మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె.

జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు. మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు.

ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here