‘Charu To Puri’ Movie Releasing on Sankranthi

ప్రత్యంగిరా దేవి ఆర్ట్స్ బ్యానర్‌పై నూతన నటీనటులు శాంతి మహరాజు, రఘురంజన్, ఆధ్య, కృతిగౌడ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చారు తో పూరి’. కె.బి. ఈశ్వర్, బుల్ బుల్, పవన్ కుమార్, రాజేష్, నీలిమ, విమల, చంద్రశేఖర్ వంటి వారు ఇతర తారాగణంగా నటించిన ఈ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని పి. పవన్‌తో కలిసి దర్శకుడు విజయ్ కుమార్ ఉప్పర నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్ ఉప్పర మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కథతో ‘చారు తో పూరి’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో చాలా మంది నూతన నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని తెలిపారు.

శాంతి మహరాజు, రఘురంజన్, ఆధ్య, కృతిగౌడ, కె.బి. ఈశ్వర్, బుల్ బుల్, పవన్ కుమార్, రాజేష్, నీలిమ, విమల, చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కెమెరా: రామ్ శ్రీనివాస్,
సంగీతం: యేలేంద్ర,
ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల,
ఫైట్స్: రవి,
ఆర్ట్: మణి,
కథ: అజయ్,
కో ప్రొడ్యూసర్: కె.బి. ఈశ్వర్ (బళ్ళారి)
నిర్మాతలు: విజయ్ కుమార్ ఉప్పర, పి. పవన్,
స్ర్కీన్‌ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: విజయ్ కుమార్ ఉప్పర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here