A rare award for Megastar Chiranjeevi

ప్రముఖ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ 2022 అవార్డును చిరంజీవికి ఆదివారం ప్రకటించారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతకు నెమలి చిత్రం కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, విశ్వజిత్‌ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్‌ జోషి అందుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here