Home Blog Page 828

Finance Minister Harish Rao and Victory Venkatesh graced “MisMatch” Pre Release Event

ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్‌`. డిసెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, దేశ‌ప‌తి శ్రీనివాస్‌, శ్రీవిష్ణు స‌హా ఎంటైర్ యూనిట్ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. బిగ్‌సీడీని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల చేశారు. బిగ్ టికెట్‌ను విక్ట‌రీ వెంకటేశ్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా..తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ – “శ్రీరాంగారిపై ఉన్న గౌర‌వంతో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో, కొత్త క‌థ‌ల‌తో, కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ‘మిస్ మ్యాచ్’ కూడా అదే కోవ‌లో క‌న‌ప‌డుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిద‌ని నాకు అర్థ‌మైంది. ఓ ప్రేమికురాలి విజ‌యం కోసం ప్రేమికుడు ప‌డే త‌ప‌న‌ను చూపించే చిత్ర‌మిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్రేమ మ‌నిషిని విజ‌యం ప‌థం వైపు న‌డిపించాలి. అలా పాజిటివ్ డైరెక్ష‌న్‌లో ఉండాలే కానీ.. వికృత రూపం తీసుకోకూడ‌దు. ఉద‌య్‌శంక‌ర్ 15 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డ‌ర్‌. నిజ జీవితంలోలాగానే తెలివైన ఐఐటీ స్టూడెంట్‌గా యాక్ట్ చేశాడు. సినిమాల్లో మంచి సందేశం ఉండాలి. సినిమాల‌తో గౌర‌వం పెర‌గాలి. వ్య‌క్తిత్వం ప్ర‌తిబింబించేలా సినిమాలుండాలి. మ‌హిళ‌ల గౌర‌వం పెరిగేలా సినిమాలుండాలి. అలాంటి ఓ మంచి సినిమా ఇదని అర్థ‌మ‌వుతుంది. `మిస్ మ్యాచ్` స‌మాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైనవారు. వారంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. ఉద‌య్‌శంక‌ర్ గురించి చెప్పాలంటే త‌న తొలి చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌లో అద్భ‌తుంగా న‌టించాడు. ఇప్పుడు ‘మిస్ మ్యాచ్‌’లో మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించాడు. త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కి ద‌గ్గ‌రైన పాత్ర‌. త‌ను 15ఏళ్ల వ‌య‌సులో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించ‌డం గొప్ప విష‌యం. త‌ను హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాలి. ఐశ్వ‌ర్యారాజేష్ మ‌రో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించింది. త‌న‌కు కూడా అభినంద‌న‌లు. నిర్మాత‌లు భ‌ర‌త్‌, శ్రీరామ్‌కు అభినంద‌న‌లు. భూప‌తిరాజాగారు వండ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను అందించారని అర్థ‌మ‌వుతుంది. అమ్మాయిలు ఉన్న‌త‌స్థాయికి ఎదిగే స్క్రిప్ట్స్‌ను నేను బాగా ఇష్ట‌ప‌డ‌తాను. రాజా, సూర్య‌వంశం వంటి అలాంటి సినిమాల్లో నేను కూడా న‌టించాను. ఈ సినిమాకు సంబంధించిన స‌న్నివేశాలు చూశాను. త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ నిర్మ‌ల్ కుమార్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – “ఉద‌య్‌శంక‌ర్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి చెప్పారు. ఐశ్వ‌ర్యా రాజేష్ గురించి చెప్పాలంంటే ఆవిడ అమ్మ‌గారు గురించి చెప్పాలి. ఆవిడ ఎంతో క‌ష్ట‌ప‌డి ఎదిగారు. నాతో పాటు 50-60 సినిమాల‌కు క‌లిసి ప‌నిచేశారు. కౌసల్య కృష్ణ‌మూర్తితో ఐశ్వ‌ర్య తెలుగులో సిక్స‌ర్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాలో తను చేసే బాక్సింగ్‌తో బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వుతుంది. నిర్మ‌ల్ కుమార్ తొలి సినిమా స‌లీమ్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. డిసెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ శాస్త్రి మాట్లాడుతూ – “నేను గురువుగా భావించే శ్రీరామ్‌సార్‌గారికి శిర‌స్సు వంచి ప్రణామాలు. ఆయ‌న త‌న‌యుడి చిత్రోత్స‌వానికి రావ‌డం సంతోషంగా భావిస్తున్నాను. ఈ క‌థ ప్రారంభం నుండి జీవీజీ రాజుగారు న‌న్ను ట్రావెల్ చేయించారు. నేను తొలి ప్రేమ సినిమాలో రాసిన ఈ మ‌న‌సే సే.. పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయించి ఉప‌యోగించాం. నిర్మ‌ల్ కుమార్‌గారు మంచి డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌కు తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఈ పాట‌లు వింటుంటే గిఫ్ట‌న్ మంచి సంగీతాన్ని అందించార‌ని తెలుస్తోంది. విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న ఐశ్వ‌ర్యా రాజేశ్ ఈ సినిమాతోనూ ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను. నిర్మాత‌ల‌కు అభినంద‌నలు“ అన్నారు.

ముఖ్య‌మంత్రి కార్యాల‌య ప్ర‌త్యేకాధికారి(ఓఎస్‌డీ) దేశ‌ప‌తి శ్రీనివాస్ మాట్లాడుతూ – “కేవలం శ‌రీరాల మ‌ధ్య ఉండే ఆక‌ర్ష‌ణ‌నే ప్రేమ‌గా చూపిస్తున్న సినిమాలు వ‌స్తున్న సంద‌ర్భంలో ఓ ప్రేయ‌సి విజ‌యం వెనుక ప్రియుడు ఉండ‌టం అనే కాన్సెప్ట్ మీద వ‌స్తున్న సినిమా ఇది. ప్రేయ‌సి విజ‌యం కోసం… బిడ్డ క‌న్న క‌ల‌ను సాకారం చేయ‌డానికి ప‌రితపించే తండ్రి క‌ల‌ను నిజం చేయ‌డానికి హీరో ప‌డే క‌ష్టం.. ఉదాత్త‌మైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇలాంటి మంచి విష‌యాల‌తో సినిమాలు వ‌స్తే స‌మాజానికి అవి మంచి మ్యాచ్ అవుతాయి. ఓ మంచి సినిమాను తీసిన నిర్మాత‌ను, ద‌ర్శ‌కుడిని, యూనిట్‌ను అభినందిస్తున్నాను“ అన్నారు.

డైరెక్ట‌ర్ డాలీ మాట్లాడుతూ – “నాకు ఏడాదిన్న‌ర క్రితం భూప‌తిగారు నాకు ఈ సినిమా పాయింట్‌ను ఓ డిస్క‌ష‌న్‌లో చెప్పారు. బ్యూటీఫుల్‌గా అనిపించింది. డైరెక్ట‌ర్ నిర్మ‌ల్‌కుమార్‌, ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోందని తెలియ‌గానే ప‌ర్‌ఫెక్ట్ మ్యాచ్ ఇదని అనుకున్నాను. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను“ అన్నారు.

దర్శహకుడు చంద్ర సిద్ధార్ధ మాట్లాడుతూ.. హీరో కావాలనుకునే వారు మంచి కాస్ట్యూమ్స్, రిచ్ లుక్, పోరాటాలు, భారీ ఛేజ్ లు ఇలాంటివి ఉండాలనుకుంటారు. కానీ ఇవేవీ లేని మా ఆట గదరా శివ హీరో ఈ చిత్రంచేయటం నన్ను ఆలోచింప చేసింది. ఉదయ్ శంకర్ చేసే ప్రతి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. చిత్రం పెద్ద విజయం సాధించాలని యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

కధానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ.. హీరో ఉదయ్ శంకర్ కు చిత్రం పెద్ద విజయం సాధించి, పేరు తేవాలని అభిలషించారు.

చిత్ర హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…నన్ను ఆశీర్వదించటానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతఙ్ఞతలు. చిత్రం కధ, కధనాలు వైవిధ్యంగా ఉంటాయి. సగటు సినిమా ప్రేక్షకులను చిత్రం ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది.నాతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలన్నారు.

కథానాయిక ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. నేను వెంకటేష్ గారికి పెద్ద అభిమానిని. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది అన్నారు.

రచయిత భూప‌తి రాజా మాట్లాడుతూ – “ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాం“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిఫ్ట‌న్ మాట్లాడుతూ – “సంగీతం అంద‌రికీ న‌చ్చింద‌నే అనుకుంటున్నాను. జీవీజీగారి అభినంద‌న‌లు, కుటుంబ స‌భ్యుల ప్రోత్సాంతో ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. నిర్మ‌ల్‌గారికి, భూప‌తిగారికి, నాకు స‌హ‌కారం అందించిన వారికి థ్యాంక్స్‌“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు నిర్మ‌ల్ కుమార్ మాట్లాడుతూ – “వేడుక‌కి వ‌చ్చిన హ‌రీశ్‌రావుగారికి, వెంక‌టేశ్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇచ్చిన జీవీజీ రాజుగారికి, మంచి క‌థ ఇచ్చిన భూప‌తిరాజాగారికి థ్యాంక్స్‌. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న క‌థ ఇది. ఉద‌య్‌శంక‌ర్‌గారు చాలా యాక్టివ్ హీరో. ఈ మ‌న‌సే సాంగ్‌ను మూడు రోజులు ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్‌లో చేశారు ఉద‌య్‌శంక‌ర్‌. తెలివైన అబ్బాయి.. విలేజ్ అమ్మాయికి మ‌ధ్య జరిగే క‌థే ఇది. కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రంలో క్రికెట్ ప్లేయ‌ర్‌గా న‌టించిన ఐశ్వ‌ర్యా రాజేష్ ఈ సినిమా కోసం రెజ్లర్ గా న‌టించారు. అందుకోసం ఆమె మూడు నెల‌లు పాటు స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నారు. గిఫ్ట‌న్ సంగీతం చ‌క్క‌గా అందించారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

నిర్మాత‌లు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ మాట్లాడుతూ – “మా టీమ్‌ను అభినందించ‌డానికి వ‌చ్చిన హ‌రీశ్‌రావుగారికి, వెంక‌టేశ్‌గారికి ధ‌న్య‌వాదాలు. ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌ష్ట‌ప‌డి సినిమాను తెర‌కెక్కించారు. మంచి క‌థ‌తో రూపొందించిన చిత్రమిది. డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ రామ్ మోహనరావు,చిత్ర బృందం పాల్గొన్నారు. హాత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డా.దిశ మృతికి నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించింది వేడుకకు హాజరైన వారితో పాటు ‘మిస్ మ్యాచ్’ చిత్ర బృందం.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .

Vv Vinayak launched “Vittal vadi” Trailer

రోహిత్,సుధా రావత్ హీరో హీరోయిన్లు గా ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో జి.నరేష్ రెడ్డి నిర్మించిన చిత్రం విట్టల్ వాడి.

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ గారు గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్బంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ గారు మాట్లాడుతూ ట్రైలర్ చాలా బావుంది.డైరెక్టర్ నాగేందర్ కి మంచి పేరు రావాలి ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా రావాలి అని కోరుకుంటున్నాను.రోహిత్ కి మంచి భవిష్యత్తు ఉంది, అలాగే మూవీ కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అల్ ది బెస్ట్ అని చెప్పారు.

ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి గారు మాట్లాడుతూ విట్టల్ వాడి మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ సర్ కి చాలా చాలా థాంక్స్…ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను.

డైరెక్టర్ నాగేందర్ మాట్లాడుతూ మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన కమర్షియల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ సర్ కి చాలా థాంక్స్..

విట్టల్ వాడి మూవీ లో హీరో గా చేసిన రోహిత్ మాట్లాడుతూ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్ సర్ కి చాలా చాలా థాంక్స్…

ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైటర్ ఆకుల శివ మాట్లాడుతూ రోహిత్ ఈ మూవీ లో అద్భుతంగా నటించాడు.ప్రొడ్యూసర్ నరేష్ రెడ్డి నా ఫ్రెండ్… ఖర్చు కి వెనకాడకుండా ఈ సినిమా ని నిర్మించారు.చిత్ర యూనిట్ అందరికి నా బెస్ట్ విషెస్ అని తెలిపారు.

నటీనటులు:
రోహిత్ రెడ్డి,సుధా రావత్,అమిత్,అప్పాజీ అంబరీష్ దర్బా,చమ్మక్ చంద్ర,జయ శ్రీ,రోల్ రైడా,
సాంకేతిక నిపుణులు:
కెమెరామెన్: సతీష్ అడపా
మ్యూజిక్: రోషన్ కోటి
ఎడిటర్: శ్రీనివాస్ కె.మోపర్తి
ఫైట్స్: శంకర్.యు
పిఆర్ఓ: మధు వి.ఆర్
లైన్ ప్రొడ్యూసర్:ప్రశాంత్ పేరుపల్లి
నిర్మాత: నరేష్ రెడ్డి.జి
డైరెక్టర్: నాగేందర్.టి

Nani, Shiva Nirvana Films Titled ”Tuck Jagadish”

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రానికి `ట‌క్‌…జ‌గ‌దీష్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని హంగుల‌తో ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందించ‌నున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో పంట‌పొలాలు, విండ్ మిల్స్ బ్యాంక్‌గ్రౌండ్‌లో నాని ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌న‌ప‌డుతున్నారు.
`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 2020 ప్ర‌థ‌మార్థంలో సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

న‌టీనటులు:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూవ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌
నిర్మాత‌లు:  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌
ఎడిట‌ర్‌:  ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌:  సాహి సురేష్
ఫైట్స్‌:  వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
కో డైరెక్ట‌ర్‌:  ల‌క్ష్మణ్ ముసులూరి
పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైనర్‌:  శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  నీర‌జ్ కోన‌

1+2 Movie Music Sitting with baskarapatla

టు ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ – ఈ సూత్రం ఏదో బాగానే ఉంది కదూ! సూత్రం ఏదైనా మంగళసూత్రం కడితేనే కదా కథ ఓ
కొలిక్కి వచ్చేది… అప్పటిదాకా చెట్టవెంట, పుట్ల వెంట పరుగులు పెట్టడమే. ఒక్క ఒరలో రెండు కత్తులు ఎలాగూ ఇమడవు…
అలాంటప్పుడు రెండు పాలపిట్టలు ఒకదానితో ఒకటి ప్రేమపోటీ పడితే ఉక్కబోత పెరగక ఏమవుతుంది? ఇలాంటి ట్రయాంగిల్
ప్రేమ పండాలంటే అందులో మాస్ మసాలా కూడా దట్టంగా ఉండాలి. హీరో షకలక శంకర్ తో ప్రేమ పోటీలో పడిన రెండు
పాటపిట్లలు ఎట్టా బయటపడ్డాయోగాని పాటల పందెంలో మాత్రం ఢీ అంటే ఢీ అన్నాయి. భాస్కరభట్ల రవికుమార్ అనే మాస్
మసాలా చేరబట్టే ‘ఒక్క దెబ్బకు రెండు పాలపిట్టలు’ పాట పుట్టింది. సంగీత దర్శకుడు హరిగౌర స్వరకల్పనలో
రూపుదిద్దుకుంటున్న ఈపాట మ్యూజిక్ సిట్టింగ్ లో భాస్కరభట్ల, సంగీత దర్శకుడు హరిగౌరలతోపాటు నిర్మాతల్లో ఒకరైన
సురేష్ కొండేటి, దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి పాలుపంచుకున్నారు.
‘ఒక్క దెబ్బకు రెండు పాలపిట్టలు
ఒక్క ఒరలో రెండు వేట కత్తులు
ఒక్కసారే ఉక్కపోత పెంచాయే…
ఒక్క తాడుకు రెండు బొంగరాలు
ఒక్క వేలికి రెండు ఉంగరాలు
ఒక్కసారే కితకితలెట్టాయే…
నీకేది ఇమ్మన్నా ఇచ్చేసుకుంటాలే
సరస్సులాంటి వయస్సునన్నే చుట్టుముట్టి చంపుతుందే
అందులోనా కొట్టుకు వెళ్లిపోనా.. అందమైనా ఒడ్డును వెతికెయ్యనా’
… ఇలా సాగిపోయింది ఈ మాస్ పాట. ఈ పాట గురించి సురేష్ కొండేటి మాట్లాడుతూ ఈ సినిమా కథలో సన్నివేశానికి
తగ్గట్టుగా పాట ఉండాలంటే భాస్కరభట్ల అయితే న్యాయం చేయగలరని ఆయనతో ఈ పాట రాయించామన్నారు. తాను
అనుకున్నదానికన్నా ఎంతో బాగా పాట వచ్చిందన్నారు. ఇప్పటిదాకా భాస్కరభట్ల రాసిన మాస్ పాటల వరుసలో ఇది ముందు
వరుసలో చేరే పాట అవుతుందని అన్నారు. హీరో శంకర్ కూడా ఈ పాట విని ‘శభాష్’ అని ప్రశంసించినట్లు చెప్పారు.
దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేటి ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ పాటను రాయించినట్లు చెప్పారు. షకలక శంకర్
కెరీర్ ను మలుపుతిప్పేలా ఈ పాట ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్
సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో నిర్మాత ఎడవెల్లి వెంకట రెడ్డి. ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ఈ నెల
రెండోవారంలో ప్రారంభమవుతుంది. మ్యూజికల్ లవ్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది.

‘Maa’ Get to Gether Event

అందాల హైటెక్ సిటీ నడుమ సుందర నందన వనం. అక్కడ చేరిన వారంతా సినిమా నటులే… వారిలో ఓ పక్క సంతాపం…
మరో పక్క సంతోషం… ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరు… వెరసి చక్కటి ఆహ్లాదకర వాతావరణం. ఇదీ ఆదివారం సినీ
నటుల వన భోజన కార్యక్రమం.  హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఎరీనాలోని టీఎస్ఐఐసి పార్క్ లో ఈ వనభోజనాల కార్యక్రమం సందడి సందడిగా సాగింది. ‘మా’ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో
విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగింది. మా వైస్ ప్రెసిడెంట్లు బెనర్జీ, హేమ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలీ, తనీష్ జయలక్ష్మి, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రవిప్రకాష్ , ఉత్తేజ్,, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, యువహీరో కార్తికేయ, , సీనియర్ నటులు గిరిబాబు,  ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర చౌద‌రి, ‘మా  ’ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా, సంపూర్ణేష్ బాబు, రాశి, డిస్కోశాంతి,  శివారెడ్డి,  గాయని మంగ్లీ, హీరోయిన్ ముస్కాన్ తదితరులు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంత సందడిలోనూ చోటుచేసుకున్న విషాదానికి కారణం  దిశా హత్యాచారం ఘటన. ఆమెపై జరిగిన అత్యాచారం, సజీవ దహనం ఘటన తమ మనసుల్ని కలచివేసిందని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఆమె చిత్రపటాన్ని ఏర్పాటుచేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ణకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి గుండెకోత ఏ తల్లిదండ్రులకూ రాకూడదని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు.

వినోదాల హరివిల్లు అందరూ నటులే… వారికిది ఆటవిడుపు సమయం. అలాంటప్పుడు ఇక అక్కడ వినోదానికి లోటు ఏముంటుంది. హీరోరాజశేఖర్ పంచ్ లు, హాస్యనటుడు అలీ మాటవిరుపులు, మిమిక్రీ శివారెడ్డి వినోదపు శైలి, నటుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ ల మరో కోణం ఇందులో కనిపించింది. ఎప్పుడూ ఫైట్స్ లో తలమునకలుగా ఉండే రామ్ లక్ష్మణ్ ఈ వేదికపై మాత్రం పాటలకు డ్యాన్స్ చేస్తూ వినోదాన్ని పంచారు. ‘గోకుల కృష్ణా గోపాల కృష్ణా’ అంటూ ఒకప్పటి హీరోయిన్ రాశి తనలోని గాయనీమణిని వెలుగులోకి తెచ్చారు. మరో విశేషం ఏమంటే రాజశేఖర్ తన కూతురు శివాత్మికతో కలిసి ఓ తమిళ పాటను పాడారు. అలనాటి నటుడు శోభన్ బాబు మనముందు లేకపోయినా అచ్చు శోభన్ బాబును తలపించేలా కనిపించే మరో సభ్యుడు ‘వెల్లువచ్చి గోదారమ్మా’ అంటూ పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ తదితరులు హాజరయ్యారు. నటి హేమ రూ. 25 వేల చెక్కును మా అసోసియేషన్ కు విరాళంగా ఇచ్చారు. ముగ్గురు సభ్యులను దత్తత తీసుకుని వారికి సహాయం చేసేందుకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా తను ఈ సహాయం అందజేయదలుచుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి స్పాన్సరర్ గా వ్యవహరించిన వెంకట గోవిందరావను  ఈ సందర్భంగా సత్కరించారు. గురురాజ్, సుమన్ బాబులు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించారు. అలాగే అమ్మ ఫౌండేషన్ అశోక్ రెడ్డి  పదివేల రూపాయలను ‘మా’ కు సహాయాన్ని అందించారు శివారెడ్డి, కౌశిక్, శిల్పాచక్రవర్తి, అనితా చౌదరి

వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

K STYLE PARTY 2019 at Hotel Hyatt Place

వినూత్న శైలి కే పార్టీ కి నగరం వేదికైంది పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించింది. సిటీకి చెందిన సుచిర్ ఇండియా సంస్థ నిర్వహకులు వై.కిరణ్ ప్రతి సంవత్సరం నిర్వహించే కే స్టైల్ బంజారాహిల్స్ లోని హోటల్ హయత్ ప్లేస్ లో జరిగింది.  పూల్ థీమ్ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది ఈవెంట్ ఆద్యంతం  అతిధులు కు వైవిధ్యమైన అనుభూతి పంచింది. ఈ కార్యక్రమంలో స్వయంగా వై.కిరణ్ షో స్టాపర్ గా మారారు.  ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు జీవా,  శివారెడ్డి, మాధవి లత, అశ్విని, రాజా రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Actor Tarun Raj Arora interview About ”Arjun Suravaram”

స్టైలిష్ విల‌న్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు త‌రుణ్ రాజ్ అరోరా. `ఖైదీ నంబ‌ర్ 150` త‌ర్వాత మ‌ళ్లీ `అర్జున్ సుర‌వ‌రం`లో ప్ర‌తినాయ‌కుడిగా నటించాడు. క‌థానాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన అంజ‌లా జ‌వేరి భ‌ర్తే త‌రుణ్ అరోరా. ఇటీవ‌ల `అర్జున్ సుర‌వ‌రం` విడుద‌లైన సంద‌ర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ…

నా కెరీర్ మొదట మోడలింగ్ తో స్టార్ట్ అయ్యింది. అందుచేత నేను ప్ర‌తి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాను. అది న‌ట‌న‌లోనూ క‌నిపించేలా చూసుకోవ‌డం నా బాధ్యత. ఆ ప్ర‌య‌త్నంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది.

నిఖిల్ అర్జున్ సురవరం లో చాలా మంచి పాత్ర‌లో నటించాను. త‌మిళ చిత్రం `కణిత‌న్‌`కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక‌లో కూడా నేనే న‌టించా. అక్క‌డ క‌థ  ప్ర‌ధానంగా హీరో, విల‌న్‌ల మ‌ధ్యే సాగుగుతుంటుంది. తెలుగులో మాత్రం ఇత‌ర పాత్ర‌ల‌కి కూడా ప్రాధాన్యం ద‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా బాగుంది అంటున్నారు.

యాక్టింగ్ భాష‌కి సంబంధించిన మ్యాటర్ కాదు. భావం ముఖ్యం. ఎక్క‌డైనా భావాలు, భావోద్వేగాలు ఒకే ర‌కంగా ఉంటాయి. అయితే హిందీలో నా సంభాష‌ణ‌ల్ని ఒక గంట ముందు చెబితే స‌రిపోతుంది, ఇక్క‌డైతే ఇంకొంచెం ముందు చెబుతుంటారు. కాక‌పోతే నాకు భాష‌ల‌తోనూ, ప్రాంతాల‌తోనూ నాకున్న అనుబంధం ప్ర‌త్యేకంగా ఉంటుంది. నేను అస్సోంలో పుట్టా. చ‌దువుల కోస‌మ‌ని చెన్నై వ‌చ్చా. బెంగుళూరులో మోడ‌ల్‌గా కొన‌సాగా. అలా అన్ని సౌత్ ఇండియా సిటీస్ తో నాకు అనుబంధం ఉంది. హిందీ చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డంతో ముంబై వెళ్లా. అక్క‌డ్నుంచి ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చాయి, మ‌ళ్లీ ద‌క్షిణాదికి వ‌చ్చా. ఎక్క‌డికి వెళ్లినా నువ్వు అక్క‌డివాడివి క‌దా అంటుంటారు. అయితే ఇప్పుడు చాలామంది న‌న్ను సౌత్ విల‌న్ అని పిలుస్తుంటారు. ఈ గుర్తింపు నాకు చాలు అనుకుంటున్న.

నా భార్య అంజలా జవేరి న‌ట‌న గురించి నాకెప్పుడూ ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వ‌దు. నీకు న‌చ్చింది చేయ్ అంటుంది.  నేను చేసిన సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.

కొన్ని సినిమాల్లో చేసిన పాత్ర‌లు సంతృప్తినివ్వ‌క‌పోవ‌డంతో మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళాను. ఆ సినిమాల‌తో నిర్మాత‌ల‌కి డ‌బ్బులొచ్చాయి కానీ, స‌రైన పాత్ర‌లు అనిపించ‌లేదు. దాంతో మోడ‌లింగ్‌వైపు వెళ్లాలనిపించింది. కానీ అప్పుడు చేసిన ఆ  త‌ప్పులు, అప్పుడు చేసిన ఆ సినిమాలు ఇప్పుడు బాగా ప‌నికొస్తున్నాయి. నేను చేసిన తప్పులు నన్ను చాలా నేర్పించాయి.

అంజలా జవేరి నేను ముంబాయిలో ప్రేమలో పడ్డాం. నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది, ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమ‌ని వ్య‌క్తం చేశా. అప్పుడు త‌ను ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడ‌ల్‌గా ఉన్నా. ఒక ఈవెంట్‌లో క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. త‌ర్వాత ప్రేమ‌, పెళ్లి. మాకు పిల్ల‌లు లేరు, పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే ఒక‌రికొక‌రు పిల్ల‌ల్లాగా ఉంటాం.

అంజలా జవేరి మంచి క‌థ కోసం ఎదురు చూస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌స్తుతం చాలా మంది యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ ద‌శ‌లో త‌న‌కి త‌గ్గ క‌థ, పాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. త్వరలో ఆమె నటించే చిత్ర వివరాలు తెలియజేస్తాము.

Venkatesh-Nagachaithanya ”Venkymama”Release Date Announcement

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు.
అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తాజాగా ఇప్పుడు వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా ద‌గ్గుబాటి, డైరెక్ట‌ర్ బాబీ ఓ ఫ‌న్నీ వీడియో కూడా విడుద‌ల చేశారు.
భారీ ఎత్తున సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సినిమా పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
నిర్మాత‌లు: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌
బ్యానర్స్: సురేష్ ప్రొడక్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
కో ప్రొడ్యూస‌ర్‌: వివేక్ కూచిబొట్ల‌
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
కెమెరా: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

Maheshbabu ”Sarileru Neekevvaru” first song Released

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌ వ్యూస్‌ పరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలోని పాటలను సరికొత్తగా ప్రతి సోమవారం ఒక పాట చొప్పున ఐదు పాటలను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి సోమవారం అయిన డిసెంబర్‌ 2న సినిమాలోని మాస్‌ నంబర్‌ ‘మైండ్‌ బ్లాక్‌’ను విడుదల చేశారు. ‘మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌… మైండ్‌ బ్లాక్‌.. బాబూ.. నీ మాస్‌ లుక్కు మైండ్‌ బ్లాకు’ అంటూ సాగే పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీప్రసాద్‌ హుషారైన బీట్‌తో ట్యూన్‌ చేశారు. బ్లేజ్‌, రెనినా రెడ్డి గానం చేసిన ఈ పాటలో మహేష్‌ వాయిస్‌ ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా చెప్పవచ్చు. ‘బాబూ నువ్‌ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’ అని లేడీ సింగర్‌ అనగా…‘నువ్‌ కొట్టరా..’ అని మహేష్‌ చెప్పడం కొత్తగా ఉంది. పాట మధ్యలో కూడా రెండుసార్లు ఇలా మహేష్‌ వాయిస్‌ వినిపిస్తుంది. ఇలాంటి మాస్‌ నంబర్స్‌ చేయడంలో సిద్ధహస్తుడైన దేవిశ్రీప్రసాద్‌ మరోసారి ఈ పాటతో తన మార్క్‌ని చూపించారు. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌ అన్నట్టుగా ఐదు పాటలున ఈ ఆల్బమ్‌లోని మొదటి పాట ప్రతి ఒక్కరితోనూ డాన్స్‌ చేయించేలా ఉంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం

Anushka,Madhavan ”Nisabdam” Release Date

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31, 2020లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ – “2017లో ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఇద్ద‌రం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్ర‌యాణంలో అనుకోని మంచి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి. మేం న‌మ్మిన ఈ క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. అలాంటి నిర్మాత దొర‌క‌డం వ‌ల్ల‌నే ఈ సినిమా సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. ఏద‌డిగినా కాద‌న‌కుండా.. అదెయ్యంత వ‌ర‌కు మా వెనుక‌ప‌డ‌తారు. మంచి క్వాలిటీ ప్రొడ్యూస‌ర్‌. మ‌న టెక్నీషియ‌న్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా ప‌నిచేయ‌డం వ‌ల్ల కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాం. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్ప‌లేను కానీ.. ఎగ్జాంపుల‌ర్ ప్రాజెక్ట్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. మా టీజ‌ర్‌కు ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. 20 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ అయ్యింది. అనుష్క చాలా సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటుంది. ముందు ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ను అనుకున్నాం. మాకు వీసాలు త‌దిత‌ర కార‌ణాల‌తో సినిమా డిలే అయ్యింది. మేం అనుకున్న హీరోయిన్‌కి ఈ సినిమాను చేయ‌లేన‌ని చెప్పేసింది. ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో అనుష్క ఫ్లైట్‌లో క‌న‌ప‌డింది. మేం ప్రయాణించాల్సిన ఫ్లైట్ డిలే అయ్యింది. ఆ స‌మ‌యంలో నేను అనుష్క‌కి ఈ క‌థ చెప్పాను. త‌ను కూడా చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. ఓ వారం గ్యాప్ త‌ర్వాత త‌న‌ను నేను మ‌ళ్లీ అప్రోచ్ అయ్యాను. అప్పుడు త‌ను నేను సినిమా చేస్తాన‌ని చెప్పింది. ఈ సినిమాలో సుబ్బ‌రాజు వైల్డ్ లైఫ్‌ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఇందులో అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడ‌లేదు. చెవులు విన‌ప‌డ‌వు. త‌న యాంగిల్‌లో క‌థ ర‌న్ అవుతుంది కాబ‌ట్టే ఈ సినిమాకు `నిశ్శ‌బ్దం` అనే టైటిల్‌ను పెట్టాం. `నిన్నుకోరి` త‌ర్వాత గోపీసుంద‌ర్ అంత గొప్ప ఆల్బ‌మ్‌ను ఈ సినిమాకు ఇచ్చాడు. ఈ క్రెడిట్ అంతా హేమంత్‌కే ద‌క్కుతుంది“ అన్నారు.

సుబ్బ‌రాజు మాట్లాడుతూ – “నేను, హేమంత్ ప‌దిహేనేళ్లుగా స్నేహితులం. ఈ క‌థ‌ను నేను కూడా విమానంలోనే విన్నాను. ఇందులో ఓ పాత్ర‌ను నాకు ఇస్తే బావుంటుంది క‌దా! అని అనుకున్నాను. ముందు ఈ పాత్ర‌కు యూనిట్ ఎవ‌రిని అనుకున్నారో ఏమో కానీ.. సినిమా ప్రారంభానికి మూడు, నాలుగు నెల‌ల ముందు నాకు ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. వైర‌టీ క్యారెక్ట‌ర్‌ను ఇచ్చిన హేమంత్‌కి, నిర్మాత‌లు విశ్వ‌ప్రసాద్‌, కోన వెంక‌ట్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

స‌హ‌నిర్మాత మాట్లాడుతూ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ మంచి సినిమా.. సినిమాను అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం“ అన్నారు.

టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “నిన్నుకోరి` సినిమా నుండి కోన వెంక‌ట్‌గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాకు లైన్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌ర్క్ చేశాం. టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టాను. హాలీవుడ్ రేంజ్‌లో ఓ సినిమా చేయాల‌ని అనుకునేవాడిని. నేను ఇదే విష‌యాన్ని కోన‌వెంక‌ట్‌గారితో కలిసి డిస్క‌స్ చేశాను. అలాంటి సినిమా ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో సినిమా చేస్తే తీయాల‌ని అనుకున్నాం. రెండేళ్ల క్రితం హేమంత్ ద‌గ్గ‌ర లైన్ విని.. సినిమాను డెవ‌ల‌ప్ చేసుకుంటూ వ‌చ్చాం. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే ఇండియ‌న్ మూవీ ఇది. జ‌న‌వ‌రి 31న దీన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ – “నేను, కోన‌గారు క‌లిసి ట్రావెల్ చేసే క్ర‌మంలో విశ్వ‌గారితో ప‌రిచ‌య‌మైంది. సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత నేను ఏది అడిగినా.. ఆయ‌న వెంట‌నే స‌మ‌కూర్చారు. అంత కో ఆప‌రేటివ్ ప్రొడ్యూస‌ర్ నాకు దొర‌క‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అనుష్కగారు మూడు నాలుగు నెల‌లు క‌ష్ట‌ప‌డి సైన్ లాంగ్వేజ్‌, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్‌గారు కూడా చ‌క్క‌గా చేశారు. అంజ‌లిగారు ఇందులో ట‌ఫ్ కాప్ రోల్ చేశారు. సుబ్బ‌రాజుగారు కూడా వైర‌టీ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. జ‌న‌వ‌రి 31న ఈ సినిమాను విడుద‌ల చేస్తాం. టెక్నిక‌ల్‌గా ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమా అంద‌రినీ ఇంప్రెస్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.