ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేనిదే చిన్న పిల్లలు కూడా కాసేపు ఉండలేరు. ఇక పెద్దవాళ్ళు చెప్పాల్సిన పని లేదు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సెల్ ఫోన్ పక్కన లేకపోతే ప్రపంచమే మిస్ అవుతామన్నది అందరి ఫీలింగ్. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మీద ప్రళయ కావేరి మధుసూదన రావు ‘ఫొనేరా నా ధునియా’ అనే సాంగ్ ని మనకు యూట్యూబ్ లో అందించారు. ప్రతి ఒక్కరు ఈ సాంగ్ ని చూసే విధంగా ప్రళయ కావేరి మధుసూదన రావు ఈ పాటను అతనే రాయడం.. ఒక ఎత్తయితే అతనే ఇందులో హీరోగా నటించి.. నిర్మించి దర్శకత్వం వహించాడు. అన్నీ తానై ఈ అద్భుతమైన పాటను మనకు అందించాడు. జాన్ మార్క్ ఎ.బి.ఆర్. స్టూడియో మాకు ఎంతో సహకారం అందించారు. అందరూ ఈ పాటను చూసి ఎంకరేజ్ చెయ్యాలని పాట రచయిత, నిర్మాత, దర్శకులు, హీరో ప్రళయ కావేరి మధుసూదన రావు తెలిపారు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో పాటలు మీకు అందిస్తామని తెలిపారు. మాకు సహకరించిన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.
పి.ఆర్.ఓ. : బాబునాయక్, ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్ : పల్లెర్ల ప్రవీణ్, కాస్టింగ్ కో ఆర్డినేటర్ : ధనలక్ష్మి, సింగర్ : జయశ్రీ,ఎడిటర్ : అర్పుల శిరీష, సంగీతం : తేలు రాజేష్, డి.ఓ.పి. : యం.బి.హెచ్., కొరియోగ్రాఫర్ : లవ కుమార్, హీరోయిన్ : కావ్య, పాట రచయిత, నిర్మాత, దర్శకులు, హీరో ప్రళయ కావేరి మధుసూదన రావు,
Youtube Video Link : https://www.youtube.com/watch?v=n9vKMtcfZS0&ab_channel=pralayamadhu









