రచయితలు దర్శకులవ్వడం చాలాకాలం నుండి ఉన్నదే గీత రచయితలు సైతం దర్శకులవ్వడం చాలా అరుదు.ప్రముఖ గీత రచయిత బండారు దానయ్య కవి దర్శకుడిగా రూపొందిస్తున్న తన రెండవ చిత్రం “చిత్రపటం”నరేన్ ,పోసాని కృష్ణ మురళి, శరణ్య పొన్ననన్, బాలాచారి, నూకరాజు, శ్రీ వల్లి నటీనటులుగా శ్రీ క్రియేషన్ పతాకంపై పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం “చిత్రపటం” ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ*
మీ పరిచయం
నేను స్కూల్ డేస్ లొనే వ్యక్తిత్వ పోటీలు,వ్యాసరచనల పోటీలలో పాల్గొనే వాడిని.ఆ తరువాత భ్రూణ హత్యలు అనే నాటకం రాయడం జరిగింది.అది అల్ ఇండియా రేడియో లో ప్రసార మవ్వడంతో నన్ను చాలామంది ప్రశంశించారు.అప్పుడే నేను తెలుగు మీద మక్కువతో సినిమా ఇండస్ట్రీ కు వెళ్లి పాటల రచయిత అవ్వాలనే కోరిక నాలో బలంగా ఏర్పడింది.ఆ తరువాత నల్గొండ లో డిగ్రీ వరకూ చదివాను.
ఇన్స్పిరేషన్
ఏటూరు సుందర రామ్మూర్తి గారి ఇన్స్పిరేషన్తో హైద్రాబాద్ కు వచ్చి ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుంటూ కొన్ని పాటలు రాశాను.అలా పాటలు రాసే ప్రక్రియలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చదువు సరిపోదని తెలుసుకొని ఉస్మానియాలో తెలుగు ఎం.ఎ చేశాను
గురువు గారి ఇన్స్పిరేషన్ తో పాటలు రాస్తున్న నాకు మొదటిసారిగా 2000 సంవత్సరం లో దొంతి రెడ్డి అచ్యుత్ రెడ్డి గారు దర్శకత్వం వహించి నిర్మించిన “నువ్వుంటే చాలు” చిత్రానికి పాటలు రాసే అవకాశం కల్పించారు.ఇదే నా మొదటి సినిమా.ఈ సినిమా తో నాకు మంచి గుర్తింపు లభించింది.ఆతర్వాత నేను తొలిచూపులోనే,దొంగోడు,అతనొక్కడే మహానంది,ఎవడి గోల వాడిదే ,అసాధ్యుడు,వీర,కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి మొదలగు చాలా సినిమాలకు పాటలు రాయడం జరిగింది.
ఆ తరువాత పాటలు రాసిన అనుభవంతో కొంతమంది పెద్దల సలహాల,సూచనల మేరకు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బావ మరదళ్లు, సతీ తిమ్మమాంబ,చిన్నపిల్లల సినిమా జీనియస్,రాజా ది గ్రేట్,పాష అందరివాడు లాంటి మొదలగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం జరిగింది.ఇందులో చిన్నపిల్లల సినిమా జీనియస్ కు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంశలు కూడా అందుకొని నాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
మీ అనుభవం
మణిశర్మ, కీరవాణి,చక్రి దేవిశ్రీ,సుకుమార్, రాజమౌళి ల దగ్గర లిరిసిస్ట్ గా చేసి అనుభవం సంపాదించుకున్నాను.ఆ అనుభవంతో “డాటర్ అఫ్ బుచ్చిరెడ్డి” సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తూ మ్యూజిక్ కూడా నేనే చేయడం జరిగింది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది.కరోనా రావడం వలన ఆ సినిమా లేట్ అయ్యింది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్,ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమాను విడుదలకు చేస్తాము.
మీ ప్రయాణం
ఇన్ని పాటలు రాసినా ఇండస్ట్రీ లో నా ప్రయాణం సాఫీగా జరగలేదు. ఏంతో మంది నన్ను అవమానించిన వారున్నారు,అలాగే ప్రశంశించి,ప్రోత్సాహించిన వారు ఉన్నారు.అయితే ఎన్ని అవమానాలు పడ్డా వెనకడుగు వేయకుండా కలమతల్లిని నమ్ముకొని మొక్కవోని దీక్ష తో ముందుకు వెళుతున్నాను.
శిష్యరికం
నేను ఎక్కువగా శిష్యరికం వేటూరి సుందర మూర్తి గారి దగ్గరే చేయడం జరిగింది. ఆ గురువు గారి దగ్గర నేను ఏంతో నేర్చుకొన్నాను.నేను రైటర్’గా లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నా వారి సంతకం తోనే తీసుకోవడం జరిగింది.గురువు గారి ఇన్స్పిరేషన్ తో కేవలం పాటల రచయిత అవ్వాలనే కలతో వచ్చిన నేను పాటల రచయితగా,సంగీత దర్శకుడిగా,చిత్ర దర్శకుడిగా ఈ రోజు నేను ఇంతవాడిని అయ్యానంటే అదంతా వారి ఆశీస్సులే,అలా వారి ఆశీస్సులే వల్లే నేను ఇంతవాడిని అయ్యాను.వారి ఋణం తీర్చుకోలేనిది.
“చిత్రపటం” గురుంచి
నేను డైరెక్ట్ చేసిన “డాటర్ అఫ్ బుచ్చిరెడ్డి” సినిమా తర్వాత వస్తున్న నా రెండో సినిమానే “చిత్రపటం”.ప్రస్తుత పరిస్థితుల్లో మనందరం ఏమైనా చేసుకోవాలన్నా,తినాలన్నా ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నాము.అయితే సెల్ ఫోన్ లో గూగుల్ లోగాని,ఇంటర్నెట్ లోగాని, రేడియోలో గానీ, ఇంట్లో గానీ, మన కుటుంబం లోనే, మన మనసులో, మన స్పర్శలో, మన చుట్టూ ఉన్నా.. మనందరం దాన్ని వెతుక్కోలేకపోతున్నాం అదే ఎమోషన్. ఆ ఎమోషన్ కంటెంట్ తోనే ఈ సినిమా తీయడం జరిగింది. ఇది పొయేటిక్ టచ్ తో వస్తున్న కమర్షియల్ సినిమా అలాగని ఇది పూర్తి పోయేటిక్ సినిమా కాదు, ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.నాకు ఎమోషన్ అంటే ఇష్టం.ఈ సినిమాలో కామెడీ,వల్గారిటీ ఉండదు.తండ్రి,కూతురు మధ్య అల్టిమేట్ ఎమోషన్ కంటెంట్ తో ఈ “చిత్రపటం” మూవీ చేయడం జరిగింది.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది త్వరలోనే ఆడియో విడుదల జరుపుకుని సినిమాను విడుదల చేస్తాం.
గురువు గారి గురుంచి చిన్న మాట
గురువు గురుంచి మీ అందరికీ ఎంత చెప్పినా తక్కువే అందుకే వారి గురించి నా మాటల్లో తెలియజేయాలని చెప్తున్నా..
ఎత్తైన వృక్షాలు ఎన్ని ఉన్నా…
గాలిని ప్రసవించగా – వెదురు మాత్రమే వేణువైంది,
కలము లెన్నో పుట్టి కళలు కన్నా..
కారణజన్ముడు జన్మ ఒక్కటే కావ్య మైంది.
అతనెవరో కాదమ్మా ,కృష్ణా గోదారి పుణ్య నదుల పుత్రోత్సాహం వేటూరి.
వేటూరి రాయగా పాటలెన్నయా నన్నయా..
మా సుందర మూర్తిని పొగడగ కవి కులం పులకిస్తుందయ్యా కన్నయ్య …
అంటూ ముగించారు.









