Heroine Samantha Released by the Telugu & Kannada bilingual ‘Rudra kala’ Movie tittle launch held grandly

కన్నడ లో పలుచిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరో దిగంత్ . తన కొత్త మూవీ టైటిల్ “రుద్ర కాల” ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు అనంతరం సమంత మాట్లాడుతూ .. ఈ చిత్రం లో నటిస్తున్న దిగంత్ కు మరియు రుద్ర కాల మూవీ టీమ్ కు అభినందలు తెలిపారు. ఈ మూవీ ఘనవిజయం సాధించాలని. ప్రేక్షకుల మనసు దోచుకోవాలని ఆశీర్వదించారు

హీరో దిగంత్ మాట్లాడుతూ ,ఈ స్టోరీ నాకు మా డైరెక్టర్ గోపి గారు చెప్పినపుడు మొదటి సిట్టింగ్ లోనే ఒకే చేశాను…అలాగే మూవీ “రుద్ర కాల” టైటిల్ సమంత చేతులు మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.అలాగే మా డైరెక్టర్ గోపి ,ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ మరియు మూవీ టీమ్ అందరికీ నా కృతఙ్ఞతలు .

డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, ఈ చిత్రం టైటిల్ ను హీరోయిన్ సమంత రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది మాకు దక్కిన మొదటి విజయంగా భావిస్తున్నాం .
రుద్ర కాల తెలుగు, కన్నడ ఒకేసారి షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ అవుతుందన్నారు.. ఇది నాకు నాలుగో చిత్రం, నన్ను నమ్మిన హీరో దిగంత్ , మా ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు

ప్రొడ్యూసర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ, డైరెక్టర్ గోపి చెప్పిన స్క్రిప్ట్ నాకు ఫ్రెష్ గా అనిపించింది మా ప్రొడక్షన్ లో ఇలాంటి మూవీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.అలాగే మా హీరో దిగంత్ , టైటిల్ రిలీజ్ చేసిన సమంత గారికి థాంక్స్ చెప్పారు… ఈ నెల ఆఖరులో మూవీ పూజ ఉంటుందన్నారు .

అలాగే ఈ మూవీ కథను రమేష్ అందిస్తున్నారు, క్రిస్టోఫర్ జోసెప్ సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివరాజ్, అసోసిటెడ్ డైరెక్టర్ రమేష్ కె పూజారి, పి ర్ ఓ దినేష్ కె .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here