Collection King Dr. Mohan Babu’s ‘Son of India’ Pre Release Event

11వ శ‌తాబ్దంలో శ్రీ‌రామ‌చంద్రుని ఘ‌న‌త‌ను చాటి చెబుతూ వేదాంత దేశిక అనే మ‌హ‌నీయుడు రాసిన ‘ర‌ఘువీర గ‌ద్య‌ము’ ను మ్యాస్ట్రో ఇళ‌యారాజా గారు త‌న విల‌క్ష‌ణ గాత్రంతో “జ‌య‌జ‌య మ‌హావీర మ‌హాధీర ధోళీయ..” అంటూ అల‌వోక‌గా త‌న గంభీర స్వ‌రంతో ఆల‌పించారు. సుదీర్ఘ‌మైన కెరీర్‌లో త‌నకే సాధ్య‌మ‌నిపించే అపూర్వ‌ మైన సంగీత బాణీల‌తో లెక్క‌లేన‌న్ని అద్భుత‌మైన పాట‌ల‌కు జీవం పోసిన ఇళ‌య‌రాజా ఇప్పుడు మోహ‌న్‌బాబు నటించిన ‘స‌న్ ఆఫ్ ఇండియా’ కోసం ఈ గద్యాన్ని పాట రూపంగా మ‌లచి అందిస్తున్నారు. ఈ పాట ఈ చిత్రానికే కాకుండా తెలుగు సినిమాకే గ‌ర్వ‌ కార‌ణంగా నిలిచే పాట అవుతుందన‌డంలో సందేహం లేదు.దేశంలోని గొప్ప విల‌క్ష‌ణ న‌టుల్లో ఒక‌రిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందిన డాక్ట‌ర్ మోహ‌న్‌ బాబు టైటిల్ పాత్రలో ప‌వ‌ర్‌ఫుల్ రోల్ లో దేశంలో వుండే ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్దిక పరిస్థితుల గురించి ఎలుగెత్తి చాటి చెప్పాలని నటించిన సంచల నాత్మక చిత్రమే “సన్‌ ఆఫ్‌ ఇండియా”.ఈ చిత్రానికి ఆయ‌న స్క్రీన్‌ప్లే సైతం స‌మ‌కూరుస్తున్నారు.టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందు తున్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ తో కలసి విష్ణు మంచు నిర్మిస్తున్నారు.ఈ ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో డాక్టర్‌ మోహన్‌బాబు మార్కు డైలాగులు,యాక్షన్‌ ఎపిసోడ్స్‌,ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకు లను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి  బి.గోపాల్, యస్.గోపాల్,కోదండ రామిరెడ్డి, పోసాని కృష్ణ మురళి, కమెడియన్స్ అలీ, సునీల్, సీనియర్ నటుడు నరేష్, ఎడిటర్ గౌతమ్ రాజు,చిట్టిబాబు తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా

పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు మాట్లాడుతూ..సినిమా నా ఊపిరి అన్నారు మా గురువుగారు. ఇక్కడకు నేను ఏమి లేకుండా వచ్చి నటుడుగా కష్టపడుతూ.. నిర్మాతగా మారి మేము సంపాందించన దాని ఎడ్యుకేషన్ లో పెట్టడం జరిగింది. అలాగే కుల మతాలకు ఆతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. 30 సంవత్సరాలు కష్టపడితే అది ఈ రోజు ఒక  యూనివర్సిటీ అయ్యింది. సినిమా అంటే ప్రతిదీ రిస్కె..1982 లో గురువుగారు దాసరి చేతుల మీదుగా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ను స్థాపించడం జరిగింది.ఆ బ్యానర్లో నిర్మాతగా, హీరోగా 1982 లో ఎంతో రిస్క్ తీసుకొని  చేసిన ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.అలా నేను ప్రతి సినిమాకు రిస్క్ చేస్తూ రిస్క్ డైలాగ్ చెపుతూ జర్నీ మొదలుపెట్టి ఇక్కడివరకు రావడం జరిగింది. జీవితంలో రిస్క్ చేయనిదే ముందుకు సాగలేము.ఈ చిత్ర దర్శకుడు రత్న బాబు  చెప్పిన కథ మాకు రిస్క్ అనిపించినా విష్ణు రిస్క్ అయినా చేద్దాం అనడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము..భారత దేశ చరిత్రలో ఒక సునీల్ దత్ ఇలాంటి క్యారెక్టర్ చేశాడు.ఆ తరువాత నేను చేస్తున్నాను.ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. రాజకీయం, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల ఇందులో ఉన్నాయి ప్రతి షాట్ బాగా రావాలని .ప్రతి ఒక్క టెక్నిసియన్స్ ఎంతో కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. 11 వ శతాబ్దంలోని గద్యాన్ని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేసి “జ‌య‌జ‌య మ‌హావీర మ‌హాధీర ధోళీయ..” పాటను పాడించడం జరిగింది. ఈ ఒక్క  సాంగ్ ను ఎంతో ఖర్చు పెట్టి  తీయడం జరిగింది. కొత్త కాన్సెప్ట్ తో ప్రై వేట్ జైలు ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.భారతదేశంలో స్వాతంత్ర్యం తీసుకురావడానికి గాంధీ నెహ్రు , భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లు మాకెందుకులే అనుకోని ఉంటే ఈ ఈరోజు మనం కుక్కల్లా, నక్కల్లా దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళం. ఇప్పటికీ తప్పు చేయని వారు ఎంతో మంది జైల్లో వున్నారు. ఎంతో మంది చీడ పురుగులు we love india అంటూ తప్పులు చేస్తునే వున్నారు.అలాంటి చీడ పురుగు లను ఏరి పారెయ్యాలి. నిజమైన స్వాతంత్ర్య రావాలి అంటే  కులాలు,అవినీతి,పోవాలి. ప్రతి ఒక్కరు ఈ దేశాన్ని తల్లి లా గౌరవించాలి అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. ఇలాంటివి కొన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది.ఈ సినిమాకు నటీనటులు టెక్నిసియన్స్ ఎంతో కష్టపడ్డారు. దర్శకుడు డైమండ్ రత్న బాబు చాలా చక్కగా తీశాడు.విష్ణు నిర్మాతగా ఈ నెల 18 న వస్తున్న “సన్‌ ఆఫ్‌ ఇండియా” గొప్ప విజయం సాధించాలి అన్నారు.

వీడియో బైట్ ద్వారా ఇళయరాజా మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు అత్యంత ఆత్మీయుడు, మంచి స్నేహితుడే కాదు  మంచి మనిషి అలాంటి వారి సినిమాకు నేను పని చేయడం చాలా సంతోషం. ఈ చిత్రానికి పనిచేసిన టీం అందరికీ అల్ ద బెస్ట్ అని అన్నారు.

చిత్ర నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ..ఇది ఒక ఎక్స్పెరమెంటల్ సినిమా. ఇలాంటి సినిమాను అతి తక్కువ మంది మాత్రమే చెయ్యగలరు.వారిలో మా డాడీ ఒక వ్యక్తి. ఇందులో నటించిన వారంతా డబ్బుతో కాకుండా ప్రేమతో సినిమాలో నటించడం జరిగింది.ఈ నెల 18 న వస్తున్న ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. నా ఆలోచనకు రూపం దాల్చిన వ్యక్తి మంచు విష్ణు. తనకు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.నాకీ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, మంచు విష్ణు కు ధన్యవాదాలు. డీఫ్రెంట్ అటెంప్ట్ తో ఈ మూవీ చేస్తున్నా మని విష్ణు గారు మూడు బుక్స్ గిఫ్ట్ గా ఇచ్చి చదవమన్నారు.ఆ బుక్స్ ఈ సినిమాకు ఎంతో ఉపయోగ పడ్డాయి. ఈ ప్రయాణంలో.ఎంతో మంది సీనియర్ నటులు, టెక్నిసిషన్స్ అందరూ ఈ సినిమాకు పిల్లర్స్ గా నిలిచారు. నేను దర్శకుడుగా ఎదగడానికి టెక్నిసియన్స్ ఎంతో దోహద పడ్డారు.అఖండ లో చేసిన ప్రజ్ఞా జైస్వాల్ తో పాటు ఆ సినిమాను వర్క్ చేసిన  వారు ఇందులో కనిపిస్తారు.వారు ఎప్పుఫు వస్తారనేది హీరో గారు చెపుతారు. జీవితంలో ఎం చెయ్యాలి అనేది ఒక “రామాయణం” నేర్పుతుంది. జీవితంలో ఎం చెయ్యకూడదో ఒక “మహాభారతం” చెపుతుంది.అలా నేను రాయలసీమ రామన్న చౌదరి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా తన సినిమాకు మాటలు రాయాలి అనుకున్నాను.ఆ  ఇన్స్పిరేషన్ తోనే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాకు ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి కావాలి. ప్రజలను,సమాజాన్ని, ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థ ను ప్రశ్నించే ఒక వ్యక్తి కావాలని మోహన్ బాబు గారిని ఎంచుకోవడం జరిగింది.లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ద్వారా వారు ఎంతో మంది నాలాంటి దర్శకులను, నటులను ఇండస్ట్రీ కు  తీసుకు రావాలని కోరుకుంటూ ఫిబ్రవరి 18 న వస్తున్న” సన్ అఫ్ ఇండియా” చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ప్రముఖ సినిమాటో గ్రాఫర్ యస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సింహాబలుడు సినిమాకు కో డైరెక్టర్ చేస్తున్నపుడు మోహన్ బాబు గారు పిలిచి నువ్వు గొప్ప దర్శకుడు అవుతావని చెప్పారు. తను చెప్పినట్లు నేను పెద్ద దర్శకుడు అయ్యి ఎన్నో సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. తను చాలా  మంచి మనిషి వారు నటిస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ… నేను దేవత సినిమాకు కో డైరెక్టర్ గా చేసే సమయంలో నన్ను ఆఫ్రిసియేట్ చేస్తూ నీ డైరెక్షన్ బాగుంది ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ అవుతావని చెప్పాడు.ఆ తరువాత  అసెంబ్లీ రౌడీ, అడవిలో అన్న,కలెక్టర్ గారు, బ్రహ్మ ఇలా తనతో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుత సామాజిక,రాజకీయాలకు అద్దం పట్టే “సన్ ఆఫ్ ఇండియా” సినిమాలో మోహన్ బాబు గారు అద్భుతమైన నటనకు కనపరచారు.ఇందులోని సాంగ్స్ అన్ని స్విచ్వేషన్ తగ్గట్టు ఉన్నాయి.ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటుడు పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..డాక్టర్ మోహన్ బాబు గారు ఎంతో మంది పేదవారి దగ్గర నుండి డబ్బులు తీసుకోకుండా ఉచిత విద్యనిస్తున్నారు.మంచి మనిషిగా వుంటూ  తెలుగు ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్ అయ్యాడు.విష్ణు ఫ్యామిలీ అందరూ చాలా మంచి మనుషులు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్  బ్యానర్‌ పై మీరు ఇలాగే సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో ఎంతో మందికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాను.మోహన్ బాబు గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ని చూడడానికి వచ్చిన మోహన్ బాబు గారు తనతో నటించి. ఆయనను హీరో గా పెట్టి సినిమా తీశాడు.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా వారికి గుర్తొచ్చే పాట “పుణ్య భూమి నాదేశం” అనే పాట దీన్ని ప్రతి రిపబ్లిక్ డే కు పాడుకుంటాం. ఇలా తను తీసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.తను తీసే సినిమాలు అన్నీ కూడా ప్రజలకు మంచి మెసేజ్ ఇద్దామని సినిమా తీస్తాడే తప్ప డబ్బుకోసం ఏ రోజు ఆశించి సినిమా తీయలేదు.అలా అనుకుంటే తను సెలెక్ట్ చేసుకొన్న రీమేక్ సినిమాలో  చిన్న పాత్ర ఇవ్వమని సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ గారు ఆడిగారంటే ఆ కథలో ఎంత బలం ఉండచ్చు.ఆ సినిమా పెదరాయుడుగా విడుదలై 300 థియేటర్ లలో రికార్డ్ సృష్టించింది.అలాంటి  గొప్ప నటుడు  ఇప్పుడు కూడా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని చేస్తున్న “సన్ ఆఫ్ ఇండియా” సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మా నాన్న గారితో మేము ఎంతో నేర్చుకున్నాము.డబ్బుకోసం తను సినిమా చెయ్యడు.ఈ సినిమా ఎంతో ప్యాషన్ తో ,ఇస్టంతో చేసిన ఈ సినిమా ఇది. విష్ణు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. నాన్న తో పని చేసిన పెద్ద వారి గురించి చెప్పే అంత అర్హత లేదు.ఈ నెల18 న వస్తున్న” సన్ అఫ్ ఇండియా” చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. అల్లూరి సీతా రామరాజు నుండి ఇప్పటివరకు మా రెండు కుటుంబాల మధ్య ఆప్యాయత పెరిగిందే కానీ తగ్గలేదు. ఇండియాలో ఎంతో మంది నటులు వున్నా కూడా మోహన్ బాబు గారు గొప్ప నటుణ్ని చూడలేదు.తను నిరంతర శ్రమ జీవి.సినిమా కోసం పుట్టిన వ్యక్తి, బ్రతికే వ్యక్తి తను. బాలీవుడ్ యాక్టర్ డేవానంద్ తరువాత మోహన్ బాబు గారినే చూస్తున్నాను.ఒక రైతు కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడుగా ఎదిగి నటుడుగా రాణిస్తూ ఒక యూనివర్సిటీని స్థాపించి ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తు న్నారు.డైమండ్ రత్నబాబు కొత్త కాన్సెప్ట్ ను తీసుకొని లెజెండరీ నటుడు మోహన్ బాబు గారితో తీస్తున్న “సన్ ఆఫ్ ఇండియా” గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటుడు నునీల్ మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు అంటేనే రిస్క్ తను ఎంతటి రిస్క్ అయినా వెనుకాడకుండా చేసే వ్యక్తి .ఇలా అన్ని గుణ గణాలు ఉన్న తను ఇప్పుడు మంచి సంకల్పం తో చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. డైమండ్ రత్న బాబుకు మంచి పేరు రావాలి. విష్ణు కు ఈ చిత్రం మంచి పేరుతో పాటు మంచి ఆదాయం కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి, చిట్టిబాబు, గౌతమ్ రాజు తదితర చిత్ర బృందం ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
డా.మోహన్ బాబు,  శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ తదితరులు

సాంకేతిక బృందం:
బ్యాన‌ర్స్‌: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
స్క్రీన్ ప్లే: డా. మోహ‌న్‌బాబు
నిర్మాత‌: విష్ణు మంచు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు
సంగీతం: మాస్ట్రో ఇళ‌యరాజా,
సినిమాటోగ్ర‌ఫి: సర్వేష్ మురారి,
మాట‌లు: డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌
స్టైలిస్ట్ ‌(మోహ‌న్‌బాబు): విరానికా మంచు
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌
ఆర్ట్‌: చిన్నా
ఎడిట‌ర్‌: గౌతంరాజు
పీఆర్వో: రాజ్ కమల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here