ప్రముఖ నటుడు చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకుగానూ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 అవార్డును చిరంజీవికి ఆదివారం ప్రకటించారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతకు నెమలి చిత్రం కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, విశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి అందుకున్నారు









