“Mr & MIss” Movie Review

Cinema rangam.. Rating 3/5
Movie Name :– “Mr & MIss”
Starring:-
Gnaneshwari Kandregula, Shailesh Sunny Etc…
Editor:-
Karthik kits
Music:-
Yashwant Nag,
Cinematography:-
Siddham
Manohar
Director..
Ashok reddy
Producer:
Croud Funded

షార్ట్ ఫిలిం తోనే సైమా అవార్డ్స్ సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు విడుదలైంది అశోక్ రెడ్డి ఇ దర్శకత్వంలో క్రౌడ్ ఫండింగ్ చిత్రం మిస్టర్ అండ్ మిస్. ఈ చిత్రంలో లో యాంకర్ శైలేష్ మరియు ప్రదీప్ పెళ్లిచూపులు విజేత జ్ఞానేశ్వరి హీరో హీరోయిన్లుగా నటించనున్నారు ఇక ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.

కథ:

ముంబైలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకునే శశి సి హైదరాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని తన బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీగా లైఫ్ కలుద్దామని వస్తుంది అక్కడ అనుకోని కారణాలవల్ల తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి అమలాపురం నుంచి ఇంగ్లీష్ రాకపోయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో హైదరాబాద్ లో అడుగు పెట్టిన శివ తో అనుకోకుండా ప్రేమ లో పడుతుంది.. ఒకానొక సందర్భంలో లో శివ ఇంకా శశి రొమాన్స్ చేస్తుండగా తీసుకున్న వీడియో సెల్ ఫోన్ మిస్ అవుతుంది ఇక ఆ సెల్ ఫోను చివరికి దొరికిందా లేదా వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముందుకు సాగుతోంది అనేది చిత్ర కథాంశం.

నటీనటులు :

ఇక క పరిచయం అయిన నటులు శైలేష్ మరియు జ్ఞానేశ్వరి స్క్రీన్ పైన వారి పెయిర్ చాలా బాగుంది. ఇన్నోసెంట్ కుర్రాడిలా శైలేష్ ప్రేక్షకులను ఆకట్టుకోగా హెచ్ ఆర్ పాత్రల్లో శశి తనదైన నటన చేసింది వీళ్లిద్దరి రొమాంటిక్ సీన్లు ఫస్టాఫ్లో పరిమితికి మించి ఉన్నాయి.మొదటి సినిమా అని తెలియకుండా ఇచ్చిన పాత్రల్లో ఇద్దరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో జ్ఞానేశ్వరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం వలన సూపర్బ్ పెర్ఫార్మన్స్ తో ఎక్కువ మార్క్స్ కొట్టేస్తే, సెకండాఫ్ లో శైలేష్ మార్క్స్ కొట్టేస్తాడు. ఇద్దరికీ ప్రేమ, కోపం, బాధ లాంటి ఎమోషన్స్ చూపించే సీన్స్ ఉండడం, అందులో ఇద్దరూ బాగా చేయడం సినిమాకి కొంత ప్లస్ అని చెప్పాలి. అలాగే జ్ఞానేశ్వరి అందాలు, రొమాంటిక్ సీన్స్ వలన యువతకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో ఫ్రెండ్ బుల్లెబ్బాయ్ పాత్రలో చేసిన నటుడు ఫస్ట్ హాఫ్ లో వన్ లైనర్స్ తో కొంత నవ్విస్తాడు

సాంకేతిక విభాగం

ఈ సినిమాకి  డైరెక్టర్ యశ్వంత్ నాగ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు . సినిమాలో తన పాటలు సందర్భానుసారంగా  ఉన్నాయి. ఆ తర్వాత సిద్ధం మనోహర్ విజువల్స్ బాగున్నాయి. యూత్ ఫుల్ ఫీల్ ని బాగా క్యారీ చేసాడు. ఇక చివరిగా యలమంచిలి కరిష్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సుధీర్ వర్మ డైలాగ్స్ చూస్తే నార్మల్ సీన్స్ లో ఓకే అనిపిస్తాయి.

డైరెక్షన్ అశోక్ రెడ్డి విషయానికి వస్తే.. ఎన్నో సార్లు చూసేసిన, తీసిన ప్రేమ కథనే ఈయన తీసుకున్నారు. ఆయన షార్ట్ ఫిలింగా తీసి అవార్డు అందుకున్న పాయింట్ ని సినిమాగా తీశారు. షార్ట్ ఫిలిం కంటెంట్ కి పర్ఫెక్ట్ కాబట్టి అక్కడ హిట్ అయ్యింది ఇక్కడ మిస్ ఫైర్ అయ్యింది.. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే.. నటీనటుల చేత పెర్ఫార్మన్స్ లు చేయించడం వరకూ ఒక 70% క్రెడిట్ ఇవ్వచ్చు, కానీ సినిమాగా చూసుకుంటే, లెంగ్త్ విషయం కావచ్చు, లేదా ఇతరులు ఇచ్చిన సలహాల మేరకు అవ్వచ్చు సినిమాని 125 నిమిషాలకి కట్ చేశారు ఓకే, కానీ ఎంత కట్ చేసినా సినిమాలో తాను అనుకున్న ఎమోషన్, చెప్పాలనుకున్న మెసేజ్ మిస్ కాకుండా ఉండాలి. కానీ అదే మిస్ అవ్వడం వలన ఫస్ట్ హాఫ్ పవరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పి ఏటేటో వెళ్ళిపోయి ఆడియన్స్ కి చిరాకు తెప్పించేస్తుంది.

కథలో ఇంకొంచెం మార్పులు చేసి  నరేషన్ లో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఇంకాస్త బావుండేది. రొమాంటిక్ సీన్లతో సినిమా మొత్తం నడపాలి అనుకోవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదరదు.సినిమాలోని రొమాంటిక్ సీన్లు యూత్ ని అట్రాక్ట్ చేయడానికి తీసినట్లుగా ఉన్నాయి .క్రౌడ్ ఫండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here