రం, కథానాయకుడిగా సందీప్ కిషన్‌కు మంచి విజయం అందించింది. అలాగే, ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు సందీప్ కిషన్. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రులకు బెంజ్ జిఎల్ఈ 350డి కారును ఆయన బహుమతిగా ఇచ్చారు.

సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ‘వివాహ భోజనంబు’ పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆయన, కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఆయన ఒక సెలూన్ ప్రారంభించనున్నారు.

స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1  ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

“Erra Cheera”First kiss Romantic song launch

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `ఎర్రచీర`. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, శ్రీరామ్, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌ర అనే పాటకు ఇంత‌కుముందు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి `తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు..` పాట‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాట‌కు కె.స‌త్య‌సుమ‌న్ బాబు లిరిక్ అందించ‌గా అంజ‌నా సౌమ్య‌- హేమ‌చంద‌ర్ పాడారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ “కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి… శివ శివ శంభో శంక‌ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోత‌ల్లోకి అంతే వైర‌ల్ గా దూసుకెళుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ లిరిక్ యువ‌త‌రాన్ని హ‌త్తుకునే రొమాంటిక్ ప‌ద‌జాలంతో ఆక‌ట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరింది. హేమ‌చంద‌ర్- సౌమ్య గానం ఆక‌ట్టుకుంటుంది“ అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: ప‌్ర‌మోద్, కెమెరా: చ‌ందు, ఎడిటింగ్: డి.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: న‌ందు, స‌మ‌ర్ప‌ణ‌: బేబి ఢ‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, ద‌ర్శ‌క‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు.

 

Crazy Multi Starars Victory Venkatesh,Nagachaitanya “Venkymama” Released on December 13..

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో …

ఫైట్ మాస్టర్ విజ‌య్ మాట్లాడుతూ – “వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య అభిమానుల‌కు ఇది పెద్ద పండగ‌లాంటి సినిమా. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ బాబీగారికి, నిర్మాత‌లు టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, డి.సురేష్‌బాబు స‌హా ఫ్యాన్స్‌కు కూడా ఇది పెద్ద పండ‌గ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
స‌హ నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండు బ్యాన‌ర్‌లు నిర్మించాయి. ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ కానీ నిజానికి న‌లుగురు ప్రొడ్యూస‌ర్స్ మా సినిమాకు ప‌నిచేశార‌ని చెప్పాలి. ఎందుకంటే హీరోలు వెంక‌టేశ్‌, చైత‌న్య‌లిద్ద‌రూ నిర్మాత‌లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా చ‌క్క‌గా వ‌చ్చింది. వారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్‌. ఎమోష‌నల్ సీన్స్ చేయ‌డంలో వెంక‌టేశ్‌గారు మాస్ట‌ర్ ఆయ‌న‌తో పాటు చైత‌న్య‌గారు కూడా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో చ‌క్క‌గా న‌టించారని.` అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “నాకు వెంకీమామ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారు, వెంక‌టేశ్‌గారు, చైత‌న్య‌గారు, బాబీగారికి థ్యాంక్స్‌. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎమోష‌న్స్‌తో ఉన్న సినిమా ఉన్న సినిమా. డిసెంబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.
నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ – “మానవ సంబంధాల‌పై తెర‌కెక్కించిన చిత్రం `వెంకీమామ‌`. ఏడాదిన్న‌ర క్రితం జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి అనే రైట‌ర్ వ‌చ్చి ఈ క‌థ‌ను నాకు వినిపించారు. విన్నాను.. బావుంది. చూద్దాం అన్నాను. త‌ర్వాత ఆ క‌థ బాబీ చేతికి వ‌చ్చింది. ఆయ‌న దాన్ని అద్భుతంగా డెవ‌ల‌ప్ చేశారు. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రిలేష‌న్ షిప్స్‌, త్యాగాలు ఇలా అన్ని అంశాలుంటాయి. రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌, కాశ్మీర్‌లో ఈ సినిమాను చిత్రీక‌రించాం. కాశ్మీర్‌లోని రిస్కీ లొకేష‌న్స్‌లో ఈ సినిమాను 25 రోజుల పాటు చిత్రీక‌రించాం. భార‌త అధికారులు, ఆర్మీ అధికారులు మాకెంతో స‌హాయ‌ప‌డ్డారు. ఇంకా చాలా మంది కాశ్మీర్‌కు రావాల‌ని, అక్క‌డ షూటింగ్‌లు చేయాల‌ని అంద‌రూ మాకు స‌పోర్ట్ చేశారు. బ్ర‌హ్మాపుత్రుడు చిత్రాన్ని కాశ్మీర్‌లో చిత్రీక‌రించాం. త‌ర్వాత ప్ర‌పంచంలో చాలా ప్ర‌దేశాలు తిరిగాం. కానీ కాశ్మీర్ వంటి అంద‌మైన ప్రాంతం.. మ‌న దేశంలో ఉండటం ఊహించుకుని చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. నేను చిన్న‌గా ఉన్న‌ప్పుడు మా మావ‌య్య సురేంద్ర‌గారిని బాగా ఇష్ట‌ప‌డేవాడిని. అలా ప్ర‌తి ఒక్క‌రికీ వారి మేన‌మామ‌ల‌తో మంచి అనుబంధం ఉంటుంది. అలాంటి మామ‌, అల్లుడు మ‌ధ్య అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. నేను సినిమా చూశాను. చాలా ఎమోష‌న‌ల్‌గా అనిపించింది. ఈ సినిమాకు ప‌నిచేసిన రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థ్యాంక్స్‌. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో ప్ర‌కాశ్‌రాజ్‌గారు న‌టించారు. చాలా ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఈ సినిమాలో మాకు స‌పోర్ట్ చేశారు. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. రావు ర‌మేశ్‌గారు తొలిసారి మా బ్యాన‌ర్‌లో ప‌నిచేశారు. వెంక‌టేశ్‌, చైత‌న్య అందరూ సినిమా చూసి బావుంద‌న్నారు. త‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా చూసి బావుంద‌న్నారు. న‌వ‌ర‌సాలున్న సినిమా. డిసెంబ‌ర్ 13న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. డిసెంబ‌ర్ 7న ఖ‌మ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాం“ అన్నారు.
రాశీఖ‌న్నా మాట్లాడుతూ – “నేను కూడా మీలాగే సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్‌గానే కాదు, వెంక‌టేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైత‌న్య‌తో పాటు వెంక‌టేశ్‌గారితో క‌లిసి న‌టిచండం హ్యాపీగా అనిపించింది. ఆయ‌న కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయ‌న గొప్ప న‌టుడే కాదు.. గొప్ప వ్య‌క్తి. చైతుతో మ‌నం త‌ర్వాత క‌లిసి ప‌నిచేస్తున్నాం. మామ‌, అల్లుడు మ‌ధ్య రిలేష‌న్ తెర‌పైనే కాదు, సెట్స్‌లోనూ చూశాను. బాబీగారు పాజిటివ్, కాన్ఫిడెంట్ ఫిలింమేక‌ర్‌. ఆయ‌న కార‌ణంగానే నేను ఈ సినిమా చేశాను.. ఫ‌స్టాఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా, సెకండాఫ్ ఎమోష‌న‌ల్‌గా సాగే చిత్ర‌మిది“ అన్నారు.
డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) మాట్లాడుతూ – “నేను విధిని న‌మ్మేవాడిని కానీ.. ఈ సినిమాకు 100 శాతం న‌మ్మాను. ఎందుకంటే జైల‌వ‌కుశ సినిమాను క‌ల్యాణ్‌రామ్‌గారు ఎన్టీఆర్‌గారి పేరు మీద పెట్టిన బ్యాన‌ర్‌లో తార‌క్‌తో ప‌ని చేశాను. త‌ర్వాత మామ‌, అల్లుడు మ‌ధ్య రిలేష‌న్‌తో సినిమా చేద్దామ‌ని కోన‌గారు చెప్ప‌గానే.. నిజ జీవితంలో ఓ కుటుంబానికి చెందిన మామ అల్లుడు క‌లిసి చేసే సినిమా త‌ప్ప‌కుండా బావుంటుంద‌న‌నిపించి విన్నాను. త‌ర్వాత సురేష్‌గారిని క‌లిసి నెరేష‌న్ ఇచ్చాను. ఎఫ్‌2, మ‌జిలీ కంటే ముందు స్టార్ట్ కావాల్సిన ప్రాజెక్ట్.. ఉగాది ప‌చ్చ‌డిలో చేదు, పులుపు, కారం ఇలా ఆరు రుచులుండినా చివ‌రి ప్రొడ‌క్ట్ బావుంటుంది. అలాంటి ఉగాది ప‌చ్చ‌డిలాంటి వ్య‌క్తి సురేష్‌బాబుగారు. ఆయ‌న ప్ర‌తి అడిగిన దానికి ఓ లాజిక్ ఉంటుంది. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ వాళ్ల మేన‌మామ గుర్తుకొస్తాడు` అన్నారు.

యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ – “డిసెంబ‌ర్ 13న `వెంకీమామ‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. వారం ప‌దిరోజులుగా యూనిట్ అంద‌రిలో థ్రిల్ల‌ర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్క‌ష‌న్ న‌డిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్‌. నా కెరీర్‌లో మ‌నం, వెంకీమామ చిత్రాలు జ్ఞాప‌కాలు. రేపు ఎన్ని సినిమాలు వ‌చ్చినా, వీటిని రీప్లేస్ చేయ‌లేం. ప్ర‌తి విష‌యంలో ఈ  సినిమ పరంగా బెస్ట్‌గానే జ‌రిగింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ప‌నిచేయ‌డం నా కోరిక‌. లేట్‌గా జ‌రిగినా లేటెస్ట్‌గా ది బెస్ట్‌గా జ‌రిగింది. అది వెంకీమామ ప‌క్క‌న చేయ‌డం. ప్రేమమ్‌లో ఒక సీన్‌లో చేసేట‌ప్పుడే చాలా ఎగ్జ‌యిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్ర‌తి సీన్‌లో ఎగ్జ‌యిట్‌గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. బాబీ ఓ మిల‌ట‌రీ ఎపిసోడ్‌లో న‌న్ను కొత్త చూపించాడు.. ఈ సంద‌ర్భంగా త‌న‌కు థ్యాంక్స్‌. విశ్వ‌ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. రాశీతో క‌లిసి భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాను. త‌మ‌న్, ప్ర‌సాద్ మూరెళ్ల‌గారు, విజ‌య్‌మాస్ట‌ర్‌, రామ్‌ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్‌, ర‌వివ‌ర్మ‌మాస్ట‌ర్ స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌“ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ – ” నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ సినిమాకి వచ్చేటప్పటికీ నా కల నిజమైందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎప్ప్పుడు రానా, చైతన్యలతో వర్క్ చేయాలి అనుకుంటాను. నాన్నగారు కూడా మా అందరితో సినిమా తీయాలని కోరుకునేవారు. ఆయన ఉండుంటే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసేవారు. నాన్నా ఈ సినిమా మీ కోసమే..చైతన్యని మీరు చాలా సినిమాల్లో చూశారు. కానీ ఈ సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఎమోషన్ చక్కగా పండించాడు.  ఈ సినిమా చైతన్యతో చేయడం హ్యాపీగా ఉంది. రేపు ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. బాబీ ఇలాంటి ఒక మామ అల్లుళ్ళ కథతో రావడమే చాలా గొప్ప విషయం. చాలా సెన్సిబుల్ గా తీశారు. ప్రతి సీక్వెన్స్ బాగా వచ్చింది. బాబీ కి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. థమన్ మంచి పాటలు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే చైతన్య కెరీర్ లో బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్నయ్య సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన అనుకున్న విధంగానే చైతన్య క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది ‘అన్నారు

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్, ప్ర‌కాశ్‌రాజ్‌, రావు ర‌మేశ్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

“Prathiroju Pandage” Trailer launched by Mega Star Mother Anjanadevi

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రావు రమేష్ మాట్లాడుతూ…

అల్లు అరవింద్ గారు ఈ కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకె చేసిన కథ కావడంతో నాకు ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. యు.వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలోని రెండు సీన్స్ ను మారుతి గారు ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. థియేటర్స్ లో మాత్రమే చూడదగ్గ సినిమా ఇది. మూవీ చూస్తున్న ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ
ఈ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మారుతి సినిమాలో కొన్ని సీన్స్ లో విపరీతంగా నవ్వించాడు. తేజ్ నాకు బ్రదర్ లాంటివాడు, మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్త్సైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ…
ట్రైలర్ చూసిన అందరూ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ కు గీతా, యూవీ బ్యానర్స్ కు థాంక్స్. ఈ కథ ముందుగా దిల్ రాజుకు చెప్పినప్పుడు ఆయన సబ్జెక్ట్ బాగుందని ఎంకరేజ్ చేశారు. తేజ్ ఈ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నాడు. సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. సత్యరాజ్ గారు కథ విని ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజుకు ఈ సినిమాకు వర్క్ చేస్తాను అన్నారు. రావ్ రమేష్ గారి పాత్ర గుర్తుండి పోతుంది. తండ్రిగా, కొడుగ్గా వెరీయేషన్స్ ఉన్న పాత్రలో నటించారు. అంజనాదేవి గారు మా చిత్ర ట్రైలర్ లాంచ్ చెయ్యడం అదృష్టాంగా భావిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న బన్నీ గారికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

బన్నీవాసు మాట్లాడుతూ…
ఈ కథను విని నమ్మి ఒప్పుకున్నందుకు ధన్వవాదాలు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని ఇప్పుడు చెప్పగలనని అన్నారు.

రాశిఖన్నా మాట్లాడుతూ…
హ్యాపిగా ఉంది. ట్రైలర్ అందరికి నచ్చింది. నాకోసం మంచి పాత్ర రాసిన మారుతి గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్న తేజ్ గారికి స్పెషల్ థాంక్స్. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికి నచ్చే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ
ఈ సినిమాను థియేటర్ లో ఫామిలీ అందరితో పాటు చూస్తే వచ్చే ఆనందం వేరు. మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు, ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు. అంజనాదేవి గారు మా ట్రైలర్ విడుదల చెయ్యడం సంతోషం. తేజ్ సినిమా చేస్తున్నప్పుడు ఇతర పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. చిరంజీవి గారి దగ్గర ఉన్న ఈ లక్షణం తేజ్ లో ఉండడం విశేషం అన్నారు.

సాయి తేజ్ మాట్లాడుతూ…
చిత్రాలహరి సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటినుండి మీకు అన్ని మంచి సినిమాలే ఇస్తాను. మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే కారణం మా టీమ్, సో మా యూనిట్ సభ్యులకు థాంక్స్ తెలుపుతున్నాను. మారుతి గారు మాతో మంచి ఫీల్ గుడ్ సినిమా చేయించరు. గీతా ఆర్ట్స్, యూవీ బ్యానర్స్ లో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి అన్నారు

“Mismatch” Hero Uday Shankar interview

‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌. ప్రస్తుతం ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బేనర్‌ పై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. డా.సలీమ్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొం దించిన ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఉదయ్‌ శంకర్‌ ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి?
– మా అమ్మగారిది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల గ్రామం. నాన్నగారిది గద్వాల దగ్గరున్న మల్దకల్‌. నా స్కూలింగ్‌ అంతా నిజామాబాద్‌లో గడిచింది. ప‌ద‌వ త‌ర‌గతి వ‌ర‌కు అక్క‌డే చ‌దువుకున్నాను. గుంటూరు వికాస్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివాను. తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ చేశాను. నాకు ముందు నుండి న‌ట‌న అంటే చాలా ఆస‌క్తి. అందుక‌నే నేను బీడీఎస్‌లో రెండేళ్లు చ‌దివి మానేశాను. నాన్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. ఫిలాసఫీపై చాలా పుస్తకాలు రాశారు. వాటి ద్వారానే సినీ రాజకీయ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది

ఆటగదరా శివ’ మూవీలో అవకాశం ఎలా వచ్చింది?
– హైస్కూల్లో చదివేటప్పుడే ‘చిరుజల్లు’ సినిమాలో నటించాను. పెద్దయ్యాక మొదట దాసరి నారాయణ రావుగారి ‘యంగ్‌ ఇండియా’ సినిమాలో ఒక చిన్న రోల్‌ చేశాను. అలాగే ‘లింగ, ‘పవర్‌’ సినిమాల్లో చిన్న సీన్లు చేశాను. ఆ రెండింటికీ రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారు నిర్మాత. ఐదేళ్లు ఆయనతో ట్రావెల్‌ చేశాను. నేను బాగా చేస్తున్నాననే నమ్మకం కలిగి, చంద్రసిద్ధార్ద్‌ డైరెక్షన్‌లో ఆయన ‘ఆటగదరా శివ’ తీశారు.

తొలి సినిమాగా `ఆట‌గ‌ద‌రా శివ` వంటి డిఫ‌రెంట్ సినిమా ఎందుకు చేశారు?
– నేను ‘లింగ‌, ప‌వ‌ర్‌’లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించాను. అప్పుడు రాక్‌లైన్‌గారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన `రామా రామా రే`ను తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు నేను సినిమా చూసి హీరో పాత్ర చేస్తాన‌న్నాను. సినిమా కోసం ఏడాది కాలం తీసుకుని జుట్టు పెంచి న‌టించాను. ఈ సినిమా చేసిన త‌ర్వాత తొలి సినిమాకే డిఫ‌రెంట్‌గా చేశాడురా అని అన్నారంద‌రూ. త్రివిక్ర‌మ్‌గారిని రీసెంట్‌గా కలిసిన‌ప్పుడు `ఆట‌గ‌ద‌రా శివ‌` సినిమా చూశాను. చాలా బావుంది. బాగా యాక్ట్ చేశావ‌ని అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.

మిస్‌ మ్యాచ్‌’ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– ఒక లవ్‌ స్టోరీ చేద్దామనీ, అది రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలా కాకుండా కంటెంట్‌ ప్రధానంగా ఉండాలని అనుకు న్నాం. ఆ ప్రాసెస్‌లో చాలా కథలు విన్నాం. ఆ టైం లోనే ఒకసారి సీనియర్‌ రైటర్‌ భూపతిరాజా గారు మా ఆఫీసుకు వచ్చి ఈ ‘మిస్‌ మ్యాచ్‌` లైన్ చెప్పారు. బాగా న‌చ్చింది. త‌ర్వాత క‌థ డెవ‌ల‌ప్ చేశారు. ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. నేను సిద్ధు అనే ఐటీ ఉద్యోగిగా నటిస్తే, కనక మహాలక్ష్మి అలియాస్‌ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య రాజేశ్‌ చేసింది.

డైరెక్టర్‌గా నిర్మల్‌ కుమార్‌ ఎవరి ఛాయిస్‌?
– భూపతిరాజా గారే సజెస్ట్‌ చేశారు. ఆయనకూ కథ నచ్చి ఈ మూవీని డైరెక్ట్‌ చేశారు. నిర్మ‌ల్‌గారు, భూప‌తిరాజాగారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని తీసుకుందాం అని ఆలోచించుకుంటున్న‌ప్పుడు భూప‌తిగారు నిర్మ‌ల్‌గారైతే సూట్ అవుతార‌ని చెప్పారు. నిర్మ‌ల్‌గారిని పిలిచి క‌థ వినింపించారు. ఆయ‌న‌కు న‌చ్చింది. ఆయ‌న‌కు ఇందులో కథతో పాటు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు బాగా నచ్చాయి. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉన్న కథ.

ఐశ్వర్యా రాజేశ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం?
– ఇది యాక్ట‌ర్‌గా నాకు రెండో సినిమానే, ఐశ్వ‌ర్య‌గారు ఇప్ప‌టికే పాతిక సినిమాలు పైగా చేశారు. ఎలాగా అనుకున్నాను. అయితే నా పాత్ర ప‌రంగా నేను న్యాయం చేయాల‌ని క‌ష్ట‌ప‌డ్డాను. ఐశ్వ‌ర్య‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, తమిళంలో స్టార్‌ అయిన ఐశ్వర్యా రాజేశ్‌ మంచి పెర్ఫార్మర్‌. నటన విషయంలో ఆమెతో నేను మిస్‌ మ్యాచ్‌ కాకూడదు. ఫస్ట్‌ టైం నాలో నెర్వస్‌నెస్‌ తను గమనించి, ”టెన్షన్‌ పడకు. ఒక ఫ్రెండ్‌ అనుకొని చెయ్యి” అని చెప్పింది. దాంతో నా ఫోకస్‌ నా క్యారెక్టర్‌ పై పెట్టి చేశాను. నేను బాగా చేశానంటే కారణం… డైరెక్టర్‌తో పాటు ఐశ్వర్య కూడా.

‘ఈ మనసే..’ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు కదా! దాని గురించి చెప్పండి?
-నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ‘తొలిప్రేమ’ నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. ‘ఈ మనసే’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సాంగ్‌ కూడా. `తొలిప్రేమ` సినిమా చూసిన‌ప్పుడు నేను భ‌విష్య‌త్తులో హీరో అయ్యి.. ఓ ల‌వ్‌స్టోరీ చేస్తే అందులో ఈ పాట‌ను రీమేక్స్ చేయాల‌ని అనుకున్నాను. ఎలాగూ ఇది లవ్‌స్టోరీ కాబ‌ట్టి ఆ పాట‌ను ఇందులో తీసుకోవ‌చ్చా? అని భూపతిరాజాగారిని అడిగాను. ఆయ‌న క‌థ ఫ్లో ఎక్క‌డా మిస్ కాకుండా సెకండాఫ్‌లో పాట‌ను యాడ్ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. అయితే ఎలా చేయాలి? ఎక్క‌డ చేయాలి? అని తెగ ఆలోచించాం. విదేశాల్లో కూడా చిత్రీక‌రించాల‌నుకున్నాం. అయితే చివ‌ర‌కు హైద‌రాబాద్‌లో చేద్దామ‌ని విజ‌య్ మాస్ట‌ర్ అన్నారు.కొత్త‌గా చేద్దామ‌న్నారు. అయితే విజ‌య్‌గారు ఈ సాంగ్‌ను సింగిల్ షాట్‌లోనే చేసేద్దామ‌ని అన్నారు. నేను షాకయ్యా. ఐశ్వర్య కూడా బాగా సహకరించింది. ఐదు రోజుల పాటు 60 మంది డ్యాన్స‌ర్స్‌, 120 మంది టెక్నీషియ‌న్స్ 5 రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి రామోజీ ఫిల్మ్‌ సిటీలోని లండన్‌ స్ట్రీట్లో సాంగ్‌ను చిత్రీక‌రించాం. ఈ సాంగ్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు విడుద‌ల చేశారు. ఆయ‌నకు ఇది సింగిల్ షాట్‌లో చేసిన పాట అని చెప్ప‌లేదు. ఆయ‌న సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు. ఇది సింగిల్ టేక్‌లో చేశారుగా అని ఆ త‌ర్వాత అన్నారు. అవును సార్‌! అన్నాను. నీ క‌ష్టం క‌న‌ప‌డుతుంది అన్నారు. ఫ్యాన్స్‌కు కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
– ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే దృష్టి . త‌ర్వాతే ఏ సినిమా చేయాల‌ని ఆలోచిస్తా . అయితే ఇప్ప‌టికే రెండు, మూడు క‌థ‌లు ఫైన‌ల్ చేసుకుని ఉన్నాను అన్నారు హీరో ఉదయ్ శంకర్