అనేక డాక్యుమెంటరీలు తీసి,చాలా రచనలు చేసి,సినిమా పై మంచి పరిజ్ఞానం కలిగిన కిరణ్మయి ఇంద్రగంటి తొలి సారిగా డైరెక్ట్ చేసిన చిత్రం ‘రాళ్ళలో నీరు‘. అనల్ప అండ్ ఫ్రెండ్స్ పతాకంపై అనల్ప ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ మంజూష,అల్తాఫ్,షఫీ,బిందు చంద్రమౌళి,డా. ప్రసాద్ ఇందులో ప్రధాన తారాగణం.
దర్శకురాలు కిరణ్మయి ఇంద్రగంటి మాట్లాడుతూ ”నేను M.A ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకునే రోజుల్లో నార్వేజియన్ నాటకం ‘ఏ డాల్స్ హౌస్’ విపరీతంగా ఆకట్టుకుంది.ఎప్పటికైనా ఆ నాటకాన్ని తెరకెక్కించాలనుకున్నాను.ఆ కల ఇప్పటికి నెరవేరింది. తెలుగులో ‘కన్యాశుల్కం’ ఎలానో,ఇంగ్లీషులో ‘డాల్స్ హౌస్’ అంత ఫేమస్.19వ శతాబ్దానికిచెందిన ప్రముఖ రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈనాటకం రాసారు.చలం తరహాలో ప్రోగ్రెసివ్థాట్స్ తో ఉండే ఈనాటకం థీమ్ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాను.ఇందులో మొత్తం ఐదు పాత్రలే ఉంటాయి.మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాల్ని,భావోద్వేగాల్ని ఒడిసిపట్టే విధంగా ఇందులో కథాంశం ఉంటుంది.కథకు తగ్గట్టుగా కాకినాడలో ఓ ఇల్లు దొరికింది.మేజర్ పోర్షన్ అక్కడే చిత్రీకరించాం.కాకినాడలో మొత్తం 28రోజులు షూటింగ్ చేశాం.ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ గా ఉంది.ఇటీవలే లాస్ ఏంజిల్స్ లో జరిగిన అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్నిప్రదర్శించాం.చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం”అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఎడిటింగ్: మార్తాండ్ . కే. వెంకటేష్, కెమెరా: RR కోలంచి, సౌండ్ డిజైనర్: తేజ ASGK, నిర్మాత: అనల్ప,
రచన-దర్శ కత్వం: కిరణ్మయి ఇంద్రగంటి.