Director Ram Mallik interview about ‘Adbhutham’

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో , హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్‏గా  రామ్ మల్లిక్ దర్శకత్వంలో చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటటైనర్ చిత్రం అద్భుతం. ఈ సినిమాకు రధన్ సంగీతం అందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.చిత్రయూనిట్ విడుదల చేసిన అద్భుతం మూవీ ట్రైలర్‏కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా.. విలేకర్లతో చిత్ర దర్శకుడు రామ్ మల్లిక్  మాట్లాడుతూ.

నేను ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ చేశాను.మూవీస్ ఫైన ఇంట్రెస్ట్ ఉండడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ కి  వచ్చిన నేను  హీరో సుమంత్ నటించిన “గోల్కొండ హై స్కూల్” కు అసిస్టెంట్ గా,అవసరాల శ్రీనివాస్ దగ్గర “ఊహలు గుసగుసలాడే” సినిమాకు అసోసియేట్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేనే సొంతంగా ఒక సినిమా చేద్దాం అనుకున్న టైంలో “గోల్కొండ హై స్కూల్” షూటింగ్ టైం లో  సుమంత్ తో పరిచయం ఉండటం వల్ల తను నన్ను పిలిచి నీలో ఉన్న సెన్సిబిలిటీస్ నాకు నచ్చాయి “విక్కీ డోనర్” సినిమాను తెలుగులో చేద్దామని అన్నాడు. దానికి “నరుడా డోనరుడా” అని పేరుపెట్టి దాన్ని మన తెలుగు నేటివిటి కి కొంచెం మార్పులు చేసి 2016లో అన్నపూర్ణ  బ్యానర్లో రమా రీల్స్ కోలబ్రేషన్స్ లో సినిమా చేయడం జరిగింది. నరుడా డోనరుడా రిలీజ్ చేసే టైంలో డిమానిటైజేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత 2017 లో   నేను చేసిన పెళ్లి గోల సూపర్ హిట్ అవ్వడంతో  దీన్ని మూడు సిరీస్ లు చేయడం జరిగింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మంచి మిత్రుడు మేము రెగ్యులర్ గా సినిమా కథలు గురించి మాట్లాడుకునే వాళ్ళం.అప్పుడు తను రాసుకున్న “అద్భుతం” కథ చెప్పడంతో ఆ కథను డెవలప్ చేసి 2019 లో స్టార్ట్ చేయడం జరిగింది.

అద్భుతం సినిమాకు యంగ్ హీరో తేజ సజ్జ ను అనుకున్న తరువాత తనకు జోడీగా అవికాగోర్ అనుకున్నాము కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో  హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్‏గా తీసుకోవడం జరిగింది.

కథ విషయానికి వస్తే ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ వలన ఇద్దరికి ఒకే ఫోన్ నెంబరు రావడం జరుగుతుంది.అయితే  హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడం..అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.ఈ కథ ఫ్రెస్ గా ఫుల్ ఎంటర్టైన్డ్ గా ఉంటుంది.

ఇందులో  హీరోకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడం వలన డిప్రెస్డ్ గా చాలా డల్ గా మూడ్ ఆఫ్ లో ఉంటాడు.హీరోయిన్ కు చాలా యాంబిషన్స్ ఉంటాయి.విదేశాలకు ట్రావెల్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.అలా ఉన్న వీరిద్దరి మధ్యన లవ్ ఎలా ఏర్పడిందనే కథ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ కామెడీ పై సినిమా నడుస్తుంది. సెకండాఫ్ అంతా ఫుల్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను సాగుతుంది.

తేజ,శివాని ఇద్దరూ కూడా చాలా చక్కగా నటించారు.ఇందులో తేజకు ఫ్రెండ్ గా కమెడియన్ సత్య నటించాడు.తన కామెడీ కు ప్రేక్షకులందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు లక్ష్మీ భూపాల్ చక్కటి మాటలను అందించారు.

ముందు మా నిర్మాత చంద్ర శేఖర్ గారు థియేటర్స్ లలో రిలీజ్ చేద్దాం అనుకునే మూవీ చేశాము.సినిమా ఔట్ ఫుట్ కోసం మా నిర్మాత ఖర్చు కు వెనుకాడకుండా చేయడంతో సినిమాను తొందరగా పూర్తి చేశాము.సినిమా రిలీజ్ చేద్దాము అనుకున్న టైంలో కరోనా రావడంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు.అప్పుడే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో మాట్లాడడం జరిగింది. డిస్బీ ప్లస్ హాట్ స్టార్ తో టై అప్ అవడం వల్ల ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేస్తున్నాము.

ప్యాండమిక్ స్విచ్వేషన్ టైంలో ఆహా వాళ్ళతో కలసి “తరగతి దాటి” వెబ్ సిరీస్ చేయడం జరిగింది.ఇప్పుడు మళ్లీ “తరగతి దాటి” సీజన్ 2 కూడా చర్చలు జరుగు తున్నాయి. ఇంకా కొన్ని కొత్త స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అవెంటనేది త్వరలో తెలియజేస్తాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here