Home Blog Page 832

“DONGA”’ Audio Releasing Tomorrow

ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు. కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సెకండ్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్ర ఆడియోను రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

“Iddari Lokam Okate” Censor Complete

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది.  డిసెంబ‌ర్లో  సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమా ను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నాము“ అన్నారు.

న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప ల‌త త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  జీఆర్‌.కృష్ణ‌
స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు
నిర్మాత‌:  శిరీష్‌
కెమెరా:  స‌మీర్ రెడ్డి
మ్యూజిక్‌:  మిక్కీ జె.మేయ‌ర్‌
ఎడిటింగ్‌:  తమ్మి రాజు
డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి

Ali, krishna Bhagawan,Raghubabu, Invited every one to Participate in Green Challenge Initiative

దయచేసి
మనిషికి మూడు చెట్లు నాటండి .. గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రఖ్యాత హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్,రఘు బాబు కలసి పిలుపునిచ్చారు!
బంజారాహిల్స్ రోడ్ నె 12 లోగల పార్క్ నందు వీరు ముగ్గురు మూడేసి మొక్కలు నాటారు.

తెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమానికి ఆదర్శంగా కార్యక్రమం హరా హైతో భరా…అనే పిలుపుతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్ మాకెంతో స్పూర్తి నింపింది ,
రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలోభాగంగా కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ ఎమ్సీ పార్క్ లో వీరు
పాల్గొన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి వ్యకి 3మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మాట్లాడుతూ…మొక్కలను నాటాలనే ముఖ్యమంత్రి కెసీఆర్ హరిత హారం సంకల్పానికి తనవంతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వున్నది. ఇఫ్పటికి కోట్ల కు పైగా చేరుకోవడం గర్వకారణం. మనిషి తనను తాను రక్షించుకోవాలంటే ప్రక్రుతిని రక్షించాల్సిందేననే మహోన్నత లక్ష్యంలో భాగంగా, సంతోష్ కుమార్ తన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని
నటులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటరు కావట్టి, మా అభిమానులకు స్పూర్తిగా నిలువాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వనాలను పెంచడం అనే కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికి ఎంతో సంత్రుప్తినిచ్చింది అని తెలిపారు

Live Legends Concert at LB Stedium, Hyderabad on November 30

కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఆ ముగ్గురు దేదీప్య‌మానంగా వెలిగే తార‌లు. ఆ తార‌లు మ‌న‌కోసం దిగివ‌చ్చే వేళ‌యింది. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో న‌వంబ‌ర్ 30న హైద‌రాబాద్ యల్బి స్టేడియంలో ఎలెవ‌న్ పాయింట్ టు మ‌రియు బుక్ మై షో వారి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున సినీ సంగీత విభావ‌రి నిర్వ‌హించ‌నున్నారు. టికెట్లు మ‌రియు ఇతర వివ‌రాల కొర‌కు బుక్ మై షోని సంప్ర‌దించండి. అలేఖ్య హోమ్స్ స‌మ‌ర్పిస్తున్న ఈ కార్య‌క్ర‌మం శ‌నివారం సాయంత్రం 5.30 నిముషాల‌కు మొద‌లు కానుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైదరాబాద్ సోమాజిగూడ పార్క్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

కె.జె.ఏసుదాసు మాట్లాడుతూ… నాకు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. నా సోద‌రుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం, నా కూతురు లాంటి చిత్ర‌తో క‌లిసి పాడ‌డం చాలా సంతోషం. నా తండ్రిగారు చిన్న‌ప్ప‌టి నుండి ఎక్కువ‌గా మాట్లాడ‌కు పాడు అని చెప్పేవారు. ఏ భాష‌లోనైనా పాడ‌టం నేర్చుకో మాట్లాడ‌టం రాక‌పోయినా అని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు వ‌చ్చి ఆనందించ‌గ‌ల‌రి కోరుకుంటున్నాను అన్నారు.

బాల‌సుబ్ర‌మ‌ణ్యం మాట్లాడుతూ… మేం ముగ్గురం క‌లిసి ప్రోగ్రాం చేస్తుంన్నాం. మొట్ట మొద‌టిసారిగా సింగ‌పూర్‌లో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీనికి కార‌ణ‌మైన లెవ‌న్ టుపాయింట్, అలేఖ్య హోమ్స్ వారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఇంత పెద్ద కార్య‌క్ర‌మం చేసేట‌ప్పుడు దాని వెన‌క ఎంత కాల వ్య‌యం, ధ‌న వ్య‌యం ఉంటుందో గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఈ కార్య‌క్ర‌మాన్నిస‌పోర్ట్ చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి మా ముగ్గురు త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఇక్క‌డ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మా ముగ్గురు పాడిన పాట‌ల సంఖ్య ల‌క్ష‌కి పైగా ఉంటాయి. ఒకొక్క‌రు 25, 30 వేలు పాట‌లు పాడాం. మూడుగంట‌ల సేపు జ‌రిగే ఈ కార్యక్ర‌మంలో ఏ పాట‌ల‌ను సెలెక్ట్ చెయ్యాలి ఏమిటి అన్న గ్రౌండ్ వ‌ర్క్ కూడా చాలా ఉంటుంది. మా మీద అభిమానంతో ప్రేమ‌తో అది పాడ‌తారు ఇది పాడ‌తారు అనుకుంటారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు అంద‌రికి న‌చ్చే పాట‌ల‌ను ఎంపిక చేసుకుని దాన్ని మీ ముందు ఉంచుతాము. ఈ కార్య‌క్ర‌మానికి వేరే వేరే రాష్ట్రాల‌నుంచి 20 మంది వాద్య బృందంకూడా వ‌స్తున్నారు. ఇది అంత సుభ‌మైన కార్య‌క్ర‌మం కాదు దీని కోసం ఒక ఆరు నెల‌లు ప్రాక్టీస్ కావాలి. మాలో ఉన్న మంచి ల‌క్ష‌ణం ఏమిటంటే ఇంకా మాకు భ‌యం ఉండ‌టం. భ‌య‌ముంటేనే కార్య‌క్ర‌మం బాగా జ‌రుగుతుంది. అంద‌ర్నీ ఆనంద‌ప‌ర‌చ‌డానికి మేము భ‌యంతో భ‌క్తితో శ్ర‌ద్ధ‌తో కృషిచేస్తున్నాము. మీ అంద‌రి అభిమానం, ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని ర‌క్తి క‌ట్టించాలి అన్నారు.

చిత్ర మాట్లాడుతూ… పెద్ద లెజెండ్స్ తో క‌లిసి పాడ‌టం నా అదృష్టం. నాకు బాగా పాడాల‌ని ఉంది. నాకు ఇంత మంచి అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

అలేఖ్య హోమ్ శ్రీ‌నాధ్ మాట్లాడుతూ… దిగ్గ‌జాల ముందు మాట్లాడ‌టం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థ త‌రుపున ఏ కార్య‌క్ర‌మం అయినా మీ ముందు ఉంటుంది. సంస్థ బ్రాండింగ్ కోసం మాత్రం కాదు. కోట్ల మందిని స్వరం తో అంద‌రినీ అల‌రిస్తున్నారు. మీ స్వ‌రం ఒక వ‌రం. మ‌హానుభావులంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇటువంటి మంచి కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువ‌చ్చిన చ‌ర‌ణ్‌కి కృత‌జ్ఞ‌త‌లు.

Suchirindia Foundation Sankalp Divas Celebrations

వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమనేది 365 రోజులూ ఉండే కార్యక్రమాలే! కానీ ఆ బిజీ షెడ్యూల్ నుంచి ఒక రోజు ను సమాజం కోసం కేటాయిస్తే అది చూపే ప్రభావం ఎనలేనిది. ఇది దృష్టి లో పెట్టుకునే మేం పలు కార్యక్రమాలను చేయడంతో పాటుగా నవంబర్28ను సంకల్ప్ దివస్ గా ప్రతి సంవత్సరం నిరహిస్తున్నాం.

సుచిర్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ వై. కిరణ్ మాట్లాడుతూ ఒకరోజు పాటు జరిగే ఈ సంకల్ప్ దివస్ ద్వారా సామాన్య ప్రజలకు స్పూర్తి కలిగిస్తూనే, కార్పొరేట్ సంస్థలు సమాజంలో అంటర్బగమేయందుకు, ఇతరులు తమ సమయంలో కొంత వెచ్చించి తమను తాము సమాజానికి పునరంకితం చేసుకునేందుకు స్పూర్తిని కలిగిస్తున్నాం.

వార్షిక వేడుకలను రెగ్యులర్ గా చేసుకునే పార్టీల్లా కాకుండా సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆయా రంగాల్లో సుప్రసిద్ధ వ్యక్తుల కృషిని గుర్తిస్తూ వారిని ప్రజల సమక్షంలో సత్కరిస్తుంది. శ్రీ అన్నా హజారే, శ్రీ సుందర్ లాల్ బహుగుణ, శ్రీ సందీప్ పాండే, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ మందాకిని, శ్రీ మహేష్ చంద్ర మెహతా, శ్రీ జాకిన్ ఆర్పుదాం, శ్రీ చండీ ప్రసాద్ భట్, శ్రీ కులందయ్ ఫ్రానిస్, డాక్టర్ కిరణ్ బేడీ, శ్రీమతి  నఫిసా మరియు యాసిడ్ ఎటాక్ సర్వైవర్ లక్మి అగర్వాల్ వంటి సామాజిక వేత్తలను గత 11 సంవత్సరాలుగా సత్కరించింది.

ఈ సంవత్సరం ఇండియన్ నటి మరియు డైరెక్టర్ నందితా దాస్ ని సంకల్ప్ సంజీవిని పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఈ సత్కార కార్యక్రమంలో సింగర్ పి. సుశీలా, డాక్టర్ ఆదిష్ సి.అగర్వాల్ ప్రెసిడెంట్ ఇంటల్ కౌన్సిల్ ఆఫ్ లండన్ చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ న్యూ ఢిల్లీ ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.

చిన్నారుల   సాంస్కృతిక కార్యక్రమాలతో సత్యసాయి నిగమాగమంలో ఈ కార్యక్రమం   ప్రారంభంమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లను మహోన్నత వ్యక్తులకు అందజేయడం తో పాటుగా ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆక్షరణ గా నిలిచాయి.

Hero Sri Vishnu has Launched a song from “Patarupalem Premakatha“

  • జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “పటారుపాళెం ప్రేమ కథ” శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా నోటిస్తున్న ఈ చిత్రం పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని యధార్థ సంఘటనలను ఆధారం చేసుకొని తెరకెక్కించారు. ఈ సినిమాలో “ఏడవున్నావే ఏడవున్నావే” అనే  తొలి పాటను హీరో శ్రీ విష్ణు విడుదల చేసారు. ఈ సంధర్భంగా  శ్రీ విష్ణు మాట్లాడుతూ నన్ను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే ఈ సినిమా దర్శకుడు దొరైరాజు గారు, ఆయన దర్శకత్వం లో వస్తున్న సినిమా పాటను విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, పాట నేను విన్నాను పాట చాలా బాగుంది. మ్యూజిక్ లవర్స్ అందరూ ఈ పాటను విని పెద్ద హిట్టు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టు కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దర్శకుడు దొరైరాజు మాట్లాడుతూ ఈ సాంగ్ శ్రీ విష్ణు విడుదల చేయడం నాకు సంతోషంగా ఉంది, ఎంతో నిజాయతీగా తీసిన సినిమా ఇది. టీజర్ ని పెద్ద హిట్టు చేసిన ప్రేక్షకులు ఈ సాంగ్ ని కూడా అంతే పెద్ద హిట్టు చేస్తారని నమ్ముతున్నాను అని అన్నారు.  సినిమా టీమ్ అందరూ శ్రీ విష్ణుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బాలు ధాకే పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా ఆర్ కె ములింటి.
    జిఎస్ రెడ్డి సమర్పణ, వి లతా రెడ్డి, వి సౌజన్యా దొరై రాజు, బి. ఆర్ బాలు, కె రామకృష్ణ ప్రసాద్ లు ఈ సినిమాను నిర్మించారు.

Bellamkonda Sai Srinivas New Movie Opening

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన విలేఖ‌రుల సమావేశంలో…

ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ:- `ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నాం. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి, చిత్ర నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ధ‌న్య‌వాదాలు. బిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాకు అంగీక‌రించిన దేవిశ్రీ ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ :-ఇలాంటి జోనర్ లో నేను చేస్తున్న మొదటి చిత్రమిది.`ద‌ర్శ‌కుడు సంతోష్ తో వ‌ర్క్ చేయ‌డం నా కుటుంబ స‌భ్యుల‌తో చేసిన‌ట్టుగా ఉంది. మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్. అల్లుడు శీను, జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన వి.వి.వినాయ‌క్, దిల్ రాజు, జెమినీ కిర‌ణ్ గార్ల‌కి థ్యాంక్స్` అని అన్నారు.

నిర్మాత‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ :-`నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్ కి ధన్యవాదాలు. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ స‌హా ఈ ప్రాజెక్ట్ నే ఆయ‌నే సెట్ చేశారు` అన్నారు.

`ఇస్మార్ట్ బ్యూటీ` న‌భా న‌టేష్ మాట్లాడుతూ :-`సాయిశ్రీనివాస్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. న‌ట‌న‌కి ఆస్కార‌మున్న పాత్ర పోషించ‌నుండ‌టం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన‌ సురేష్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ డుడ్లీ మాట్లాడుతూ :-`స్వస్థ‌లం చెన్నై అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశాను. తెలుగులో నా తొలిచిత్రం. ఎంతో ఫ్యాష‌నేట్ ఇండ‌స్ట్రీ అయిన టాలీవుడ్ లో వ‌ర్క్ చేయ‌నుండ‌టం సంతోషంగా ఉంది` అన్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ :-`స్టోరీ చాలా బాగుంది. ట్రైమండ‌స్ హిట్ కొడ‌తామ‌నే న‌మ్మ‌క‌ముంది` అన్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల‌, ఎడిట‌ర్: త‌మ్మిరాజు, మాట‌లు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత: గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం, స్టోరీ, స్కీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్: సంతోష్ శ్రీనివాస్ :

Super star son in law wedding riception

సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ సోదరి శ్రీమతి ఉప్పలపాటి లక్ష్మి తులసి , ప్రముఖ నిర్మాత పద్మావతి పిక్చర్స్ ఉప్పలపాటి సూర్య నారాయణ బాబుల కుమారుడు వినాయక శివ సాయి బాబు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో ని గండిపేట గోల్కొండ రిసార్ట్స్ లో  సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం లో అతి వైభవంగా జరిగింది . సూపర్ స్టార్ కృష్ణ, మేనల్లుడు వినాయక శివ సాయి బాబు,  వధువు కొల్లి పద్మావతి వెంకటేశ్వర్ రావు దంపతుల కుమార్తె సాయి ఆశ్రిత ల ను ఆశీర్వదించారు . ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత, పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆది శేషగిరి రావు , శ్రీమతి ప్రమీళ దంపతుల తో పాటు , ఘట్టమనేని రత్నాకర్ బాబు దంపతులు ,ఘట్టమనేని పద్మావతి -అరవింద్ బాబు దంపతులు ,, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, నిర్మాత గల్లా పద్మావతి -జయదేవ్, మంజుల -సంజయ్  , పోసాని ప్రియదర్శిని-నాగ సుధీర్ బాబు , పోసాని రాణి -నాగేశ్వర్రావు దంపతులు , ఘట్టమనేని నమ్రత-మహేష్ , ప్రముఖ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు , కే.యస్.రామారావు , బి.వి.యస్. ప్రసాద్ , కే. దామోదర్ ప్రసాద్, శాఖమూరి మల్లికార్జున రావు , లక్ష్మి ఫిలిమ్స్ బోస్ ,    యమ్.యల్.సి బుద్ధా వెంకన్న , గద్దె రామ్ మోహన్ రావు,   పరుచూరి మురళి , సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన రాష్ట్ర అధ్యక్షులు దిడ్డి రాంబాబు , ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్ , బాలాజీ శర్మ , సి. కృష్ణ కన్నారావు , నాగేశ్వర్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు .

Athade Srimannarayana Movie going to be a pan India film with all the hype

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమానువిడుద‌ల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగు ట్రైల‌ర్‌ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

హీరో ర‌క్షిత్ శెట్టి మాట్లాడుతూ – “ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింద‌నే అనుకుంటున్నాను. సాధార‌ణంగా నేను ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాల ట్రైల‌ర్స్‌ను నేనే క‌ట్ చేసుకుంటున్నాను. కానీ ఈ సినిమా ట్రైల‌ర్‌ను క‌ట్ చేయ‌డానికి నెల‌రోజుల స‌మ‌యం ప‌ట్టింది. నేను షార్ట్ ఫిలింస్ నుండి సినిమాల్లోకి వ‌చ్చాను. చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇక `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌` సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా కోసం మూడేళ్లు క‌ష్ట‌ప‌డ్డాను. ఈ జ‌ర్నీలో నాతో పాటు చాలా మంది ప్ర‌యాణించారు. నా టీమ్‌కు ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. నేను వ‌చ్చి ఏడేళ్లు అయ్యింది. త‌క్కువ సినిమాలే చేశావ‌ని అంటుంటారు. కానీ మీరు చూస్తే నేను చేసిన సినిమాలు చూస్తే నేను, నాటీమ్ ప‌డ్డ కష్టం ప‌డుతుంది. ఈ సినిమాకు శంక‌ర్ నాగ్‌గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మాల్గుడి డేస్‌` నాకు స్ఫూర్తి. ఆ సినిమాలోని మాల్గుడి ప్ర‌దేశం ద‌క్షిణ భార‌తానికి చెందిన ఉహ‌త్మాక ప్ర‌దేశం.  అది భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమాకోసం 19 సెట్స్ వేశాం. దాదాపు 90 శాతం బెంగ‌ళూరు సెట్స్‌లోనే తీశాం. మిగిలిన భాగాన్ని బీజాపూర్‌, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌ల్లో చిత్రీక‌రించాం. అలాగే సినిమా ప్రారంభించి టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యానికి ప్యాన్ ఇండియా మూవీగా చేయాల‌ని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా హ్యూజ్ రేంజ్‌లో విడుదల చేస్తున్నాం. డ‌బ్బింగ్ విష‌యానికి వ‌స్తే క‌న్న‌డ వెర్ష‌న్ ను పూర్తి చేశాను. హిందీ ట్రైల‌ర్‌కు డ‌బ్బింగ్ చెప్పాను. వాయిస్ సెట్ అవ‌డంతో ఇప్పుడు హిందీకి పూర్తి స్థాయిలో డ‌బ్బింగ్ చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి ప్యాన్ ఇండియా మూవీగా చేశామంటే నిర్మాత‌లు అందించిన ప్రోత్సాహ‌మే కార‌ణం. ఈ సినిమా కోసం మూడేళ్లలో 385 రోజ‌లు పాటు క‌ష్ట‌పడ్డాం. డైరెక్ట‌ర్ స‌చిన్ నిద్రాహారాలు మానుకుని రేయింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. టీమ్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. నా మిత్రుడు, కిరిక్ పార్టీ డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి ఈసినిమాలో చిన్న స‌న్నివేశంలో క‌నిపించింనందుకు థ్యాంక్స్. ఈ సినిమాలో ల‌వ్‌, అడ్వెంచ‌ర్‌, కామెడీ, యాక్ష‌న్ స‌హా అన్ని హంగులుంటాయి“ అన్నారు. అనంత‌రం పాత్రికేయులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా తెలుగులో త‌న అభిమాన న‌టుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపారు. త‌న న‌ట‌న‌, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో త‌న ప‌రిణితి త‌న‌కు న‌చ్చుతుంద‌ని తెలిపారు.
నిర్మాతలు పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ మాట్లాడుతూ – “ముందు ఈ సినిమాను 8 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో ప్రారంభించాం. క‌థ‌, స‌బ్జెక్ట్ మీద నమ్మ‌కంతో మంచి చిత్రంగా, నిర్మాణ వ్య‌యంలో రాజీ ప‌డ‌కుండా నిర్మించాం. అలాగే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాలో యాక్ట్ చేయడం మాకు హ్యాపీ. త‌న‌తో మ‌రిన్ని చేయాల‌నుకుంటున్నాం“ అన్నారు.
డైరెక్ట‌ర్ స‌చిన్ మాట్లాడుతూ – “మూడేళ్ల పాటు ఓ సినిమాకు ప‌నిచేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఇందులో నా ఒక్క‌డి క‌ష్టమే కాదు.. అంద‌రి స‌పోర్ట్ దొరికింది. అంద‌రికీ నచ్చేలా ఉంటుంది. హీరో ర‌క్షిత శెట్టి, నిర్మాత‌లు పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ల‌కు, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ శాన్వి శ్రీవాత్స‌వ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Brand factory Announces“Free Shopping Weekend”

Actress Hebah Patel & Actress Rukshar Dhillon Exclusive Pictures at Brand Factory Announces “Free Shopping Weekend” from 4th December to 8th December, 2019 at Brand Factory Stores Near You.