డిజైనర్ దుస్తులు రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవడమే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మనోహార్ గ్రేస్ న్యూ డిజైనర్ లగ్జరీ స్టూడియోను సికింద్రాబాద్ లోని మహంకాళి టెంపుల్ దగ్గర హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులకు అందుబాటు లోకి తీసుకొచ్చారు. డిజైనర్ దుస్తులు కొనుగోలు చేయడానికి చాలా మంది ఆంధ్రప్రదేశ్, విజయవాడ ప్రాంతాల నుంచి అత్యధికంగా హైదరాబాద్ వస్తుంటారు. వారందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి “గ్రేస్ న్యూ డిజైనర్ స్టూడియో” పేరుతో అందరికీ మెచ్చిన దుస్తులతో అందుబాటులోకి తీసుకొని రావాలని 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ ను తీర్చిదిద్దారు. అయితే ఈ స్టోర్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మినిష్టర్ పద్మారావు ముఖ్య అతిధిలుగా వచ్చి గ్రేస్ న్యూ డిజైనర్ లగ్జరీ స్టూడియోను ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమానికి అధిరే అభి, ఆర్జే కాజల్, అరియానా, హరి తేజ, అక్షఖాన్, జబర్దస్త్ అవినాష్, గల్లీ బాయ్స్ సద్దాం, గల్లీ బాయ్స్ భాస్కర్, యాంకర్ రవి, యాదమ్మ రాజు, బిగ్ బాస్ విశ్వ, జ్ఞానేశ్వర్ పుట్ట, మహేష్ విట్టా, శివ యాంకర్, జబర్దస్త్ అజయ్, ఆర్జే చైతూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం
ముక్కు అవినాష్, అదిరే అభి లు మట్లాడుతూ ..మా సోదరుడు మనోహర్ ఈ ఫాబ్రిక్ స్టోర్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది..మా అందరికీ తనే మంచి మంచి డిజైన్స్ చేసి ఇస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీ లో చాలా మంది డిజైనర్స్ ఉన్నా మనోహర్ వంటి వారిని ఎంకరేజ్ చేస్తే తను మరిన్ని మంచి డిజైన్స్ అందిస్తాడు..ఈ స్టోర్ లో పెళ్ళికి సంబందించిన అన్ని డిజైన్స్ ఇక్కడ దొరకుతాయి అన్నారు.
గ్రేస్ న్యూ డిజైనర్ లగ్జరీ స్టూడియో డిజైనర్ సి. ఈ. ఓ . మనోహార్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు “గ్రేస్ న్యూ డిజైనర్” పేరుతో బోటిక్ ఉండింది. అయితే దేవుని కృప వల్ల వర్కర్స్ , మా టీం, మా ఫాలోవర్స్ సపోర్ట్ వలన ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెన్ చేశాను.బోటిక్ రెగ్యులర్ గా ఉన్నా ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, డిజైనింగ్ ఇలా అన్ని రకాలు అందుబాటులో ఉంటాయి.ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఫిట్టింగ్ అనేది ఇంపార్టెంట్. మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయడానికి మనిషి కావాలి అది రాజు దగ్గర ఉంది. కాబట్టి రాజుతో కలసి ఈ స్టోర్ ను స్టార్ట్ చేశాను. నాకు బిగ్ బాస్ సీజన్ 4, సీజన్ 5, ఓటిటి, జబర్దస్త్ డి. జోడీ యాక్టర్స్ ఎక్కువగా క్యాస్ట్యూమ్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్బంలో యాంకర్స్ రవి అన్న, అవినాష్, అభి అన్న,హరి తేజ, అక్షఖాన్, జబర్దస్త్ అవినాష్, గల్లీ బాయ్స్ సద్దాం, గల్లీ బాయ్స్ భాస్కర్, యాంకర్ రవి, యాదమ్మ రాజు, బిగ్ బాస్ విశ్వ, జ్ఞానేశ్వర్ పుట్ట, మహేష్ విట్టా, శివ యాంకర్ ఇలా చాలామందికి డిజైన్స్ చేస్తాను. వారితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది వస్తుంటారు. ఇక్కడనుండి ఔట్ అఫ్ కంట్రీ లో స్టే చేసే వారికి కూడా ఆన్ లైన్ మీద తీసుకొని డిజైన్ చేస్తాను. మన దగ్గర ఫార్మల్స్, క్యాజువల్స్, సద్రి ,ఇండోవెస్టీన్ ,జోద్ పురి ఇలా ప్రతిదీ మా దగ్గర దొరుకుతుంది. నాకిలాంటి మంచి పొజిషన్ ఇచ్చిన మా అమ్మ, నాన్నలకు, సపోర్ట్ ఇచ్చిన రాజు బ్రదర్ కు ధన్యవాదములు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మనోహర్ ప్రారంభించిన ఈ “గ్రేస్ న్యూ డిజైనర్ లగ్జరీ స్టూడియో” దినాదినాభి వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.









