‘CAT’ Movie concept poster launched by Hero Adivi Sesh

వి.ఆర్.జి.ఆర్ (VRGR) మూవీస్ బ్యానర్ పై వై. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం క్యాట్ (CAT) ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ని ప్రముఖ సినీ హీరో అడివి శేష్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ.. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు చెప్పి “క్యాట్” (CAT) మూవీ ఘన విజయం సాధించాలి అని అన్నారు.

డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో G.V. నాయుడు, V.J. బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ, ఎడిటింగ్: D.వెంకటప్రభు, మ్యూజిక్: మారుతి రాజా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: V. CH శేఖర్ ముద్దు, దర్శకత్వం: G.V. నాయుడు (గొంగటి వీరాంజనేయులు).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here