అరుణ్ రాయదుర్గం, రాణి వరదా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “1990’s”. ఈ చిత్రాన్ని మనసు మల్లిగే బ్యానర్ పై చంద్రశేఖర్.బి.ఎస్. నిర్మిస్తున్నారు. నందకుమార్. సి.ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. 1990’S సినిమా త్వరలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ ను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సినీ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ – 1990’S సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నూతన దర్శకుడైనా మూవీని బాగా రూపొందించాడు. కన్నడ నుంచి తెలుగులోకి వస్తున్న ఈ చిత్రానికి మన తెలుగు ఆడియెన్స్ ఆదరణ తప్పకుండా దక్కాలని కోరుకుంటున్నా. 1990’S చిత్ర యూనిట్ కు నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
సినీ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – 1990’S సినిమా ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ ఈవెంట్ లో మా డైరెక్టర్ వీరశంకర్ గారి బర్త్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ కన్నడ నుంచి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. నేను ఇటీవలే బెంగళూరుకు ఓ ఫిలిం ఫెస్టివల్ కోసం వెళ్లాను. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. దర్శకుడు నందకుమార్ కొత్త వాడైనా బాగా రూపొందించాడు. ఈ మూవీ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
సినీ జర్నలిస్ట్ సంతోషం సురేష్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే ఏ భాష చిత్రాలైనా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. అందుకు నిర్మాతగా నేనే ఎగ్జాంపుల్. నేను చేసిన మంచి డబ్బింగ్ మూవీస్ తెలుగులో ఆదరణ పొందాయి. 1990’S మూవీ స్ట్రాంగ్ కంటెంట్ తో తీసినట్లు ట్రైలర్, సాంగ్స్ తో తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా తెలుగు ఆడియెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ – ఈ రోజు నా బర్త్ డే అని తెలుసుకుని కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం హ్యాపీగా ఉంది. నేనూ పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. కన్నడతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో నేను చేసిన ఓ కన్నడ మూవీకి ఈ సినిమా డీవోపీ ఆలేష్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆయన ఈ మూవీకి ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కన్నడలో ఫేమస్ ఎడిటర్ జనార్థన్ గారి అబ్బాయి అరుణ్ ఈ చిత్రంతో హీరోగా మన ముందుకు వస్తున్నారు. మనసు మల్లిగే అంటే మనసు మల్లెపువ్వు అనే పొయెటిక్ బ్యానర్ పెట్టడం ప్రొడ్యూసర్ టేస్ట్ ను చూపిస్తోంది. సినిమా మాత్రం మాస్ గా చేస్తూ చివరలో పొయెటిక్ టచ్ ఇవ్వడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. 1990’S టీమ్ డైరెక్టర్ నందు, హీరో వరుణ్, హీరోయిన్ రాణి వరదా, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్..అందరికీ నా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ బి.ఎస్. మాట్లాడుతూ – సినిమా అంటే లెక్కలు వేసుకుని చేస్తారు. కానీ మేము 1990’S చిత్రాన్ని లెక్కలు వేసుకుని చేయలేదు. ఒక ప్యాషన్ తో చేశాం. ప్యాషనేట్ టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. నేను తెలుగువాడినే. ఐటీ రంగంలో కర్ణాటకలో సెటిల్ అయ్యాను. 1990’S సినిమా చాలా రూటెడ్ గా ఉంటుంది. మన మూలాలు కలిగిన కథా కథనాలతో సాగుతుంది. తెలంగాణతో పాటు శ్రీరంగపట్నం, మైసూర్ లో షూటింగ్ చేశాం. కంటెంట్ ఉన్న మూవీస్ కు ఆదరణ దక్కుతున్న ట్రెండ్ చూస్తున్నాం. మేమూ 1990’S చిత్రంలో అలాంటి మంచి కంటెంట్ తో వస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ నందకుమార్ సి.ఎం. మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్, సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. సినిమా బాగుంటే తప్పకుండా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే 1990’S చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తేనే కొత్త వాళ్లమైన మేము ఇండస్ట్రీలో నిలబడగలం. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయని ఆశిస్తున్నాం. అలాగే సినిమా కూడా కొత్త తరహాలో సాగుతూ మిమ్మల్ని మెప్పిస్తుంది. అన్నారు.
హీరో అరుణ్ రాయదుర్గం మాట్లాడుతూ – మా మూవీని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. 1990’S సినిమా మిగతా వెర్షన్స్ కంటే తెలుగు బాగా వస్తుందని మా నమ్మకం. తెలుగు కోసం ఆరుగురితో మంచి టీమ్ ను పెట్టి రాయించాం. తెలుగులో మా మూవీ మిగతా అన్ని భాషల కంటే బాగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ రాణి వరదా మాట్లాడుతూ – 1990’S సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ మా టీమ్ ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. 1990’S మూవీ ఒక కొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టాం. త్వరలోనే మా మూవీ మీ ముందుకు రాబోతోంది. మా సినిమాకు సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఇ.సి.మహారాజ్ మాట్లాడుతూ – 1990’S సినిమా తెలుగులో నాకు ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలోని సాంగ్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి. నెక్ట్స్ టైమ్ ఈవెంట్ లో కంప్లీట్ గా తెలుగు నేర్చుకుని మాట్లాడుతా. 1990’S ట్రైలర్, సాంగ్స్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.
నటీనటులు – అరుణ్ రాయదుర్గం, రాణి వరదా, పునీత్ సాయి, స్వప్న, సిధార్థ, రమేష్, దేవరాజ్
టెక్నికల్ టీమ్
బ్యానర్… మనసు మల్లిగే
ప్రొడ్యూసర్ : చంద్ర శేఖర్ B. S
కో. ప్రొడ్యూసర్ : అరుణ్ కుమార్
డైరెక్టర్ : నంద కుమార్ C.M
కెమెరా : ఆలేష్. S
సంగీతం : E C. మహారాజ్
ఎడిటింగ్ : కృష్ణ
డాన్స్ : సాధిక్ సర్దార్
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్









