బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్) గా, బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ),గా రెండు భాషల్లో నిర్మించిన ఈ చిత్రాలలోని గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ) చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రివ్యూ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
మాజీ యమ్.పి. సీతారాం నాయక్ మాట్లాడుతూ..ఈ సినిమా సరదా కోసం తీసిన సినిమా కాదు రైతుల ప్రాబ్లం గురించి ఒక సైంటిఫిక్ సొల్యూషన్ని ఇంక్లుడ్ చేసి బంజరా,తెలుగు భాషలలో తీసిన సినిమా ఇది.ఈ సినిమా అందరికీ ఉపయోగ పడుతుంది..ఈ బంజరా జాతి 15 వ శతాబ్దం కంటే ముందే పుట్టిన జాతి.చత్రపతి శివాజీ నుంచి మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ వంటి మహనీయుల కంటే ముందే వున్నారు.ఈ జాతి పెద్దలు ఎవరైతే ఉన్నారో హథీరాం బాబా, సేవలాల్ మహారాజ్ ,లక్కీసా బంజరా నాయకులు అందరు కూడా ఈ దేశాన్ని దిశా నిర్దేశాన్ని చేసిన వారి కంటే ముందే ఈ జాతి బిడ్డలు పుట్టారని చరిత్ర తెలియజేస్తుంది. ఇంత చరిత్ర ఉన్న ఈ దేశంలో బంజారా అనే పదం తప్ప మేము ఎవరం అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది.కానీ ఇవాళ రేఖ్య నాయక్ లాంటి వారే కాకా ఇక్కడున్నటు వంటి వారిని చూస్తుంటే సేవలాల్ మహారాజ్, హథీ రాం బాబా లు గుర్తొస్తున్నారు. ఆరోజున జాతికి ఒక దిశ దిశానిర్దేశం చేస్తే ఈరోజు బంజారా సినిమా గోర్ మాటి పేరుతో మళ్లీ మే మెవరం మా కల్చర్ ఏంటి, ఈ దేశంలో అల్లాడిపోతున్న రైతాంగం గురించి కిసాన్ పేరుతో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఇంత తొందరగా సినిమా అయి పోయిందా అనే విధంగా చాలా చక్కగా తీశారు. ఈ సినిమాలో నటించిన వారందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.ఈ రేఖ్య నాయక్ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రొఫెసర్ గా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశం కల్పించిన మా జాతి నాయకులు అందరూ ఇక్కడున్నారు వారందరినీ నేను కోరుతున్నాను. ఇప్పటికీ ఈ జాతికి సరైన ప్రాధాన్యత దొరకడం లేదు ఈ దేశంలో.. ఈనాటికీ మేమెవరం అని వెతుక్కుంటున్న దౌర్భాగ్యం వచ్చింది ఈ జాతికి. ఈ దేశానికి రహదారులు కనిపెట్టింది మా జాతి, ఈ దేశం నలుమూలల్లో అన్నం కోసం అల్లాడుతుంటే అతిధి రూపంలో అందరికీ అన్నం పెట్టింది ఈ జాతి, కానీ మా నాయకుల కంటే తరువాత వచ్చిన వారిని చరిత్ర గుర్తించింది.. సమాజం గుర్తించింది..కానీ మా భాషకు, మా జాతికి లభించింది కానీ..12 కోట్ల మంది ఉన్న మా జాతికి సరైన గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం. అలాంటిది మా జాతికి గుర్తింపు తీసుకురావాలని మన జాతి భాషను, సంస్కృతు లను కాపాడుకోవాలని రేఖానాయక్ లాంటివారు సినిమాలు తీయడం చాలా సంతోషించదగ్గ విషయం. వీరు చేసిన కష్టానికి మనమంతా ఆదరించి ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇప్పుడు మన చరిత్ర తెరవకుండా ఉన్నది.మన జాతి ఎలా ముందుకు రావాలి అంటే మనమందరం ఇలాంటి సినిమాను బలపరచాలి. తెలంగాణలో 50 లక్షల మంది బంజరా జనాభా ఉంది. మేము దేశంలో ఎవరికీ తక్కువ కాదు, తెలంగాణలో అసలే కాదు.. తెలంగాణ లో 32 మంది ప్రాణ త్యాగాలు చేసిన జాతి మనది.తెలంగాణ అంతా శాంతియుతంగా ఈ రాష్ట్రం బాగుపడాలి అని మా ప్రయత్నం మేము చేస్తున్న వారు మమ్ములను మమ్ములను అక్కున చేర్చుకోవాలి, ఈ సమాజానికి మా చరిత్ర ఏంటో తెలవాలి.అందుకోసం అతి త్వరలో తెలంగాణ లంబాడీలు తెలంగాణ రాజ్యాంగ భద్రత అనే పుస్తకం కూడా వస్తుందని హామీ ఇస్తున్నాను. ఇందులో మొత్తం ఇతిహాసం ఉంది.మన మూలాలు మనకు తెలియ అంటే ఈ రేఖ్య నాయక్ లాంటి వారు ఈ ఇతిహాసాన్ని ఒక సినిమాగా తీసి సమాజం లో మన జాతి ముందుకు వచ్చేలా చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను
ఓయూ జేఏసీ కరాటే రాజు మాట్లాడుతూ ..ఎంతో వ్యయ ప్రయాసలకు కూర్చి చక్కని సినిమా తీశారు బంజారా భాషను ఈ దేశంలో నే మలుపు తిప్పే విధంగా.. ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల గోర్ బంజారాలు ఏకం చేసే విధంగా ఒక గొప్ప ప్రయత్నాన్ని చేసినటువంటి చిత్ర నిర్మాణానికి ధన్యవాదాలు. దీనికి అన్ని విధాలుగా ముందున్నటటువంటి మిత్రుడు రేఖ్య నాయక్. ఆనాడు గోరీ, గజినీ లను కాశీ లను తన్ని తరిమిన చరిత్ర ఏదైతే ఉందో.. అలాగే బండెనక బండి కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజము సర్కరోడా అన్నటువంటి వంటి వారికి తండాలో తల దాచుకున్న వారికి శరణం ఇచ్చినటువంటి ఈ కోయర్ జాతిని కాపాడడానికి ముందుకు తీసుకుపోయే టటువంటి ఈ చిత్ర నిర్మాణానికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. గతంలో పార్లమెంటు నుంచి పల్లె దాకా, పార్లమెంటు నుంచి మన్నెం దాకా.. పార్లమెంట్ నుంచి తండా వరకు కూడా గిరిజనుల చరిత్ర ఏ మాత్రం తక్కువ కాకుండా.. ఆనాడు స్వతంత్రం ఉద్యమం నుంచి నేడు తెలంగాణ ఉద్యమం కోరకు ఎంతో మంది బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ జాతికి ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్న ఈ జాతి చరిత్ర తెలియజేస్తూ సినిమా ద్వారా రైతుల బాధలను తెలియజేస్తూ చక్కటి ప్రయత్నం తో తీసిన రేఖ్య నాయక్ టీం అందరికీ శుభాబి వందనలు తెలియ జేస్తున్నాను అన్నారు.
అసిస్టెంట్ కమిషనర్ కిషన్ నాయక్ మాట్లాడుతూ.. గోర్ మాటి మూవీలో నటించిన వారందరికీ నా జాతి నుంచి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మాజీ ఎంపీ సీతారాం గారు చెప్పినట్టుగా మన దేశంలో ఒకే రక్తంతో ఉన్న జాతి ఏందంటే ఒక లంబాడీలు. మరి తెలంగాణలో కూడా అదే స్థాయిలో యాభై లక్షల మంది లంబాడీలు ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రంగంలో కూడా బంజారాలకు తగిన గుర్తింపు లేదు అయితే ఇప్పుడిప్పుడే ఏదో ఒక కష్టాన్ని నమ్ముకుని ముందుకు వస్తున్న ఈ జాతి సినీ రంగం వైపు కూడా అడుగులు వేసి ఒక చక్కని సినిమాను చేయడం జరిగింది. సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న మా జాతి బిడ్డలను కూడా అక్కున చేర్చుకుని అవకాశాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాము.మా భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు కనుమరుగైపోతున్న తరుణంలో సమాజంలో ముఖ్య భూమిక వహిస్తున్న సినీరంగ పరిశ్రమ ద్వారా మన భాష, సంస్కృతిని తెలియజేస్తూ రైతుల యొక్క సమస్యలను చూపిస్తూ.. వారికి సరైన గుర్తింపు దొరకడం లేదంటూ.. విద్య, వైద్యం, అన్నం పెట్టె రైతు ఈ మూడు లేకపోతే మానవ మనుగడ లేదని సినిమా రూపంలో చూపెడుతూ మంచి మెసేజ్ ఇవ్వడంలో దర్శక,నిర్మాత లు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను తెలంగాణ లో ఉన్నటువంటి 50 లక్షల మంది బంజారాలు ఆదరించాలి. మీ చరిత్రను మీ భాషను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఈ బిడ్డలపై ఉండాలని మనస్పూర్తిగా కోరుతూ. ఈ సినిమా ద్వారా జాతి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల జెండా వేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ..దేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉండగా, 50 లక్షల మంది బంజారాలు వున్న మన తెలంగాణ లో మనకు తగిన ప్రాధాన్యత లేదు.ఈ రోజు ఈ జాతి బిడ్డల తరుపున ఇప్పుడు ఇండస్ట్రీ కు వచ్చి మన జాతి చరిత్ర, బాషా,సంస్కృతం ఇలా అన్ని కనుమారుగై పోకూడని తెలియేయడానికి గోర్ మాటి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి అన్నారు.
హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన శంకర్ జాదవ్ మాట్లాడుతూ..మా సినిమా చూడడానికి వచ్చిన యమ్.పి. సీతారాం నాయక్ సర్ కు,ఎమ్మెల్సీ రాములు నాయక్, రవీంద్ర నాయక్ ,జీవన్ లాల్,రాజ్ కుమార్ జాదవ్, ఉద్యోగ సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాల నాయకులకు ధన్యవాదాలు. సినిమా అనేది నా కళ, ఆ కళ నెరవేరడానికి 18సంవత్సరాలు పట్టింది. ఆ 18సంవత్సరాల కళ ఈ రోజు రేఖ్య నాయక్ అన్న తీసిన “గోర్ మాటి” సినిమాతో తీరింది.నేను సినిమా తీసున్నాను అని చెప్పగానే సీతారాం బాబాయ్, రామకృష్ణ సర్, దేవి మేడమ్ ఇలా చాలా మంది మేమున్నామని నాకు సపోర్ట్ గా నిలిచారు. అలాగే రేఖ్య నాయక్ అన్న నా వెన్ను తట్టి నాకు సపోర్ట్ గా నిలవడమే కాక నిర్మాతగా ఈ సినిమా తీయడం జరిగింది. రేఖ్య నాయక్ ను నేను సొంత అన్నగా భావిస్తాను. మేమిద్దరం ఒకే కడుపులో పుట్టకపోయినా దానికంటే మించి ఉన్నాము. నా ఫేస్ రీడింగ్ చూసి నన్ను అర్థం చేసు కుంటాడు. అలాంటి అన్న ఈ సినిమా ద్వారా దొరికినందుకు దేవుడికి ధన్యవాదాలు.ఈ బ్యానర్ లో వస్తున్న గోర్ మాటి సినిమాతో ఆగిపోదు.మీ అందరి సపోర్టు మాకుంటే బంజారాను స్థాయిని పెంచుతూ బంజారా జాతి గురించి తెలుపుతూ అందరి మెప్పు పొందేలా ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వస్తాయని అన్నారు. డైరెక్టర్, హీరో గా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు..
చిత్ర నిర్మాత రేఖ్య నాయక్ మాట్లాడుతూ… మా చిత్రాన్ని చూడడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ఈ సినిమాకోసం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. అలా హెల్ప్ చేసిన వారిలో ముఖ్యంగా మా తమ్ముడు రవి,. ఇలా చాలామంది నాకు తోబుట్టువుల్లా ఉండి హెల్ప్ చేశారు. వారందరి సపోర్ట్ తోనే నేనీ రోజు ఈ స్టేజ్ పై నిలుచున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్, డి.ఓ.పి గోపి ,మ్యూజిక్ డైరెక్టర్ యమ్. యల్. రాజా,ఎడిటర్ క్రాంతి ఇలా చిత్ర యూనిట్ అందరూ కూడా ఏంతో డెడికేషన్ తో వర్క్ చేశారు . ఇందులో హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శంకర్ లా డెడికేషన్ వర్క్ చేసే వారిని నేను ఇప్పటివరకు చూడలేదు.ఈ సినిమా చాలా బాగా వచ్చింది మా సినిమాను అందరూ చూసి గొప్ప విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..
జబర్దస్త్ అదిరే అభి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం డైరెక్టర్ దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు నేను ప్రత్యక్షంగా చూశాను వారి కష్టాన్ని. చాలామంది డబ్బున్న వాళ్ళు సేఫ్ సైడ్ గా బిజినెస్ చేస్తూ సినిమా చేస్తారు. కానీ.. రేఖ్య నాయక్ గారు తను చేసే పనిని పక్కనపెట్టి బంజారా జాతికి గురించి ప్రపంచానికి తెలియజేయాలని ఈ సినిమా తీస్తూ.. సినిమా కోసమే గత రెండు సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు ఆయన బాగుపడాలి అంటే ఆయన ఈ సినిమాకు పెట్టిన డబ్బుతో ఒక కమర్షియల్ సినిమా తీసి సొమ్ము చేసుకోవచ్చు కానీ కానీ బంజారా సంస్కృతి ని తెలియజేయాలని ఇందులో రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ మెడిసిన్స్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎంతో గొప్పదని ఇంటర్నల్ మెసేజ్ ఇస్తూ చక్కటి చిత్రాన్ని తీశారు.ఈ జాతి వారు ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులుగా మంచి పొజిషన్లో ఉన్నారు వారంతా ఈ చిత్రానికి సపోర్ట్ గా నిలవాలి అన్నారు.
జనసేన విద్యార్థి విభాగం నాయకుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ..ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడేది ఒక్క రైతు మాత్రమే.. వారు లేకపోతే ఏ వ్యవస్థ లేదు.రైతు తాను పండించిన ధాన్యానికి తానే ధరను నిర్ణయించాలనే కాన్సెప్ట్ లో బంజారాల సంసృతిని, ఆచార వ్యవహారాలను ఈ చిత్రం ద్వారా పొందుపరచి జనవరి 26 ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ చిత్రాన్ని బజారాలే కాకా తెలుగు ప్రజలంతా ఈ చిత్రానికి మద్దతు ఇచ్చే చిత్ర యూనిట్ ను ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని అన్నారు
రామకృష్ణ ,దేవి లు మాట్లాడుతూ..హీరో శంకర్ జాదవ్ మా పిల్లలకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చేవాడు.ఆ రోజు ఆయన గర్వపడ్డడేమో గాని ఈ రోజు రైతులు గురుంచి చక్కటి సందేశం తో తీసి తనే మాకు హీరో అయ్యాడు.అలాంటి తన పక్కన నిలబడి మాట్లాడుతున్నందుకు మేము గర్వపడు తున్నాము అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు మోహన్ సింగ్,రఘు,మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాంబాబు, చందూలాల్, శరత్,సంజీవ నాయక్ వంటి ఎంతో మంది పాల్గొని ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని తెలిపారు
నటీనటులు
శంకర్ జాదవ్ ,కరిష్మా ,అదిరే అభి, సిరి రాజ్ ,డాక్టర్ శివ శంకర, జబర్దస్త్ గడ్డం నవీన్ ,చిట్టి బాబు ,సునీత మనోహర్, మహేంద్ర ,సంపత్ నాయక్ ,శర్వన్ పెరుమాల్ ,చయాంక్,పురుషోత్తం రెడ్డి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : బంజారా బిగ్ సినిమాస్
నిర్మాత : రేఖ్య నాయక్
దర్శకత్వం : శంకర్ జాదవ్
మ్యూజిక్ : ఎం యల్ రాజా
డీ ఓ పి : గోపి
ఎడిటర్ : క్రాంతి
విజువల్ ఎఫెక్ట్స్ : రాము అద్దంకి
లిరిక్స్ : ఎం శ్రీనివాస్
యాక్షన్ : దేవరాజ్
పి.ఆర్.ఓ : బాబు నాయక్









