Cinemarangam.Com
సినిమా : “ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 12.05.2023
బ్యానర్ : జెన్ నెక్స్ట్ మూవీస్
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : రవి ప్రకాష్ బోడపాటి
సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల
ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సాదునూరు
నటీ నటులు : నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు
డి. ఓ. పి : అమర్ దీప్
ఆర్ట్ : విజయ్ మక్కెన
మ్యూజిక్ డైరెక్టర్ : అర్వీజ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : గిడియన్ కట్ట
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి
ప్రొడక్షన్ హెడ్ : అరవింద్ కుమార్ పిట్టల
డబ్బింగ్ & డి ఐ : జయంతి స్టూడియో
సౌండ్ ఎఫెక్ట్స్ : నాగ కిరణ్
వి ఎఫెక్ట్స్ : ప్రైమ్ పిక్సెల్
డాల్బీ మిక్సింగ్ : ప్రసాద్ ల్యాబ్ అట్మాస్ స్టూడియో
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్

బ్యూటిఫుల్ హీరోయిన్ ఛార్మి తో మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాలు తీసి ఎంతో మంచిపేరు తెచ్చుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీ నటులుగా, రవి ప్రకాష్ బోడపాటి రచన-దర్శకత్వంలో, ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం ”ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “.ఈ చిత్రానికి సహ నిర్మాతలు గా అనిల్, క్రాంతి జువ్వల, ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా మోహన్ దాస్ వ్యవహరిస్తున్నారు..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ “ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
యదార్థ సంఘటన ఆధారంగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. వాయిస్ ఆర్టిస్ట్, డాన్సర్ చరిత్ర(దృషికా చందర్) మిస్సింగ్ అనే వార్త విని రవి(నిహాల్ కోదాటి) టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు ఆర్బన్ క్రైమ్ సీఐ బాషా(మధునందన్) ఈ కేసుని స్థానికంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. కేసు పెద్దది కావడంతో ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య ఐపీఎస్ (భార్గవ పోలుదాసు) రంగంలోకి దిగుతాడు. ఆయన సారథ్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. చరిత్ర మిస్సింగ్‌కి సంబంధించి క్లూస్ రాబట్టే క్రమంలో ఆమెతో టచ్‌లో ఉన్న వారిని విచారిస్తుంటారు పోలీసులు. అందులో భాగంగా కార్పొరేట్ కంపెనీ హెడ్ విక్రమ్(సమర్థ్ యుగ్)ని మొదటగా విచారిస్తాడు. అతను చరిత్రతో డేట్‌కి వెళ్లినట్టు చెబుతాడు, అంతకు మించి ఆమెతో సంబంధం లేదని చెప్పి, తర్వాత పోలీసులకు టైమ్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతుంటాడు. మరోవైపు చరిత్రతో క్లోజ్‌గా ఉన్న రవిని విచారించగా, తమ మధ్య ఉన్న లవ్ స్టోరీ బయట పెడతాడు. రవిని ప్రేమించిన చరిత్ర, కార్పొరేట్ కంపెనీ సీఇఓ విక్రమ్‌తో డేట్‌కి ఎందుకు వెళ్లింది? చరిత్ర మిస్సింగ్‌కి ముందు రోజు ఏం జరిగింది? చరిత్ర మిస్సింగ్‌కి కారణం రవినా, విక్రమా? మిస్ అయిన చరిత్ర ప్రాణాలతోనే ఉందా? మరణించిందా? అనేది తెలుసుకోవాలి అంటే “ద బ్యూటిఫుల్ గర్ల్” సినిమా చూడాల్సిందే

నటీనటుల పనితీరు
రవి పాత్రలో నిహాల్ కోదాటి చాలా బాగా చేశాడు. పేద అబ్బాయి పాత్రకి పర్‌ఫెక్ట్ సెట్ అయ్యాడు. ఇన్నోసెంట్‌గా, కొన్ని సీన్లలో కన్నింగ్‌గా చాలా బాగా చేశాడు. మరోవైపు చరిత్రగా దృషికా చందర్ నటన సినిమాకి మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. రొమాంటిక్ సీన్లలో బాగా చేసింది. రవి, చరిత్ర లవ్ స్టోరీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కొత్తగా ఉంటాయి. వీరిద్దరి మధ్య వచ్చే ఆయా సన్నివేశాలు యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా భార్గవ పోలుదాసు బాగా చేశారు. జర్నలిస్ట్ వైజయంతిగా దేవి నాగవల్లి ఉన్నంతలో మెప్పించింది. విక్రమ్ పాత్రలో సమర్థ్ యుగ్ స్టయిలీష్ గా ఆకట్టుకున్నాడు. బాషా పాత్రలో మధునందన్ పోలీస్ గా మెప్పించాడు.ఇంకా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
కార్పొరేట్ కంపెనీ ముసుగులో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగుతూ , పెద్ద మాఫియా నెట్ వర్క్ రన్ చేస్తున్నారనే విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చాలా బాగా చూయించాడు. సీన్లు, డైలాగ్‌లు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఆయా సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమాకు ఆయన పడిన కష్టం కనిపిస్తుంది. అంతే కాకుండా సెకండాఫ్ కూడా సినిమాని కూడా అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు రవి ప్రకాష్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. గిడియన్ కట్టా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆర్వీజ్ సంగీతం వినసొంపుగా బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అమర్ దీప్ గుత్తుల కెమెరా వర్క్ సూపర్బ్. సినిమాకి కెమెరా వర్క్ ఓ అసెట్. ప్రవీణ పూడి ఎడిటింగ్ పనితీరు బాగుంది..మంచి బలమైన కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసుకొని చేసిన నిర్మాతలు జెన్ నెక్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.చిన్న సినిమా అయినా చాలా క్వాలిటీతో తెరకెక్కించారు.ఇందులో కథతో పాటు వినోదం, ఎమోషన్స్, వాల్యూస్,లతో పాటు ప్రేక్షకులకు చక్కటి మెసేజ్ తో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఈ సినిమా చాలా బాగా నిర్మించారు.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కావాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం” ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది..
Cinemarangam.com Review Rating 3/5









