Suspense Crime Thriller ‘Parigettu Parigettu’ Movie Review 

Release date :- July 30,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “Parigettu Parigettu”
Banner :- N.S.Cine Plix
Cast : – Surya Srinivas, Amurutha Acharya etc.
Music :-  Suneel kasyap
Editor :- Venkat Prabhu
P.R.O: – Madhu V.R
Producer :- A Yamine Krishna
Director : – Ramakrishna Thota

తెలుగు ప్రేక్షకులు క్రైం థ్రిల్లర్ మూవీస్ కి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అందుకే అప్ కమింగ్ డైరెక్టర్లు కానీ… అప్ కమింగ్ నటీనటులు కానీ.. ఇటాంటి జోనర్ సినిమాలను తెరమీద చూపించడానికి ఇష్టపడు తుంటారు. సింపుల్ కథ.. కథనాలతో తెరమీద ఇలాంటి కథలను మంచి గ్రిప్పింగ్ తో చూపించగలిగితే.. బాక్సాఫీస్ బద్దలే. నిర్మాతలకు మంచి పేరుతో పాటు కాసులు కూడా గలగలలాడుతాయి. ఇలాంటి ఫ్రెష్ లైన్ అండ్ స్క్రీన్ ప్లేతో సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పరిగెత్తు పరిగెత్తు చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ:
అజయ్(సూర్య శ్రీనివాస్ ) బాగా చదువుకొని ఏదైనా బిజినెస్ చేసి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండాలనుకునే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అతనికి రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసే ప్రియ(అమృత) పరిచయం అవుతుంది. వీరిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటి కావడంతో ఇద్దరూ ప్రేమలో పడుతారు. ఇంతలో బిజినెస్ కోసం ఓ వ్యక్తి దగ్గర అప్పు చేసి అజయ్ అతని నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. దాంతో అతను అజయ్ ప్రియురాలిని బంధించి.. తన అప్పు రూ.10లక్షలను చెల్లించి తన ప్రియురాలిని విడిపించుకుని తీసుకెళ్లాలని షరతు పెడతాడు. మరి అజయ్ తన అప్పును చెల్లించి.. తన ప్రియురాలిని విడిపించుకున్నాడా? అప్పును తీర్చడానికి అజయ్ ఎంచుకున్న మార్గం ఏమిటి? ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలు… దాని పర్యావసానాలు ఏంటనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
హీరో, హీరోయిన్ లు ఇద్దరూ బాగా నటించారు.  కేవలం కథ.. కథనం తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ఇలాంటి చిత్రాల్లో నటీనటులు పోటీ పడి నటించి మెప్పించారు. విలన్ పాత్రధారులతో పాటు, చివర్లో వచ్చే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తదితరులంతా కూడా పోటీ పడి నటించారు. ప్రేక్షకులను మరీ సీరియస్ కథ.. కథనాలతో కట్టి పడేయకుండా వుండేందుకు మధ్యలో ఓ మంచి ఐటెం సాంగును కూడా ప్లాన్ చేసి ఆడియన్స్ ని రంజింపజేశారు. ఐటెం సాంగు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇలాంటి కథలను బిగ్ స్క్రీన్ పై చూపించేటప్పుడు… స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. దాన్ని ఎంత ఆసక్తికరంగా మలుపులతో చూపించగలిగితే… ప్రేక్షకులు అంత బాగా రెండు గంటల పాటు.. థ్రిల్ కు గురవుతూ ఎంజాయ్ చేస్తారు.ఇందులో దర్శకుడు రామకృష్ణ అదే చేశారు. తను రాసుకున్న ప్లాట్.. దానిి తగ్గట్టు గ్రిప్పింగ్ స్క్ర్ న్ ప్లే రాసుకుని మెప్పించాడు. ఓ వైపు హీరో చెల్లి ఆరోగ్యాన్ని… మరోవైపు విలన్ చేతిలో బంధీ అయిన ప్రియురాలిని రక్షించుకునే క్రమంలో కథానాయకుడు ఎలాంటి రిస్క్ ను చేసి.. సక్సెస్ అయ్యాడనే దాన్ని యూత్ కి కనెక్ట్ అయ్యేలా రెండు గంటల పాటు ప్రేక్షకులకు ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వకుండా చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ముఖ్యంగా వైజాగ్ నుంచి చుట్టు పక్కల నగరాలకు గంజాయి ఎలా సరఫరా అవుతోంది… అందులో నిరుద్యోగ యువత ఎలా చిక్కుకొని.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోంది.అనేదాన్ని దర్శకుడు బాగా స్టడీ చేసి చూపించారు. అందుకు వ్యవస్థలోని ముఖ్యమైన వ్యక్తులు కూడా చాలా మంది ఇన్ వాల్వ్ అవుతున్నారనే లోపాలను కూడా ఎత్తి చూపించాడు. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. సునీల్ కశ్యప్ ఇందులో బాగా స్కోర్ చేశారు. . కమర్షియల్ ఎలిమెంట్స్ కి తక్కువ స్కోప్ వున్న ఇలాంటి ఎంగేజింగ్ క్రైం థ్రిల్లర్ మూవీస్ లో స్టార్ కాస్ట్ తో పనిలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది.నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. నిర్మాత యామినీ కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ఓటిటి లో విడుదల చేసుంటే మంచి మైలేజ్ వచ్చేది. ఇపుడు రాంగ్ టైం లో రిలీజ్ చేశారు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. కానీ ఈ ప్యాండమిక్ స్విచ్వేషన్ లో విడుదలైన సినిమాలను  ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. ఈ న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పరుగెత్తు పరుగెత్తు’ మూవీ ఆద్యంతం ఉత్కంఠను రేపుతూ తెలుగు ఆడియన్స్ ను బోరింగ్ లేకుండా థియేటర్లో కూర్చోబెడుతుంది అనడంలో సందేహం లేదు.  క్రైం థ్రిల్లర్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinema rangam.com… Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here