సినీ ఇండస్ట్రీ లో గొప్ప విలక్షణ నటుల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన డాక్టర్ మోహన్‌బాబు టైటిల్ పాత్రలో పవర్‌ఫుల్ రోల్ లో దేశంలో వుండే ప్రస్తుత సామాజిక, రాజకీయ,ఆర్దిక పరిస్థితుల గురించి ఎలుగెత్తి చాటి చెప్పాలని నటించిన సంచలనాత్మక చిత్రమే “సన్ ఆఫ్ ఇండియా” .ఈ చిత్రానికి ఆయన స్క్రీన్‌ప్లే సైతం సమ కూరుస్తున్నారు. టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని ఒక విభిన్న కథా కథనాలతో రూపొందు తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ తో కలసి విష్ణు మంచు నిర్మిస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఆవుతున్న సందర్భంగా విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..
రాయలసీమ లోని ఒక పల్లెటూరు లో పుట్టిన వాడిని. నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు.తిండిలేక వేసుకోవడానికి చెప్పులు లేక ఎంతో ఇబ్బంది పడ్డాను. అందుకే నాకు చిన్నప్పుడే ఆకలిలో నుండి వచ్చింది కోపం .జీవితంలో నేను కోపానికి బానిసయ్యాను. ఆ కోపం నాకే కొన్ని సార్లు నష్టాన్ని మిగిల్చింది. ఎన్టీఆర్ గారి సినిమాలు చూసి పెరిగిన నేను ఇండస్ట్రీకు వస్తే రాయలసీమ వాడు సినిమాకు పనికిరాడు వారికి భాష తెలియదు అన్నారు. అయితే కరెక్ట్ గా చెప్పాలంటే అసలైన తెలుగుభాష తిరుపతి లో పుట్టింది తిరుపతిలో ఏ కవులు ఉండేవారని మీరందరూ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆతరువాత అన్నయ్య రామారావు భాషను చూసి కొంత తెలుకొన్నాను , ఆ తరువాత గురువు గారు ప్రతి క్యారెక్టర్ కు డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకొని చేయడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే.. భారతదేశంలో విలన్ గా ఎక్కువ మేనరిజమ్స్ పెట్టిన వ్యక్తి నేనొక్కడినే.
ఒక్క డిఫరెంట్ కథను డైమండ్ బాబు చెప్పాడు నచ్చింది. అయితే ఇందులో రిస్క్ వున్నా కూడా ఈ సినిమా తీద్దామని చేశాము. మా గురువుగారు దాసరి, శ్యామ్ బెలగల్ వంటి వారు ఎన్నో ప్రయోగాలు చేశారు నేను కూడా అలా చేద్దామని ఈ సినిమా తీయడం జరిగింది.సునీల్ దత్ 1964 లో బ్లాక్ అండ్ వైట్ లో చేసిన “యదెఇన్” సినిమా లో తను ఏకపాత్రాభినయంలో అద్భుతంగా నటించాడు.ఆ సినిమా కంటే ఈ సినిమా బాగుంటుంది.
చెడు చూడకు,చెడు మాట్లాడకు, చెడు చేయకు అనే ఒక మంచి వ్యక్తి తన భార్య, పిల్లలతో హ్యాపీ గా జీవితం గడుపుతున్న తనకు ఒక రాజకీయ నాయకుడి వల్ల తన జీవితం ఎలా నాశనం అయ్యింది.అలా తను చేయని తప్పుకి ఏం శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్న తన జీవితం ఇంతేలే అనుకోకుండా బాగా చదువుకొని నా లాంటి తప్పు చేయని వారు భారతదేశంలో ఎంతమంది వుండారని థీసెస్ చేసి అటువంటి వారి కోసం తను చేసిన అద్భుతమైన ప్లాన్ ఏమిటి ? అనే విషయాన్ని తెలుపుతూ..ఈ భారతదేశంలో ఎన్నో వేల మంది చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తు న్నారు. వారి బిడ్డలు పిల్లలు పరిస్థితి ఏంటి ? అనేది ఇందులో చూయించడం జరిగింది
ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ టీవీ చానల్స్ ప్రవేట్ హాస్పిటల్స్ ఇలా ఎన్నో వున్నాయి అవన్నీ ఉండగా ప్రైవేట్ జైలు ఎందుకు ఉండకూడదు అనే కొత్త కాన్సెప్ట్ ను ఈ సినిమా ద్వారా తీసుకురావడం జరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న కొన్ని వేలాదిమంది ఖైదీల డిమాండ్ ఏమిటనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాలో న్యాయ దేవతకు కళ్ళకు కట్టిన గుడ్డ విప్పితే తెలుస్తుంది ఆ దేవత కళ్ళలో పాలు వస్తున్నాయా నీళ్లు వస్తున్నాయా అనేది విషయం ఇందులో చెప్పడం జరిగింది.
11వ శతాబ్దం లోని ఒక గద్యాన్ని ఇళయరాజా గారిని రిక్వెస్ట్ చేస్తే తను నాపై ప్రత్యేక శ్రద్ధతో ఈ గద్యాన్ని పాటించడం జరిగింది.ఈ సినిమా లో చాలామంది నటించారు వారి గురించి రివీల్ చేయకుండా సినిమా చూడాలని చెపుతున్నాము.ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పడం లేదు కానీ గ్యారెంటీగా మంచి పిక్చర్ తీశారని ప్రేక్షకులు కచ్చితంగా చెపుతారు .
ఈ జనరేషన్ లోనైనా యూత్ అంతా మారి కులాలకు కోసం కొట్టు కోవద్దని చెపుతూ కులాలుకు అతీతంగా పని చేయాలని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది.మా యూనివర్సిటీలో కూడా లో కూడా కులం అనేది తీసివేయడం జరిగింది.మా యూనివర్సిటీ నుండి ఇప్పటివరకు 30 బ్యాచ్ ల స్టూడెంట్స్ చదువుకొని వెళ్లిన వారు వివిధ రాష్ట్రాల్లో మంచి మంచి హోదాలలో ఉన్నారు.
1.30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ప్యాండమిక్ వలన ముందు ఓటిటి కు అనుకొని యూత్ కు కావాల్సిన అంశాలు పెట్టడం జరిగింది.అది కూడా కథ డిమాండ్ మేరకు ఆ సీన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఓటిటి కాకుండా థియేటర్స్ లలో విడుదల చేస్తుండడం వలన సెన్సార్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని ముద్దు సన్నివేశాలు తొలగించడం జరిగింది.తరువాత ఓటిటి లో రిలీజ్ అయితే వాటిని మళ్లీ యాడ్ చేస్తాం.
ఏ మనిషికైనా యాంబిషన్ ఉండాలి.కష్టపడే మనస్తత్వం ఉండాలి అప్పుడే ఏదైనా సాధిస్తాడు.నేను ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు చేశాను కానీ ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది.ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నాకూడా నా డైలాగులు ఎక్స్ప్రెషన్స్ ఇందులో
డిఫరెంట్ గా ఉంటాయి.చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.
తిరుపతిలో మా క్యాంపస్ పక్కన నాలుగున్నర కోట్ల వ్యయంతో బాబా టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ బాబా గుడి దర్శించుకుని వెళ్తారు అటువంటి మహత్తరమైన శక్తి తో చాలా గొప్ప హృషికేస్ లో ఉన్నటువంటి మేధావులు తీసుకొని వచ్చి ఆ బాబా ప్రతిష్టాపన జరుగుతుంది. ఇది మే నెలలో జరగవచ్చు. ఈ గుడి కోసం చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ బాబా గుడిని చాలా మోడ్రన్ గా కట్టడం జరిగింది.మనకు ఎవరికీ తెలియని ఎటువంటి మూలికలతో తపస్ సంపన్నులతో హిమాలయ పర్వతాలలో వుండే మేధావులను తీసుకొచ్చి ఆ యంత్రాలను పెట్టి ఆపైన బాబాను గారిని తీసుకువచ్చి పెట్టడమే.తరువాయి ఇక నుంచి శిరిడీ కి వెళ్లి దర్శించుకోవలసిన అవసరం లేదు ఇక్కడ కొచ్చి దర్శించుకుంటే చాలు.
నేను డైరెక్షన్ చేయడానికి రెండు కథలు రెడీగా వున్నా కూడా నా టీం టైం కు రాకపోతే నాకున్న కోపం వారిని ఇబ్బంది పెడుతుందని విరమించుకున్నాను. అలాగే నేను ఒక బుక్ రాస్తున్నాను అందులో అన్నీ నిజాలు రాస్తున్నాను ఆ బుక్ త్వరలో పూర్తవుతుంది.ఆ బుక్ కు ఇంకా టైటిల్ పెట్టలేదు.లక్మి సినిమా ఒకటి ఓటిటి కు ఉంది.ఆ తరువాత విష్ణు తో ఒక సినిమా ఉంది.ఇలా కొన్ని సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నాయి అవి ఎంటనేది త్వరలో తెలియజేస్తాను ఆని ముగించారు









