A special birthday poster of actress Yamini ER has been released from ‘Queen’ Movie. directed by Ratan Rishi

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో “క్వీన్” మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90’s హీరోల్లో ఒకరు నటించబోతున్నారు.

ఈ రోజు హీరోయిన్ యామినీ ఈఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ “క్వీన్” మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో క్లాసికల్ డాన్సర్ గెటప్ లో
అందంగా ముస్తాభైన యామిని, ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ… అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. “క్వీన్” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు – యామినీ ఈఆర్, కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్, భాయ్ నవీన్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
ఆర్ట్ – భార్గవ నౌండ్ల
కొరియోగ్రఫీ – జేడీ మాస్టర్
డీవోపీ – సరస్
మ్యూజిక్ – భరత్. ఎం
ఎడిటింగ్ – ఆర్ ఎం విశ్వనాథ్ కుచనాపల్లి
పీఆర్ఓ – జీఎస్ కే‌ మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాణం – వన్ సర్కిల్
రచన, దర్శకత్వం – రతన్ రిషి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here