’30 Rojullo Preminchadam Ela?’ Movie Review

Release date :-January 29,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “30Rojullo Preminchadam Ela?”
Banner:-S.V Productions
Presents:-SV Babu
Starring:- Anchor Pradeep Machiraju, Amrita Iyer Shubhalekha Sudhakar, Viva Harsha, Bhadram,Posani Krishna Murali,Hema,Hyper adi Etc…
Editor:- Praveen KL
Music:-Anup Rubens
Cinematography:-Dasharathi sivendra
Producer:- S.V.Babu
Director:- Munna

యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన ప్రదీప్ మాచిరాజు కొన్ని సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. ఇప్పుడు వెండితెరపై పరిచయమవుతున్నాడు ప్రదీప్ తాను హీరోగా నటించి పరిచయమవుతున్న తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సి ఉండగా కరుణ మహమ్మారి కారణంగా ఈ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి సమీక్షిద్దాం.

కథ:

అర్జున్ అక్షర ఒకే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు. పక్క పక్క ఇళ్లల్లోనే ఉండే వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పరస్పరం చూడగానే చిరాకు పడిపోతుంటారు. అలాంటి వీళ్లిద్దరూ కొన్ని అనూహ్య పరిస్థితుల మధ్య ఒకరి శరీరంలోకి ఒకరు ప్రవేశించాల్సిన పరిస్థితి వస్తుంది. గత జన్మలో ప్రేమికులై ఉండి అర్ధంతరంగా ప్రాణాలు వదిలిన ఈ జంట, మళ్లీ ఈ జన్మలో కలవడం కోసమే ఇలా జరిగిందని ఓ స్వామీజీ చెబుతాడు. ఐతే ఒకరినొకరు అసహ్యించుకునే అర్జున్.. అక్షర ఎలా ప్రేమలో పడి తిరిగి తమ తమ శరీరాల్లోకి వెళ్లారన్నది మిగతా కథ.

నటీనటులు :

బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు ప్రదీప్‌. తనదైన కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమర్‌తో ఎన్నో షోలను విజయవంతం చేశాడు. షోలో ప్రదీప్‌ ఉంటే చాలు కామెడీకి కొదవ ఉండదు. తొలి సినిమాలో కూడా అదే కామెడీతో నవ్వించాడు ప్రదీప్‌. అర్జున్‌ అను అల్లరి స్టూడెంట్‌ పాత్రలో జీవించేశాడు.మొదటి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు. యాంకర్‌గా తనకున్న ఎక్స్‌పీరియన్స్‌ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్‌ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు.

ప్రదీప్‌ తర్వాత బాగా పండిన పాత్ర అమృతది. అక్షర అనే యువతి పాత్రలో అమృత జీవించేసింది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్‌ ఆది, మహేశ్‌, శుభలేఖ సుధాకర్‌ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక విభాగం :

హాలీవుడ్ సినిమాలు మన దగ్గర ఫ్రీమేక్ అవడం మామూలే. అలాంటి కోవలో చెందినదే ఈ చిత్రం కూడా. ఇట్స్ ఎ బాయ్ గర్ల్ థింగ్ అనే హాలీవుడ్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో ప్రాణం, ఆనందం వంటి పలు సినిమాల కథలు నుంచి స్ఫూర్తి చెంది  కథ  తయారు చేసుకున్నాడు. దర్శకుడు మున్నా. అయితే దీంట్లో లో ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశించడం అనేది మొన్న వచ్చిన శ్రీనివాస్ రెడ్డి జంబలకడిపంబ సినిమాలో కూడా చూశాం.మొదటి సినిమాతోనే ప్రదీప్‌తో ప్రయోగం చేయించాడు దర్శకుడు మున్నా. పునర్జన్మల కథ ఎంచుకుని మంచి ప్రయత్నమే చేశాడు.

నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకున్నాడు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి .అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించవు. ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్‌ అయ్యే విధంగా ఉంటాయి. సీరియస్‌ కథ అయినా.. కామెడీతో నడిపించే ప్రయత్నం చేశాడు.క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ మెయింటెయిన్ చేశాడు దర్శకుడు. అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఉంది ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

Cinemarangam 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here