Home Blog Page 829

“ONLY NENU” Movie Trailer Launch

శరకడం స్టోరీస్ పతాకం పై చెంగ్ , మైరా అమితి,చరిత దీప్,సుదజైన్ నటీనటులుగా విగ్నేష్ కలగర డైరెక్షన్ లో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం `ఓన్లీ నేను`. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు ఫిలింఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా

నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ…….“ఓన్లీ నేను ` టీజర్ బావుంది. ముఖ్యంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్. ఇక శ్రీనివాస్ గారు ఈ నెల 15న ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే వినూతనమైన కార్యక్రమం చేపడుతున్నారు. కొత్త డైరెక్టర్స్, కొత్త నిర్మాతలకు ఇది మంచి వేదిక అవుతుంది“ అన్నారు.

తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరి కృష్ణ మాట్లాడుతూ… …“ఓన్లీ నేను ` ట్రైలర్ బావుంది. డైరెక్టర్ ప్రతిభ ఏంటో ట్రైలర్ తో తెలుస్తుంది. ఇక నిర్మాత శ్రీనివాస్ ఒక వైపు సినిమా చేస్తూనే మరోవైపు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప ప్రయత్నం. ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యూ డైరెక్టర్స్ , న్యూ ప్రొడ్యూసర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఔత్సాహికులు పాల్గొని తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం“ అన్నారు.

డైరెక్టర్ వీరభద్రం
మాట్లాడుతూ……`సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ కి , నిర్మాతకు నా శుభాకాంక్షలు “ అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ……“ఇండియన్ ఫాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఒక తెలుగులో ఒక వినూతన కార్యక్రమం ఈ నెల 15న శిల్పారామం లో చేస్తున్నాం. ఔత్సాహిక దర్శకులందరూ వారి టీజర్స్ , వారి కాన్సెప్ట్స్ ప్రదర్శించడం జరుగుతుంది. అదే కార్య క్రమం లో పాల్గొనబోయే నూతన నిర్మాతల్లో కొందరు ఆయా దర్శకులలో కొందరిని ఎంచుకుని తమ ప్రాజెక్ట్స్ కు సైన్ చేయడం మా ముఖ్య ఉద్దేశం. దీని వలన న్యూ డైరెక్టర్స్ , టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లకు, సినిమా వాళ్ళతో పరిచయాలు లేని వారికి ఉపయోగపడుతుంది. ఆడిషన్స్ ద్వారా నటీనటులు కూడా వారి యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవచ్చు. ఇక మా సినిమా ఓన్లీ నేను ట్రైలర్ లాంచ్ చేసాము. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం “ అన్నారు.

చిత్ర దర్శకుడు విఘ్న్ ష్ మాట్లాడుతూ……“ఓన్లీ నేను సినిమా షూటింగ్ ఫైనల్ లో ఉంది. థ్రిల్లర్ కాన్సెప్ట్. ఒక స్కాం ని బేస్ చేసుకుని సినిమా అంతా ఉంటుంది. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేస్తాం“ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కే వోలేటి, మ్యూజిక్:ఎస్. కె .బాలచంద్రన్ , ఎడిటర్: రాము, సాంగ్స్: ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాత: శ్రీనివాస్ శరకడం , డైరెక్టర్: విఘ్న్ ష్ కలగర (vignesh kalagara)

“THOLIKIRANAM” Releasing on December 20

ఏవియమ్ ఆర్ట్ ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ బేబీ మేరీ విజయ సమర్పించు తొలికిరణం చిత్రం డిసెంబర్ 20.న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎమ్.ఆర్.సి నాయుడు నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు సాగర్, దర్శకుడు వేణు, భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ…
చిత్ర యూనిట్ అందరికి అభినందనలు. సినిమా ఆలస్యం అయినప్పటికీ గొప్పగా ఉంటుంది. మాకు సహకరించిన మీడియా వారికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన భాను చందర్ గారికి థాంక్స్. దర్శకుడు సాగర్ గారు మాకు అన్ని విధాలా సహకరించారు
అన్నారు.

నిర్మాత ఎమ్.ఆర్.సి నాయుడు మాట్లాడుతూ…
మీడియా వారందరికీ ధన్యవాదాలు, మాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాను రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తెరకెక్కించడం జరిగింది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందరికి నచ్చే విధంగా ఉంటుందన్నారు.

ఆర్టిస్ట్ పి.డి.రాజు మాట్లాడుతూ…
దాదాపు మూడు ఏళ్లనుండి మేము ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. దేవుడి దీవెనలతో సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ…
నేను సినిమా చూశాను, బాగా నచ్చింది. క్రిస్టమస్ సందర్బంగా డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. పెద్ద రేంజ్ సినిమా అవుతుంది తొలికిరణం. గొప్ప సినిమా అవ్వాలనే సంకల్పంతో ఈ సినిమాను నిర్మించారు నిర్మాత. విజయ్ చందర్ కారుణామయుడు చిత్రం కంటే ఎక్కువగా తొలికిరణం సక్సెస్ అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

భానుచందర్ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. తొలికిరణం టైటిల్ అద్భుతంగా ఉంది. అన్ని మతాల వారికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంది, చెడు మీద మంచి ఎప్పటికి విజయం సాధిస్తుంది అనే అంశం ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. దర్శకుడు జాన్ నన్ను జీసెస్ పాత్ర చెయ్యమని అడిగితే నేను చెయ్యలేదు. ఆ పాత్ర చెయ్యడానికి పవిత్రత కావాలని ఒప్పుకోలేదు. ఆ తరువాత డైరెక్టర్ జాన్ నన్ను రీసెర్చ్ చేసే పాత్ర గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకోవడం జరిగింది. చిత్ర డబ్బింగ్ చెబుతున్న సమయంలో నాకు థ్రిల్లింగ్ గా అనిపించింది. ప్రేక్షకులకు రేపు డిసెంబర్ 20న థియేటర్ లో అదే ఫీలింగ్ కలుగుతుందని భావిస్తున్నాను, తొలికిరణం చిత్రాన్ని సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

“Bhagyanagara Veedhullo Gammathu”Pre Release Event

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..
ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమాను ముందుగా చిన్న కాన్సెప్ట్‌గానే స్టార్ట్ చేశాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ముందు ఈ సినిమాకు నిర్మాత‌గా మాత్ర‌మే సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ వేరే డైరెక్ట‌ర్‌ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు స‌హా కొంత‌మంది చిన్న చిన్న క‌రెక్ష‌న్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తున్నాం. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతారు. ఆ విష‌యంలో నాది గ్యారెంటీ. నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ“ అన్నారు.
ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ – “ఈ సినిమాకు రెండోసారి సాకేత్ మ్యూజిక్ అందించాడు. త‌న ప‌నితో అంద‌రినీ క‌లుపుకుపోయే ర‌కం. త‌ను మంచి సింగ‌ర్‌, మ్యూజిషియ‌న్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌తిరోజూ క‌ష్ట‌ప‌డాల్సిందే. ఆ క‌ష్ట‌మేంటో నాకు తెలుసు. అలాగే శ్రీనివాస‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ ఇండ‌స్ట్రీలో నేను వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒక‌రు. అందుక‌నే నా సినిమాల్లో త‌నుంటాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌ను మిస్స‌య్యాడు. ఈ సినిమా చేయాల‌నుకోగానే న‌న్ను స‌ల‌హా అడిగాడు. త‌ను మా సినిమా షూటింగ్‌లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా క‌ష్ట‌ప‌డుతుంటాడు. త‌ను డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ కూడా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే కాస్త భ‌య‌ప‌డ్డాను. ఎందుకున్నా.. రిస్క్ ఏమో! అని అన్నాను. త‌ను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్ అలాగే వాళ్ల ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ గ్రూప్ త‌న‌ను బాగా న‌మ్మారు. నేను సినిమాను చూశాను. నాకు స‌న్నివేశాలు బాగా న‌చ్చాయి. ప్రేక్ష‌కులు కూడా శ్రీనివాస్‌రెడ్డిగారి తొలి ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సాకేత్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.
నిర్మాత ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ – శ్రీనివాస‌రెడ్డిగారితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిచ‌యం ఎర్ప‌డిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌యాణం బావుంది. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న కేవ‌లం భాగ్య‌న‌గ‌ర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గ‌మ్మ‌త్తు చేస్తార‌న‌డంలో సందేహం లేదు. గ‌ట్టిగా న‌వ్విస్తున్నారు. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది“ అన్నారు.
స‌త్యం రాజేష్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా మ‌న‌కు క్లోజ్‌గా ఉండేవాళ్ల సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఎంజాయ్ చేస్తూ న‌టిస్తాం. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డిని ఓ ఆటాడుకున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ అద్భుతంగా న‌టించారు“ అన్నారు.
ష‌క‌ల‌క శంక‌ర్ మాట్లాడుతూ – “శ్రీనివాస్‌రెడ్డన్న‌తో నా కెరీర్ ప్రారంభం నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయ‌న నాకు పెద్ద‌న్న‌లాంటి వ్య‌క్తి. 37 రోజుల పాటు ప‌నిచేశాను. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్రం శ్రీను, ప్రవీణ్‌, అశోక్ త‌దిరులు పాల్గొన్నారు.

Sridevi: The Eternal Goddess’ Book Launched By Bollywood Star Deepika Padukone

శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖనటి దీపికా పదుకొనె.
దివంగ‌త అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌ ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుస్తక రూపంలో రానుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ పుస‌క్తానికి ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట‌ రాయ‌డం విశేషం.
‘ఐకాన్ శ్రీదేవిగారి న‌టనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాల‌ను చూస్తూ పెరిగాను. న‌ట‌న‌లో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్‌.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.

శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వ‌ర‌కు ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత స‌త్యార్థ్ నాయ‌క్ సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ బుక్ కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Angry Hero Karthi’s ‘Donga’ Releasing On December 20th

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రానున్నాడు. ఈ చిత్రం లో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

‘దొంగ’ నుండి ఫస్ట్ సింగ్ విడియో నీ ఆదివారం విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవా లో కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. లాంగ్ హెయిర్ తో, కొత్త తరహా స్టైలింగ్ తో కార్తీ సాంగ్ లో ఎనర్జిటిక్ గా ఉన్నారు.”… ఎవ్వరినీ వదలదుగా నా స్ట్రీట్ స్మార్ట్ చిలిపి తనం.. మాయలోన పుట్టి మాయలోన పెరిగినాను” అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్టరైజేషన్ నీ తెలిపేలా సాగుతుంది. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటని రాయగా, రంజిత్ గోవింద్ పాడారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి డిసెంబ‌ర్ 20 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నిఖిల విమల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Arjun Suravaram Directer Tn Santhos interview

బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని థియేటర్ లలో మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ టి.ఎన్. సంతోష్ మీడియా తో మాట్లాడుతూ…..

తెలుగు సినిమా చేశారు కదా తెలుగు నేర్చుకోలేదా.?

తెలుగు బాగా అర్ధమవుతుంది, కానీ మాట్లాడడం రాదు,నాకు చెన్నయ్ కంటే కూడా హైదరాబాద్ చాలా ఇష్టం.ఇక్కడ పీపుల్ సినిమా టీం అంతలా నచ్చింది.నిఖిల్ ప్రొడ్యూసర్ కు మంచి సపోర్ట్ చేశారు.

నిఖిల్ గురుంచి…..

ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నిఖిల్ ఒక చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు ఈ సినిమాని క్యారీ చెయ్యగలడా అనుకున్నాను కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అలాంటి డౌట్స్ ఏమి లేవు చాలా బాగా చేసాడు,ఈ సినిమా కోసం 15 kgs పెరిగాడు.

తెలుగు ఆడియన్స్ గురుంచి?

నాకు తెలుసు సినిమా ఎలా ఉంటే తెలుగు ఆడియన్స్ లవ్ చేస్తారు అని,మిగతా వాటితో పోలిస్తే పైరసీ ఇక్కడే తక్కువగా ఉంటుంది.
సినిమా కూడా అక్కడ 100 కోట్లు సాధిస్తే ఇక్కడ 200 కోట్లు సాధిస్తుంది.

తమిళ్ తరువాత మీరు ఏ లాంగ్వేజ్ లో చెయ్యడానికి ఇష్ట పడతారు?

నాకు వేరే లాంగ్వేజ్ లో కూడా సినిమాలు వచ్చాయి కానీ నేను చేయలేదు కన్నడ లో కూడా వచ్చింది.నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.

క్లైమాక్స్ ఏమైనా చేంజ్ చేశారా?

క్లైమాక్స్ అక్కడ లెంగ్తీ గా ఉంటుంది.ఇక్కడ కొంచెం ఎమోషన్ యాడ్ చేసాం,ఒరిజినల్ సినిమాలో లేనివి కూడా కొన్ని యాడ్ చేసాం.

మురగదాస్ గారితో మీ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది?

ఆయనతో రెండు సినిమాలకు వర్క్ చేసాను 7th సెన్స్ ,తుపాకీ ఈ కథ పాయింట్ ఆయనకి తెలుసు 1st టైం తమిళ్ రిలీజ్ అయ్యాక చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఈ సినిమా చూసి తెలుగులో కూడా రిమేక్ చెయ్ బాగుంటుంది ఆయనే చెప్పారు.

తెలుగు సినిమా చేస్తారా తమిళ్ సినిమా చేస్తారా.?

తెలుగు సినిమా అనుకుంటున్నాను,
బై లింగ్వగల్ అయితే ఇంకా మంచిది.

ఈ సినిమా సీక్వెల్ చేస్తున్నారా?

ఇప్పుడు ఇంకా ఏవిధమైన ప్లాన్ చెయ్యలేదు

సినిమా రిలీజ్ లేట్ అయింది కదా మీకు ఏమనిపించింది.?

కొంచెం బాధ అనిపించింది, అలానే మాకు ప్రాబ్లమ్ కూడా తెలుసు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్న.

నిఖిల్ చెప్పాడు నేను డైరెక్టర్ తో కొన్నిసార్లు గొడవ పడ్డాను అని.?

అది ఫైట్ కాదు,నిఖిల్ క్వశ్చన్స్ చేసేవాడు ఇది రీమేక్ కాబట్టి నేను కూడా ఆన్సర్ ఇచ్చేవాణ్ణి, అలా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉండేది అది చాలా మంచిది, ఆయన అడిగిన ప్రతిసారి నేను పాజిటివ్ గా తీసుకున్నాను.మేము సినిమా కోసం గొడవ పడ్డాము,మేము పర్శనల్ గా మంచి ఫ్రెండ్స్.

నెక్స్ట్ సినిమా విషయం గురించి.?

ఇంకా డిస్కషన్ జరుగుతుంది,కాన్ఫర్మ్ అయ్యాక అతి త్వరలో చెప్తాను.

ఏ జోనర్ లో చేయబోతున్నారు .?

సినిమా రిలీజ్ అయ్యాక కంప్లీట్ సబ్జెక్ట్ చెప్తాను మీకు.

Sai Ram Shankar New Movie “Resound” Opening

రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకం పై దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతం లో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం ‘రి సౌండ్ ‘. శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది . ముఖ్య అతిధులు, స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా . మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ తో యూత్ ని అలరిస్తున్న ఆకాష్ పూరి కూడా పూజ కార్యక్రమాలలో పాల్గున్నారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ “సాయి రామ్ శంకర్ మళ్ళి రీసౌండ్ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “ఆర్య తో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు రంగస్థలం తో రీసౌండ్ చేసాడు, అతడొక్కడే తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో రీసౌండ్ చేసాడు. మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం. హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది . మా సినిమా ప్రారంభానికి వచ్చిన సుకుమార్ గారి కి సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ : నాకు ఈ సినిమా లో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. సాయి రామ్ శంకర్ గారికి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్” అని తెలిపారు.

డైరెక్టర్ కృష్ణ చిరుమామిళ్ల మాట్లాడుతూ : మంచి కమర్షియల్ సినిమా. అందరికి సినిమా నచ్చుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ “రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయి రామ్ శంకర్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు ధన్యవాదాలు . మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచుతుంది” అని తెలిపారు.

సినిమా పేరు : రీసౌండ్
నటి నటులు : సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద కృష్ణ, తదితరులు
కెమెరా మాన్ : సాయి ప్రకాష్
సంగీతం : స్వీకర్ అగస్తి
డైరెక్టర్ : కృష్ణ చిరుమామిళ్ల
నిర్మాతలు : జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి

Aisian Muktha Cinema A2 Opening

సినిమా మల్టీప్లెక్స్ లలో ఎసియన్ బ్రాండ్ నలుదిశలా వ్యాప్తిస్తుంది.  హైదరాబాద్ లో పదో మల్టీ ప్లెక్స్ ను నారపల్లి లో మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ప్రారంభించారు.
రాజకీయ,సినీ ప్రముఖలతో ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం గ్రాండ్ గా జరిగింది. మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా మల్టీప్లెక్స్ లను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎసియన్ గ్రూప్ కే దక్కుతుంది.

వేగంగా విస్తరిస్తున్న జంట నగరాలలో ఎసియన్ మల్టీ ప్లెక్స్ లు సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో  అందరికీ అందుబాటులో ఉండే విధంగా మల్టీ ప్లెక్స్ లను డిజైన్ చేయడంలో ఎసియన్ గ్రూప్ సక్సెస్ అయ్యింది.  అందుకే అనతి కాలంలో పది మల్టీ ప్లెక్స్ లను నిర్మించగలిగింది. ఈ కార్య క్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి , ఎమ్యల్యే భేతి సుభాష్ రెడ్డి లతో పాటు నిర్మాతలు లక్షణ్, గోవర్దన్ లు, ఎసియన్ సినిమాస్ అధినేత్ సునీల్ దాస్ నారాంగ్, డిస్ట్రిబ్యూటర్ సదానంద్ గౌడ్, శ్రీధర్ , కాంప్లెక్స్ యజమాని జనార్ధన్ లతో పాటు పలువురు ప్రముఖలు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ:
‘‘ ఈ  కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. ఆ వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్న ఎసియన్ సంస్థకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.

ఎసియన్ గ్రాప్ ఛైర్మన్ నారాయన్ దాస్ కె నారంగ్  మాట్లాడుతూ:
‘‘ ఎసియన్ జంటనగరాల్లో నిర్మించిన పదో మల్టీ ప్లెక్స్ ఇది. నగరం వేగంగా అభివృద్ది చెందుతుంది.  అందుకే మల్టీ ప్లెక్స్ లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నిర్మిస్తున్నాము. ఎ మల్టీ ప్లెక్స్ లేని విధంగా ఎసియన్  మల్టీ ప్లెక్స్ సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మిడిల్ క్లాస్ వారికి సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. హైదారాబాద్ తో పాటు కర్నాటక, ఆంధ్రాలలో కూడా ఎసియన్ మల్టీ ప్లెక్స్ లను వచ్చే యేడాది నిర్మిస్తాము. నారా పల్లి లో ఎసియన్ మల్టీ ప్లెక్స్  నిర్మించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

Roylakshmi ‘Cinderella’ teaser Release

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ `రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం `సిండ్రెల్లా`. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని మ‌ల్టీ కల‌ర్‌ ఫ్రేమ్స్, ఎస్‌.ఎస్‌.ఐ ప్రొడ‌క్ష‌న్‌  బ్యాన‌ర్స్‌పై తెలుగులో మంచాల ర‌వికిర‌ణ్ `సిండ్రెల్లా` పేరుతోనే ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఎం.ఎన్‌.రాజు ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌.

ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది.

త్వ‌ర‌లోనే ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.

న‌టీన‌టులు:
రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  మ‌ల్టీ క‌ల‌ర్ ఫ్రేమ్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  విను వెంక‌టేశ్‌
నిర్మాత‌:  మంచాల ర‌వికిర‌ణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: ఎం.ఎన్‌.రాజు
సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ
మ్యూజిక్‌: అశ్వామిత్ర‌
సౌండ్ డిజైనింగ్‌: స‌చిన్‌(సింక్ సినిమాస్‌)

ఎడిట‌ర్‌:  లారెన్స్ కిషోర్‌

December 6th “Mera Dosth”

పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై  పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునిఈ నెల  6న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో చిత్ర  నిర్మాత పి.వీరా రెడ్డి  మాట్లాడుతూ …“సినిమా అంతా  కంప్లీట్ అయ్యింది. ఈ నెల  6న దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా పట్ల మా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. స్టోరీ, చిన్నా  గారి మ్యూజిక్ మా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది“ అన్నారు.
  డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ…“నిర్మాత   ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషన్, రిలీజ్  కూడా చాలా  గ్రాండ్ గా చేస్తున్నారు.   ప్రేమ , ఫ్రెండ్ షిప్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.  ఈ నెల6న సినిమా రిలీజ్. మా ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా “అన్నారు.
హీరోయిన్ శైలజ మాట్లాడుతూ…“ఇందులో నేను  పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర  చేశాను. డిసెంబర్ 6 న సినిమా  వస్తుంది. లవ్, ఫ్రెండ్ షిప్, ఫామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ  చూసి బ్లెస్ చేయండి “ అన్నారు.
 కాశీవిశ్వనాధ్ , బెనర్జీ, అమిత్, వీరారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : చిన్న; ఎడిటర్ : నందమూరి హరి; కెమెరా: సుధీర్; నిర్మాత: పి. వీరారెడ్డి; డైరెక్టర్: జి.మురళి.