క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్`రష్మిక జంటగా, మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి నిర్మించిన పాన్ఇండియా సినిమా ‘పుష్ప’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రాబట్టు కుంటోంది. అలాగే కలెక్షన్స్ విషయంలో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ పాత్రికేయులతో తన విజయానందాన్ని పంచు కున్నారు.
‘‘ముందుగా మా ‘పుష్ప’ను అద్వితీయంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అసలు కథ ‘పుష్ప2’లోనే ఉంది. పార్ట్ 2లో ఎమోషన్ కంట్రోల్ ఉంటుంది. ఫాదర్, బ్రదర్స్ మధ్య ఎలా అంతరాలు తాగ్గాయని చూపిస్తాము. క్యారెక్టరైజేషన్ చెప్పడం కోసమే ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాం. దీనికి మరో బ్యాక్‌డ్రాప్ పెట్టవచ్చు. కానీ సౌత్ స్టేట్స్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అందరికీ తెలిసిందే. అందరికీ కనెక్ట్ అవుతుందని తీసుకున్నాం. ఈ బ్యాక్‌డ్రాప్ రీసెర్చ్ కోసమే 6 నెలల పైన పట్టింది. మొదట వెబ్ సిరీస్ చేద్దామనుకున్నాం. తర్వాత ఇది సినిమా చేస్తే బాగుంటుందని టర్న్ అయ్యాం. పార్ట్2లో డాన్ పుష్పరాజ్ గురించి కాదు.. ఎర్రచందనం గురించే ఉంటుంది. ” *తగ్గేదేలే* “.. అనే డైలాగ్ కమ్ మేనరిజం ఇంతలా పాపులర్ అవుతుంది అనుకోలా. లారీ మిస్సింగ్ సీన్ నిజంగా జరిగిందే. ఇప్పుడు అంత ఎర్ర చందనం అక్కడ లేదు. అంతా కొట్టేశారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలో ఈ సెన్సిబులిటీస్ ఉండవు. నేచురల్‌గా ఉండే కమర్షియల్ సినిమాలు ఉండవు. దాన్ని మేం ఈ సినిమా ద్వారా ట్రై చేశాం. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ల బ్యాక్‌డ్రాప్‌లు వేరు.. మా సినిమా వేరు. వాటితో దీన్ని కంపార్ చేయలేం. మా సినిమా ఎమోషన్ వేరు. పుష్ప2 కు కనెక్ట్ కోసం ఎస్పీ సీన్ చేయాల్సి వచ్చింది. హిందీలో విడుదల చేయటానికి రాజమౌళిగారు ఇచ్చిన ఎంకరేజ్మెంటే కారణం. మాకు టైం లేకపోవడం వల్ల హిందీలో పబ్లిసిటీ చేయలేక పోయిన మాట వాస్తవమే. నా టార్గెట్ ఆడియెన్‌ను ఎంటర్టైన్ చేయడమే. నా ఆలోచన అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. క్లైమాక్స్‌లో ఫైట్‌లాంటి సీన్ తీయాలని అనుకున్నాం.కానీ తీయలేదు అందుకే ఫైట్ లేదు. ఒక ఫార్మెట్కు అలవాటు అయిపోయిన ప్రేక్షకులకు కొంత నిరాశగా అనిపించవచ్చు. పార్ట్ 2లో ఇవే క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి. వచ్చే దసరాకు గానీ, డిసెంబర్‌కు గానీ పార్ట్ 2 రావచ్చు. నేను చాలా వరకు కొత్త వారి కోసం ట్రై చేస్తుంటాను. కానీ కొన్ని క్యారెక్టర్స్‌కు కొందరు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లు సూట్ అవుతారు. వారిని తీసుకుకోక తప్పదు. సమంతా ఐటెమ్ సాంగ్ విషయంలో ముందు ఇది నాకు కరెక్ట్ కాదు అని అన్నారు. నేను ఆమెను కన్విన్స్ చేశాను. మేము మామూలుగా మాట్లాడుతున్నా..బన్నీ మాత్రం చిత్తూరు స్లాంగ్‌లోనే మాట్లాడటం మొదలు పెట్టాడు. అది అతని డెడికేషన్. మైత్రి మూవీస్‌లో ఒక దర్శకుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో ఈ సినిమాతో అనుభవించాను. విడుదల విషయంలో మా నిర్మాతలు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఇప్పటికే రెండు పాండమిక్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండటంతో.. ఫిబ్రవరిలో అనుకున్నప్పటికీ, అందరం పగలు, రాత్రి కష్టపడి డిసెంబర్లోనే వచ్చేశాం. ఈ విజయం ఎంటైర్ యూనిట్‌కు చెందుతుంది. పుష్ప మేకింగ్ నేను టఫ్ జాబ్‌గా ఫీలయ్యాను. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎంత అందమైన లొకేషన్స్ ఉన్నాయో.. అంత రిస్క్ కూడా ఉంది. పుష్ప పార్ట్ 2 తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుంది. ఫైనల్‌గా ‘పుష్ప’ విజయం మా కష్టాన్ని మర్చిపోయేలా చేసింది అన్నది 100 శాతం నిజం’’ అన్నారు.









